• Follow NativePlanet
Share
» »రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

ప్రపంచంలో వున్న అత్యంతపురాతన నగరాలలో అయోధ్య ఒకటన్న సంగతి మీకందరికీ తెలిసిందే.రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య. ఒక స్వర్ణయుగానికి కేంద్ర బిందువు అయోధ్య. అందుకే ఆ నగరం ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. హిందువులు అమితంగా ప్రేమించే శ్రీరామచంద్రప్రభువు పుట్టిన ఊరైన అయోధ్యకు జీవితంలో ఒక్క సారైనా వెళ్ళాలనే కోరిక బలంగా వుంటుంది. అయితే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు అయోధ్యకు తరలి వస్తారు.

వారిది మనదేశం కాదు.హిందువులు అసలేగాదు. అయినా వారికి అయోధ్య ఒక ప్రసిద్ధపుణ్య క్షేత్రం. తమ జీవితంలో ఒక్క సారైనా అయోధ్యను దర్శించాలానే జీవితాశయంతో ఒక దేశ ప్రజలు మొత్తం బ్రతుకుతున్నారంటే మీరు నమ్మగలరా? కానీఇది పచ్చినిజం.మరి వారెవరు?ఏ దేశం వారు?ఎందుకని వారు ప్రతిసంవత్సరం అయోధ్యకు తండోపతండాలుగా వస్తున్నారు అనే విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

అయోధ్య సరయూ నదీతీరంలోఫైజాబద్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు.

PC:Ramnath Bhat

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆ విస్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా లోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది.

PC:आशीष भटनागर

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అయోధ్య సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.

PC:Vishwaroop2006

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

మన ఆసియాఖండంలోని దేశాలలో సౌత్ కొరియా ఒకటి. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర కల మనభారతదేశపు విస్తీర్ణం, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, వియత్నాం, ఇండోనేషియా వంటి అనేక దేశాలతో కలిపి వుండినట్లు తాజాపరిశీలనలు చెబుతున్నాయి.

PC:Vishwaroop2006

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అదే కోవకు చెందినదే సౌత్ కొరియాఅని కొరియాప్రజలు చెబుతున్నారు.వేల ఏళ్ల క్రితం హిందూమతం దాదాపు ఆసియా అంతావుండేది.

PC:wikimedia.org

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

ఆ సమయంలో ఇప్పుడు చైనా,జపాన్ అంటూ పేర్కొంటున్న వివిధ దేశాలలో యువ రాణులను,రాజులను మన దేశపు యువరాజులకు, యువరాణులకు ఇచ్చి పెళ్ళిళ్ళు జరిగినట్లు మహా భారతం చెబుతోంది.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

మహా భారతకాలంలో కౌరవులతల్లి అయిన గాంధారి కూడా నేటి ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మహిళగా పురాణాలలో పేర్కొనబడినది.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అటువంటి ఒక కథ చరిత్రపుటలలో నిక్షిప్తమై కొరియన్లకు,మనకి ఒక బంధాన్ని ఏర్పరచిందని హాన్యాంగ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎమరిటస్ చెబుతున్నారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

కొరియన్ల కధనం ప్రక్కారం పూర్వం కొరియా ప్రాంతానికి మొదటి చక్రవర్తులైన గ్యూంగ్వాన్ గయ వంశంలోని గింసురో అనే రాజుకి తగినవధువు గురించి అన్ని ప్రాంతాలలో వెతుకుతుండగా వారి కుల దేవుడైన సాంజి సురి రత్న అనే యువతి తల్లిదండ్రుల కలలో కనపడి నీ కూతురిని పడవమీదుగా గయ రాజ్యానికి పంపు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అక్కడ ఆమె మహారాణి అవుతుంది దాంతో ఆమెను ఒక పడవలో ఎక్కించి పరిచారికలతో సముద్రం మీదుగా కొరియాకు పంపినట్లు ఆమె చేసే సముద్రప్రయాణంలో ఎటువంటి ఆటంకం కలగకుండా వుండటానికి 2చేపల బొమ్మలు పొదిగివున్న ఒక నీలిరంగు రాయిని ఆమె మెడలో హారంగా ధరింపజేసినట్లు వారు చెబుతున్నారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

కొరియాకిచేరుకున్న సురిరత్న గురించి తెలుసుకున్న రాజుసురో ఆమెను పరిణయ మాడాడని వారి పురాణాలుచెబుతున్నాయి.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

వివాహం తరువాత ఆమె పేరు హియో హ్వాంగ్ ఓక్ గా మారిందట.ఈమె ఆ దేశపు మొదటి మహారాణిగా కొరియన్లు పేర్కొంటారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రాణి హియో హ్వాంగ్ ఓక్ యొక్క జన్మస్థలంపై చాలాసంలు చరిత్రకారులు పరిశోధన జరపగా ప్రొఫెసర్ బ్యుంగ్ మో కిం, ప్రొఫెసర్ ఎమెరిటస్ వంటివారు ఆమె భారతదేశంలోని అయుత అనేవంశానికి చెందినదని ఆ వంశం వారు రామజన్మ భూమిఅయిన అయోధ్యలో 48 ఎడి నందు వుండేవారని చెప్పారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

