Search
  • Follow NativePlanet
Share
» »సూర్య గమనాన్ని అనుసరించి పూటకో రూపంలో దర్శనమిచ్చే ఆ దేవత శక్తి ఏమిటో తెలుసా?

సూర్య గమనాన్ని అనుసరించి పూటకో రూపంలో దర్శనమిచ్చే ఆ దేవత శక్తి ఏమిటో తెలుసా?

భారత దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక మంచు పర్వతాల నడుమ ఉన్న ఉత్తరాఖండ్ లో అయితే పురాణాల్లో పేర్కొన్న ప్రతి విషయానికి సంబంధించి ఒక చిన్న దేవాలయం అయినా ఉంటుంది. అటువంటి దేవాలయాల్లో మూలవిరాట్టు ఉదయం బాలికగా, మధ్యాహ్నం ప్రౌడ మహిళగా, సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. ఇందుకు గల కారణాలు తదితర విషయాలకు సంబంధించిన కథనం మీ కోసం...

ఇక్కడ ముస్లీం పూజారులు మేకలను సాత్విక బలి ఇస్తారు

ధారి దేవి దేవాలయం

ధారి దేవి దేవాలయం

P.C: You Tube

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శ్రీనగర్ లో ప్రవహిస్తున్న అలకనందా నదీ తీరంలో అత్యంత ప్రాచీనమైన ధారాదేవి దేవాలయం ఉంది. ఈ ధారి దేవి అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు. ధారి దేవిని ధర దేవి అని కూడా పిలుస్తారు.

అలకనంద

అలకనంద

P.C: You Tube

ఈ దేవత చల్లని చూపువల్లే అలకనందా నదీ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఎటువంటి ఆపద తలెత్తనీయకుండా చేస్తుందని స్థానిక భక్తులే కాకుండా హిందూ భక్తులు కూడా నమ్ముతారు. ఈ దేవాలయం సుమారు 8వ శతాబ్దం నుంచి ఇక్కడే ఉందని చెబుతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన సూర్యదేవాలయాలు !

సిద్ధపీఠం

సిద్ధపీఠం

P.C: You Tube

ఇక ఇక్కడ వెలిసిన ధారా లేదా ధరా అమ్మవారి గురించి ప్రస్తావన మన పురాణాల్లో కూడా ఉంది. ఈ దేవత ప్రస్తావన ముఖ్యంగా మహాభారతం లో ఉంది. ఇక భాగవతంలో ఈ దేవాలయాన్ని సిద్ధపీఠం అని కూడా ప్రస్తావించారు.

ముదుమలై అభయారణ్యం ప్రకృతి అందాల కలగూరగంప !

108 శక్తి పీఠం

108 శక్తి పీఠం

P.C: You Tube

ఇక్కడ సాక్షాత్తు మహాకాళీ ధరా దేవి రూపంలో ఉండటం వల్ల అమ్మవారు అత్యంత ప్రభావంతమైన, శక్తివంతమైన దేవతగా మహాభాగవతంలో పేర్కొన్నారు. భారత దేశంలోని 108 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటిని చెబుతారు.

ఉగ్రస్వరూపిణి

ఉగ్రస్వరూపిణి

P.C: You Tube

ఈ ధరా దేవిని ఉగ్రస్వరూపిణి అని పేర్కొంటారు. ఈ దేవి చల్లని చూపు మన పై ఉంటే జీవితంలో అనుకొన్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. అయితే ఆమె మన పై ఆగ్రహం వ్యక్తం చేస్తే మాత్రం అనేక కష్టనష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుందని చెబుతారు.

కేదారనాథ

కేదారనాథ

P.C: You Tube

క్రీస్తుశకం 1882లో ఇస్లాం రాజు ఒకరు ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇక్కడ ఒక మసీదును నిర్మించాలని చూశారు. దీంతో ఆ సమయంలో కేదారనాథ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. పర్వత శిఖర భాగాలు కరిగి ప్రవహించసాగాయి. వేల మంది చనిపోయారు.

అదే నమ్మకం.

అదే నమ్మకం.

P.C: You Tube

దీంతో ఆ ముస్లీం పాలకుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనను పక్కనపెట్టాడు. అంతేకాకుండా అప్పటి నుంచి ఎవరూ కూడా ఈ దేవాలయం జోలికి వెళ్లలేదని చెబుతారు.

గోపురం ఉండదు.

గోపురం ఉండదు.

P.C: You Tube

సాధారణంగా హిందూ దేవాలయాలకు గర్భగుడి దాని పై గోపురం ఉంటుంది. అయితే ధారి దేవి దేవాలయంలో గర్భగుడి మాత్రమే ఉంది. గోపురం ఉండదు. అదే ఇక్కడి ప్రత్యేకత.

విశిష్ట రూపం

విశిష్ట రూపం

P.C: You Tube

ఇక ఈ క్షేత్రం మహిమ ఏమిటంటే ఈ దేవాయంలోని అమ్మవారు ఉదయం పూట బాలిక రూపంలో, మధ్యాహ్న సమయంలో ప్రౌడ స్త్రీగా, సాయంకాలం సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. సూర్య గమనాన్ని అనుసరించి అమ్మవారి రూపం మారుతుంది.

శ్రీనగర

శ్రీనగర

P.C: You Tube

ఈ దేవాలయంలో కాళీమాత విగ్రహం కూడా ఉంది. శ్రీ నగర ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ధారా దేవి విగ్రహాన్ని తీసి కొంచెం ఎత్తులో పెట్టాలని ప్రయత్నించారు.

అన్ని ఏర్పాట్లు

అన్ని ఏర్పాట్లు

P.C: You Tube

ఇందు కోసం దేవాలయాన్ని కొంతవరకూ నేలమట్టం చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేసుకొంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా వారి ప్రయత్నాన్ని మార్చలేకపోయాయి.

సిర్పూర్ పురావస్తు కట్టడాల వారసత్వ నగరం !

అలా జరిగింది

అలా జరిగింది

P.C: You Tube

అలకనందా నదీ జలాశయం దగ్గర నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2013 జూన్ 16 సాయంత్రం ఆరు గంటలకు ఈ దేవాలయంలో కొంత భాగాన్ని పడుగొట్టేశారు.

భోరున వర్షం

భోరున వర్షం

P.C: You Tube

అటు పై ఈ ధారి దేవి విగ్రహాన్ని అక్కడి నుంచి వేరేచోటికి మార్పించేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేదర్నాథ్ లో భోన వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వర్షం ఆగకుండా పడింది.

వేలమంది

వేలమంది

P.C: You Tube

దీంతో చాలా మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. ఇక చూస్తున్నట్లుగానే పర్వత శిఖరాలు రాలిపోయాయి. ఇందుకు సంబంధించిన అన్వేషణ ప్రారంభమయ్యింది.

అందువల్లే

అందువల్లే

P.C: You Tube

ధారాదేవి దేవాలయాన్ని పడగొట్టి అక్కడి అమ్మవారి విగ్రహాన్ని స్థానభ్రంశం కలిగించినందువల్లే ఇలా రెప్పపాటులో భోరున వర్షం కురిసిందని అనేక మంది జ్యోతిష్యాస్త్ర నిపుణులు తేల్చారు.

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X