Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు !

శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు !

తిరుమలేశుని ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణమే. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామి వారికి బ్రహ్మోత్సవాలను మొదటి సారిగా బ్రహ్మదేవుడు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం లో పేర్కొనటం జరిగింది

By Venkatakarunasri

తిరుమలేశుని ఆలయం నిత్యకల్యాణం - పచ్చతోరణమే. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామి వారికి బ్రహ్మోత్సవాలను మొదటి సారిగా బ్రహ్మదేవుడు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం లో పేర్కొనటం జరిగింది.

బ్రహ్మదేవుడే స్వయంగా ఉత్సవాలను ప్రారంభించడంతో "బ్రహ్మోత్సవాలు" అయ్యాయని చెబుతారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను 9 రోజులపాటు ఘనంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తిరుమలలో జరిగే మిగితా ఉత్సవాలతో పోలిస్తే, ఇవి వైభవంగా, పెద్ద ఎత్తున జరుగుతాయి. శ్రీవారికి జరిగే గొప్ప ఉత్సవాలు ఇవి.

బ్రహ్మోతవాలు 3 రకాలు. మొదటిది నిత్య బ్రహ్మోత్సవం, రెండవది శాంతి బ్రహ్మోత్సవం, మూడవది శ్రద్దా బ్రహ్మోత్సవాలు నిత్య బ్రహ్మోత్సవం.

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ఆధారంగా జరిగేవి నిత్య బ్రహ్మోతవాలు. ఇవి మూడు, ఐదు, ఏడూ, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులలో గానీ జరుగుతాయి.

నిత్య బ్రహ్మోత్సవం

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ఆధారంగా జరిగేవి నిత్య బ్రహ్మోతవాలు. ఇవి మూడు, ఐదు, ఏడూ, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులలో గానీ జరుగుతాయి.

శాంతి బ్రహ్మోత్సవం

కరువుకాటకాలు, క్షామం, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడన నివారణకోసం జరిపించేవి శాంతి బ్రహ్మోత్సవాలు. వీటిని పురాతన కాలంలో రాజులు ప్రజల మేలు కొరకు ఐదు రోజుల పాటు జరిపించేవారు.

శ్రద్ధా బ్రహ్మోత్సవాలు

ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దైవసన్నిధిలో, దేవస్థానంలో సమర్పించి భక్తి శ్రద్దలతో జరిపించుకొనేది శ్రద్దా బ్రహ్మోత్సవాలు. వీటిని 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు' అని కూడా అంటారు.

మొదటి రోజు

మొదటి రోజు

ధ్వజారోహణ

మొదటి రోజు ఆలయం సన్నిధిలో ధ్వజారోహణ చేస్తారు. కొత్త నూలు బట్ట మీద గరుడ బొమ్మ చిత్రీకరించి పతాకావిష్కరణ చేస్తారు. దాంతో స్వామి వారికి బ్రహ్మోతవాలు మొదలయినట్లే.

రెండవరోజు

రెండవరోజు

శేషవాహనం

ధ్వజారోహణ తర్వాత రెండవరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పుష్పాలతో అందంగా అలంకరించి, వాహన మండపంలో ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. ఇది బ్రహ్మోత్సవాలలో ప్రధానమైనదిగా భావిస్తారు.

 మూడవ రోజు

మూడవ రోజు

సింహవాహనం

మూడవ రోజైన సింహవాహన సేవ సమయంలో స్వామి వారు వజ్రఖచిత కిరీటంతో. సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటాడు. ఆరోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు.

నాలుగవ రోజు

నాలుగవ రోజు

కల్పవృక్షవాహనం

4 వ రోజు ఉదయం స్వామి వారు కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తాడు. ఆరోజు సాయంత్రం, సర్వభూపాల వాహనంమీద స్వామివారి వూరేగింపు, భక్తులకు కనులవిందుగా సాగుతుంది.

ఐదవ రోజు

ఐదవ రోజు

మోహినీ అవతారం, గరుడవాహనం

స్వామి వారు 5 వ రోజున మోహినీ అవతారంలో దర్శనమిస్తాడు. దీనిని ఒక ప్రతేకత ఉంది. అన్ని వాహన సేవలు స్వామి వారి వాహన మండపంలో మొదలైతే, ఇదొక్కటే సేయువారి ఆలయం నుంచే పల్లకిలో మొదలవుతుంది. స్వామి వారు వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, ఒక చేతిలో చిలుకను పట్టుకొని ఉంటాడు. అదే రోజు రాత్రి స్వామి వారు గరుడ సేవలో తరిస్తాడు.

ఆరో రోజు

ఆరో రోజు

గజవాహనం

ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు.

ఏడవ రోజు

ఏడవ రోజు

సూర్య ప్రభ వాహనం

7 వ రోజు ఉదయం మలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహనంలో, సాయంత్రం చంద్రప్రభ వాహనంలో ఊరేగుతారు. సాయంత్రం చంద్రప్రభావ వాహన ఊరేగింపులో తెలుపు వస్త్రాలు, తెలుపు పుష్పనాలు, మాలలు దహరించటం విశేషం.

8 వ రోజు

8 వ రోజు

రథోత్సవం

8 వ రోజు జరిగే రథోత్సవానికి హాజరైనట్లు, భక్తులు మరేరోజున కానరారు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకొని వాహన సేవ ఇది.

9 వ రోజు

9 వ రోజు

చక్రస్నానం

బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన 9 వ రోజు , స్వామివారికి చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X