Search
  • Follow NativePlanet
Share
» »సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

By Venkatakarunasri

ముంబై మహానగరం నుండి 213 కిలోమీటర్ల దూరంలో, పూణే నగరం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది భీమశంకర్. ఇది సాహసికులు ఇష్టమైన ప్రదేశం. ట్రెక్కింగ్, హైకింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. సహ్యాద్రి పర్వత పంక్తులలో భీమశంకర్ ట్రెక్ ప్రసిద్ధి చెందినది. శిధి ఘాట్ గుండా పైకి ఎక్కడం ... గణేష్ ఘాట్ గుండా కిందకు దిగటం నిజంగా ఆసక్తి కలిగించకమానదు.

మీరు ఎప్పుడూ ఉండే రొటీన్ లైఫ్ లకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారా ? ఇప్పుడొచ్చే సెలవులను ఎలా గడపాలి అని అనుకుంటున్నారా ? ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలను కాకుండా ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ కుటుంబసభ్యులతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ గడాలనుకుంటున్నారా ? అయితే మహారాష్ట్ర పోదాం పదండీ ..! ఇతిహాసం మేరకు శివ భగవానుడు సహ్యాద్రి కొండలలో భీముడి అవతారంగా దేవతల కోరిక మేరకు నివసిస్తున్నాడని చెపుతారు. త్రిపురాసురుడనే రాక్షసుడితో శివుడు పోరాడి ఆ రాక్షసుడిని వధించాడు. ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడి శరీరంనుండి ప్రవహించిన చెమట ధారలే భీమ నదిగా ప్రవహించాయని చెపుతారు.

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

ముంబై నుండి కర్జాత్ స్టేషన్ వరకు (90 km) రైల్లో వెళ్ళండి. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో 40 km ల దూరంలో ఉన్న ఖండాస్ గ్రామానికి చేరుకోండి.

చిత్ర కృప : Yogendra Joshi

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

ఎలా వెళ్ళాలి ?

ఇక్కడికి చేరుకున్నాక, టూరిస్ట్ లకు రెండు ఆప్షన్ లను ఎంచుకోవచ్చు భీమశంకర్ చేరుకోవటానికి. ఒకటి గణేష్ ఘాట్ రూట్ కాగా, మరొకటి శిది రూట్.

చిత్ర కృప : solarisgirl

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

ట్రెక్ ఎలా ఉంటుందంటే ..!

గణేష్ ఘాట్ & శిది ఘాట్ రూట్ లు రెండూ కూడా అద్భుతంగా ఉంటాయి. ఖండాస్ నుండి కుడివైపు తిరిగి మెయిన్ బ్రిడ్జి మీదుగా 3-4 గంటలు ప్రయాణిస్తే గణేష్ ఘాట్ చేరుకోవచ్చు. గంట ట్రెక్ తర్వాత గణేష్ ఆలయం, పదర్ ఖిల్లా చేరుకోవచ్చు. మీరు ట్రెక్ ను ఇంకా కొనసాగించాలనుకుంటే, గైడ్ సహకారంతో కొనసాగించవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

ట్రెక్ ఎలా ఉంటుందంటే ..!

ఈ రూట్ గుండా వెళుతున్నప్పుడు టీ స్టాల్ లు, చిన్న చిన్న హోటళ్లు కనిపిస్తాయి. మీకు ఆకలి అనిపిస్తే వెళ్లి తినండి. పదర్ ఖిల్లా రూట్ నుండి కొన్ని గంటల ప్రయాణంలో భీమశంకర్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Shekhar Mane

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

శిది రూట్

శిది రూట్ పర్యాటకులకు ఛాలెంజ్ ఇచ్చే రూట్. ఇక్కడి నుండి కూడా గణేష్ ఆలయానికి చేరుకోవచ్చు. మెయిన్ బ్రిడ్జ్ నుండి మెట్ల మార్గాన వెళ్ళటం వలన సమయ కలిసివస్తుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్త. ఇవి కాస్త డేంజర్. అలా చేరుకున్నాక, పదర్ ఖిల్లా మీదుగా భీమశంకర్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Nitin Raut

