Search
  • Follow NativePlanet
Share
» » మున్నార్ కంటే కూర్గ్ గొప్ప... ఎలా ?

మున్నార్ కంటే కూర్గ్ గొప్ప... ఎలా ?

ఈ మధ్య కాలంలో కేరళ టూరిజం బాగా అభివృద్ధి చెందినది. అయితే ప్రస్తుతం కేరళ రాష్ట్ర టూరిజం కంటే కూడా, కర్నాటక రాష్ట్ర టూరిజం బాగా అభివృద్ధి చెందుతోంది. కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ, తన పర్యాటక దేవుళ్ళను రాష్ట్రంలోని ఎన్నో రొమాంటిక్ ప్రదేశాలకు తీసుకు వెళుతోంది. వాటిలో కొడగు జిల్లా లోని కూర్గ్ ప్రదేశం ఒకటి.

ఈ రెండు రాష్ట్రాల టూరిజం శాఖలు పేర్కొనిన పర్యాటక గణాంకా వివరాలు పరిశీలిస్తే, కేరళ్ లోని మున్నార్ కంటే, కర్నాటక లోని కూర్గ్ ను ఇటీవలి కాలంలో పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు. గత సంవత్సరం మున్నార్ నెం. 1 స్థానంలో వుండగా, ఇపుడు ఆ నెం.1 స్థానం కూర్గ్ పర్యాటక ప్రదేశం ఆక్రమించినది. ఈ సంవత్సరం అంటే 2013 జనవరి నుండి నవంబర్ వరకూ కూర్గ్ ను 10,73,961 మంది పర్యాటకులు సందర్శించారు. ఇదే కాలంలో మున్నార్ ను 3,53,545 పర్యాటకులు సందర్శించారు. ఇంత అధిక వ్యత్యాసానికి గల కారణం ఏమిటి ? ఇక్కడ మున్నార్ లో పర్యాటకులకు అధిక మౌలిక సదుపాయాలూ కూడా వున్నాయని గ్రహించాలి.

mudeth

కేరళ టూరిజం

ఈ గణాంకాలు సేకరించిన కేరళ టూరిజం శాఖ తన భవిష్యత్తు ప్రణాలికలను రచిస్తోంది. మున్నార్ లో అనేక అద్భుత ఆకర్షణలు వున్నాయి. నాణ్యత అధికంగా వుండే వస్తువు అమ్మకానికి ప్రకటనలు అవసరం లేదు. ఇదే సిద్ధాంతంగా కేరళ టూరిజం శాఖ ఇపుడు మున్నార్ పట్ల వవ్యహరిస్తోంది. మున్నార్ కేరళ రాష్ట్రంలో ఒక మంచి హనీమూన్ ప్రదేశం. ఇక్కడి గాలిలో కావలసినంత శృంగారం కలదు. గణాంకాల మేరకు కూర్గ్ కూడా హనీ మూన్ జంటలకు ఆతిధ్యం ఇస్తోంది. మరి మున్నార్ ప్రదేశానికి టూరిస్ట్ లు తగ్గటంలో గల కారణం ఏమిటి ? అని పరిశీలిస్తే....ఈ సంవత్సరం మున్నార్ లో వాతావరణం లో మార్పు వచ్చినదని చెపుతున్నారు. ఆ కారణంగానే 40 శాతం తక్కువగా పర్యాటకులు వచ్చారట.

ఇటీవల చేయబడిన ఒక సర్వే మేరకు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ సంస్థ కూడా కూర్గ్ ను ఒక టాప్ హిల్ స్టేషన్ గా చూపుతోంది. కూర్గ్ కు పర్యాటక సఫలత అధికంగా ఉంటోంది. దానికి కారణం, మా ట్రావెల్ సైట్ నేటివ్ ప్లానెట్ గతంలో చెప్పినట్లు కూర్గ్ లో అత్యధిక ఆనందాలే అనేది విశ్వసించక తప్పదు.

అంతులేని ఆకర్షణలు, అనేక సాహస క్రీడలతో కూర్గ్ పర్యాటకులకు ఖచ్చితమైన ఒక సెలవుల విహార ప్రదేశం. మరి మున్నార్ కంటే కూర్గ్ ఎలా ఇంకనూ అధికం అనేది పరిశీలించాలి. అది కూర్గ్ వాతావరణమా ? చేరుటకు రవాణా సదుపాయాలూ ఇక్కడకు అధికమా ? లేక చక్కని ఆతిధ్యమిచ్చే స్తానికులా ? కారణం ఏదైనప్పటికీ కూర్గ్ పర్యాటక హృదయాలు దోచేసింది. మీరు ఒక్కసారి సందర్శిస్తే చాలు, మరోసారి మిమ్మల్ని వచ్చేలా చేస్తుంది.

కూర్గ్ లో ఆతిధ్యం ఒక అదనపు ఆకర్షణ. టూరిస్ట్ లకు ఇక్కడ కల హోం స్టే లు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవలే టూరిజం శాఖ అనుమతి లేని హోం స్టే లను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. మీకు అవసరమైన అన్ని ట్రావెల్ ప్రణాలికలు అమలు చేయగల లక్సరీ హోటల్స్ మీకు ప్రకృతి ఆనందాలు చూసే సమయాన్ని అధికం చేస్తాయి. అన్ని వర్గాల పర్యాటకులు ఈ కారణంగా కూర్గ్ కు అధికంగా వస్తున్నారు.

మున్నార్ లో వలే, అందమైన ఏనుగులు, పచ్చటి ప్రదేశాలు, మెరిసే నీరు , టీ తోటలు లేదా కాఫీ తోటలే కాటు, కూర్గ్ లో మీకు చక్కని ఆతిధ్యం ఇచ్చే ప్రజలు, వివిధ రకాల సంస్కృతులు కూడా ఆకర్షణగా వుంటాయి. కూర్గ్ లో దక్షిణ ఇండియాలోనే ఉత్తమమైన బౌద్ధ విహారం ఒకటి బైలకుప్పే లో కలదు. విభిన్న పర్యాటకతకు ఇది ఒక ఉదాహరణ గా నిలుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X