Search
  • Follow NativePlanet
Share
» » హరిద్వార్ - దేవుళ్ళు నివసించే నగరం !

హరిద్వార్ - దేవుళ్ళు నివసించే నగరం !

దేవుళ్ళ నగరం గా చెప్పబడే హరిద్వార్ పవిత్ర గంగా నదికి ప్రవేశ ద్వారం హరిద్వార్ హిందువుల ఏడూ పవిత్ర నగరాలలో ఒకటి. ఈ ప్రదేశానికి హిందూ యాత్రికులు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు. పన్నెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ప్రసిద్ధ కుంభ మేలా ఇక్కడ జరుగుతుంది.

ఈ ప్రదేశానికి బ్రహ్మ, విష్ణు, శివుడు ఒక సారి వచ్చారని పురాణాలు చెపుతాయి. ఇక్కడి దేవాలయంలో జరిగే సాయంత్రపు పూజకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇంత ప్రసిద్ధి చెందిన హరిద్వార్ పట్టణ పర్యటనకు రెడీ అవండి.

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

హర కి పురి
హర కి పూరి ప్రదేశం హరిద్వార్ లో అత్యంత ప్రసిద్ధి కల ప్రదేశంగా భావించబడుతుంది. ఇక్కడ వేద కాలంలో హిందూ దేవుళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు మరియు శివుడు వివిధ సమయాలలో సంచరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ప్రదేశం గంగా నది మైదాన ప్రాంతాలు ప్రవేశించేందుకు ప్రవేశ ద్వారం. ఇక్కడి గంగా నదిలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించి తమ పాప ప్రక్షాళన గావిన్చుకుంటారు. ఇక్కడి ఘాట్ లో విష్ణువు యొక్క కాలి ముద్రలు కూడా చూడవచ్చు. దీనిని భక్తులు పూజిస్తారు.
Pic Credit: Liz Highleyman

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

మానస దేవి టెంపుల్
శివాలిక్ కొండలపై భాగంలో ని బిల్వా పర్వతం పై కల మానస దేవి టెంపుల్ అధిక సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ లో రెండు దేవతా విగ్రహాలు వుంటాయి. ఒకదానికి అయిదు చేతులు వుండగా మరొకటి ఎనిమిది చేతులు కలిగి వుంటుంది. టెంపుల్ లోకే ప్రవేసించే భక్తులు ఒక పవిత్ర దారాన్ని ఇక్కడ కల ఒక పవిత్ర చెట్టుకు కడతారు. ఈ రకమైన చర్య వారి కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. ఒకసారి కోరిక తీరితే, ఆ భక్తుడు మరల వచ్చి ఆ దారం ముడి తీసి వేస్తాడు. ఈ టెంపుల్ చేరేందుకు కేబుల్ కార్ సౌకర్యం కూడా కలదు.

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

వైష్ణో దేవి టెంపుల్
ఇక్కడ నిర్మించిన వైష్ణో దేవి టెంపుల్ జమ్మూ లోని అసలైన వైష్ణోదేవి గుడిని పోలి వుంటుంది. గర్భ గుడి చేరాలంటే, భక్తులు సొరంగాలు, గుహల గుండా ప్రయాణించాలి. తనను నమ్మిన వారిని ఆ మాత ఆశీర్వదిస్తుందని భక్తులు గట్టి గా నమ్ముతారు.
Pic Credit: bhisham pratap padha

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

మయా దేవి టెంపుల్
మాయా దేవి టెంపుల్ హరిద్వార్ లో అతి ప్రాచీనమైనది. శివుడి సహచరిణి అయిన సతి తన ప్రాణాలను త్యాగం చేసినపుడు, ఆమె గుండె, నాభి ఇక్కడ పడ్డాయని ఆ ప్రదేశంలో టెంపుల్ నిర్మించారని చెపుతారు. ఈ టెంపుల్ కు అధికంగా మహిళలు వచ్చి తమ భర్తల బాగు కొరకు పూజలు చేస్తారు.
Pic Credit: momo

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

భారత్ మాతా మందిర్
దీనినే మదర్ ఇండియా టెంపుల్ అని కూడా అంటారు. మన దేశ మృత సైనికుల గౌరవార్ధం ఈ టెంపుల్ నిర్మించబడినది. సప్త సరోవరం పై కల ఈ టెంపుల్ కు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ మందిర్ కు ఎనిమిది అంతస్తులు కలవు. ఒక్కొక్క అంతస్తు ఒక దేవుడికి కేటాయించబడినది. ఈ మందిరం మన దేశపు స్వాతంత్ర యోధులకు అంకితం ఇవ్వబడినది. Pic Credit: RameshSharma1

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

కుంభ మేలా
ఇక్కడ కల పవిత్ర గంగా నదికి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభ మేళ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. ఈ వేడుకలు సుమారు నేలా పదిహేను రోజుల పాటు జరుగుతాయి. Pic Credit: -.-Paul-.-

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

ఉడాన్ ఖటోలా
ఉడాన్ ఖటోల అంటే మానస దేవి టెంపుల్ కు చేరేందుకు భక్తులు ఉపయోగించే ఒక రోప్ వే మార్గం. ఇది చండి దేవి టెంపుల్ వద్ద మొదలై భక్తులను బిల్వా పర్వత పై భాగం చేరుస్తుంది. అక్కడ నుండి దిగువకు చూస్తె ప్రదేశం అంతా అద్భుతంగా కనపడుతుంది.
Pic Credit: Wiki Commons

 దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

హరిద్వార్ లో షాపింగ్
హరిద్వార్ వచ్చిన యాత్రికులు తమ షాపింగ్ లో ఎన్నో ఆకర్షణీయ వస్తువులను మోతి బజార్ లేదా అప్పర్ రోడ్ లలో కొనుగోలు చేయవచ్చు. రేట్ లు కొంచెం అధికమే. వీధులలో కల షాపులలో కూడా సరసమైన రేట్ లకు వివిధ రకాల హస్త కళా వస్తువుల ను కొనుగోళ్ళు చేయవచ్చు. చెక్కిన విగ్రహాలను అమ్మే షాపులు కూడా కలవు.

Pic Credit: Wiki Commons

 దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

దేవుడే దిగి వస్తే...భూ లోకమే విహరిస్తే?

హరిద్వార్ లో ఆహారాలు ?
హరిద్వార్ తీపి పదార్ధాలకు ప్రసిద్ధి. ప్రతి షాపు లోను స్వీట్ లు లభిస్తాయి. స్థానిక ఆహారాలు పూరీలు, బంగాల దుంప , కాలి ఫ్లవర్, బఠాని ల కుర్మా లభిస్తాయి. నగరం లో వెజ్ ఆహారాలు మాత్రమే లభిస్తాయి. ఉదయం వేల తాజా తాజా వేడి వేడి పాలు ప్రత్యేక పానీయంగా ప్రతి వారూ తాగుతారు.
Pic Credit: Aleksandr Zykov

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X