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

భీమశంకర్ దేవాలయం

భీమశంకర్ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం సహ్యాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో కలదు. ఇందులో శివుడు కొలువై ఉంటాడు. గుడిని నానా ఫడ్నవీస్ నిర్మించాడు. శివాజీ మహారాజు కూడా గుడి బాగోగులకై వందల ఎకరాల భూమిని ధారాదత్తం చేసాడు. ఇక్కడే భీమానది పుట్టిందని చెబుతారు.

చిత్ర కృప : ସୁରଥ କୁମାର ପାଢ଼ୀ

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

శనిదేవాలయం

భీమశంకర్ దేవాలయ ప్రాంగణంలోనే చిన్న శని దేవాలయం కలదు. గుడి పక్కనే పెద్ద గంట కనపడుతుంది. అది హేమాందపతి శిల్ప శైలిని చూపుతుంది. పక్షులను వీక్షించేవారు, ట్రెక్కింగ్ మీద ఆసక్తిని కనబరిచేవారు ఇక్కడికి వచ్చి ఆనందిస్తుంటారు. భీమశంకర్ అభయారణ్యం సహ్యాద్రి కొండల్లో దట్టమైన అడవుల మధ్య భీమశంకర్ అభయారణ్యం కలదు. ఇది ఇప్పటికే అంతరించిపోతున్న ఎన్నో పక్షులకు, జంతువులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నది. ఔషధాలు ఉపయోగపడే మొక్కలు కూడా కలవు.

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

మన్మోడ్ హిల్స్

సుమారు వేయి మీటర్ల ఎత్తున కల మన్మోడ్ హిల్స్ అనేక పురాతనమైన పెద్ద రాతి చెక్కడాల శాసనాలను కలిగి ఉంది. ఇవి చాలావరకు భీమశంకర దేవాలయానికి సంబంధించినవే. ఈ చెక్కడాలన్ని పూర్తిగా బౌద్ధ మత శైలిలో కలవు. నాగఫణి మరియు గుప్త భీమశంకర్ దేవాలయాలు కూడా సమీపంలో చూడదగిన నిర్మాణాలు.

చిత్ర కృప : Glasreifen

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

హనుమాన్ సరస్సు

హనుమాన్ సరస్సు ఒక పిక్నిక్ ప్రదేశం. పక్షులు, ఉడుతలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. సమీపంలోనే ఒక పెద్ద జలపాతం కూడా కలదు.

చిత్ర కృప : solarisgirl

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

కొండన కేవ్స్

కొండన కేవ్స్ క్రీ. శ. 200 సంవత్సరాల క్రితం నాటివి. ఇందులో 8 పురాతన బుద్ద గుహలు ఉన్నాయి. వాటిలో సూపాలు, ఆకృతులు, శిల్పాలు అద్భుతం. గుహలు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్ వంటి సాహసాలు ఆనందపరుస్తాయి. కోతలిఘడ్ తాలూకాలోని కోట (peth fort) కూడా ట్రెక్కింగ్ కు అనువైనదే !

చిత్ర కృప : Gauravyawalkar.2012

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి

భీమశంకర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పూణే సమీప విమానాశ్రయం. విమానాశ్రయం బయట భీమశంకర్ చేరేందుకు అద్దెకు టాక్సీలు, క్యాబ్ లు దొరుకుతాయి.

రైలు మార్గం

కర్జాత్, పూణే లు భీమశంకర్ సమీప రైల్వే స్టేషన్లు.

రోడ్డు మార్గం

మహారాష్ట్ర లోని వివిధ ప్రదేశాల నుండి భీమశంకర్ కు ప్రతిరోజూ బస్సులు నడుస్తుంటాయి. పూణే, ముంబై నుండి కూడా రోజువారీ సర్వీసులు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X