Search
  • Follow NativePlanet
Share
» »చిరుజల్లుల సవ్వడిలో వయనాడ్ !!

చిరుజల్లుల సవ్వడిలో వయనాడ్ !!

చల్లటి గాలుల మధ్య చిరుజల్లులు పడుతూ వుంటే ఇంటిలో కూర్చుని ఆనందించే వారు అనేకం. మరి మరింత ఆహ్లాదకర ప్రదేశం అయిన కేరళ లోని వయనాడ్ లో మండు వేసవి తర్వాత పడే చిరుజల్లుల అనుభూతులు మరింత ఆనందకరం.

అందులోనూ ఒక హౌస్ బోటు లో కూర్చుని వర్ష రుతువులో వచ్చే మొదటి చిరుజల్లుల ఆస్వాదన అద్భుతంగా వుంటుంది. ఈ వాతావరణానికి ఒక కప్పు వేడి కాఫీ తోడైతే ఇక అది మరువలేని అనుభూతి. కేరళ లోని వయనాడ్ ఒక గొప్ప వర్ష రుతువు పర్యటన ప్రదేశం.

అసలు వయనాడ్ ఎందుకు వెళ్ళాలి ? వెళితే, అక్కడ ఏమేమి చూడాలి ? అనేది పరిశీలించండి.

హోటల్ వసతులకు క్లిక్ చేయండి

వయనాడ్ ఎందుకు చూడాలి ?

వయనాడ్ ఎందుకు చూడాలి ?

కేరళ లోని వయనాడ్ ఎన్ని సార్లు చూసినప్పటికీ మరల మరల చూడాలనిపించే ప్రదేశం. ప్రతి సందర్శన ఒక మరువ లేని అనుభూతి. ఇక్కడి వాతావరణం మీ సెలవులను ఆనందింప చేసేదిగా వుంటుంది. చక్కని వాతావరణమే కాక, ఇక్కడి ప్రదేశాలు సైతం ఆకర్షనీయం. హృదయ ఆకారంలో వుండే సరస్సు ఒకటి చేమ్బ్రా శిఖరంపై వుంటుంది. ఇది వయనాడ్ లో ఒక గొప్ప ఆకర్షణ.

బాణా సుర సాగర్ డాం

బాణా సుర సాగర్ డాం

పర్వతాలను ముద్దాడే అతి పెద్ద మేఘాలను చూస్తూ ఆనందించగల బాణా సుర సాగర్ డాం ప్రదేశ వర్ణన మాటలకు అందనిది. ఈ డాం నీటిలో ఒక చక్కటి బోటు విహారం చేయండి. చుట్టూ పచ్చటి ప్రదేశాలు. అది మీకు మరువలేని అనుభూతులనిస్తుంది.

పూకాట్ సరస్సు

పూకాట్ సరస్సు

వయనాడ్ లో కల పూకాట్ సరస్సు అధిక సంఖ్యా పర్యాతకులచే సందర్శించ బడుతుంది. ఈ సరస్సులో బోటు విహారం అద్భుత ఆనందాలను అందిస్తుంది. ఇక్కడ కల మత్స్య కొలను ప్రదేశ అందాలను మరింత పెంచి మిమ్మల్ని మీరు మరచి పోయే లా చేస్తుంది.

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు

వర్ష రుతువులో మీన్ ముట్టి జలపాతాలు పర్యాటకులు తప్పక చూడదగిన ఆకర్షనలలో ఒకటి. ఈ జలపాతాల దృశ్యం చూడకుండా మీ వయనాడ్ సందర్శన పూర్తి కానట్లే.

సూచిపార జలపాతాలు

సూచిపార జలపాతాలు

అందమైన సూచిపార జలపాతాలను మీ వయనాడ్ ట్రిప్ లో అసలు మిస్ చేయ కండి. ఎత్తు నుండి హోరు మనే శబ్దంతో చేసే ఈ జలపాతాల ధ్వని ప్రకృతి ప్రియులు తప్పక చూడదగిన దృశ్యం.

ఎదక్కాల్ గుహలు

ఎదక్కాల్ గుహలు

వయనాడ్ వెళ్ళే పర్యాటకులకు ఎదక్కాల్ గుహలు ఒక ఆసక్తి కర ఆకర్షణలు. ఏటవాలుగా వుండే ఈ ప్రదేశ నడక మిమ్ములను గుహలకు తీసుకు వేలుత్లుంది. ఇవి సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తున కలవు.

కరపూజ డాం

కరపూజ డాం

కరపూజ ఇండియా లో ఒక అతి పెద్ద మట్టి ఆనకట్ట. ఇది కలపెట్ట ప్రదేశం కు 16 కి. మీ. ల దూరం. ఇక్కడ కల సరస్సులు, పక్షులు, పర్వత శ్రేణులు వంటివి పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తాయి.

కన్తాపారా జలపాతాలు

కన్తాపారా జలపాతాలు

మీలోని సాహస వంతుడికి ఇది సరైన ప్రదేశం. కాన్తాపార జలపాతాలు పచ్చటి అడవుల మధ్య కలవు. ట్రెక్కింగ్ కు ఇది ఒక అద్భుత ప్రదేశం. అయితే, వరశా కాలంలో ట్రెక్కింగ్ సూచించ దగినది కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X