Search
  • Follow NativePlanet
Share
» » ఒళ్ళు గగుర్పొడిచే వింత విషయాలు, మిస్టీరియస్ ప్రదేశాలు

ఒళ్ళు గగుర్పొడిచే వింత విషయాలు, మిస్టీరియస్ ప్రదేశాలు

మన భారత దేశంలో సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం పుష్కలంగా లభిస్తుంది. ఇవే కాదు భారతదేశంలో ఎక్సోటిక్ బీచ్ లు, అద్భుతమైన గేట్ వేలు, అతి పెద్ద పురాతన దేవాలయాలతో పాటు కొన్ని మిస్టిరియస్ స్థలాలు మరియు అసాధార

మన భారత దేశంలో సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం పుష్కలంగా లభిస్తుంది. ఇవే కాదు భారతదేశంలో ఎక్సోటిక్ బీచ్ లు, అద్భుతమైన గేట్ వేలు, అతి పెద్ద పురాతన దేవాలయాలతో పాటు కొన్ని మిస్టిరియస్ స్థలాలు మరియు అసాధారణ విషయాలున్న ప్రదేశాలు ఉన్నాయి.

అలాగే మన దేశంలో నమ్మ శక్యం కాని ఎన్నో మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ మూఢ నమ్మకాలు పూర్వకాలం నుండి కోన సాగుతూ వస్తున్నాయి. వాటికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ వాటిని కన్నులారా చూసి నమ్మవలసి వస్తోంది. గతంలో కూడా ఇటువంటి మూఢ నమ్మకాలపై కొంత సమాచారం ఇవ్వడం జరిగింది.

అయితే ఇపుడు మరికొన్నిబ్యాహ్య ప్రపంచానికి తెలియని, అంతగా గుర్తింపుకు నోచుకోని వింత్తైన ప్రదేశాలు, రుజువు లేని ప్రదేశాలైనా నమ్మి తీరాల్సినటువంటి కొన్ని అంశాలు గల ప్రదేశాల గురించి ఇక్కడ అందిస్తున్నాము. మీ పర్యటనలో ఈ అంశాలను గుర్తించి నిజా నిజాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించండి. ఉన్నది వున్నట్లు మీ ముందు ఉంచుతున్నాము. అవి వాస్తవాలో లేక అభూత కల్పనలో నిర్ణయం తీసుకోవడం మీ వంతు.

1. బ్లాక్ మ్యాజిక్ కు ప్రసిద్ది చెందిన అస్సాం:

1. బ్లాక్ మ్యాజిక్ కు ప్రసిద్ది చెందిన అస్సాం:

బ్రహ్మపుత్ర నది ఒడ్డున మాయాంగ్ మరీగాన్ జిల్లా అస్సాంలో బ్లాక్ మ్యాజిక్ (చేతబడులకు )ప్రసిద్ది. ఈ మాయాంగ్ గ్రామం పర్యాటక ప్రదేశం, వన్యప్రాణి పర్యటనకు, నదీ పర్యటనకు, పర్యావరణ పర్యాటక రంగంగా , సాంస్కృతిక పర్యాటక రంగంగా ప్రసిద్ది చెంది పురావస్తు ప్రదేశం. భారతదేశంలోనే ఎక్కువగా మంత్ర విధ్యలను ప్రదర్శించే ప్రదేశంగా ప్రసిద్ది చెందినది.

