» »బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు

బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

బెంగళూరు అనగానే పచ్చదనం కళ్ళముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది.అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు దీనికి చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. బెంగుళూరు ఒక సుందర నగరం, ఇక్కడ ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు వున్నాయి. నేటి రోజులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి పరంగా ఎన్నో సాఫ్ట్ వారే సంస్థలు ఇక్కడ వెలిశాయి. గతం లో ఈ నగరాన్ని పించన్లు తీసుకునే వృద్ధులు వుండే నగరంగా చెప్పేవారు. కాని నేడు ఈ నగరం యువ తరానిది. నగరంలోని ప్రధాన ప్రదేశాలలో ఎన్నో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లుమల్టీ ప్లేక్స్ లు వెలిశాయి. అర్ధ రాత్రి వరకూ నగరంలోని వీధులు సందడిగానే వుంటాయి.

బెంగుళూరు వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది. విలాస వంతమైన హోటళ్ళ తో అనేక విందులు, వినోదాలు నడుస్తాయి. నగరం ఎంత ఆధునికతలు సంతరించుకున్నప్పటికి, నేటికీ బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలకు పర్యాటకులు వరుస కట్టి వెళుతూనే వున్నారు. కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ కాఫీ తోటలు, చూడాలన్నా , మైసూరు,శ్రీరంగ పట్నం వంటి చారిత్రక ప్రదేశాలు చూడాలన్నా బెంగుళూరు ద్వారా వెళ్ళవలసినదే. మరి బెంగుళూరు సందర్శనలో ఏమి చూడాలి ? ఎన్నో ఆకర్షణలు కలవు.

బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు

1. అవలబెట్ట

1. అవలబెట్ట

వన్ డే పిక్నిక్ స్పాట్ కు తగిన ప్రదేశం ఇది. కుటుంబంతో కలసి ఒక్కరోజులో ట్రిప్ ముగించే వీలున్న టూరిస్ట్ ప్లేస్ కూడా.అవలబెట్టకు ఒక చారిత్రక విశిష్టత వుంది. కామధేను కాలుమోపిన ప్రదేశమని నమ్ముతారు. ఇక్కడి కొండ మీద ఆలయం వుంది. ట్రెక్కింగ్ అవకాశం కూడా వుంది.

చిత్రకృప:Karthik960

2. పచ్చదనం

2. పచ్చదనం

అసలే పచ్చదనం. ఇక వర్షాకాలంలో అయితే ఎటు చూసినా చెట్లు, పూలతో పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా వుంటాయి. కొండ పైనున్న హిల్ టాప్, దానికి కొంచెం దిగువున వుండే క్లిఫ్స్ ప్రత్యేక ఆకర్షణలు.

చిత్రకృప:Sripoornap

3.రద్దీ

3.రద్దీ

క్లిఫ్ చేరుకోవటం తేలికే అయితే ఫోటోలు దిగే వాళ్ళతో ఎప్పుడూ అక్కడ రద్దీగా వుంటుంది. ఈ కొండపై కోతులు కూడా ఎక్కువే. అందుకే తినే వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పని సరి. ఇక్కడ రెస్టారెంట్లు లాంటివి వుండవు కాబట్టి ఆహారం వెంట తీసుకెళ్లాల్సిందే.

చిత్రకృప:Bilal ahmad

4. స్కందగిరి

4. స్కందగిరి

స్కందగిరి కలవర దుర్గ అనే పర్వతాల కోట. బ్రితీషర్లతో పోరాడేందుకు వీలుగా టిప్పుసుల్తాన్ ఈ ప్రదేశంలో ఎన్నో కోటలు కట్టించాడు. తర్వాతి కాలంలో ఈ కోటలు కూలిపోయినా వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ మిగిలే వున్నాయి. ఈ కొండ ప్రాంతం మీద ట్రెక్కింగ్ చేస్తూ అందాలను వీక్షించొచ్చు. అయితే ఇక్కడ దొంగలు మోసగాళ్ళూ ఎక్కువే. ఇక్కడ ట్రెక్కింగ్ ప్రారంభంలోనే పాపాగ్ని మఠ్ అనే గుడి వుంటుంది. గుడికి కుడివైపున తిరిగి 100 మీటర్లు నడిస్తే పైకి దారి కనిపిస్తుంది. ఈ దారివెంటే ప్రయాణిస్తూ కొండల మీద గీసిన బాణం గుర్తును అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా కొండంతా చుట్టి రావచ్చు.

చిత్రకృప:Vijets

5. అయిదుగురు బృందం

5. అయిదుగురు బృందం

గైడ్ల పేరుతో తప్పుదారిలో తక్కువ దూరం చుట్టి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. కాబట్టి అయిదుగురు బృందంగా ఏర్పడి స్వయంగా ట్రెక్కింగ్ కి వెళ్ళిరావటం ఉత్తమం. చీకటి పడుతున్న సమయంలో ట్రెక్కింగ్ చేయకపోవటమే మంచిది. రాత్రివేళ మూన్ లైట్ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఇందుకోసం రాత్రి 12 నుంచి బయలుదేరి కొండపై 3 నుంచి 4 గంటలకు చేరుకోవచ్చు. అడ్వెంచరస్గా వుండాలనుకుంటే స్లీపింగ్ బాగ్స్ తీసికెళ్ళాలి. మంచినీళ్ళు, స్వట్టర్లు, స్నాక్స్, టార్చ్ తప్పనిసరి.

