Search
  • Follow NativePlanet
Share
» »నాసిక్ - శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం !!

నాసిక్ - శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం !!

By Super Admin

మక్కా గురించి మీకు తెలియని నిజాలు !మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

నాసిక్ నగరం వేల ఏళ్ల సంస్కృతికి, వందల యేళ్ల చరిత్రకు సాక్షీభూతం. కుంభమేళాతో పన్నెండేళ్లకోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. క్రీ.పూర్వం నుంచి ఈ ప్రాంతం జనావాసం అనడానికి ఈ పేరు వెనుక ఉన్న కథే నిదర్శనం. రాముడు వనవాసకాలంలో ఇక్కడి తపోవన్‌ లోనే నివసించాడని, లక్ష్మణుడు... శూర్పణఖ ముక్కు కోసింది ఇక్కడేననీ చెబుతారు. నాసిక కోసిన ప్రదేశం కాబట్టి నాసిక్‌గా వ్యవహారంలోకి వచ్చిందట. స్థలపురాణం మాట ఎలా ఉన్నా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు పురాణాల నేపథ్యం కలిగినవే. పౌరాణిక క్షేత్రాలకు దీటుగా ద్రాక్షతోటలు, వైన్ తయారీ కేంద్రం, హాలిడే రిసార్టులు వగైరా చాలానే ఉన్నాయి. నాసిక్ ని గ్రేప్ గార్డెన్ సిటీ అనికూడా పిలుస్తారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందామా!!...

త్రయంబకేశ్వర దేవాలయం

త్రయంబకేశ్వర దేవాలయం

త్రయంబకేశ్వర దేవాలయం నాశిక్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. దేశంలోని నాలుగు జ్యోతిర్లింగాలలో ఒకటి ముక్తి ధామంలో కలదు. ఈ దేవాలయ గోడలపై ఆకర్షణీయ రీతిలో భగవద్గీతలోని శ్లోకాలు లిఖించబడ్డాయి. ఇక్కడే కల కాలారాం దేవాలయం నల్లటి రాతితో నిర్మించబడి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా ఫాల్కే ఇక్కడనే జన్మించాడు.
Photo Courtesy: Nilesh.shintre

తపోవన్

తపోవన్

శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం. ఇక్కడ రుచికరమైన జామకాయలు దొరుకుతాయి.
Photo Courtesy: Indi Samarajiva

పంచవటి

పంచవటి

కాలారామ్ ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉంటాయి.కాలారామ్ దేవాలయం నాశిక్ లో ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని 1794 లో గోపికాబాయ్ పేష్వా నిర్మించారు. ఇది త్రయంబకేశ్వర దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఇది కూడా ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో కలదు. దీని నిర్మాణం పూర్తిగా నల్లరాతితో జరిగింది. ఈ దేవాలయం సుమారు 70 అడుగుల ఎత్తులో ఉండి శిఖరం బంగారు పూత వేసిన రాగి కలిగి ఉంటుంది. దీనిలో రాముడు, సీత లక్ష్మణుల విగ్రహాలుంటాయి. ఇక్కడే ఒక గణపతి, ఆంజనేయ మరియు విఠల దేవాలయాలు కూడా ఉంటాయి.
Photo Courtesy: World8115

మినరల్ మ్యూజియం

మినరల్ మ్యూజియం

సిన్నార్‌లో ఉంది. రకరకాల ఆకారాల రాళ్లను చూడవచ్చు.

