» »కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు !

కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు !

Posted By:

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోమంచి పర్యాటక ప్రదేశం కాశ్మీర్. ఇది ఇండియా లోనే ఉత్తమమైన హిల్ స్టేషన్ లలో ఒకటి. హిమాలయాల ఒడిలో కల అందాల కాశ్మీర్ లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలు, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలూ కలిగి వుంది. కాశ్మీర్ సందర్శనలో అక్కడ చుట్టూ పట్ల కల మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు కూడా కలవు. మీరు స్నేహితులతో వెళ్ళినా, కుటుంబ సభ్యులతో వెళ్ళినా, ఎవరితో కలసి వెళ్ళినప్పటికీ అందరి అభిరుచులకు తగిన ప్రదేశాలు ఇక్కడ కలవు. కాశ్మీర్ ను పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్సిస్తున్నప్పటికి, మార్చ్ నుండి అక్టోబర్ నెలలు అనుకూలమైనవి. కాశ్మీర్ అక్కడి ఆహారాలకు కూడా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఇక్కడ మాంసం చాలా రుచికరం. ఏ డిష్ చేసినా మాంసం విరివిగా వినియోగిస్తారు. వాజ్ వాన్ డిష్ అనే వంటకాని చికెన్ మరియు లాంబ్ కలిపి వండి అద్భుత రుచి ఇస్తారు. కాష్మీరియులు టీ ప్రియులు. ఎన్నో రకాల చాయ్ తయారు చేస్తారు. నూన్ చాయ్, శీర్ చాయ్, కహవా మొదలైనవి ప్రసిద్ధి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని కాశ్మీర్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి తేలికగా చేరవచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కాశ్మీర్ కు సమీప ఎయిర్ పోర్ట్ జమ్మూ తావి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్.
కాశ్మీర్ పర్యటనలో చూసే మంచి ప్రదేశాలు
 

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

దళ్ సరస్సు
శ్రీ నగర్ లోని దళ్ సరస్సు చాలా అందమైనది. ముచ్చటగా దీనిని శ్రీనగర్ ఆభరణం అంటారు. హిమాలయాల నేపధ్యం కల ఈ సరస్సు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.

ఫోటో క్రెడిట్: Basharat Alam Shah

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

దళ్ లేక్ లో పర్యాటకులు నీటి క్రీడలు ఆచరించ వచ్చు. కయాకింగ్, వాటర్ సర్ఫింగ్, కేనోయింగ్ ఆంగ్లింగ్ మరియు స్విమ్మింగ్ లు ఇక్కడ ప్రధాన క్రీడలు. ఫోటో క్రెడిట్: Basharat Alam Shah

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్
శ్రీ నగర్ లోని ఇందిరా గాంధి తులిప్ గార్డెన్ ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశం దళ్ సరస్సు కు నాలుగు కి. మీ. ల దూరంలో కలదు.

ఫోటో క్రెడిట్: Nikhil S

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

తులిప్ పండుగ
శ్రీనగర్ లో చేసే తులిప్ పండుగ కు ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఇది సాధారణంగా మార్చ్, ఏప్రిల్ నెలల లో జరుగుతుంది. 90 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ తోటలు చూసేందుకు ఇది మంచి సమయం.
Photo Courtesy: Wikipedia

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

కార్గిల్
కార్గిల్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ 1999 లో పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగింది. లడక్ లో ఇది రెండవ పెద్ద ప్రాంతం. ఇక్కడ కల ప్రకృతి అందాలు పర్యాటకులను మరల మరల రప్పించేలా చేస్తాయి. కార్గిల్ నుండి శ్రీనగర్, పాడుం మరియు లెహ్ లకు చక్కని రోడ్లు కలవు.
Photo Courtesy: Aayush Iyer

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

కార్గిల్ లో ఆకర్షణలు
కార్గిల్ లో కర్ష మొనాస్టరీ, పాడుం మరియు షార్ గోల్ మొనాస్టరీ వంటి ఆకర్షణలు చూడవచ్చు. ట్రెక్కింగ్ మరియు మౌంటే నీరింగ్ లకు కార్గిల్ మంచి ప్రదేశం.

Photo Courtesy: Hamon JP

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అల్చి
ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి అల్చి మంచి ప్రదేశం. ఇక్కడ కల టెంపుల్స్, మొనాస్టరీ లు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ ప్రదేశంలో అనేక ప్రకృతి దృశ్యాలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: Vyacheslav Argenberg

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఆల్చి పర్యాటక ఆకర్షణలు
అల్చిలో ప్రధానంగా మీరు ఆల్చి బౌద్ధ ఆరామం, సామ్ టి సేక్ మరియు మంజు శ్రీ టెంపుల్ లు చూడాలి.

