• Follow NativePlanet
Share
» »అటు కళాశాల సెలవుల్లో ఇటు హనీమూన్ సమయంలో ఇక్కడికి వెళ్లారా

అటు కళాశాల సెలవుల్లో ఇటు హనీమూన్ సమయంలో ఇక్కడికి వెళ్లారా

Written By: Beldaru Sajjendrakishore

మనిషికి ఒక్కో వయస్సులో కొన్ని ప్రత్యేక కోరికలు కలగడం సహజం. ఆ సమయంలో ప్రత్యేక పనులు చేయాలని కొన్ని ప్రత్యేక ప్రాంతాలను చూడాలని పించడం మరింత సహజం. ఇక ఇక మనిషి జీవితంలో మరిచిపోలేని దశలు రెండు. అందులో ఒకటి విద్యార్థి దశ. అందులోనూ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న సమయంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలనిపిస్తుంది. కొత్తగా పరిచమైన స్నేహితులతో ఆ క్షణాలను ఆస్వాధించడం మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా సెలవులు దొరికినప్పుడు కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటాడు. ఆ ప్రదేశాల్లో తాను ఇంతకు ముందు ఎప్పుడూ పొందని ఏదో ఒక కొత్త దనాన్ని పొందాలని భావిస్తాడు.

సూర్య భగవానుడు ఇచ్చిన వర ప్రభావం...ఆ సమయంలో ఇక్కడకు వెళ్లితే విజయం ఖచ్చితం

ఇక్కడ క్రూర మృగాలకూ ప్రాణ భయం లేదు...మన మనస్సుకు ఆహ్లాదం తప్ప

వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా

ఇక మనిషి జీవితంలో రెండో దశ గృహస్తుడు కావడం. పెళ్లి దానికి తొలిమెట్టు. వివాహం తొలినాళ్లలో తన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తితో ఏకాంతంగా గడపాలనుకొంటాడు. శృంగార పరమైన కోరికలను పెంచే అటువంటి ప్రాంతాల కోసం ఎంత దూరమైన ప్రయాణించి చేరుకుంటారు. ఈ రెండు దశలకు అంటే అటు కాలేజ్ స్టూడెంట్స్ సెలవులను ఎంజాయ్ చేయడంతో పాటు ఇటు హనిమూన్ కపుల్స్ కు అనువుగా ఉండే కొన్ని ప్రాంతాలు మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ వేసవి సెలవులతో పాటు పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే ఈ వేసవి కాలంలో ఆ ప్రాంతాల గురించిన వివరాలను నేటివ్ ప్లానెట్ మీ కోసం తీసుకువచ్చింది.

1. ఊటి

1. ఊటి

1. ఊటి

Image Source:

స్టూడెంట్స్ కు తమ సెలవులను ఎంజాయ్ చేయాలన్నా కొత్తగా పెళ్లైన జంటలకు హనిమూన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఊటినే. మధ్య తరగతి కుటుంబ నుంచి కాస్త ఉన్నత స్థాయి కుటుంబాల వరకూ ఈ ప్రాంతాన్నే తమ హనీమూన్ డెస్టినిగా లేదా హాలిడే స్పాట్గా ఎన్ను కొంటారు. ఏడాది మొత్తం ఎంజాయ్ మెంట్ కు అనువైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. మైసూరుకు 128 కిలోమీటర్లు, తమిళనాడులోని కొయంబత్తూర్ కు 86 కిలోమీటర్ల దూరంలోని ఊటికి దేశం మొత్తం నుంచి రవాణా సదుపాయం బాగా ఉంది.

2. శ్రీనగర్

2. శ్రీనగర్

Image Source:

చుట్టూ ఎతైన మంచు కొండలు, స్వచ్ఛమైన నీటిని కలిగిన సరస్సులు ప్రకృతి లోని అందాన్నంతటిని తనలోనే అమర్చుకున్న ఈ శ్రీనర్ కొత్త జంటలకు రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. అదే విధంగా కొత్త కోరికలు ఉదయించే వయస్సైన స్టూడెంట్స్ కు కూడా ఈ ప్రాంతం ఎర్రతివాచి పరుస్తుంది. చలికాలంలో కంటే వేసవి కాలంలో ఇక్కడ విహరించడానికి అనుకూలం. శ్రీనగర్ లోని సరస్సులో బోట్ పడవుల్లో విహరిస్తూ ప్రక`తిని ఆస్వాధింస్తూ జీవిత భాగస్వామితో ఊసులాడటం విషయం మాటలకు అందని ఓ అద్భుత కావ్యమనడం అతిశయోక్తి కాదేమో.

 3. సింమ్లా

3. సింమ్లా

Image Source:

స్నేహితుల చేతిలో చెయ్యి వేసి చల్లని పిల్లగాలులను ఆస్వధిస్తూ ముందుకు సాగడం, తెల్లని మేఘాలను మనలను దాటుకుంటూ వెలుతుండటం సినిమాల్లో చూడటానికేనా అంటే ఇప్పటి యువతరం కాదని అంటుంది. సెలవులను ఎంచక్కా ఇక్కడ గడపడానికి యువకులు ఎప్పుడూ ముందుంటారు. అదే విధంగా మీరు హనీమూన్ ట్రిప్ కోసం సింమ్లాను ఎంచుకుంటే ఇలాంటి ఎన్నో అనుభవాలు మీకు తరుచుగా ఈ నగరంలో ఎదురవుతాయి. హిమాలయ పర్వత సానువుల్లో భాగమైన ఈ నగరంలో ఒక్కొక్కసారి నాలుగు డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ఆ చల్లని సమయంలో వెచ్చని కోరికలకు అంతే ఉండదేమో.

4. మనాలి

4. మనాలి

Image Source:

హనీమూన్ వెళ్లాలనుకొనే వారి ఛాయిస్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న పట్టణం కూడా తప్పకుండా ఉంటుంది. ఇందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ప్రధాన కారణం. ఒక వైపున నదీ లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, ఆ పర్వతాల్లో రంగురంగుల పుష్పాలు ఇలాంటి ద`ష్యాల కంటే కొత్త జంటలు కోరుకునేది ఇంకేమి ఉంటుంది చెప్పండి. అందుకే సముద్రమట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణానికి హనీమూన్ జంటలు క్యూ కడుతుంటాయి. అదే విధంగా ఇక్కడి భౌగోళిక పరిస్థితులు సాహస క్రీడలకు పెట్టింది పేరు. అందువల్ల ఇటీవల కాలంలో యువకులు కూడా ఇక్కడకు ఎక్కువగా వెలుతుంటారు.

5. కేరళ

5. కేరళ

Image Source:

సముద్ర తీర ప్రాంతమైన ఈ రాష్ర్టం దేశంలో పర్యాటకంలో ముందుంటుంది. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. సగటు మధ్య తరగతి కుటుంబాల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకూ ప్యాకేజీల వారిగా ఇక్కడి సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏకాంతానికి భంగం కలగకుండా గూడు పడవల్లో ప్రయాణించడం జీవితంలో పరిచిపోలేని అనుభవం. అందువల్లే అటు విద్యార్థులతో పాటు ఇటు హనిమూన్ జంటలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.

6. కాశ్మీర్

6. కాశ్మీర్

Image Source:

చల్లని వాతావరణానికి కాశ్మీర్ పెట్టింది పేరు. చుట్టూ మంచు పర్వతాల మధ్య ప్రకృతిని ఆస్వాధిస్తూ ముందుకు వెళ్లలనుకోవడం ఎవరికి ఉండదు చెప్పండి. అంతేకాకుండా శృంగార పరమైన ఆలోచనలను రెట్టింపు చేసే స్వభావం కలిగిన కుంకుమపువ్వూ కూడా దొరుకుతుంది. అయితే చలికాలంలో కంటే వేసవి కాలంలో కాశ్మీర్ ను హనిమూన్, హాలిడే డెస్టినీ కోసం ఎన్ను కుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా గూడు పడవల్లో ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

7. డార్జిలింగ్

7. డార్జిలింగ్

Image Source:

పశ్చిమ బెంగాల్ లోని ఈ పట్టణం సముద్ర మట్టానికి 6700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి వాతావరణం, పరిసర ప్రాంతాలు కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే హాలిడే డెస్టినేషన్ ప్యాకేజీలను అందించించే సంస్థలు డార్జిలింగ్ తమ జాబితాలో మొదటగా చెబుతారు. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. దీంతో ఏడాది మొత్తం డార్జిలింగ్ పర్యాటకానికి అనుకూలం.

8. గోవా

8. గోవా

Image Source:

సముద్ర తీర ప్రాంతమైన గోవా కేవలం మనకే కాకుండా విదేశీయులకు కూడా అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. చాలా మంది బ్యాచిలర్ పార్టీ కోసం ఇక్కడికే వస్తుంటాయి. కొన్ని కళాశాలలు కూడా తమ విద్యార్థులకు ఇక్కడకు ట్రిప్ కోసం తీసుకువెలుతుంటాయి. ఇక్కడి హోటల్, రిసార్టులు కూడా ప్రతి వర్గం కోసం అందుబాటు ధరల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి.

9. కూర్గ్

9. కూర్గ్

Image Source:

కర్నాటకలో ప్రముఖ హిల్ స్టేషన్ అయిన కూర్గ్ కూడా హనీమూన్ జంటలకు ఇష్టమైన పర్యటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. చిరుజల్లుల్లో తడుస్తూ ప్రియ సఖితో నడవటం ఎవరికి ఆనందం కలిగించదు. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం చలికాలంలో కూడా పర్యాటకులకు ఆహ్వనం పలుకుతుంది. విద్యార్థులు ముఖ్యంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఎక్కువగా ఇష్టపడే వారు ఇక్కడికి వస్తుంటారు.

10 లడక్

10 లడక్

Image Source:

హిమాలయ ప్రాంతాలకు చెందిన ఈ పట్టణం సముద్ర మట్టానికి 9800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ సదుపాయం కూడా ఉంది. అందు వల్ల విద్యార్థులు తమ సెలవులను గడపడానికి ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇందుకు రవాణా సౌకర్యాల కొంత మేరకు మాత్రమే అందుబాటులో ఉన్నా కూడా ఇటీవల ఇక్కడకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

11. ఖజురహో

11. ఖజురహో

Image Source:

సాధారణంగా ఖజురహో హనిమూన్ జంటలకు మాత్రమే ప్రత్యేకం అని అనుకుంటారు. అయితే ఈ దేవాలయల గోడల పై ఉన్న శిల్పాలు భారతీయ శిల్ప కళకు అద్ధం పడుతాయి. ప్రతి శిల్పం కొత్త విషయాన్ని చెబుతూ ఉంటుంది. అందువల్లే విద్యార్థులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఇక్కడకు వెళ్లడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక హనిమూన్ జంటలు ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను చూసిన తర్వాత అటు నుంచి అటే ఖజురహోకు వెలుతుంటారు.

12. మణిపూర్

12. మణిపూర్

Image Source:

మణిపూర్ రివర్ రాఫ్టింగ్, కేవింగ్ వంటి అడ్వెంచర్ టూరిజానికి పెట్టింది పేరు. అందువల్లే ఇక్కడకు ఎక్కువగా విద్యార్థలు వస్తుంటారు. ఇక హనీమూన్ జంటలు విహరించడానికి కూడా ఇక్కడ అనుకూలమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఈ ఈశాన్య రాష్ట్రం అటు విద్యార్థులతో పాటు పెళైన కొత్త జంటలకు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. అందువల్లే ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

13. ఉదయ్ పూర్

13. ఉదయ్ పూర్

Image Source:

రాజస్థాన్ లో సిటీ ఆఫ్ సన్ సెట్ గా పేరుగాంచిన ఉదయ్ పూర్ అటు విద్యార్థులతో పాటు హనిమూన్ జంటలను బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటు వంటి సరస్సులే. ఏకాంతంగా గడపాలనుకొనే వారికి అనువైన వాతావరణంతో పాటు అడ్వెంచర్ టూర్ ను ఇష్టపడే యువతకు కూడా ఈ ఉదయ్ పూర్ లోని సరస్సులు అవకాశం కల్పిస్తాయి.

14. పాండిచ్చేరి

14. పాండిచ్చేరి

Image Source:

అందమైన బీచ్ లకు పాండిచ్చేరి పెట్టింది పేరు. స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచ్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ బాగా ప్రాచూర్యం పొందింది. దీంతో వివాహాన్ని వినూత్నంగా చేసుకోవాలనే వారు సముద్ర లోతుల్లోకి వెళ్లి ఇక్కడ వివాహం చేసుకుని అటు నుంచి అటే హనిమూన్ కు వెళుతుంటారు. ఇక అడ్వెంచర్ స్పోర్ట్ ఇష్టపడే యువత స్కూబా డైవింగ్ కోసమే ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

15. లక్షద్వీప్

15. లక్షద్వీప్

Image Source:

ఇక్కడ కూడా బీచ్ లు ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల అటు హనుమూన్ జంటలతో పాటు సాగర అలలతో పోటీ పడుతూ ముందుకు సాగాలనే మనస్తత్వం ఉన్న యువత కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. భారత దేశం నుంచే కాకుండా పొరుగున ఉన్న దేశాల నుంచి కూడా ఇక్కడకు విమానయాన సదుపాయాలు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి కూడా యువత, యువ జంటలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

16. రుషికేష్

16. రుషికేష్

Image Source:

రివర్ రాఫ్టింగ్ కు ఈ ప్రదేశం పెట్టింది పేరు. నదీ ప్రవాహంతో జోరుగా వెళ్లాలనుకునే వారికి ఈ రుషికేష్ రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. అంతే కాకుండా ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక ప్రాంత కూడా దీంతో పెళైన కొత్త జంటలతో పాటు యువకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు శృంగార పరమైన ఆలోచనలను పెంపొందించే రుషికేష్ ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది.

17.బెంగళూరు

17.బెంగళూరు

17.బెంగళూరు

Image Source:

బ్యాచిలర్ పార్టీకి బెంగళూరు పెట్టింది పేరు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు యువత ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. దేశ విదేశాలకు చెందిన సంప్రదాయాలును ఇక్కడ మనం చూడవచ్చు. మిగిలిన నగరాలతో పోలిస్తే కాలుష్యం తక్కువ రవాణా సదుపాయం ఎక్కువ. దీంతో అటు యువతతో పాటు హనిమూన్ కపుల్స్ ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

18. మంగళూరు

18. మంగళూరు

Image Source:

బీచ్ టూరిజాన్ని అన్ని వయస్సుల వారు ఇష్టపడుతారనడంలో సందేహం లేదు. ఇక కర్ణాటకలోనే కాకుండా భారత దేశంలో మంగళూరులో ఉన్నటు వంటి బీచ్ లు మరెక్కడా లేవు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో అటు యువతతో పాటు వేడి కోరికలు కలిగే హనిమూన్ జంట కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి