» »బెంగుళూర్ నుండి మెల్కోటే కు అద్భుతమైన రోడ్ ట్రిప్

బెంగుళూర్ నుండి మెల్కోటే కు అద్భుతమైన రోడ్ ట్రిప్

By: Venkata Karunasri Nalluru

వేర్వేరు ప్రదేశాకు, వివిధ సంస్కృతులకు, వివిధ మతాలకు మరియు తరగతులకు చెందిన వారు సామరస్యంగా కలిసి జీవిస్తున్న నగరం బెంగుళూర్. ఇది మెట్రో నగరం కావడంతో ఇక్కడ ఉద్యోగాలకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ స్థిరపడటం వల్ల జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఐటి అభివృద్ది చెందటం మరియు ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ది చెందటం ఈ మార్పుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చును.

బెంగుళూర్ సమీపంలో గల అనేక ప్రదేశాలను ఒక వారాంతంలో సందర్శించవచ్చును. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలిలత జన్మస్థలం అయిన మెల్కోటేను మీరు వారాంతంలో బెంగుళూరు నగరం నుండి సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి. ఇప్పుడు మనం బెంగుళూర్ నుండి మెల్కోటే కు రహదారి యాత్ర చేద్దామా !

Exciting Road Trip From Bangalore To Melkote

బెంగుళూర్ నుండి మెల్కోటే కు ప్రయాణించటానికి రెండు ప్రముఖ మార్గాలు ఉన్నాయి.

మొదటి మార్గం : బెంగుళూర్ - యడియూర్ - మెల్కోటే (148 కి.మీ)

ఈ మార్గం ఎన్ హెచ్ 75 మరియు ఎన్ హెచ్ 150 ఎ ద్వారా మెల్కోటే వెళ్తుంది.

రూట్ 2: బెంగుళూర్ - రామనగర - మద్దూరు - మాండ్యా - మెల్కోటే (159 కి.మీ)

ఈ మార్గం ఎన్ హెచ్ 275 ద్వారా వెళ్తుంది. ఈ మార్గంలో కొన్ని అందమైన ప్రదేశాలు సందర్శించవచ్చును. ఈ మార్గం ద్వారా మనం బెంగుళూర్ నుండి మెల్కోటే యాత్ర చేద్దామా !

మీరు ఉదయాన్నే బయల్దేరితే మీరు 160 కి.మీ లు కవర్ చేసి ఎన్నో ప్రదేశాలు చూడవచ్చును. మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

Exciting Road Trip From Bangalore To Melkote

మీరు పొద్దున్నే జర్నీ స్టార్ట్ చేస్తే "కామత్ పెలేట్ కోర్నర్ లేదా కుడ్ల రెస్టారెంట్" లలో సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చును. "శ్రీవారి వెజ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ కేబిఆర్ ఫాస్ట్ ఫుడ్" లలో ఇతర స్నాక్స్ తినవచ్చును.

బ్రేక్ ఫాస్ట్ తర్వాత తదుపరి స్టాప్ "రామనగర్" వద్ద. నగరం నుండి ఇది 54 కి.మీ ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం షోలే చిత్రీకరించారు. తర్వాత ఈ ప్రదేశం చాలా ప్రాముఖ్యత గాంచినది. ఇది ఒక ట్రెక్కింగ్ ప్రదేశం. ఇక్కడి దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా వుంటాయి. ఇక్కడ కొన్ని ఫోటోలు క్లిక్ చేసుకోవచ్చును. తదుపరి స్థలం మద్దూరు.

మద్దూరు రామనగర నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్నది. దీనికి మహాభారత కాలం నాటి చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగం ముగిసేసరికి పాండవులలో ఒకరైన అర్జునుడు కృషుడుని నరసింహావతారంలో చూడాలని కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు నిరాకరించడంతో, అర్జుని కోసం బ్రహ్మ ఒక విగ్రహాన్ని తయారుచేశాడు.

ఈ భీకర ఉగ్ర నరసింహ విగ్రహం మద్దూరులోని ఉగ్ర నరసింహ దేవాలయంలో వుంది. మీరు ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ మార్గంలో తదుపరి గమ్యం "మాండ్యా". ఇది మద్దూరు నుండి సుమారు 18 కి.మీ ల దూరంలో ఉంది. "మాండ్యా" చక్కెర కర్మాగారాలకు ప్రసిద్ధి కావటం వల్ల దీనిని "సక్కెరె నాడు" అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ వరదరాజ స్వామి ఆలయం మరియు శ్రీ పట్టాభి ఆలయం అనే రెండు ముఖ్యమైన ఆలయాలు వున్నాయి.

మీరు ఎన్ హెచ్ 150 ఎ ద్వారా మాండ్యా నుండి ప్రయాణం చేసినట్లయితే మాండ్య నుండి 53 కి.మీ దూరంలో ఉంది. మెల్కోటేలో చూడవలసిన కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు వున్నాయి.

Exciting Road Trip From Bangalore To Melkote

PC: Philanthropist 1

యోగ నరసింహ స్వామి ఆలయం :

యోగ నరసింహ స్వామి దేవాలయం "యదుగిరి" గుట్టపై వున్నది. ఈ దేవాలయం "హొయసల పాలన" లో నిర్మించబడింది. ఆలయ గోపురం దూరం నుండి చూడవచ్చు. ఇక్కడ "నరసింహస్వామి" కొలువై వున్నాడు. ఈ విగ్రహాన్ని హిరణ్యకశికుని కుమారుడైన "ప్రహ్లాదుడు" స్థాపించాడని చెప్తారు. ఈ దేవాలయం ఏడు ముఖ్యమైన నరసింహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Exciting Road Trip From Bangalore To Melkote

PC: Prathyush Thomas

చెలువనారాయణ ఆలయం :

ఈ ఆలయం కూడా "యదుగిరి" గుట్టపై వున్నది. ఇక్కడ విష్ణుమూర్తి కొలువై వున్నాడు. ఈ ఆలయం పురాతన కాలం నాటిది.

చెలువనారాయణ ఆలయం శ్రీ వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వారికి ముఖ్యమైన యాత్రా స్థలం. ఇక్కడ శ్రీ రాముడు తన కుమారుడు కుశలునితో ఇక్కడకు వచ్చి శ్రీమన్నారాయణకు పూజలు చేశారని నమ్ముతారు. ఇక్కడ గల సంపత్ కుమారానంద్ విగ్రహాన్ని కూడా రామప్రియ అని పిలుస్తారు. ఇక్కడ పూజలందుకునే దేవత యదుగిరి నాచియార్.

Exciting Road Trip From Bangalore To Melkote

PC: Philanthropist 1

రాయ గోపురం :

రాయ గోపురాన్ని చరిత్రలో ప్రేమికులకు సంబంధించినదని చెప్తారు. ఇది విజయనగర సామ్రాజ్యం హయాంలో నిర్మించబడిన అసంపూర్ణంగా నిర్మితమైన ఆలయం.

ఈ ఆలయాన్ని రాత్రికి రాత్రే నిర్మించారు. ఈ ఆలయానికి గోపురం లేకుండానే నాలుగు వైపులా జఠిలంగా చెక్కబడి వుంటుంది. ఈ ఆలయ ప్రదేశంలో అనేక దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలు చిత్రీకరించారు.

Exciting Road Trip From Bangalore To Melkote

PC: sai sreekanth mulagaleti

తొండనుర్ లేక్ :

ఒకప్పుడు ఈ ప్రాంతంలో జీవించిన "స్వామి రామానుజ" తొండనుర్ లేక్ ను నిర్మించారని అంటారు. ఈ సరస్సు "పద్మగిరి కొండ" చుట్టూ వున్నది. టిప్పు గుహలు మరియు జలపాతంను "రామానుజ గంగే" అని పిలుస్తారు. ఈ సరస్సు ఔషధ లక్షణాలను కలిగి వుందని చెబుతారు. ఇక్కడ ఆసక్తికరమైన ఒక కథనం వుంది. అదేమిటంటే ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ సరస్సును సందర్శించినపుడు ఇక్కడ "వాటర్ క్రిస్టల్" ను కనుగొన్నాడు. తర్వాత ఇతను ఈ సరస్సుకు "మోతీ తలాబ్" అని పేరు పెట్టాడు. "మోతీ తలాబ్" అంటే "ముత్యాల సరస్సు" అని అర్థం.

వనప్రస్థ ఆశ్రమం :

ఈ ఆశ్రమము 2010 లో ఇస్కాన్ వారిచే స్థాపించబడింది. ఇది ఒక బోధన కేంద్రం. ఇది ఒక వేద వృద్ధాశ్రమంగా కూడా సేవలు చేస్తోంది.

మెల్కోటేలో వుండటానికి తగిన వసతి సౌకర్యాలు : మీరు మెల్కోటేలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే యాత్రికులకు సహేతుక మంచి వసతి శ్రీనివాస సభ అందిస్తుంది. మీరు మైసూర్ రోడ్ కి వెళ్ళినట్లయితే హోటళ్లు, మంచి సౌకర్యాలు అందించే రిసార్ట్స్ వుంటాయి. ఇక్కడ బస చేయుటకు కొన్ని అంబ్లీ హాలిడే రిసార్ట్, హోటల్ లే రుచీ, ప్రిన్స్ మరియు హోటల్ మయూర రివర్ వ్యూలు ఉన్నాయి.