2. అస్థిపంజరాల సరస్సు-చమోలీ, ఉత్తరాఖండ్:

2. అస్థిపంజరాల సరస్సు-చమోలీ, ఉత్తరాఖండ్:

రూప్ ఖండ్ అస్థిపంజరం సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలకు 5029మీటర్ల ఎత్తులో ఉంది. ఈ హిమాలయ పర్వత అంచున ఉన్న రూప్ ఖండ్ సరస్సులో వందలాది మానవ అస్థిపంజరాలున్నాయి. ఇవి ఎప్పటివో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ, ట్రెక్కింగ్, మిస్టరీ లేక్ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందినది.
pc:youtube

3. హాంటెడ్ భాన్గర్ కోట - భంగఢ్, రాజస్థాన్

3. హాంటెడ్ భాన్గర్ కోట - భంగఢ్, రాజస్థాన్

ఆరావళి శ్రేణిలో సరిస్క రిజర్వు సరిహద్దులో భన్గర్ కోట అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. చూస్తే ఒళ్లు గగుర్పొడస్తుంది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కోట గేటు వద్ద ప్రవేశం లేదు అనబడే ఒక బోర్డ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు పర్యాటకుల ప్రవేశానికి నిషేదం.

4. అత్యంత శుభ్రమైన ప్రదేశం-మాలేన్నాంగ్, మేఘాలయ:

4. అత్యంత శుభ్రమైన ప్రదేశం-మాలేన్నాంగ్, మేఘాలయ:

మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు కాశీ హిల్స్ మాల్లీనాంగ్ గ్రామం. ట్రావెల్ మ్యాగజైన్ డిస్కవర్ ఇండియా వారు 2003 మరియు 2005లో ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన ప్రదేశంగా మాల్లీనాంగ్ గ్రామంను ప్రకటించింది.
PC: Ashwin Kumar

5.టెంపుల్ అఫ్ రాట్స్-కర్ని మాత ఆలయం, రాజస్థాన్:

5.టెంపుల్ అఫ్ రాట్స్-కర్ని మాత ఆలయం, రాజస్థాన్:

రాజస్థాన్ లోని బికనీర్ ప్రదేశంలో కర్ని మాతా ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎలుకలను పూజిస్తారు. ఈ ఆలయాన్ని కర్ని మాతకు అంకితం చేయబడినది.ఈ ఆలయంలో సుమారు ఇరవై వేలకుపైగా నల్ల ఎలుకలున్నాయి. ఇంకా కబ్బలు అని పిలవబడే తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. ఇవి మనుష్యులకు ఎలాంటి హాని చేయవు. స్థానికులు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు కూడా కర్ని మాత ఆలయ సందర్శనం చేస్తుంటారు. ఎలుకలకు ఆలయం ఉందంటే వింతే కదా మరి.
PC -Fulvio Spada

6.హ్యాంగింగ్ పిల్లర్ -లేపాక్షి, ఆంధ్రప్రదేశ్:

6.హ్యాంగింగ్ పిల్లర్ -లేపాక్షి, ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ లో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం లేపాక్షి. వేలాడే స్థంభం క్రి. శ. 16 వ శతాబ్దం నాటి శిల్పం ఇది అని చెపుతారు. వేలాడే స్థంభం ఆనాటి శిల్పకళ నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, నేడు 21 వ శతాబ్దంలో అది ఒక మిస్టరీ అయ్యింది. ఈ వేలాడే స్థంభం, లేపాక్షిలో వీరభాద్రేస్వరుడి దేవాలయంలో వుంది. ఇది రూఫ్ నుండి వేలాడుతుంది. భూమిపై అతక కుండ వుంటుంది. ఇంత పెద్ద స్థంభం వేలాడటం ఎలా సాధ్యం ? ఏమిటీ వింత ? పరిశీలించండి. ఇంకా ఇక్కడ అతి పెద్ద నంది విగ్రహం, విజయనగర రాజు మరియు కన్నడ్ శాసనాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

PC: Srihari Kulkarni

7.ఒక్క ఇంటికీ తలుపులు లేని శని శింగనాపూర్, మహారాష్ట్ర:

7.ఒక్క ఇంటికీ తలుపులు లేని శని శింగనాపూర్, మహారాష్ట్ర:

మహారాష్ట్రలో శని శింగనాపూర్ గా పిలవబడుతున్న ఈ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు. శనిమహాత్మకు ప్రసిద్ది చెందిన ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ దొంగతనాలు, బందిపోటుల సమస్య ఏమాత్రం ఉండదు. ఈ గ్రామానికి శనిమాహాత్మ స్వామి కాపాలగా ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. ఆ కారణం చేతనే ఈ వింత ప్రదేశం పర్యాటక ప్రదేశంగా , ఆధ్యాత్మిక ప్రదేశంగా బాగా ప్రసిద్ది చెందినది.
Image Source: PTI

8. లివింగ్ రూట్ వంతెన-మేఘాలయ:

8. లివింగ్ రూట్ వంతెన-మేఘాలయ:

మేఘాలయాలోని డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ వంతెన చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో మేఘాలయాలో ఉన్న ఆ రబ్బరు చెట్టు వేర్లు ఒక వంతెనలా పెరగడం సస్పెన్స్ గా ఉంటుంది.

Photo Courtesy: Arshiya Urveeja Bose

9. విశాలమైన మర్రి చెట్టు-బొటానికల్ గార్డెన్ , హౌరా :

9. విశాలమైన మర్రి చెట్టు-బొటానికల్ గార్డెన్ , హౌరా :

అతి పెద్ద మర్రిచెట్టు విశాలమైన ఈ మర్రి చెట్టు భారత దేశంలో కలకత్తలోని బొటానికల్ గార్డెన్ లోనిది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టుగా పరిగణిపంబడుతున్నారు. ఈ బొటానికల్ గార్డెన్ లో ఎక్కువగా మర్చి చెట్లు ఉన్నాయి.


PC- Biswarup

10. రూరల్ ఓలింపిక్ కిల్లా రాయ్ పూర్ , పంజాబ్

10. రూరల్ ఓలింపిక్ కిల్లా రాయ్ పూర్ , పంజాబ్

పంజాబ్ రాష్ట్రంలో లూధియానా నగరంలో కిలా రాయ్ పూర్ ఒక ప్రధాన గ్రామం. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కిల్యాపూర్ స్పోర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ చూడటానికి మరియు పాల్గొనడానికి మన దేశంలోనే వారి కాదే విదేశియులతో సహా వందల మంది పాల్గొంటారు. క్రీడా ఔత్సాహికులకు ఈ గ్రామం ప్రసిద్ది.
Image Source: Instagram

11. నంది పెరుగుతూనే ఉంది-జగంతి, ఆంధ్రప్రదేశ్

11. నంది పెరుగుతూనే ఉంది-జగంతి, ఆంధ్రప్రదేశ్

యాగంటి ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉండే నంది విగ్రహం ఒకటి నేటికీ పెరుగుతూ ఉంటుంది. భారత పురావతస్తు శాఖ ప్రకారం 20వ సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున రాయి పెరుగుతున్నట్లు గుర్తించారు. .ఈ నంది విగ్రహం జీవం పోసుకున్న రోజున, జీవం పోసుకుని పరుగెత్తటం మొదలు పెట్టిన రోజున ప్రళయం సంభవిస్తుందని, కాలం ఆగి పోతుందని చెబుతారు. మరి దాని పరుగు కంటే ముందే మనం పరుగు పెట్టి ప్రళయం నుండి తప్పించుకుంటే మంచిదేమో.

12.చౌరఘర్ శివ టెంపుల్ - పాష్మార్, మధ్యప్రదేశ్

12.చౌరఘర్ శివ టెంపుల్ - పాష్మార్, మధ్యప్రదేశ్

చౌరఘర్ శివాలయం ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రం . ఇది పంచమరికి సుమారు 1326 మీటర్ల ఎత్తులో ఉంది. చౌరఘర్ లోని అతి పెద్ద రెండవ ఎత్తైన శిఖరం పంచమరి. ఈ శివాలయం ప్రత్యేకత ఇక్కడ వేల సంఖ్యలో త్రిశూలాలున్నాయి.

