Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలు !!

కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలు !!

కృష్ణా నది భారతదేశంలో ప్రవహించే జీవనది. జీవనది అంటే ఎల్లప్పుడూ నీటితో కళకళలాడుతూ ప్రవహించే నది అని అర్థం. దక్షిణ భారత దేశంలో గోదావరి నది తరువాత రెండవ అతి పెద్ద నది ఈ కృష్ణా. ఎక్కడో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లో పుట్టి, ఆంధ్ర ప్రదేశ్ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

పడమర దిక్కున పుట్టి, తూర్పు వైపున ప్రవహించే కృష్ణా నది సుమారు 1300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలా తన ప్రయాణంలో ఎన్నో నగరాలను, పట్టణాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను, పుణ్య స్థలాలను తాకూతూ వెళుతుంది. ఈ పవిత్ర కృష్ణా నది కి 29 ఉపనదులు ఉన్నాయి. వాటిలో కెల్లా పెద్ద ఉపనది తుంగభధ్ర నది. తుంగభధ్ర నది తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఆలంపూర్ వద్ద కృష్ణా నది తో కలుస్తుంది. చిట్టచివర హంసలదీవి వద్ద కృష్ణా నది తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించి బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది.

ఇది కూడా చదవండి : గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్య క్షేత్రాలు !

హిందువుల పవిత్ర నదిగా భావించే కృష్ణా నది తీరాన ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రలలో శ్రీశైలం క్షేత్రం ప్రధానమైనది. అతరువాతనే మిగితా క్షేత్రాలు. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్నాటక, మహారాష్ట్ర లలో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున కూడా పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. కృష్ణా నది కి ప్రధాన ఆకర్షణ ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే పుష్కరాలు. ఆ సమయంలో కృష్ణా నది తీరం అంతా భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తుంది. కృష్ణా నది తీరం వెంబడి ఉన్న పుణ్య క్షేత్రాలను ఒకసారి పరిశీలిస్తే ...

కృష్ణా నది పుట్టుక

కృష్ణా నది పుట్టుక

కృష్ణా నది మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి 306 కిలోమీటర్ల ప్రయాణం సాగించి కర్ణాటకలోని బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. కర్నాటక లో 482 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రయాణం కావించి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ప్రవేశిస్తుంది. పిదప ఇదే జిల్లాలోని ఆలంపూర్ ప్రదేశంలో ఆంధ్ర రాష్ట్రాంలోకి ప్రవేశిస్తుంది.

చిత్ర కృప : Saurabhdas

కృష్ణా నది పుట్టుక

కృష్ణా నది పుట్టుక

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాంలోకి ప్రవేశించడమే తరువాయి .... దట్టమైన నల్లమల అడవుల్లోని లోయల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన కృష్ణా శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ప్రవహించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. ఇక్కడ నుండి దీవి సీమ లోని హంసల దీవి వద్ద తన ఉగ్రరూపాన్ని చూపించి చివరగా బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతుంది.

చిత్ర కృప : Prateek Rungta

మహబలేశ్వర్, మాహారాష్ట్ర

మహబలేశ్వర్, మాహారాష్ట్ర

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఒక పర్వత ప్రాంతం(హిల్ స్టేషన్). పశ్చిమ కనుమలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కనుమల్లోనే కృష్ణా నది తో పాటుగా మరో నాలుగు నదులు పుడుతాయి. ఈ ప్రదేశంలో చూడటానికి ముప్పై కి పైగా ఆకర్షణలు ఉన్నాయి. అందమైన లోయలు, అడవులు, నదులు, జలపాతాలు ఇక్కడి పశ్చిమ కనుమల అందాల్ని మరియు మహాబలేశ్వర్ అందాల్నిమరింతగా పెంచాయి.

ఇది కూడా చదవండి : మహబలేశ్వర్ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Nilesh Khedekar

సాంగ్లీ, మహారాష్ట్ర

సాంగ్లీ, మహారాష్ట్ర

సాంగ్లీ మహారాష్ట్రలోని ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణాన్ని డ్రామాల పుట్టినిల్లు అనేవారు. ఇక్కడ తప్పక చూడవలసినవి ఆలయాలు, జంతు ప్రదర్శనశాలలు. ఇక్కడి ఆలయాల్లో గణపతి ఆలయం, సంగమేశ్వరుని ఆలయం బాగా ప్రశస్తి చెందినవిగా స్థానికులు చెబుతారు. అంతేకాక ఈ ప్రాంతంలోనే రామలింగ, దత్తదేవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : సాంగ్లీ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Shreesaipratik

బెల్గాం, కర్నాటక

బెల్గాం, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో గల ఐనాపూర్ గ్రామం వద్ద కృష్ణా నది ప్రవేశిస్తుంది. బెల్గాం పురాతనమైన పట్టణం. అందమైన సాహ్యాద్రి కొండలు, అరేబియా సముద్రం, జలపాతాలు, పచ్చిక బయళ్లు మరియు ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ చెప్పుకోదగ్గ రెండు ఆలయాలు చిక్క బాసడి, కమల్ బాసడి.

ఇది కూడా చదవండి : బెల్గాం పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sandeep Badavanache

కుదలసంగమ, కర్నాటక

కుదలసంగమ, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కుదలసంగమ ఒకటి. ఇది పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసినది. ఇక్కడ ప్రముఖంగా చూడవలసినది ఆలయాలు. ఈ ఆలయాలలో సంగమనాథ ఆలయం, బాసవేశ్వరుని ఐక్య లింగ ఆలయం ప్రధానమైనవి. సంగమనాథ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Rupak Sarkar

జలదుర్గ, కర్నాటక

జలదుర్గ, కర్నాటక

జలదుర్గ కర్నాటక రాష్ట్రంలోని రైచూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ కృష్ణా నది పరవళ్ళుతొక్కుతూ పై నుండి జలపాతంలా కిందకు పడుతుంది. దీనికి గల మరో పేరు జలదుర్గ జలపాతం. ఇక్కడ చూడవలసినది జలదుర్గ కోట. ఇది సముద్రమట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో నిర్మించినారు. ఈ కొండ మీద నుండి లోయలో ప్రవహించే కృష్ణా నదిని తనివితీరా చూడవచ్చు.

చిత్ర కృప : kylepounds2001

తంగడి, తెలంగాణ

తంగడి, తెలంగాణ

తంగడి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా(పాలమూరు జిల్లా)లో గల ఒక గ్రామం. ఇక్కడే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. దక్షిణ భారత దేశంలో రాక్షస తంగడి యుద్ధం ఇక్కడే జరిగిందని కొందరి అభిప్రాయం.

చిత్ర కృప : mahaboobnagar.nic.in

కురుపురం, మహబూబ్‌నగర్

కురుపురం, మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది తీరాన ఉన్న కురుపురం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడికి భక్తులు వారాంతంలో తరచూ వస్తుంటారు. శని, ఆది వారాల సమయంలో, పండుగ సమయాల్లో యాత్రికులు ఇక్కడికి వచ్చి వనభోజనాలు సైతం చేస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ యాత్రికులను ఆకర్షిస్తున్నది.

ఇది కూడా చదవండి : మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : pklanka

గద్వాల, మహబూబ్ నగర్

గద్వాల, మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా లో గల గద్వాల ఒక ప్రముఖ పట్టణం మరియు రెవిన్యూ డివిజన్. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గద్వాల కోట మరియు అందులోని చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించినారు. దీనితో పాటు ఇక్కడ చూడవలసిన మరో ఆకర్షణ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్.

చిత్ర కృప : Gadwal Fort

బీచ్ పల్లి, మహబూబ్ నగర్

బీచ్ పల్లి, మహబూబ్ నగర్

బీచ్ పల్లి మహబూబ్ జిల్లా కు చెందిన గ్రామం. ఇది బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్నది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో సీతారామాలయం మరియు ప్రాచీన ఆంజనేయస్వామి ఆలయం కలదు. జాతీయ రహదారికి దగ్గరలో ఉండటం చేత పుష్కరస్నానం చేయటానికి భక్తులు తరలివస్తుంటారు.

చిత్ర కృప : Naidugari Jayanna

ఆలంపూర్, మహబూబ్ నగర్

ఆలంపూర్, మహబూబ్ నగర్

ఆలంపూర్ జాతీయ రహదారి కి చేరువలో ఉన్నది. ఇది మహబూబ్ నగర్ జిల్లా లో మండలమైనప్పటికీ దక్షిణాన ఉన్న కర్నూలు తో గట్టి సంబంధమే కలిగి ఉన్నది. ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. ఈ ప్రదేశంలో కృష్ణా నది మరియు దానియొక్క ఉపనదుల్లో కెల్లా పెద్దది తుంగభద్రా నది రెండూ కూడా కలుస్తాయి. ఇక్కడ జోగులాంబ, బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధికెక్కినాయి.

చిత్ర కృప : Lovell D'souza

సంగమేశ్వరం, ఆంధ్ర ప్రదేశ్

సంగమేశ్వరం, ఆంధ్ర ప్రదేశ్

సంగమేశ్వరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న పుణ్య క్షేత్రం. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం ఈ సంగమేశ్వరం. ఒకటి కాదు... రెండు కాదు .. ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఈ క్షేత్రం ఏడెనిమిది మాసాలు నదిలో మునిగి కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే బయటపడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శివలింగం.

ఇది కూడా చదవండి : సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుడు !

చిత్ర కృప : surendra katta

సోమశిల, మహబూబ్‌నగర్

సోమశిల, మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్ జిల్లా లోని కొల్లాపూర్ కి 8 కి. మీ. దూరంలో కొండలమధ్యలో నుంచి ప్రవహిస్తున్న కృష్ణా నది, చుట్టూ పచ్చని ప్రకృతి, నదీ తీరంలో నిర్మించిన 14 ఆలయాల సముదాయం సోమశిల. ఇక్కడి ప్రధాన దైవం సోమేశ్వర స్వామి . ఇక్కడ ఉన్న ఆలయాలు అన్నింటికీ కలిపి ఒకే గోడ ఉంది. ఇక్కడున్న సుందర దృశ్యాలు, కృష్ణా నది మిమ్మల్ని కనులవిందు చేస్తుంది.

చిత్ర కృప : mahabubnagar.nic.in

శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఉన్నది. ఇది ఒక ప్రముఖ శైవ క్షేత్రం. కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రధాన పుణ్య క్షేత్రాలలో ఇది ఒకటి. శ్రీశైలం కృష్ణా నది ఒడ్డున కలదు. ఇక్కడ దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన బ్రామరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉన్నది. ఏటా లక్షలాది మంది భక్తులు మల్లికార్జునుడి దర్శనానికి వస్తుంటారు.

ఇది కూడా చదవండి : శ్రీశైలం పర్యాటక ప్రదేశాలు !

ఇది కూడా చదవండి : నల్లమల అడవుల్లో బోట్ ప్రయాణం !

చిత్ర కృప : Anupam Bhattacharyya

కేతవరం, ఆంధ్ర ప్రదేశ్

కేతవరం, ఆంధ్ర ప్రదేశ్

కేతవరం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణా నది ఒడ్డున ఉన్న్డి. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి. ఆలయ దర్శనం చేసుకోవడానికి భక్తులు కష్టపడక తప్పదు. ఇక్కడి కొండమీద ఉన్న ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే 650 మెట్లు ఎక్కి, ఉదయాన్నే 9 గంటలకల్లా కొండమీదికి చేరుకోవాలి.

ఇది కూడా చదవండి : గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రదేశాలు !

చిత్ర కృప : srinivasa_raov

అమరావతి, ఆంధ్ర ప్రదేశ్

అమరావతి, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని గా ఎంపికకాబడ్డ అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉన్నది. కొత్తగా ఎంపిక కాబడ్డ రాజధాని కావడంతో ప్రభుత్వం అనేక రకాల శంకుస్థాపనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ పంచరామాలలో ఒకటైన అమరలింగేశ్వర స్వామి (శివుడు)ఆలయం ఉన్నది.

ఇది కూడా చదవండి : అమరావతి - ప్రధాన ఆకర్షణలు !

చిత్ర కృప : naga raj

కనక దుర్గ ఆలయం, ఆంధ్ర ప్రదేశ్

కనక దుర్గ ఆలయం, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత తాత్కాలిక రాజధాని విజయవాడ లో ఉన్న కనకదుర్గ ఆలయం దేశంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండ మీద వెలసింది. కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ ఆలయం గురించి క్షేత్ర పురాణంలో పేర్కొనటం జరిగింది. పాండవులలో ఒకడైన అర్జునుడు ఈ కొండమీద కోర్చొని శివుని గురించి తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యెక్షమై అతనికి పాసుపాటాస్త్రం అనుగ్రహించినట్టు పురాణాల్లో పేర్కొనటం జరిగింది.

ఇది కూడా చదవండి : విజయవాడ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : ravindra_s_1999

అవనిగడ్డ, ఆంధ్ర ప్రదేశ్

అవనిగడ్డ, ఆంధ్ర ప్రదేశ్

అవని గడ్డ కృష్ణా నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతాన్నే దీవిసీమ అని అంటారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు లంకమ్మ అమ్మవారి దేవాలయం, కోదండరామ వారి ఆలయం.

చిత్ర కృప : Tandavakrishna tungala

నాగాయలంక, ఆంధ్ర ప్రదేశ్

నాగాయలంక, ఆంధ్ర ప్రదేశ్

నాగాయలంక కృష్ణా జిల్లాలో ఉన్న ఒక మండలం. ఇది కృష్ణా నది కి చేరువలో కలదు. ఇక్కడి ఆలయాల్లో గంగానమ్మ తల్లి దేవాలయం, గణపతి దేవాలయం, పోతురాజుస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రాముని ఆలయం, దుర్గమాత ఆలయం ప్రధానమైనవి.

చిత్ర కృప : andhra pradesh temples

కోడూరు, ఆంధ్ర ప్రదేశ్

కోడూరు, ఆంధ్ర ప్రదేశ్

కోడూరు కృష్ణా జిల్లాలో ఉన్న ఒక మండలం పేరు. ఈ మండలం కృష్ణా నదికి దగ్గరలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పార్వతీ సమేత స్వామి వారి ఆలయం, గంగా భవానీ ఆలయాలు ప్రముఖమైనవి.

చిత్ర కృప : Srikanth N

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X