Search
  • Follow NativePlanet
Share
» »భావనగర్ - గుజరాత్ ప్రధాన వ్యాపార కేంద్రం

భావనగర్ - గుజరాత్ ప్రధాన వ్యాపార కేంద్రం

భావ నగర్ ను 1723లో భావ సిన్హజి గోహిల్ కనుగొన్నారు. గోహిల్ వంశస్తులు మార్వార్ నుండి వచ్చి వడవా అనబడే గ్రామంలో స్థిర పడ్డారు. ఆ గ్రామాన్నే ఇపుడు భావనగర్ గా పిలుస్తున్నారు. భావ నగర్ పట్టణం ఒక కోటచే రక్షించ బడుతూ సుమారు రెండు శతాబ్దాలపాటు ఆఫ్రికా , మొజాంబిక్ , జాంజిబార్, సింగపూర్ , పర్షియన్ గల్ఫ్ వంటి ప్రదేశాలతో సంబంధం కలిగి వ్యాపారాలను చేసింది.భావనగర్ - గుజరాత్ లో ఒక ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రధానంగా కాటన్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంది. ఈ నగరం ఎల్లపుడూ సముద్రపు వ్యాపారానికి, రత్నాలకు, సిల్వర్ ఆభరాణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. అనేక వ్యాపార సంబంధాల కారణంగా భావ సిన్హజి, భావ నగర్ ప్రదేశ్ ప్రాముఖ్యతను ఎంతో పెంచాడు. భావ సిన్హజి వలెనె, అతని వారసులు కూడా వ్యాపారాలను అధికం చేసి, భావ నగర్ అభివృద్ధికి తోడ్పడ్డారు. బ్రిటిష్ వారి పాలనలో అంటే 19 వ శతాబ్దంలో భావ నగర్ స్టేట్ రైల్వే ఏర్పడి ఇండియా లో మొదటి రైల్వే లైన్ కల రాష్ట్రం అయింది. ఆధునీకరణ కారణంగా కథియవార్ రాష్ట్రంలో భావనగర్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. భావ నగర్ మహారాజులు బ్రిటిష్ వారితో సన్నిహిత సంబంధాలు కలిగి వారిచే ఎన్నో బిరుదులు పొందారు.భావ నగర్ ను పాలించిన రాజ వంశం ఎంతో పేరు ప్రతిష్టలను పొందింది.

 ఒక తీర ప్రదేశం

ఒక తీర ప్రదేశం

భావ నగర్ ఒక తీర ప్రదేశం. గుజరాత్ యొక్క దక్షిణ భాగం లోను ఖామ్భాట్ గల్ఫ్ కు పడమటి గాను కలదు.ఇక్కడి వాతావరణం ఉష్ణమండల తీరు కలిగి, పొడిగా వుంటుంది. వేసవి వర్షా కాలాలు వేడి గాను వుంటాయి.

Photos Courtesy : gujarattourism.com

 ఘోఘా బీచ్ తీరం

ఘోఘా బీచ్ తీరం

టూరిస్ట్ లు అధికంగా ఆహ్లాదకర వాతావరణం వుండే వింటర్ నెలల లో సందర్శిస్తారు. ఘోఘా బీచ్ తీరం ఎంతో అందమైనది. పర్యాటకులు అధికంగా ఇష్టపడేది.

ఘోఘా బీచ్

ఘోఘా బీచ్

గుజరాత్ లోని భావనగర్ లో కలఘోఘా బీచ్ ను పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు

Photos Courtesy : gujarattourism.com

పచ్చటి ప్రదేశం

పచ్చటి ప్రదేశం

మహువా బీచ్ చుట్టూ కల ప్రదేశాలు పచ్చదనం కలిగి ఆహ్లాద పరుస్తాయి.

Photos Courtesy : gujarattourism.com

మహువా బీచ్

మహువా బీచ్

భావ నగర్ లోని మహువా బీచ్ లో ఒక ప్రశాంత సాయంత్రంలో పర్యాటకులు

మహువా బీచ్ తీరం

మహువా బీచ్ తీరం

సముద్ర తీరంలో చిరు తిండ్లు అమ్మే వ్యాపారస్తులు

మహువా బీచ్

మహువా బీచ్

భావ నగర్ లోని మహువ బీచ్ పర్యాటకుల ప్రధాన ఆకర్షణ

Photos Courtesy : gujarattourism.com

బౌద్ధ గుహలు

బౌద్ధ గుహలు

భావ నగర్ లోని తధవాజ్ కొండలపై రాతి తో మలచబడిన బౌద్ధ గుహలు.

Photos Courtesy : gujarattourism.com

నేషనల్ పార్క్

నేషనల్ పార్క్

రండి ...త్వరగా రోడ్డు దాటేద్దాం!...వేలవదార్ బ్లాకు బక్ నేషనల్ పార్క్ లోని లేడి పిల్లలు రోడ్డును దాటే ఒక అందమైన దృశ్యం.

Photos Courtesy : gujarattourism.com

వేలవదార్ నేషనల్ పార్క్

వేలవదార్ నేషనల్ పార్క్

పోటీ పడి పరుగులు పెట్టె జింకల అందమైన నేషనల్ పార్క్ దృశ్యం

Photos Courtesy : gujarattourism.com

వేలవదార్ నేషనల్ పార్క్

వేలవదార్ నేషనల్ పార్క్

నేషనల్ పార్క్ లో ఆటలాడుతున్న రెండు బ్లాకు బుక్ లేడి పిల్లలు

Photos Courtesy : gujarattourism.com

బ్రహ్మకుండ్

బ్రహ్మకుండ్

భావనగర్ లో బ్రహ్మ కుండ్ ఒక ప్రసిద్ధ ఆకర్షణ. బ్రహ్మ కుండ్ నిర్మాణ సమీప దృశ్యం

Photos Courtesy : gujarattourism.com

బ్రహ్మ కుండ్ కొలను

బ్రహ్మ కుండ్ కొలను

భావ నగర్ లోని అతి పెద్ద మెట్లు కలిగి చుట్టూ అనేక హిందూ దేవతల విగ్రహాలతో ఆకర్షనీయం గా నిర్మించిన బ్రహ్మ కుండ్ నీటి కొలను

Photos Courtesy : gujarattourism.com

బ్రహ్మ కుండ్ చెక్కడాలు

బ్రహ్మ కుండ్ చెక్కడాలు

బ్రహ్మ కుండ్ లోపలి భాగంలో అందమైన హిందూ దేవతల, ఇతర సాంప్రదాయ పురుషుల చెక్కడాలు
Photos Courtesy : gujarattourism.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X