Search
  • Follow NativePlanet
Share
» »ఔరంగ జేబును గఢ గఢలాడించిన ధ్యానాంజనేయ స్వామిని దర్శిస్తే సకల శుభాలు, సంతానం కలుగుతుంది

ఔరంగ జేబును గఢ గఢలాడించిన ధ్యానాంజనేయ స్వామిని దర్శిస్తే సకల శుభాలు, సంతానం కలుగుతుంది

హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం. సామాన్య శకం 1143 ప్రాంతంలో గోల్కొండను పాలించే రెండవ ప్రతాప రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. అతిపురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది.

శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఉన్న ఆ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అని పేరు ఎలా వచ్చింది. ఆంజనేయ స్వామికి చాలా చోట్ల చాలా ఆలయాలున్నాయి. కానీ ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ ప్రత్యేకతలు ఏంటో ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి.

రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ ఘాట్ లో శ్రీ ధ్యానేంజనేయ స్వామి ఆలయం ఉంది. ధ్యాన ముద్రలో స్వయంభుగా వెలసిన శ్రీ కర్మన్ ఘాట్ లో శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆశ్రుత జన భక్త కోటి కల్పవ్రుక్షంగా వెలుగొందుతున్నాడు. అంతే కాక, ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నఅతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆయల చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం...

కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రణుకు

కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రణుకు

కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రణుకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది. ఈ రోజు మనం హైదరాబాదుగా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలవబడుతూ అడవిగా ఉండేది.

PC: Jidutorrentz

ఒక రోజు ప్రతాపరుద్రుడు

ఒక రోజు ప్రతాపరుద్రుడు

ఒక రోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా, దగ్గరోని పొదల నుండి పులి అరిచన శబ్ధం వినబడినది. ఆ రాజు ఆ దిక్కున వెళ్ళే కొలది శబ్దం మాయం అవుతూ వచ్చింది. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గ కూర్చొని సేదతీరుతుండగా, తదగ్గరలోని పొదనుండి శ్రీరాం శ్రీరాం అనే తారకమంత్రం వినిపించింది.PC: Sanyam Bahga

ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి,

ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి,

ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి, ఆకులు, తీగలు, చెట్లు తొలగించి చూడగా, ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్జాపించాడు.

ఆ స్వామి ఆజ్జానుసారం ఆలయం నిర్మాణం చేసి,

ఆ స్వామి ఆజ్జానుసారం ఆలయం నిర్మాణం చేసి,

ఆ స్వామి ఆజ్జానుసారం ఆలయం నిర్మాణం చేసి, హనుమాన్ జయంతి రోజున పూజలు నిర్వహించి, అర్చకులను పిలిపించాడు, 17వ శతాబ్ధంలో ఔరంగ జేబు గోల్కొండ కోట ఆక్రమించుకుని దేశంలోని హిందూ దేవాలయాలన్నింటిని ద్వంసం చేయమని ఆజ్ఝాపించాడు. ఆసమయంలో ఈ ఆలయంలోకి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు.

అప్పుడు ఔరంగ జేబు ఉగ్రుడై

అప్పుడు ఔరంగ జేబు ఉగ్రుడై

అప్పుడు ఔరంగ జేబు ఉగ్రుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖ ద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగ జేబు భయంతో వనికిపోయాడు.

ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగ జేబు ధైర్యం చేసుకుని నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతయూ కాంతి వంతంగా దివ్వ తేజోవంతంగా వెలిగిపోయింది.

PC:YOUTUBE

ఈ కాంతి నుండి ఒక అద్భుత సుందరిమూర్తి అయిన

ఈ కాంతి నుండి ఒక అద్భుత సుందరిమూర్తి అయిన

ఈ కాంతి నుండి ఒక అద్భుత సుందరిమూర్తి అయిన ధ్యానాంజనేయస్వామి దివ్వ రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అద్రుశ్యమయ్యాడంట. అప్పుడు ఔరంగ జేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్కమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్ మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది.PC:YOUTUBE

ఈ ఆలయంలోని స్వామి వారిని మండలమోజనం

ఈ ఆలయంలోని స్వామి వారిని మండలమోజనం

ఈ ఆలయంలోని స్వామి వారిని మండలమోజనం పాటు ప్రదక్షణలతో సేవిస్తే సంతానంలేని వారు సంతానవంతులు అవుతారని, మరియు గాలి, దూళిలాంటివి ధరిచేరవని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు.

టైమింగ్స్ :

టైమింగ్స్ :

సోమవారం నుండి ఆదివారం వరకూ ఉదయం 6 నుండి మద్యహ్నానం 12 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుండి తిరిగి 8.30వరకు తెరవబడి ఉంటుంది. మంగళవారాల్లో ఉదయం 5.30గంటల నుండి మద్యహ్నాం 1గంట వరకు మరియు సాయంత్రం 4:30 గంటల నుండి 09 గంటల వరకు ఉంటుంది

అడ్రస్ :

అడ్రస్ :

ఇన్నర్ రింగ్ రోడ్, పద్మా నగర్ కాలనీ, కర్మన్ ఘాట్, హైదరాబాద్ , తెలంగాణ

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:

కర్మాన్ ఘాట్ హానుమాన్ టెంపుల్ చేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఇది నగరంలోనే ఉంది కాబట్టి వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి.

రోడ్ మార్గం: రోడ్ మార్గంలో టెంపులుకు చేరుకోవాలంటే సిటీ బస్సులు ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మహాత్మాగాంధీ బస్ టర్మినల్ నుండి సిటీ బస్ సర్వీస్ లున్నాయి. బస్ స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది

ఎయిర్ :

ఇండియాలో ప్రసిద్ది చెందిన ఈ హనుమాన్ టెంపుల్ , ఈ ఆధ్యాత్మికత ప్రదేశానికి విదేశాల నుండి కూడా భక్తులు సందర్శిస్తుంటారు. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ట్రైయిన్ :

సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ నుండి కర్మాన్ ఘాట్ దేవాలయం కేవలం5కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X