» »కదిలే శివలింగం ఎక్కడ వుందో మీకు తెలుసా?

కదిలే శివలింగం ఎక్కడ వుందో మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు

కదిలే శివలింగం దియోరియా జిల్లా ఉత్తర ప్రదేశ్ లో వుంది. దియోరియా జిల్లా గురించి రామాయణంలో ప్రస్తావించబడింది. రాముడు తన కుమారుడైన కుశుని కుశ్వంతి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసాడు. అదే ప్రస్తుత ల్హుషీనగర్. మహాభారత కాలానికి ముందు ఈ ప్రాంతం మహాసుదర్శన్ మల్లు రాజ్యంలో భాగంగా ఉందని విశ్వసిస్తున్నారు. ఈ జిల్లాకు సమీపంలో దట్టమైన అరణ్యం ఉంది. ఖుషినగర్ సకలసమృద్ధితో తులతూగిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతం క్రీ.శ 1114- 1154 మధ్యకాలంలో మయూర రాజులు, మౌర్యరాజులు, గుప్తరాజులు, బీహార్ రాజులు, మరియు గార్వార్ రాజుల పాలనలో ఉండేది.

ఇది కూడా చదవండి: గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి వృక్షం

కదిలే శివలింగం ఎక్కడ వుందో మీకు తెలుసా?

 1. ఎలా చేరుకోవాలి?

1. ఎలా చేరుకోవాలి?

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు వెళ్ళండి (ఇక్కడ రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి). అక్కడ దిగి 52 కి.మి. దూరంలో ఉన్న దియోరియా వెళ్ళండి. మీకు ఇక్కడికి వెళ్ళటానికి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు దొరుకుతాయి. ఒకవేళ బస్సులో ప్రయాణించాలనుకుంటే ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు లభ్యమవుతాయి.

చిత్ర కృప : Aditya Kaushal

2. రుద్రపురం

2. రుద్రపురం

దియోరియా అనేది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. మీరు దియోరియా చేరుకున్నాక అక్కడి నుండి మరళా 27 కి. మీ ల దూరంలో ఉన్న రుద్రపూర్ ('రుద్రపురం' అని కూడా పిలుస్తారు) కు చేరుకోవాలి.

చిత్ర కృప : Dennis Jarvis

3. కదిలే శివలింగాలు ఉన్న దేవాలయం

3. కదిలే శివలింగాలు ఉన్న దేవాలయం

ఈ దేవాలయంలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది.

చిత్ర కృప : wiki commons

4. దుగ్దేశ్వరనాథుడు

4. దుగ్దేశ్వరనాథుడు

ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు అంటారు. దియోరియాలోని రుద్రపురంలో ఉన్న శివాలయంలోని శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది.

చిత్ర కృప :wiki commons

5. భక్తులు తండోపతండాలు

5. భక్తులు తండోపతండాలు

ఇక్కడ శివలింగం గంటసేపు కదలచ్చు లేదా ఐదు గంటలు కదలచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని చెపుతుంటారు ఇక్కడి అర్చకులు. అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట.

ఇది కూడా చదవండి:శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

చిత్ర కృప :wiki commons

6. కదిలే శివలింగం

6. కదిలే శివలింగం

ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నాదో తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.

చిత్ర కృప :wiki commons

7. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం

7. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం

ఈ ఆలయంలోని శివలింగాలన్నీ స్వయంభు లింగాలే. ఈ శివలింగం కదులుతూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకసారి కాదు. చాలాసార్లు కదులుతూనే ఉంటుంది. కానీ ఈ శివలింగం కదలటం ఆగిపోతే మాత్రం ఎవరు ఎంత కదిలించినా శివలింగం కదలదట.

చిత్ర కృప :wiki commons

8.పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు

8.పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు

ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలు భక్తులు క్యూ కడుతున్నారు. ఇక ఈ శివలింగం ఎందుకలా కదులుతుందని తెలుసుకునేందుకు చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు.

చిత్ర కృప : Ursula