Photo Courtesy: RKBot

పాండవ్‌లేని

పాండవ్‌లేని

ఇది పాండవులు నివసించారని నమ్మే గుహ. నాసిక్- ముంబయి హైవేలో ఉంది.పాండవలేని గుహలు సుమారు 20 శాతాబ్దాలకిందటివి. నాశిక్ లోని త్రివంశి కొండలపై కలవు. ఈ గుహలు 24 గుహలు వీటిని జైన రాజులు నిర్మించారని చెపుతారు. అంబికాదేవి, వీర మణిభద్రాజి మరియు తీర్ధంకరుడు వ్రిషభ్ దేవ్ ఇక్కడ నివసించారు. జైన మత శాసనాలు మాత్రమేకాక, బుద్ధుడి శిల్ప చిత్రాలు కూడా ఈ గుహలలో కలవు. పెద్ద పెద్ద రాళ్ళలో ఏర్పరచిన నీటి ట్యాంకులు కలవు. ఈ ప్రదేశంలో మతగురువులు తమ శిష్యులను కలిసేవారని చెపుతారు.

Photo Courtesy: Katyare

ద్రాక్షతోటలు

ద్రాక్షతోటలు

నాసిక్ నగర శివారులో గంగాపూర్‌కి దగ్గరగా విస్తరించిన ద్రాక్షతోటలు ఈ ప్రదేశానికి హైలైట్. అస్సాం టీ తోటలతో పోటీ పడుతున్నట్లు ఉంటాయి ఇక్కడి ద్రాక్షతోటలు. పందిరి నుంచి వేళ్లాడుతున్న ద్రాక్ష గుత్తులు నోరూరిస్తాయి. ఈ తోటలు ఎర్రద్రాక్షకు ప్రసిద్ధి,అలాగే రెడ్‌వైన్‌కి కూడ. ఇక్కడ తయారయ్యే మద్యం విదేశాలకు ఎగుమతి అవుతోంది. వైన్ స్పెక్టేటర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఎక్కిన సులా విన్‌యార్డ్సు ఇక్కడే ఉంది. 30 ఎకరాలతో మొదలైన ద్రాక్ష తోటల పెంపకం 1500 ఎకరాలకు విస్తరించింది. ఏటా ఇక్కడ ఐదు మిలియన్ లీటర్ల వైన్ తయారవుతుంది.

Photo Courtesy: Pablo Ares Gastesi

వైన్ తయారీ

వైన్ తయారీ

బియాండ్ సులా విన్‌యార్డ్సు ట్రిప్‌లో ఇక్కడి రిసార్టులో బస చేసి, విశాలమైన టేస్టింగ్ రూమ్‌లో కూర్చుని మేలిరకం మద్యాన్ని రుచి చూస్తూ ఎదురుగా కనిపిస్తున్న విస్తారమైన తోటలను చూడడంలోని ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. పర్యాటకులను ద్రాక్షతోటలలో విహారానికి తీసుకెళ్తారు. వైన్ తయారీ విధానాన్ని చూపిస్తారు. ద్రాక్ష పండ్లను నుజ్జు చేసి రసం తీయడం, జ్యూస్‌ని రకరకాలుగా ప్రాసెస్ చేయడం, నాణ్యమైన మద్యాన్ని బాటిళ్లలో నింపి సీలు వేయడం వరకు ప్రతిదీ ఆసక్తిగానే ఉంటుంది.

Photo Courtesy: chiragndesai

అంజనేరి పర్వత్

అంజనేరి పర్వత్

త్రయంబకేశ్వర్ దగ్గర ఉన్న జలపాతం. ఈ ప్రదేశం చాలా ప్రఖ్యాతి గాంచినది. ఇక్కడకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
Photo Courtesy: amol kataria

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

సమీప విమానాశ్రయం...
నాసిక్‌ లోని ఓజార్ ఎయిర్‌ పోర్టు, నాసిక్ పట్టణ కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో ఉంది.
సమీప రైల్వేస్టేషన్...
నాసిక్ రైల్వే స్టేషన్ ఉన్న ప్రదేశాన్ని నాసిక్ రోడ్ అంటారు. ప్రధాన నగరం ఇక్కడికి 10 కి.మీ.ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్లడానికి దేవగిరి రైలు ఉంది. దాదాపుగా 700 కి.మీ.లు ఉంటుంది.

Photo Courtesy: Superfast1111

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X