హియో కిం సురోతో పెళ్లి జరిగేసరికి ఆమె వయస్సుకేవలం 16సంలేనంట.ఈ విషయాన్ని అక్కడి చరిత్రకారులు, నాయకులు, అధికారికంగా గుర్తించగా వారు 2001లో ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిఅయిన అఖిలేష్ యాదవ్ వద్దకు వచ్చి తమ దేశపు మొదటిరాణి పుట్టినిల్లుఅయోధ్యేనని దానికిగుర్తుగా అక్కడ హియో హ్వాంగ్-ఓక్ పేరుమీద ఒక మెమోరియల్ స్థాపిస్తామని అడిగారు.వారి విన్నపాన్ని యాదవ్ అంగీకరించారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అప్పటి నుంచికొరియన్లు అయోధ్యను తమ పుట్టినిల్లుగా భావిస్తున్నారు. అందుకని ప్రతిసం సౌత్ కొరియా నూతనసంవత్సరం నాడు అయోధ్యను దర్శించటానికి వేల మంది కొరియన్లు వస్తున్నారు.

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య

అక్కడికి వచ్చిన కొరియన్లను ఇంటర్వూజేసినకొన్ని నేషనల్ ఛానల్స్ వారు చెప్పినదాని ప్రకారం కొరియన్స్ అయోధ్యను తమతల్లిగారిఇల్లుగా తమకి పుణ్యక్షేత్రంగా భావిస్తునట్లు తమ జీవితంలో ఒక్క సారైనా అయోధ్యను సందర్శించాలని అన్నారు.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

బెలా భవాని టెంపుల్

ప్రతాప్ ఘడ్ ఉత్తర ప్రదేశ్ లో ఒక జిల్లా. దీనికి ఈ పేరు దాని హెడ్ క్వార్టర్ టవున్ అయిన బేల ప్రతాప్ ఘర్ నుండి వచ్చింది. చరిత్ర మేరకు ఒక స్థానిక రాజు అజిత్ ప్రతాప్ సింగ్ ఆరూర్ వద్ద గల రాంపూర్ ను తన ప్రధాన పాలనా కార్యాలయం చేసుకున్నాడు. తర్వాత 1858 లో ప్రతాప్ ఘర్ జిల్లా ఏర్పడినపుడు దానిని బెలా ప్రతాప్ ఘర్ అన్నారు. బెలా అనేది సాయి నది ఒడ్డున కల బెలా భవాని టెంపుల్ ను సూచిస్తుంది.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

బారాబంకి

బారాబంకి లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. ఇది పారిజాతం చెట్టుకు పుట్టినిల్లు. బారాబంకి ఘంటాఘర్ లేదా క్లాక్ టవర్ సిటీకి ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ జిల్లాలో కల మహాదేవ టెంపుల్ పురాతన టెంపుల్స్ లో ఒకటి.

సమీప ప్రదేశాలు

సమీప ప్రదేశాలు

కుషినగర్

కుషినగర్ ఉత్తరప్రదేశ్ లో బౌద్ధ యాత్రా స్థలాలలో ముఖ్యమైనది. బౌద్ధ గ్రంధాల ప్రకార౦, గౌతమ బుద్ధుడు అతని మరణం తరువాత హిరణ్యవతి నది సమీపంలో పరినిర్వానం పొందినట్లు ఉంది. గత కాలంలో దీనిని కుశావతి అని పిలిచేవారు, శ్రీరాముని కుమారుడైన కుశుడికి ఆపేరు పెట్టిన తరువాత దానికి ఆ పెరువచ్చినట్టు రామాయణ పురాణంలో పేర్కొనడం జరిగింది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం

అయోధ్య నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్నో విమానాశ్రయం అయోధ్యకి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ నుండి ఏదైనా ప్రైవేటు టాక్సీ లేదా బస్సు తీసుకుని నగరానికి రావచ్చు. అమౌసి, వారణాసి మరియు కాన్పూర్ వద్ద ఉన్న దేశీయ విమానాశ్రయాలు అయోధ్యకి సమీపం లో ఉన్నవే.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు మార్గం

ఢిల్లీ, లక్నో, వారణాసి మరియు అల్లహాబాద్ వంటి ప్రధాన నగరాలకి అయోధ్య రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. సమీపంలో రైల్ హెడ్స్ అలహాబాద్(జి కె ఫై ఎక్ష్ప్రెస్), కోల్కతా (దూన్ ఎక్ష్ప్రెస్), ఢిల్లీ(సరయు యమునా ఎక్ష్ప్రెస్), మరియు లక్నో (కైఫియత్ ఎక్ష్ప్రెస్) మరియు వారణాసి (మరుధర్ ఎక్ష్ప్రెస్)అందుబాటులో కలవు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

బస్సు మార్గం

లక్నో, అలహాబాద్, వారణాసి, గోరఖపూర్ మరియు ఇతర ప్రధాన నగరాల నుండి బస్సు సర్వీసు లు సులభం గా అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేటు సంస్థల చే ఈ బస్సులు నడపబడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల నుండి అయోధ్య కి డీలక్స్ బస్సులు అలాగే వోల్వో కోచ్ లు అందుబాటులో కలవు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి