• Follow NativePlanet
Share
» »కొత్తదంపతులూ ఇక్కడకు వెళ్లకండి...మీ సమయం అంతా అందుకే సరిపోతుంది.

కొత్తదంపతులూ ఇక్కడకు వెళ్లకండి...మీ సమయం అంతా అందుకే సరిపోతుంది.

Written By: Kishore

వివాహం మరుపురాని ఘటన. ఈ శుభకార్యం జరిగిన తర్వాత మన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తితో కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉంటుంది. ఆ ప్రదేశాలు రొమాంటిక్ మూడ్ ను మరింతగా పెంచేవిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. ఆ రొమాంటిక్ మూడ్ ను పెంచడానికి అక్కడి ఉన్న వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. ముఖ్యంగా కొంత చలితో కూడిన చిరు జల్లులు కలిగిన ప్రదేశంలో వేడి కోరికలు మరింత రెట్టింపు అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు వంటి ప్రదేశాలు బెంగళూరుకు దగ్గర్లో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కూర్గ్, శివమొగ్గ, కుద్రేముఖ్ అందులో కొన్ని. వీటితో పాటు మరికొన్ని రొమాంటిక్ ప్రదేశాలు మీ కోసం...

బహుశా దేవుడు కూడా ఈ రహస్యాలను ఛేదించలేడేమో

1. కూర్గ్

1. కూర్గ్

P.C: raggy gowda

కూర్గ్ ను సాధారణంగా స్కాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ ప్రక`తి అందాలను మిమ్ములను మైమరిపింపజేస్తాయి. ముఖ్యంగా కూర్గ్ కాఫీ ప్రపంచ ప్రఖ్యాతి చెందినది. ఇక్కడి వాతావరణం మిమ్ములను బెడ్ పై నుంచి లేవనివ్వదు. దీంతో మీ పార్ట్ నర్ కొంత ఇబ్బంది పడుతాడేమో


బెంగళూరు నుంచి 249 కిలోమీటర్ల దూరం

2. భీమేశ్వరీ

2. భీమేశ్వరీ

P.C: YouTube

చుట్టూ పచ్చని చెట్టు, అంతెత్తు నుంచి జాలువారే నీటి గలగలతో కూడిన జలపాతాలు కొత్త దంపతులను మరో లోకంలోకి తీసుకుపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మాషీర్ ఫిషింగ్ ఇక్కడ మంచి ఆటవిడుపు. ఉదయం ఎంతగా తిరిగినా రాత్రి బెడ్ పై చేరుకొంటే అక్కడి అందాలతో పాటు కళ్లెదుట ఉన్న అందాలు మిమ్ములను నిద్ర పోనీయవు

బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం

3. నందిహిల్స్

3. నందిహిల్స్

P.C: YouTube

కర్ణాటకలోని ప్రముఖ హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. వన్ డే ట్రిప్ కోసం నంది హిల్స్ ను ఎంచుకోవచ్చు. ఇక్కడ కాటేజ్ సౌకర్యం కూడా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ ప్రక`తి అందాలను వీక్షించి రాత్రికి కాటేజీ చేరుకోవచ్చు. అక్కడ కూడా మీ కళ్లెదుట ఉన్న అందాలను కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడవచ్చు.

బెంగళూరు నుంచి కేవలం 68 కిలోమీటర్లు

4. మైసూరు

4. మైసూరు

P.C: YouTube

కర్నాటకలో బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాల్లో మైసూరు ముందుంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 770 మీటర్ల ఎత్తులో ఉండే ఈ నగరంలో కాస్త చలి వాతావరణం ఉంటుంది. ఇక్కడి రాచరికపు భవనాలు, దేవాలయాలు చూడదగినవి. మీ జీవిత భాగస్వామితో అవన్నీ చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తాయి.

బెంగళూరు నుంచి 140 కిలోమీటర్లు

5.మంగళూరు

5.మంగళూరు

P.C: YouTube

సముద్ర తీర ప్రాంతమైన మంగళూరు బీచ్ లకు నిలయం. ముఖ్యంగా ఉల్లాల బీచ్ కు వెళ్లిన తర్వాత త్వరగా తిరిగి రావడానికి మనసొప్పదు. కారణం మీ జీవిత భాగస్వామి తడిచిన అందాలను తనివితీరా చూస్తూ అలా సమయం గడపొచ్చు. ఇక్కడి స్పైసీ సీ ఫుడ్ మీ కోరికలను రెచ్చగొట్టుతుంది.

బెంగళూరు నుంచి 371 కిలోమీటర్లు

6.కనకపుర నేచర్ క్యాంప్

6.కనకపుర నేచర్ క్యాంప్

Image source:

సముద్ర మట్టానికి దాదాపు 2093 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడి చుంచి వాటర్ ఫాల్స్ వద్ద మీరు చిన్నపిల్లలే అయిపోతారు. అయితే మనస్సు మాత్రం పెద్ద పెద్ద పనులు చేయాలని కోరుకొంటుంది.

బెంగళూరు నుంచి 55 కిలోమీటర్లు

7. శివమొగ్గ

7. శివమొగ్గ

P.C: YouTube

కొత్తగా మీ ప్రపంచంలోకి వచ్చిన అందాల భరణితో ప్రక`తి అందాలన్నింటినీ తనలో ఇముడ్చుకొన్న శివమొగ్గకు వెళ్లడం మరిచిపోలేని అనుభూతి. ఇక్కడ జోగ్, అబ్బే జలపాతాల గలగలలు, శరావతి నది హొయలుచూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోతారు. ఇక్కడి ఆగుంబే హిల్ స్టేషన్ లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికి చాలా బాగుంటుంది.

బెంగళూరు నుంచి 284 కిలోమీటర్లు

8. కుద్రేముఖ్

8. కుద్రేముఖ్

P.C: YouTube

కర్నాటకలోనే కాకుండా భారత దేశం వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హిల్ స్టేషన్ కుద్రేముఖ్. చుట్టూ ఉన్న పచ్చదనం, అంతెత్తు నుంచి పడే జలపాతాలను చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు.

బెంగళూరు నుంచి 332 కిలోమీటర్లు

10. బెంగళూరు

10. బెంగళూరు

P.C: YouTube

బెంగళూరు కూడా మంచి హనీమూన్ డెస్టి నేషన్. ఇక్కడ టిప్పు ప్యాలెస్, ఇస్కాన్ టెంపుల్, లాల్ బాగ్, కబ్బన్ పార్క్ వంటి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. బెంగళూరు మంచి షాపింగ్ హబ్ కూడా. జీవితంలోకి కొత్తగా వచ్చిన మీ భాగస్వామికి మంచి మంచి గిఫ్ట్ లు కొనివ్వడానికి అనువైన షాపింగ్ కాంప్లెక్సులు ఎన్నో ఇక్కడ ఉన్నాయి.

9. చిక్కమగళూరు

9. చిక్కమగళూరు

P.C: YouTube

సముద్ర తీర ప్రాంతమైన చిక్కమగళూరులో దొరికే కాఫీ రుచిని ఎప్పటికీ మరిచిపోలేము. అదే విధంగా భద్ర అభయారణ్యంలో షికారు చేయడం కొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఇక్కడ ఉన్న వీరభద్ర దేవాలయం కూడా చూడదగినది.

బెంగళూరు నుంచి 243 కిలోమీటర్లు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి