Search
  • Follow NativePlanet
Share
» »ఆగస్టు నెలకే ఉత్తమ ప్రదేశాలు !!

ఆగస్టు నెలకే ఉత్తమ ప్రదేశాలు !!

మీరు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు వేచి ఉండి, ఏదైన ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా ?? అయితే మీకు ఇది సరైన సమయం. మీరు తక్కువ వర్షపాతం ఉండే ప్రదేశాలను సందర్శించాలనుకుంటే ఇక్కడ మేము అందిస్తున్న కొన్ని ప్రదేశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు భారతదేశం లో ఆగష్టు లో అసలు సందర్శించడానికి ప్రదేశాలే లేవుకాదా అని చెప్పి వెనుకాడవద్దు. ఇక్కడ పేర్కొనబడిన కొన్ని ప్రదేశాలు కేవలం ఆగస్ట్ మాసం లోనే .. ఆది కూడా తక్కువ వర్షాలు పడే సమయంలోనే సందర్శించేవిగా ప్రసిద్ధి చెందినవి. మరి ఆలస్యం చేయకుండా, సూట్ కేస్ లు సర్దుకొని ఇక్కడున్న ప్రదేశాలను ఒకసారి తిరిగొద్డామా !!

పేటియం కూపన్లు : రూ. 200 టికెట్ మీద 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు ఐ ఫోన్ 6 గెలుచుకునే అద్భుత అవకాశం

మున్నార్, కేరళ

మున్నార్, కేరళ

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను సందర్శించేలా చేస్తాయి.

మున్నార్ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: tornado_twister

చిరపుంజీ, మేఘాలయ

చిరపుంజీ, మేఘాలయ

స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన నోహ్కలికై జలపాతం ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది. చిరపుంజీ కేవలం దృశ్య వీక్షణం కొరకు మాత్రమే కాదు సాహసోపేతమైన పర్యటనలకు కూడా అనుగుణంగా ఉంటుంది. చిరపుంజి ని ఆగస్టు మాసంలోనే సందర్శించాలి.

చిరపుంజీ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Amos Chapple

అగుంబే, కర్నాటక

అగుంబే, కర్నాటక

మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. అగుంబే సందర్శించాల్సిన సమయం సమయం ఆగస్టు మాసం.

అగుంబే లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Sharath Chandra

కొడైకెనాల్, తమిళనాడు

కొడైకెనాల్, తమిళనాడు

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుమతి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

కొడైకెనాల్ మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Binish Kallarackal

లాహౌల్, హిమాచల్ ప్రదేశ్

లాహౌల్, హిమాచల్ ప్రదేశ్

ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. ఇక్కడి ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు. అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి.

లాహౌల్ లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Bot

అండమాన్ నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దీవులు

గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే! ఈ సెలవుల విహార ప్రదేశం అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే.

అండమాన్ మరియు నికోబార్ దీవులలో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Show In My Eyes

బికనేర్, రాజస్థాన్

బికనేర్, రాజస్థాన్

బికనేర్ రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి మధ్యలో గల ప్రధాన ఎడారి పట్టణం. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, రుచికరమైన భుజియాలకు, రంగురంగుల పండుగలకు, అద్భుతమైన భవనాలకు, అందమైన శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఒంటెల పండగ ప్రసిద్ధి చెందినది. బికనేర్ సందర్శించదలచుకొన్న పర్యాటకులు ప్రసిద్ధ ఇసుక రాయి కట్టడ౦ లాల్ఘర్ ను తప్పనిసరిగా చూడాలి.ఈ ప్రదేశాన్ని వేసవి కాలం కంటే ఆగస్టు మాసం సందర్శనకి అనువైనది.

బీకనేర్ లో మరిన్ని ఆకర్షణలకి ఇక్కడ క్లిక్ చేయండి

ముస్సూరీ, ఉత్తరాఖండ్

ముస్సూరీ, ఉత్తరాఖండ్

ముస్సూరీ ని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు.ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఈప్రదేశం ఇక్కడ కల శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్ వాలీ కి ప్రసిద్ధి గాంచినది. అందమైన ప్రదేశాల తో కూడిన ఈ పట్టణం లో అనేక ప్రాచీన టెంపుల్స్, కొండలు, జలపాతాలు, లోయలు మరియు వైల్డ్ లైఫ్ సంక్చురి లు కలవు. ఐఏఎస్ లకు శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఇక్కడనే ఉంది.

ముస్సూరీ లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Parveen Singh

పాండిచేరి

పాండిచేరి

ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణీకునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.

పాండిచేరి లో మరిన్ని ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Vincent Mivelaz

మండు, మధ్యప్రదేశ్

మండు, మధ్యప్రదేశ్

మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది. మండు అంటే ఒక ఆనందాల భూమి. సాంప్రదాయక మాల్వా ఆహారాలు దాల్ బాత్ మరియు మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది. ఇక్కడ చూడవలసిన వాటిలో బాజ్ బహదూర్ మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటు లు , తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ మొదలైనవి ఉన్నాయి.

మండు లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: McKay Savage

కూర్గ్ , కర్నాటక

కూర్గ్ , కర్నాటక

కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్ లలో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుకనే కూర్గ్ ను ఇండియా లోని స్కాట్ లాండ్ అని, కర్నాటకలోని కాశ్మీర్ అని అభివర్ణిస్తారు. కూర్గ్ లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలలో అబ్బే ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, టిబెట్ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్ చేసే వారికి పుష్ఫగిరి హిల్స్, కోటిబెట్ట,నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. కూర్గ్ ను సందర్శించాలంటే, ఆగస్ట్ మాసం నుండి నుండి నవంబర్ మాసం వరకు అనుకూల సమయం.

కూర్గ్ లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: sandeepachetan.com travel photography

మహాబలేశ్వర్ , మహారాష్ట్ర

మహాబలేశ్వర్ , మహారాష్ట్ర

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్ స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, ప్రతాప్ ఘడ్ కోట వంటివి కూడా మహాబలేశ్వర్ లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. ఇంతటి వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్ ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే ఆగస్టు మాసంలో తప్పక సందర్శించావల్సినదే!

మహాబలేశ్వర్ లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: sandeepachetan.com travel photography

వాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్

వాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్

వాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని హేమకుండ్ కు వెళ్ళే దారిలో ఉన్నది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టూ ముట్టి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ తెలుపు మరియు పసుపు అనేమోన్స్,, డైసీలు, హిమాలయ నీలిరంగు గసగసాల మరియు పాము లిల్లీ వంటి అనేక 300 జాతుల పుష్పాలను చూడవొచ్చు. ఈ పుష్పాలతోపాటు, నలుపు హిమాలయ ఎలుగుబంట్లు, తహర్స్, కస్తూరి జింక, మంచు చిరుతలు, మరియు సేరోవ్స్ వంటి అరుదైన జంతుజాలాన్నిమరియు అరుదైన సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: Alosh Bennett

ఉదయపూర్, రాజస్థాన్

ఉదయపూర్, రాజస్థాన్

బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభయారణ్యాలకు ప్రసిద్ది పొందిన ఉదయపూర్ ‘సరస్సుల నగరం' గా పిలువబడే అందమైన ప్రదేశం. మహారాణా ఉదయ సింగ్ నిర్మించిన, గోల్ మహల్ గా పిలువబడే రాజ్ ఆంగణ్ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగ్ మందిర్, నెహ్రూ గార్డెన్, ఏక్ లింగ జీ దేవాలయం, రాజీవ్ గాంధీ పార్క్, శ్రీనాథ్ జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ మధ్య కాలం బాగుంటుందని పర్యాటకులు భావిస్తుంటారు.

ఉదయపూర్ లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Slick-o-bot

కన్యాకుమారి, తమిళనాడు

కన్యాకుమారి, తమిళనాడు

కన్యాకుమారి పట్టణం ఇండియా కు దక్షిణ భూభాగాన చివరలో వుంది. ఈ ప్రదేశంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం మరియు హిందూ మహా సముద్రం కలుస్తాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు , ప్రత్యేకించి పౌర్ణమి రోజులలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీ లో ప్రధాన ఆకర్షణలు అంటే అవి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం. సీఫుడ్ లు కన్యాకుమారి ప్రసిద్ధి చెందినది. కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

కన్యాకుమారి లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Gopinath Sivanesan

ఖజురహో, మధ్యప్రదేశ్

ఖజురహో, మధ్యప్రదేశ్

ఇక్కడ ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది.ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణ. మానవ భావోద్వేగాలను రాతిమీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేనివిధంగా మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు. ఈ దేవాలయాలను యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఆగస్ట్ మాసం.

