• Follow NativePlanet
Share
» »భయం భయంగా సమాధులలో సందర్శన !!

భయం భయంగా సమాధులలో సందర్శన !!

దిగువ పేర్కొనే ప్రదేశాలు ఒక్కసారి పరిశీలిస్తే, అసలైన యుద్ధాలు ఎపుడు ఎక్కడ జరిగాయి, ఆ ప్రదేశాల చరిత్ర ఏమిటి అనేవి మీకు ఒక అవగాహన వస్తుంది. పర్యటించ దగిన ఇండియా లోని కొన్ని యుద్ధ భూములను చూడండి.

యుద్ధ ప్రదేశాల పర్యటన చేయాలని ఎపుడైనా భావించారా ? భారత దేశం విశ్రాంతి సెలవులకు, హనీ మూన్ లకు ఒక మంచి ప్రదేశమే. కాని ఈ దేశానికి చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలు కూడా అధికంగానే వున్నాయి. దేశంలో జరిగిన యుద్ధాలు, పోరాటాలు దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో చెరగని ముద్రలను కూడా వేసాయి. ప్రపంచ యుద్ధాల చరిత్రలో ఇండియా కూడా కొన్ని ప్రధాన యుద్ధాలు చేసింది.

కురుక్షేత్ర

కురుక్షేత్ర

కురుక్షేత్ర పోరాం ఒక చారిత్రక యుద్ధం. పాండవులకు, కౌరవులకు మధ్య జరిగినట్లు హిందువుల పవిత్ర ఇతిహాసం మహాభారతం చెపుతోంది. ఈ కురుక్షేత్ర రణ రంగంలోనే శ్రీ కృష్ణుడు భగవత్ గీత ను అర్జ్లునుడికి ఉపదేశించాడు. ఈ సిటీ లో పర్యాటక ఆకర్షణలు అనేకం కలవు. వాటిలో భీష్మ కుండ్, బ్రహ్మ సరోవర్, జ్యోతిసార్ వంటి వాటికి చారిత్రక సంబంధం కలదు.

పానిపట్

పానిపట్

పానిపట్ లో జరిగిన యుద్ధాలు ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కలదు. ఈ యుద్ధాలు వివిధ వంశాలకు చెందినా రాజుల మధ్య జరిగాయి. ఈ మూడు పానిపట్ యుద్ధాలు 1526,1556 మరియు 1761 లలో వరుసగా జరిగాయి. మొదటి పానిపట్ యుద్ధం కారణంగా ఇండియా లో మొఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. ఈ యుద్ధ భూమి లో నిర్మించిన ఇబ్రహీం లోడి సమాధి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

ఢిల్లీ

ఢిల్లీ

ఇండియా లో యుద్ధభూమి పర్యాటకం లో ఢిల్లీ ప్రసిద్ధి చెందినది. ఢిల్లీ నగరం చిన్న, పెద్ద యుద్ధాలు అనేకం చవి చూసింది. ఈ కారణంగా చరిత్ర పుస్తకాలలో ప్రధానంగా చోటు చేసుకుంది. ఢిల్లీ లోని ఇండియా గేటు, ఖూని దర్వాజా వంటివి కొన్ని చారిత్రక యుద్ధ భూములు.

మైసూరు

మైసూరు

మైసూరు నగరం అనేక యుద్దాలతో చరిత్ర కలిగి వుంది. తిపు సుల్తాన్ వంటి గొప్ప పాలకులు అనేక ఆంగ్లో - మైసూరు యుద్ధాలు జరిపారు. బ్రిటిష్ వారు ఇండియా కు వచ్చినప్పటి నుండి వారి ప్రభుత్వానికి 1767 - 1789 ల మధ్య జరిగిన ఈ ఆంగ్లో - మైసూరు యుద్ధాలు పెద్ద ఆటంకంగా ఉండేవి.

Photo Courtesy: Riju K

జిల్లియన్ వాలా బాగ్

జిల్లియన్ వాలా బాగ్

జిలియన్ వాలా బాగ్ ప్రదేశ అమ్రిత్ సర్ లోని ఒక పబ్లిక్ గార్డెన్. బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ మూకుమ్మడి హత్యా కాండ నిర్వహించినప్పటి నుండి ఈ ప్రదేశం ప్రసిద్ధి అయ్యింది. ఈ మారణకాండ లో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక మెమోరియల్ నిర్మించారు. ఇది తప్పక చూడ దగినది.

ఇంఫాల్

ఇంఫాల్

ఇంఫాల్ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇది ప్రసిద్ధి అయ్యింది. ఆసియ లో మొట్ట మొదటి సారిగా ఈ ప్రదేశంలో జపాన్ వారి సైన్యాలు ఓడించాబడ్డాయి. ఇంఫాల్ లో కల మిత్ర కూటమిని నాశనం చేసి ఇండియా ను జయించాలని జపాన్ సిద్ధపడింది. ఈ యుద్ధ ప్రదేశంలో ఒక యుద్ధ స్మారకాన్ని మరణించిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు.

కొహిమ, నాగాలాండ్

కొహిమ, నాగాలాండ్

నాగాలాండ్ లోని కొహిమా లో మిత్ర కూటమి లోని 1420మంది సైనికుల శ్మశానం కలదు. వీరికి గాను ఒక ప్రసిద్ధ మెమోరియల్ స్తూపం నిర్మించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధం. దీనిపై " మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, రేపటి కొరకు మేము ఈ రోజు మరనిన్చాము " అని చెప్పండి అని వ్రాసి వుంటుంది.

Photo Courtesy: Rupkamal Sarma

కార్గిల్

కార్గిల్

కార్గిల్ ప్రదేశం లోని పర్వత ప్రాంతాలలో ప్రసిద్ధ 1999 సంవత్సరపు కార్గిల్ యుద్ధం జరిగింది. ఇది లైన్ అఫ్ కంట్రోల్ కు సమీపంలో కలదు. ఈ యుద్ధం ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది. దీనిని ఆపరేషన్ విజయ్ అని అంటారు. ఈ ప్రదేశం చారిత్రకంగానే కాక బౌద్ధ ఆరామాలకు కూడా ప్రసిద్ధి.

అతిశక్తివంతమైన నాగ దోష పరిహారం గుడి !

గిన్నిస్ బుక్ లో అనంతపురం ! ఎందుకు ?

సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - 12 దేవాలయాల మిస్టరీ !

గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి