Search
  • Follow NativePlanet
Share
» »సెప్టెంబర్ లో పుట్టుకువచ్చే అందాలను చూడటానికి ఈ ప్రాంతాలకు వెళ్లారా?

సెప్టెంబర్ లో పుట్టుకువచ్చే అందాలను చూడటానికి ఈ ప్రాంతాలకు వెళ్లారా?

ఈ విశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భౌగోళిక స్వరూపం ఉంటుంది. ఒక చోట ఎతైన పర్వత పంక్తులు ఉంటే మరికొన్ని చోట్ల లోతైన పర్వత లోయ ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల సముద్రాలు, ఇంకొన్నిచోట్ల జలజల పారే నదీజలాలు మనకు కనిపిస్తాయి. ఇక అరణ్యప్రాంతాలన్నీ వర్షాకాలమైన సెప్టెంబర్ లో కొత్త అందాలు సంతరించుకొంటాయి. అందుకే కొంతమంది తాము చేయాల్సిన టూర్లను ఈ సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకొంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ కథనం. మరెందుకు ఆలస్యం చదివేయండి. మరో పదిరోజుల్లో రానున్న సెప్టెంబర్ లో ఎక్కడికెక్కడికి వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.

జిరో, అరుణాచల్ ప్రదేశ్.

జిరో, అరుణాచల్ ప్రదేశ్.

P.C: You Tube

హిమాలయాల రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో ప్రాంతం ఈ సెప్టెంబర్ లో కొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ జీరో ఉత్సవం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ ఉత్సవాన్ని చూడటానికి విదేశీయులు సైతం వస్తారు. అంతేకాకుండా ఇక్కడ టాలీ అభయారణ్యం, పైనాపిల్ తోటలు, మేఘ్నా గుహ, సర్కూట్ హౌస్ తదితరాలను చూడవచ్చు. దీనికి దగ్గర్లో తేజ్ పూర్ ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్ ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాయి.

లచిన్, సిక్కిం

లచిన్, సిక్కిం

P.C: You Tube

చుట్టూ దూదె పింజల్లాంటి మంచునుకప్పుకొన్న కొండలు, మధ్యలో రంగురంగులను కప్పుకొన్నట్లు ఉన్న వివిధ రకాల పంట పొలాలు, ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు ఇవన్నీ ఒకే చోట చూడాలనుకొంటే చలో లచిన్. సిక్కింలోని ఈ ప్రాంతంలో తంగు, చోపట్ లోయలు చూడదగినవి. ఇక్కడ ట్రెక్కింగ్ తో పాటు రివర్ ర్యాఫ్టింగ్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువగా యూత్ ఇక్కడికి వస్తుంటారు. దగ్గర్లో అంటే 200 కిలోమీటర్ల దూరంలో బాగ్ దోగ్రా ఎయిర్ పోర్ట్, 174 కిలోమీటర్ల దూరంలో డార్జిలింగ్ ఎయిర్ పోర్ట్ ఉంది.

దోయార్స్, పశ్చిమబెంగాల్

దోయార్స్, పశ్చిమబెంగాల్

P.C: You Tube

డోర్స్ అనే పదం నుంచి దోయార్స్ పదం ఉద్భవించింది. పశ్చిమ బెంగాల్ కే కాకుండా ప్రక`తి సంపదలకు నియలమైన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఈ దోయార్స్ ద్వారం లాంటిది. ఇది ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడ గురుమారా నేషనల్ పార్క్, బుక్సా టైగర్ రిజర్వ్, జల్దాపారా అభయారణ్యం, చంప్రామారి అభయారణ్యం, భుటాన్ ఘాట్, తీస్తా బ్యారేజ్ చూడదగిన ప్రదేశాలు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్, జంగిల్ సఫారీ అందుబాటులో ఉంటాయి.

కలింపోగ్, పశ్చిమ బెంగాల్

కలింపోగ్, పశ్చిమ బెంగాల్

P.C: You Tube

పశ్చిమ బెంగాల్ లోని మరో హిల్ స్టేషన్ కలింపోగ్. కనుచూపుమేర పచ్చని చెట్లు ఒక వైపు, తెల్లటి హిమాలయ పర్వత ప్రాంతాలు మరోవైపు మనకు కలింపోగ్ వద్ద కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల సంఖ్య కొంత తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ప్రశాంతమైన పర్యాటనలను ఆస్వాధించాలనుకొనేవారికి కలింపోగ్ తప్పకుండా నచ్చుతుంది. గ్రహం హౌస్, మ్యూజియం తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదిగినవి.

లోనావాలా

లోనావాలా

P.C: You Tube

మహారాష్ట్రలోని లోనావాల సెప్టెంబర్ వచ్చిందంటే చాలు పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ముంబై నుంచి ఎక్కువ మంది లోనావాలకు వస్తుంటారు. ఇక్కడి వాతావరణంతో పాటు అడ్వెంచర్ టూరిజాన్ని ఇష్టపడే వారికి లోనావాలా స్వర్గధామం. అదేవిధంగా రామ్చి కోట, లోహాఘడ్ కోట, బేడ్సా గుహలు, వ్యాక్స్ మ్యూజియం, కర్లాబాజా కేవ్స్, తుంగా ఫోర్ట్ ఇక్కడ చూడదగిన ప్రాంతాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X