Photo Courtesy: A Frequent Traveller

13. మ్యాగ్నటిక్ హిల్-లడక్, జమ్ము అండ్ కాశ్మీర్ :

13. మ్యాగ్నటిక్ హిల్-లడక్, జమ్ము అండ్ కాశ్మీర్ :

మ్యాగ్నిటిక్ హిల్ ను గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు. ఇది లెహ కార్గిల్ -శ్రీనగర్ హైవేలో లడక్ లో ఉంది. డొమస్టిక్ టూరిస్ట్ లకు మ్యాగ్నటిక్ హిల్ బాగా ప్రసిద్ది చెందినది. ఈ ప్రదేశానిక కారు ప్రయాణం బాగుంటుంది.

14. కుంభాల్ ఘర్ గ్రేట్ వాల్ - రాజసమండ్, రాజస్థాన్

14. కుంభాల్ ఘర్ గ్రేట్ వాల్ - రాజసమండ్, రాజస్థాన్

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ అతి పెద్ద గోడగా కుంబాల్ ఘర్ గ్రేట్ వాల్ ఉంది. ఇది రాజస్థాన్ లోని అతి పెద్ద కోట గోడల్లో చిత్తోర్ ఘడ్ కోట గోడ తర్వాత ఇది రెండవ అతి పెద్దది. Photo:Lundur39

15.కోడిని ట్విన్స్ విలేజ్ - కోడిని, కేరళ

15.కోడిని ట్విన్స్ విలేజ్ - కోడిని, కేరళ

బహుశా, మనం ఇద్దరం...మనకు ఇద్దరు అనే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం మీరు ఒకప్పుడు వినే ఉంటారు. మరి ఈ విచిత్రం చూడండి. కేరళ రాష్ట్రంలోని మలప్ఫురం జిల్లాలోని తిరురంగడికి సమీపంలో కొడిని గ్రామంలో రెండు వేల కుంటుంబాలున్నాయి. ప్రపంచంలో ట్విన్స్ అధికంగా ఉన్న ప్రదేశంగా కోడిని ఉంది. ఈ గ్రామంలోని వారు ఈ విషయాన్ని మరి కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లు కనపడుతోంది. ఇక్కడ జంటలకు పిల్లలు ఎపుడూ కవలలుగానే పుడతారు. ఒన్ షాట్ టు బర్డ్స్ ...అంటే ఇదేనేమో మరి. ఇదే విధంగా జరుగుతోందట నైజీరియా లోని ఇగ్బో - ఆరా ప్రదేశంలో కూడాను. అయితే కోడినిహి గ్రామస్తుల మరియు ఇగ్బో - ఆరా ప్రజల మధ్య ఏ రకమైన తిండి అలవాట్లు కామన్ గా లేవని కూడా తెలుసుకున్నారట.
Image Source: Instagram

16. చండీపూర్ హైడ్ అండ్ సీక్ బీచ్ -చండీపూర్, ఓడిషా

16. చండీపూర్ హైడ్ అండ్ సీక్ బీచ్ -చండీపూర్, ఓడిషా

ఓడిశాలో బలేశ్వర్ జిల్లాలో చండీపు సముద్రంగా పిలుచుకుంటారు. చండీపూర్ బీచ్ కు హైడ్ అండ్ సీక్ బీచ్ గా బాగా ప్రసిద్ది చెందినది. ఇక్కడ కొంతమంది వారి రాత్రి శికారులలో మిస్ అయ్యారని, లేదా గాలిలోకి కలసిపోయారని చెపుతారు. ఈ బీచ్ లో మానవాతీత చర్యలు అనేకం జరుగుతాయని కూడా స్థానికుల కధనంగా వుంటుంది. మరి ఎంతో కాలంగా ఈ ప్రదేశంలో వినపడుతున్న ఈ నిజాన్ని లేదా అభూత కల్పనను ఎవరు చేదించ గలరు.

Photo Courtesy: Subhashish Panigrahi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X