Photo Courtesy: Fulvio Spada

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అమరనాథ్
అమర నాథ్ హిందువుల తీర్థ యాత్రా స్థలం. ఇది శ్రీనగర్ కు 45 కి. మీ. ల దూరంలో కలదు. అమరనాథ్ కేవ్ టెంపుల్, తప్పక చూడవలసిన ప్రదేశం. Photo Courtesy: Wikipedia

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అమరనాథ్ ఆకర్షణలు
అమరనాథ్ లోని యాత్రా స్థలాలే కాక, ఇక్కడ మీరు శేష నాగ సరస్సు కూడా చూడాలి. ఇది ఒక పవిత్ర మైన సరస్సు గా భావించి స్నానాలు చేస్తారు. అమరనాథ్ కు సమీపంలో పహల్గాం మరొక అందమైన పర్యాటక ఆకర్షణ. సమయం దొరికితే, అమరనాథ్ కు 13 కి. మీ. ల దూరంలో కల సోనా మార్గ కూడా తప్పక చూడదగిన ప్రదేశం.

Photo Courtesy: Nitin Badhwar

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

మంచు కొండల మహత్యం - గుల్మార్గ్ ఇది ఒక పూల తోట. కాశ్మీర్ లో అందమైన ప్రదేశం. మంచి స్కై ఇంగ ప్రదేశం కూడాను. గుల్మార్గ్ కాశ్మీర్ కు 48 కి. మీ. ల దూరంలో కలదు.

Photo Courtesy: Soumyadeep Paul

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ ఆకర్షణలు

నింగ లే నల్లా, ఆల్ పత్తర్ లేక్ , అచ్చ బాల మొదలైనవి చూడాలి. ఔటర్ సర్కిల్ వాక్, అనబడే ఒక 11 కి. మీ. ల ప్రదేశం తప్పక నడవదగినది. Photo Courtesy: Peter

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఒకప్పుడు గుల్మార్గ్ ప్రదేశం రాజులు, మహారాజులకు వేసవి విడిది ప్రదేశంగా వుండేది. అయితే, సుమారుగా 1985 ల నుండి కాశ్మీర్ ప్రాంతంలోని ఈ భూభాగం ఒక పర్యాటక ఆకర్షణగా రూపు దిద్దుకుంటోంది.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ అందాల సందర్శనకు కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు లేకపోలేదు. కొద్ది సంవత్సరాలు గడిచే సరికి సాహస క్రీడలు ఆచరించే వారికి ఇది ఒక ప్రధాన ప్రదేశంగా రూపు దిద్దుకొంది.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

పెద్దవైన పర్వత శ్రేణుల మధ్య స్కై ఇంగ్ ఒక ప్రధాన క్రీడగా మారింది. ఒక్కసారి హిమాలయాలలోని ఈ మంచు ప్రాంతాలు సందర్శిస్తే, ఇక అక్కడ నుండి దూరం అవటం అసాధ్యం.

హాయ్...వేసవి అంతా ఇక్కడ హాయి....!

హాయ్...వేసవి అంతా ఇక్కడ హాయి....!

ప్రపంచం నలుమూలలనుండి, పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చి, వారి ఆనందాలు అధికం చేసుకుంటారు. రోజుల తరబడి స్కి ఇంగ్ లో గడుపుతారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

పెద్ద పెద్ద పర్వత శ్రేణుల మధ్య కల గుల్మార్గ్ దానికి అది ఒక ప్రపంచం గా వుంటుంది. మంచు కొండల మహత్యం - గుల్మార్గ్ గుల్మార్గ్ ప్రదేశానికి వెళ్ళాలంటే, తాంగ్ మార్గ నుండి పాము మెలికల వంటి ఎన్నో వంపులు తిరగాలి.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ సిటీ లోపలి ప్రాంతం మాత్రం ఎంతో బిజి గాను, రణగొణ ధ్వనులతో నిండి వుంటుంది. ఎన్నో రకాల డాబాలు ఉన్నప్పటికీ సిటీ లోపలికి కార్లు దూసుకు పోతూ వుంటాయి.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అనేక రెస్టారెంట్లు కలవు. ఇవి చాలా వరకు వెజిటేరియన్ గా చెప్పబడతాయి. ఇక్కడ దొరికే వసతి కొరకు అంటే చవక తిండ్లు, వసతులు కారణంగా చాలామంది పర్యాటకులు ఇక్కడే వసతి పొందుతారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఇక్కడి గోల్ఫ్ కోర్సు పూర్తిగా మంచుతో కప్పబడి వుంటుంది. ఇక్కడ పెద్ద బెడద అంటే అది కోతులు, కుక్కలు. అవి పర్యాటకులను తరుముతూ వుంటాయి.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ లో ప్రకృతి దృశ్యాలను ఆనందించాలంటే, హోటల్ హై లాండ్స్ పార్క్ పక్కన కల రిసార్ట్ లోని ఎత్తైన ప్రదేశం. మీరు ఇక్కడ నుండి ఈ చారిత్రాత్మక ప్రదేశం చూడవచ్చు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఇక్కడ కల కేథలిక్ చర్చి 1920 లలో బ్రిటిష్ వారిచే నిర్మించబడింది. బ్రిటిష్ వారు ఈ ప్రదేశానికి స్కి ఇంగ్ కు వచ్చే వారు. సమీపంలో ఒక గురుద్వారా , ఒక టెంపుల్ మరియు మాస్క్ లు కూడా కలవు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఈ ప్రాంతం చుట్టూ హిమాలయ పర్వత శ్రేణులు కప్పబడి వుంటాయి. కాశ్మీర్ ప్రాంతం లో కల్లోలం ఉన్నప్పటికీ , అపుడు అపుడు అశాంతి ఇక్కడ కలుగుతున్నప్పటికి, పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి తమ స్కి ఇంగ్ సాహస క్రీడలను ఆచరించి, పర్యాటక మ్యాప్ లో దీనికి గుర్తింపు ఇస్తున్నారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

