Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ కు 100 KM లలోపు గల జలపాతాలు !

హైదరాబాద్ కు 100 KM లలోపు గల జలపాతాలు !

హైదరాబాద్ కు 100 KM లలోపు గల జలపాతాలు !

ఏంటి .. ఈ దసరా పండుగ సెలవులు సప్పగా గడుస్తున్నాయని అనుకుంటున్నారా ?? ఈ సెలవులను తీపి జ్ఞాపకాలుగా మార్చాలనుకుంటున్నారా?? అయితే మీకు ఇక్కడ చెప్పబోయే విశేషాలు చాలా వరకు మీ సెలవులను ఆవిధంగానే మార్చబోతున్నాయి.

ఈ దసరా పండక్కి హైదరాబాద్ నగరం చుట్టుప్రక్కల గల 8 జలపాతాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇవి చాలా వరకు బయటి ప్రపంచానికి తెలియవు. ఒకవేళ తెలిసినా ఒకటో, రెండో తెలిసి ఉంటాయే తప్ప మిగితావి తెలిసి ఉండవు. హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడ పేర్కొన్న జలపాతాలకు మీరు కుటుంబసభ్యులతో కానీ, స్నేహితులతో కానీ చూసిరావచ్చు. ఇవి సందర్శించడానికి సమయం కూడా ఈ అక్టోబర్ మాసమే కావడం యాధృచ్ఛికం.

మరి ఇక్కడ మీకు చెప్పబోయే జలపాతాలు హైదరాబాద్ నగరం నుంచి ఎటు వైపున వెళ్ళాలి మరియు అవి ఎంత దూరంలో ఉన్నాయి లేదా ఏమైనా రవాణా సౌకర్యాలు ఉన్నాయా అంటే ...

మల్లెల తీర్థం - శ్రీశైలం

మల్లెల తీర్థం - శ్రీశైలం

శ్రీశైలానికి 58 కి. మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహా నగరానికి 170 కి. మీ. దూరంలో నల్లమల్ల అడవులలో మల్లెల తీర్థం ఉన్నది. ఇది అడవిలో ఉన్నా, రోడ్డు మార్గం ద్వారా జలపాతానికి తేలికగా చేరుకోవచ్చు. ఈ నీరు ఎంతో పవిత్రమైందిగా భావించడంతో భక్తులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయటం వల్ల పాపాలు పోయి, మోక్షం లభిస్తుందని వారి నమ్మకం. కింద ఉన్న నీటిలోకి వెళ్ళాలంటే 250 మెట్లు దిగి చాలా జాగ్రత్తగా, గాబారా పడకుండా నిదానంగా ఒకరి నొకరు చేయి పట్టుకొని వెళ్ళాలి.

శ్రీశైలం లోని మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు

Photo Courtesy: Ylnr123

ఎత్తిపోతల జలపాతం - నల్గొండ

ఎత్తిపోతల జలపాతం - నల్గొండ

ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగర్ కి 14 కి. మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహా నగరానికి 173 కి. మీ. దూరంలో నల్గొండ జిల్లా లో ఉన్నాయి. కృష్ణా నది ఉపనదియైన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి వేగంగా పడటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. ఈ జలపాతాలు సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తూ, రాత్రి పూట విద్యుత్ కాంతులతో ధగధగా మెరుస్తూ చూడటానికి మనోహరంగా ఉంటుంది.

నల్గొండ జిల్లాలో ఉన్న మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు

Photo Courtesy: Praveen120

భీముని పాదం జలపాతం - వరంగల్

భీముని పాదం జలపాతం - వరంగల్

తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా - గూడూరు మండలంలోని సీతానాగారం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆహ్లాదపరిచే భీముని పాదం జలపాతాలు ఉన్నాయి. ఇవి గూడూరు బస్ స్టాండ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరం నుంచి 51 కి. మీ. దూరంలో, ఖమ్మం బస్ స్టాండ్ నుంచి 88 కి. మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహానగరం నుంచి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ జలపాతం చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. ఇక్కడ ఎండాకాలంలోను నీరు రావడం ఒక వింతైన అనుభూతి. ఇక వర్షాకాలంలో చెప్పనక్కర్లేదనుకుంటా..! పర్యాటకులు ఇబ్బడి ముబ్బడిగా తరలి వస్తుంటారు. వచ్చి ఇక్కడ వనభోజనాలు సైతం చేస్తుంటారు.

వరంగల్ జిల్లాలోని మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు

పొచ్చెర జలపాతం - అదిలాబాద్

పొచ్చెర జలపాతం - అదిలాబాద్

నిర్మల్ కు 40 కి. మీ. దూరంలో, అదిలాబాద్ కు 50 కి. మీ. దూరంలో, హైదరాబాద్ మహానగరానికి 257 కి. మీ. దూరంలో మరియు కుంటాల జలపాతానికి 22 కి. మీ. దూరంలో పొచ్చెర అనే చిన్నదైన జలపాతాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. ఎన్ హెచ్ 7 నుంచి దిగి బోథ్ వెళ్లే మార్గంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. బోథ్ క్రాస్ రోడ్డు నుంచి బస్సులు, జీపులు మరియు ఆటోలు నిత్యం నడుస్తుంటాయి. చిన్న కొండ వాగు రాళ్ళపై నుంచి నీళ్ళు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పై నుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ జలపాతం లో తడవకుండా ఉండటం మీకు సాధ్యమా ..??

అదిలాబాద్ మరింత సమాచారం కొరకు

Photo Courtesy: Rajib Ghosh

కుంటాల జలపాతం - అదిలాబాద్

కుంటాల జలపాతం - అదిలాబాద్

నిర్మల్ కు 43 కి. మీ. దూరంలో, అదిలాబాద్ కు 58 కి. మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహాంగరానికి 260 కి. మీ. దూరంలో రాష్ట్రం లోనే ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతం ఉంది. గోదావరి కి ఉపనదియైన కడెం వాగు సహ్యాద్రి పర్వత పంక్తులపై 45 మీ. ఎత్తునుంచి దూకుతూ కనువిందు చేస్తుంది. జలపాతం కిందికి దూకే చోట ఒక చిన్న రాతి గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నంది తదితర విగ్రహాలు ఉన్నాయి. బస్సు, జీపు మరియు ఆటో సౌకర్యం పుష్కలంగా ఉండటంతో పర్యాటకులు, శివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

అదిలాబాద్ లోని అడవులు, సెలయెర్ల కొరకు

Photo Courtesy: Rajib Ghosh

గాయత్రి జలపాతం - అదిలాబాద్

గాయత్రి జలపాతం - అదిలాబాద్

తర్ణం ఖుర్ద్ గ్రామానికి 5 కి.మీ.దూరంలో, కుంటాల జలపాతానికి 19 కి.మీ .దూరంలో, నిర్మల్ కి 38 కి.మీ. దూరంలో, అదిలాబాద్ కి 59 కి.మీ. దూరంలో మరియు హైదరాబాద్ నగరానికి 270 కి.మీ. దూరంలో అందమైన ప్రకృతి నడుమ గాయత్రి జలపాతం ఉన్నది. చాలా తక్కువ మందికి తెలిసిన గాయత్రి జలపాతం గోదావరి నది ఉపనదియైన కడెం నది మీద ఏర్పడ్డది. ఇక్కడికి వర్షాకాల సమయంలో పర్యాటకులు వస్తుంటారు. దీనిని గాడిద గుండం జలపాతమని మరియు మోక్కుడు గుండం జలపాతమని పిలుస్తారు. గాడిద గుండం జలపాత పరిసరాలే మనల్ని స్వర్గం తీసుకొనివెళతాయి. 200 అడుగుల ఎత్తు నుండి పదే జలపాత నీటిధారాల శబ్ధం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ..!

గాయత్రి జలపాతం గురించి మరింత సమాచారం కొరకు

Photo Courtesy: telangana tourism

సహస్త్రకుండ్ జలపాతం - నాందేడ్

సహస్త్రకుండ్ జలపాతం - నాందేడ్

ఇశ్లహ్పూర్ గ్రామానికి 4.5 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ కి 60 కి.మీ. దూరంలో, నాందేడ్ కి 100 కి.మీ. దూరంలో, అదిలాబాద్ కి 116 కి.మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహానగరానికి 282 కి.మీ. దూరంలో సహస్త్రకుండ్ జలపాతం నాందేడ్ జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది. ఈ జలపాతం గోదావరి ఉపనదియైన పెనగంగా నది మీద ఏర్పడ్డది. 50 అడుగుల ఎత్తు నుంచి కిందకుపడే ఈ జలపాత దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కువగా మాన్సూన్ సీజన్ లో పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతానికి దగ్గరలో నదికి అటు వైపు, ఇటు వైపు రెండు దేవాలయాలు ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలోని మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు

Photo Courtesy: Pradeep Paratamsetti

కనకై జలపాతం / బంద్రేవ్ జలపాతం - అదిలాబాద్

కనకై జలపాతం / బంద్రేవ్ జలపాతం - అదిలాబాద్

గిర్నూర్ గ్రామానికి 2 కి.మీ. దూరంలో , కుంటాల జలపాతానికి 35 కి.మీ. దూరంలో, నిర్మల్ కి 54 కి.మీ. దూరంలో, అదిలాబాద్ కి 51 కి.మీ. దూరంలో మరియు హైదరాబాద్ మహానగారానికి 282 కి.మీ. దూరంలో గోదావరి ఉపనదియైన కడెం నది మీద కనకై జలపాతం ఉంది. ఈ జలపాతం ఒక చక్కని ట్రెక్కింగ్ స్థావరంగా ఉన్నది. మొదట రాళ్ళ గుట్టల మధ్య చిన్న ప్రవాహంగా మొదలై, ఆతరువాత మధ్యలో బంద్రేవ్ జలపాతాన్ని కలుపుకొని చివరగా చీకటి గుండంతో కలిసి పెద్దగా ఏర్పడుతుంది. ఈ జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది.

కిన్నెరసాని జల సోయగాల కొరకు

Photo Courtesy: telangana tourism

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X