ఖజురహో లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Paul Mannix

పహల్గాం, జమ్ము కాశ్మీర్

పహల్గాం, జమ్ము కాశ్మీర్

పహల్గాం, జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ స్థలం దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన ప్రవాహాలు, మరియు పువ్వుల పచ్చిక బయళ్లలతో నిండి ఉంటుంది. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు, కాబట్టి ఇక్కడ సినిమా షూటింగ్ లు చాలా జరుగుతుంటాయి. సంవత్సరం అంతా పర్యాటకులు దేశవిదేశాలనుండి ఈ ప్రాంతాన్ని దర్శించటానికి వొస్తూనే ఉంటారు. ఎవరైనా మంచు పడటం చూడాలనుకుంటే నవంబర్ మరియు ఫెబ్రవరి నెలల్లో సందర్శించవొచ్చు. ఏది ఏమైనా ఆగస్ట్ నుండి నవంబర్ మధ్య వరకు పహల్గాం ను దర్శించటానికి అనువైన సమయం.

పహల్గాం లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy:Nandanupadhyay

మౌంట్ అబు, రాజస్థాన్

మౌంట్ అబు, రాజస్థాన్

రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబు ఒక పర్వత ప్రాంతం. ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. నక్కి సరస్సు, సన్సెట్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ అఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంత౦లొ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు. సంవత్సరం పొడవున వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ఆగస్ట్ మాసం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.

మౌంట్ అబు లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: CorrectKnowledge

కౌసని, ఉత్తరాఖండ్

కౌసని, ఉత్తరాఖండ్

కౌసని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక సుందరమైన పర్వత పట్టణం. గొప్పవైన హిమాలయాలతో పాటు నందాకోట్, త్రిశూల్, మరియు నడ దేవి వంటి పర్వతాలు ఇక్కడ నుండి సులభంగా కనిపిస్తాయి. ఈ పట్టణం దట్టమైన దేవదారు చెట్లు మధ్య ఒక కొండల పైన ఉంది. అంతే కాకుండా అందమైన కొండలు మరియు పర్వత ప్రాంతంలో ఉన్న ఆశ్రమములు, దేవాలయాలు మరియు టీ ఎస్టేట్ లకు ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అంటే ఆగస్ట్ మరియు ఫిబ్రవరి మధ్య కౌసని సందర్శించడానికి ఇష్టపడతారు.

కౌసని లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Ekabhishek

గోవా

గోవా

ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. ఇక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. గోవా ప్రాంతాన్ని ఎక్కువగా ఆగస్ట్ మాసం లో ఎక్కువ మంది సందర్శిస్తుంటారు కారణం నీటి క్రీడలు ఆగస్ట్ మాసంలోనే జరుగుతుంటాయి. అన్ని బీచ్ లలోను వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. వీటిని కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కైస్, బనానా రైడ్, పారా సైలింగ్ వంటివి ఎంచుకోవచ్చు. బీచ్ లో కల గుడిసెలలో లభించే అచ్చమైన గోవా సీఫుడ్ తో బాటుగా బీర్ పుచ్చుకోవడం మరచిపోకండి.

Photo Courtesy:Vinoth Chandar

అతిరాప్పిల్లి, కేరళ

అతిరాప్పిల్లి, కేరళ

అతిరాప్పిల్లి అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. ఇక్కడ వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం కనిపిస్తుంది. అతిరాప్పిల్లి జలపాతం, వళచల్ జలపాతం, చార్పా జలపాతం ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్, షాపింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో మునిగితేలవచ్చు. మీరు ఆగస్ట్ మాసం లో సందర్శిస్తే జలపాతాల హోరులతో మారుమ్రోగుతూ ఈ ప్రాంతం ప్రతిద్వనిస్తుంది.