చిత్రకృప:Prakashchandrasekaran

6. బిళిగిరి రంగా హిల్స్

6. బిళిగిరి రంగా హిల్స్

కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో వుండే బిళిగిరి రంగన్ ఓ పర్వత సముదాయం. బిఆర్ హిల్స్ అని పిలిచే ఈ ప్రదేశం బర్డ్స్ వాచింగ్ కు అనుకూలమైనది.

చిత్రకృప:David Brossard

7. బిఆర్ టి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ

7. బిఆర్ టి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ

అప్పుడప్పుడు అడవిజంతువులు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడున్న బిఆర్ టి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీలో రకరకాల జంతువులను చూడవచ్చును. ఇక్కడున్న 2000 ఏళ్ళ నాటి దొడ్డసంపిగె మర అనే ఓ పెద్ద చంపక చెట్టు వుంది. దీని ఎత్తు 34మీ. వెడల్పు 20మీ. ఇక బిఆర్ హిల్స్ లో ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ చేయవచ్చు.

చిత్రకృప:PRODavid Brossard

8. బిలిగిరి రంగ స్వామి దేవాలయం

8. బిలిగిరి రంగ స్వామి దేవాలయం

కావేరీ,తుంగభద్ర నదుల మధ్య నెలవైన ప్రదేశం కాబట్టి పచ్చదనం, చల్లదనాలకు ఇక్కడ కొదవే వుండదు. బిఆర్ హిల్స్ లోని ఎత్తైన కొండ మీద బిలిగిరి రంగ స్వామి దేవాలయంను సందర్శించుకోవచ్చును.

చిత్రకృప:PRODavid Brossard

9. ముత్యాల మడువు

9. ముత్యాల మడువు

ఒక్క పూటలో వెళ్లిరాగల హాలిడే స్పాట్ ముత్యాల మడువు. దీనినే పర్ల్ వ్యాలీ అని కూడా అంటారు. చుట్టూ కొండల మధ్యలో లోయ దాన్లో నెలవైవున్న ఈ చిన్న జలపాతం. ఈ కొలను చక్కని పిక్నిక్ స్పాట్. 100 అడుగుల ఎత్తు నుంచి జారిపడే జలపాతం చుట్టుపక్కన పరుచుకున్న పచ్చదనం ఈ ప్రదేశం ప్రత్యేకతలు.

చిత్రకృప:wikimedia.org

10. జలపాతాలు

10. జలపాతాలు

ఈ జలపాతం అడుగునున్న కొలను లోతు వుండదు. కాబట్టి నిరభ్యంతరంగా కొలనులో మునకలేయవచ్చును. ఇదే లోయలో ఇంకో రెండు జలపాతాలు కూడా వున్నాయి. వాటిని కూడా తప్పక చూసి తీరాల్సిందే. ఇక్కడో చిన్న శివాలయం కూడా వుంది. అయితే వీటి దగ్గరకు నేరుగా వాహనాలలో వెళ్ళే వీలుండదు. కాబట్టి పార్కింగ్ లో వెహికల్స్ వదిలి వంద మెట్ల దాకా ఎక్కాల్సి వుంటుంది. పార్కింగ్ ప్లేస్ లో రెస్ట్ రూం, రెస్టారెంట్లు వుంటాయి.

చిత్రకృప:wikimedia.org

11. రంగనాథస్వామి దేవాలయం

11. రంగనాథస్వామి దేవాలయం

బెంగుళూరు పరిసర ప్రాంతాలలో చూడదగ్గ ముఖ్యమైన దేవాలయాలలో రంగనాథస్వామి దేవాలయం ఒకటి. ఈ గుడి తిరుమలై అనే కొండ మీద వుంది. ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన ఈ దేవాలయం ప్రాకారం గోపురాల నిర్మాణ కౌశలాలు చూసి తరించాల్సిందే. శంఖం, చక్రం, గద ధరించి అభయ ముద్రతో దర్శనమిచ్చే మూడడుగుల నారాయణ విగ్రహం అద్భుతమనిపిస్తుంది.

చిత్రకృప:Nagarjun Kandukuru

12. దేవాలయం చుట్టు పక్కల

12. దేవాలయం చుట్టు పక్కల

ఈ దేవాలయం చుట్టు పక్కల రాముడు, ఆంజనేయుడు, సీతమ్మవార్ల దేవాలయాలు కూడా వున్నాయి. కల్యాణకట్ట, గరుడస్తంభం, కృష్ణదేవరాయల కాలం నాడు నిర్మించినవి. ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

చిత్రకృప:Ajith Kumar