Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని కొన్ని బెస్ట్ సన్ సెట్ పాయింట్స్ మీకోసం!

భారతదేశంలోని కొన్ని బెస్ట్ సన్ సెట్ పాయింట్స్ మీకోసం!

భారతదేశంలోని కొన్ని బెస్ట్ సన్ సెట్ పాయింట్స్ మీకోసం!

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి? మనసుకు ప్రశాంతతను చేరువ చేసే ప్రదేశాల కోసం వెళ్లాలనుకునేవాళ్లకు వెంటనే గుర్తుకోచ్చేవి సన్ సెట్ పాయింట్లు. ఆకాశాన్ని చాలాసార్లు నీలం రంగులోకానీ, ఒక్కోసారి ఎరుపురంగులోకానీ ఉండడం మనం చూసి ఉంటాం.

మేఘాలయలోని సూర్యుడు కొండలు, సరస్సుల మాటుకు జారుకోవడం భలే విచిత్రంగా అనిపిస్తుంది. నీలం, ఎరుపు రంగులను కలిపి ఒక కొత్త రంగు మనకు కనిపిస్తుంది. భారతదేశంలోని కొన్ని బెస్ట్ సన్ సెట్ ప్రాంతాల గురించి తెలుకుందాం.

కన్యాకుమారి..

కన్యాకుమారి..

భారతదేశంలోని చివరి భాగంగా చెప్పుకునే కన్యాకుమారి ప్రపంచంలోని సన్ సెట్ ప్రదేశాలలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పచ్చని పర్యావరణానికి చిరునామాగా కూడా చెబుతారు. కన్యాకుమారి తీర ప్రాంతం.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంతో సహా ఈ మూడు సముద్రాల సంగమం మీద సూర్యాస్తమయం యొక్క అద్భుత దృశ్యాలను ఆస్వాదించ‌వ‌చ్చు. ఈ బీచ్ ప్రత్యేకమైన ఎర్రటి సూర్యాస్తమయాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది. సముద్రపు అలలను చించుకుంటూ బయటికి వస్తున్న సూర్యుని చూడ్డానికి ఇక్కడికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

మౌంట్ అబు..

మౌంట్ అబు..

రాజస్థాన్లోని మౌంట్ అబు ప్రాంతాన్ని సాయంత్రం వేళ చూడాలి. మనల్ని మనమే మైమరిచిపోయేంతంగా ఉంటుంది ఆ ప్రాంతం. చిన్న చిన్న కొండల మధ్య నుంచి మెల్లగా జారుకుంటున్న ఎర్రని సూర్యుడిని చాలా సేపు అలానే వీక్షించవచ్చు. మౌంట్ అబూలోని సూర్యాస్తమయం నేరుగా వీక్షించ‌డం అద్భుతమైన అనుభవం. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన నేపథ్యం, ​​వేడి వేడి టీ, మొక్కజొన్న కాబ్స్‌తో టైంపాస్ చేస్తూ.. మంత్రముగ్ధులను చేసే సూర్యాస్తమయ దృశ్యాల‌ను చూడాలంటే, మౌంట్ అబూ చేరుకోవాల్సిందే.

రాన్ ఆఫ్ కచ్

రాన్ ఆఫ్ కచ్

గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ సూర్యాస్త‌మ‌యం విచిత్రంగా అనిపిస్తుందని చెప్పాలి. దూరాన ఉన్న భూమి అంతా తెలుపురంగులో కనిపిస్తుంది. కానీ సాయంత్రం అవ్వగానే సూర్యుడు కిందకు చేరుకునే సమయం రాగానే అక్కడి భూమంతా బంగారపు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే, రాన్ ఆఫ్ కచ్ భారతదేశంలోని అందమైన సూర్యాస్తమయ గమ్యస్థానంగా ప్ర‌సిద్ధిపొందింది. రాన్ ఆఫ్ కచ్ వద్ద సూర్యాస్తమయం సందర్శకులకు ఎడారిలో ఒక అందమైన ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించిన అనుభూతిని కలిగిస్తుంది. వైట్ రాన్ ఆఫ్ కచ్ వద్ద సందర్శకులకు ఈ అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది.

తాజ్ మహల్

తాజ్ మహల్

పసుపు, నారింజ, గులాబీ మరియు ఎరుపు రంగులతో తాజ్ మహల్ సూర్యాస్తమయం సమయంలో అద్భుతంగా మెరుస్తుంది. మెల్ల‌మెల్ల‌గా చీక‌టిలోకి జారుకుంటోన్న సూర్యుడిని చూసేందుకు ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సూర్యాస్తమయ గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందిన తాజ్‌మ‌హ‌ల్‌కు చేరుకోవాలి. తెల్లని పాలరాయి యొక్క అద్భుతమైన నిర్మాణం దాని సున్నితమైన వ‌ర్ణ‌మాలిక‌లు విశేష వ‌ర్ణాల సూర్యాస్త‌మ‌యాన్ని సంద‌ర్శ‌కుల‌కు చేరువ చేస్తాయి.

హావ్‌లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్‌

హావ్‌లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్‌

రాధానగర్ బీచ్‌లో సూర్యాస్తమయం ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. అందుకే, భారతదేశంలోని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇక్క‌డి తీరాల్లో దాగివున్న‌ పగడపు దిబ్బల అందాల వ‌ర్ణాలు చిరస్మరణీయమైన సూర్యాస్తమయాలను ఆస్వాదించడానికి సరైన వేదిక‌గా ఈ ప్రాంతాన్ని ప్ర‌సిద్ధి చెందేలా చేశాయి.

హాజీ అలీ దర్గా

హాజీ అలీ దర్గా

హాజీ అలీ ముంబైలోని ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి కూడా ఇది ఒక అద్భుతమైన గ‌మ్య‌స్థానంగా పేరుపొందింది. ఇక్క‌డి సూర్యాస్తమయ స‌మ‌యం హాజీ అలీ దర్గా యొక్క నిర్మలమైన ప‌రిశ‌రాల‌కు తోడుగా ఎగిసిప‌డే అల‌లు.. గూటికి చేరే సముద్ర పక్షులు.. సుందరమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్ర‌దేశంగా నిలుపుతాయి. అందుకే, సందర్శకులకు అత్యంత విశ్రాంతి అనుభవాలను అందించే భారతదేశంలోని ఉత్తమ సూర్యాస్తమయ ప్రదేశాలలో ఇది ఒకటి.

Read more about: kanyakumari mount abu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X