అతిరాప్పిల్లి లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Jan J George

వయనాడు, కేరళ

వయనాడు, కేరళ

కేరళలో ఉన్న వయనాడు ప్రాంతం ఎన్నో ప్రత్యేకతల వలన ప్రసిద్దమైన పర్యాటకుల మజిలీ అయింది. కళ్ళని తిరిగి ఉత్తేజ పరిచేంత అందం ఈ ప్రాంతం సొంతం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ అందమైన పచ్చటి కొండలు, ఆకుపచ్చని సౌందర్యం, సుగంధభరిత తోటలు, దట్టమైన అడవులు మరియు సంపన్న మైన సాంస్కృతిక చరిత్ర ఇక్కడ ఉండే ప్రధాన ఆకర్షణలు. అడవులకి దగ్గరలో ఉన్న కొన్ని రిసార్ట్స్ ల లో అలసి సొలసిన పర్యాటకులని తిరిగి ఉత్తేజపరిచేందుకు ఆయుర్వేదిక్ మసాజ్, స్పా వంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడున్న అందమైన మరియు ప్రశాంత వాతావరణం ఆస్వాదించాలంటే పర్యాటకులు ఆగస్ట్ మాసంలో తప్పక సందర్శించాలి.

వయనాడు లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Sarath Kuchi

కుమరకొం, కేరళ

కుమరకొం, కేరళ

అందరూ తప్పక వెళ్ళి తీరాలనుకునే అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం. ఇక్కడ మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన హాలిడే ని గడపడం ఒక మధురానుభూతి. కుమరకొం లో లభించే వంటకాలలో సంపన్నమైన కేరళ సాంప్రదాయ రుచులు పర్యాటకులకి అద్భుతమైన భోజనాన్ని రుచి చుసిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో లభించే వివిధ రకాల సీ ఫుడ్స్ ఏంతో రుచికరంగా ఉంటాయి.మంత్రముగ్ధుల్ని చేసే ఇక్కడి వాతావరణం ఆగస్ట్ మాసంలో పర్యాటకులని ఆకర్షిస్తూ అంతు లేని ఉల్లాసాన్నిపంచుతోంది.

కుమరకొం లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Sarath Kuchi

లోనావాలా, మహారాష్ట్ర

లోనావాలా, మహారాష్ట్ర

లోనావాలా మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ఉండే అద్భుతమైన సహ్యాద్రి శ్రేణిలో గల ప్రసిద్ధ పర్వత ప్రాంతం. జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంటుంది. మీరు పర్వతారోహణ లేదా పురాతన భారతీయ నిర్మాణాలను ఇష్టపడే వారైతే తుంగ్, తిలోనా, లోహ ఘడ్ కోటలను చూడండి. ఎత్తైన, పచ్చటి చెట్లుగల రైవుడ్ పార్క్ లోనావాలాలో పెద్ద ఉద్యానవనం. సరదాలు పంచే మరో ప్రదేశం శివాజీ ఉద్యాన్. ఈ స్వర్గపు తునకకి ఆగస్ట్ మాసంలో వెళ్ళకపోతే ఏమీ కోల్పోతున్నారో మీకు తెలీదు.

లోనావాలా లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Ravinder Singh Gill

పంచగని, మహారాష్ట్ర

పంచగని, మహారాష్ట్ర

ప్రకృతి రమణియతతో శోభిల్లే పర్యాటక కేంద్రం మహారాష్ట్ర లోని పంచగని. అందమైన పకృతి లో కొండల మధ్య సూర్యాస్తమయం ఆస్వాదించాలన్నా, అలా కాసేపు బొటు లో షికారు చేద్దామనుకున్నా, స్ట్రా బెర్రీ పళ్ళూ కోసుకోవాలన్నా, లేదా మీరు సాహసోపేతమైనా ఆలోచనలున్నవారైతే పారాగ్లైడింగ్ చేయవచ్చు. ప్రకృతి ని ప్రేమించేవారు, పచ్చటి ఒడి లో సేద తీరాలనుకునే వారు తప్పక చూడాల్సిన ప్రదేశం షేర్ బాగ్. ఆగస్ట్ నుంచి నవంబర్ వరకూ కూడా చిత్తడి నేల, చుట్టూ పచ్చటి ప్రకృతి ని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు.

పంచగని లో మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: FlickreviewR

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X