నేటికీ ఇక్కడి వసతులు , సౌకర్యాలు అధికంగా వృద్ధి చెందనప్పటికి, గత పది సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరిగినట్లు, స్థానికులు చెపుతారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అనేక మార్పులు ప్రతి సంవత్సరం వెళ్లేవారికి కనపడతాయి. పర్యాటకులకు ప్రాధమిక సౌకర్యాలు కూడా సరిగా లేనప్పటికీ, స్కి పెట్రోల్, హోటల్స్, ఎక్విప్మెంట్ మరియు హెలి స్కై ఇంగ్ లాలో మార్పులు గణనీయం గా కలవు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఇండియాలో స్కి ఇంగ్ ఒక కొత్త క్రీడ. అసలు ఉప ఖండంలో ఈ క్రీడ ప్రారంభంలో ఉన్నప్పటికీ, స్కఎర్ లలో చాలామంది విదేసీయులుగా వుంటారు. కాని ప్రతి సంవత్సరం, ఈ శిఖరాల స్కీయింగ్ క్రీడలలో ఇండియన్ లు అధికంగా వుంటున్నారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ స్కై ఇంగ్ విజయానికి కారణం విదేశీ పర్యాటకులు మరియు మనో ధృఢ త కల కాష్మీరు ప్రజలు . రాజకీయ పరిస్థితి మారితే , టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని వీరు భావిస్తారు

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ ప్రాంతం ఒకప్పుడు యూసఫ్ షా చాక్, జహంగీర్ వంటి మొగలాయీ ప్రభువులకు ఒక రిసార్ట్ గా వుండేది. గుల్మార్గ్ కు పాత పేరు "గౌరీ మార్గ" అని చెపుతారు. ఈ పేరు శివ భగవానుడి సతీమణి అయిన పార్వతిది గా కూడా చెపుతారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

యూసఫ్ షా చాక్ రాజు ఈ పేరును గుల్మార్గ్ అంటే గులాబీల రోడ్డు గా మార్చాడు. ఇరవై శతాబ్దపు మొదటి భాగంలో ప్రసిద్ధ సెంట్రల్ ఆసియన్ చరిత్రకారుడు సర్ మార్క్ ఆరేళ్ స్టీన్ (1862 -1943) ఇక్కడ ఒక టెంట్ లో నివసించి పర్వతాల అన్వేషణ చేసేవాడు.

హాయ్...వేసవి అంతా ఇక్కడ హాయి....!

హాయ్...వేసవి అంతా ఇక్కడ హాయి....!

ఇండియా లో గుల్మార్గ్ ప్రాంతం యూసఫ్ షా, చాక్, జహంగీర్ వంటి మొగలాయీ ప్రభువులకు ఒక వేసవి విడిది గా వుండేది. తర్వాతి కాలంలో ఈ పట్టణం బ్రిటిష్ వారికి విడిదిగా కలదు. ఈ ప్రదేశం పాకిస్తాన్ కు మనకు గల లైన్ అఫ్ కంట్రోల్ కు కొద్ది మైళ్ళ దూరంలో వుంటుంది.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

ఇక్కడి రిసార్ట్ లు సముద్ర మట్టానికి 12,959 అడుగుల ఎత్తులో వుంటాయి. ఇక్కడి స్కై ఇంగ్ ప్రాజెక్ట్ ను కాశ్మీర్ ముఖ్య మంత్రి డిసెంబర్, 25, 2004 లో ఆవిష్కరించారు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

గుల్మార్గ్ కు శ్రీ నగర్ లేదా శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి తేలికగా చేరవచ్చు. బస్సు లేదా కార్ లో రెండు గంటల ప్రయాణం. ఒక గంట ప్రయాణంలో తాంగ్ మార్గ చేరవచ్చు.

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అత్యంత సుందరమైన ఈ పూవు కాశ్మీర్ రాష్ట్ర పుష్పం గా గుర్తించబడినది

హాయి అంతా ఇక్కడే !!

హాయి అంతా ఇక్కడే !!

అత్యంత సుందరమైన ఈ జింక అందాల కాశ్మీర్ రాష్ట్ర జంతువుగా గుర్తించబడింది