Search
  • Follow NativePlanet
Share
» »ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఏం జరుగుతుందో తెలుసా? - ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఏం జరుగుతుందో తెలుసా? - ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని కైలాస కోన శివాలయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని కైలాస కోన శివాలయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. నేడు భారతదేశంలో ఎంతో వైభవంగా వెలసిల్లిన ఎన్నో దేవాలయాలు, దైవాన్ని తలపించే ఇతర కట్టడాలన్నీ పురాతనకాలంలో దేవతలు పరవశించి కొన్నాళ్ళు పాటు జరిగిన ప్రాంతాలకు చిహ్నంగా నిర్మించబడినట్లు కొన్ని కథనాలు ప్రచారంలో వున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక చరిత్రతో కూడిన నిర్మాణాలలో కైలాస కోన గుహాలయం కూడా ఒకటి. చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో వున్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది.

ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఏం జరుగుతుందో తెలుసా? - ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

1. గుహాలయం ఎక్కడ వుంది?

1. గుహాలయం ఎక్కడ వుంది?

చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

PC: youtube

2. జలపాతం శోభ

2. జలపాతం శోభ

ఇది కైలాస కోన కొండపై ఉంది. పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం మహా శోభాయమానంగా ఉంటుంది.

PC: youtube

3. శివలింగం ఎక్కడ వుంది?

3. శివలింగం ఎక్కడ వుంది?

కైలాస కోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది.

PC: youtube

4. శివలింగానికి ఎదురుగా ఏముంది?

4. శివలింగానికి ఎదురుగా ఏముంది?

శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి.

PC: youtube

5. వీరభద్రుని విగ్రహం పక్కన ఏముంది?

5. వీరభద్రుని విగ్రహం పక్కన ఏముంది?

గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది.

PC: youtube

6. కొండ గుహలే ఆలయాలా?

6. కొండ గుహలే ఆలయాలా?

పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలనే ఆలయాలుగా మలచేవారు.

PC: youtube

7. ముగ్ధమనోహరమైన సౌందర్యం

7. ముగ్ధమనోహరమైన సౌందర్యం

ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.

PC: youtube

8. గుహాలయం కథ

8. గుహాలయం కథ

క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి ఈ గుహాలయం కథ ఇలా ఉంది.

PC: youtube

9. చూడముచ్చతైన జలపాతాలు

9. చూడముచ్చతైన జలపాతాలు

పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను, మధుర భావనను కలిగిస్తుంది. అలాంటిది చక్కటి గుహాలయం, ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం చూడముచ్చటగా ఉంటాయి.

PC: youtube

10. ఊరట చెందే ప్రాంతం

10. ఊరట చెందే ప్రాంతం

ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అలజడులు, ఆందోళనలు మటుమాయమై ఊరట లభిస్తుంది.

PC: youtube

11. పర్యాటకులు కైలాసకోనకు ఎందుకొస్తారు?

11. పర్యాటకులు కైలాసకోనకు ఎందుకొస్తారు?

జిల్లాలోని కైలాసకోనకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.ఎంతో అందమైన జలపాతాలతో ముఖ్యమైనవి తలకోన.

PC: youtube

12. కైలాస కోన, ఉబ్బుల మడుగు జలపాతాలు ఎక్కడ వున్నాయి?

12. కైలాస కోన, ఉబ్బుల మడుగు జలపాతాలు ఎక్కడ వున్నాయి?

కైలాస కోన, ఉబ్బుల మడుగు జలపాతాలు, కైలాస కోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది.

PC: youtube

13. మీరు ప్రకృతిని ఆస్వాదించగలరా?

13. మీరు ప్రకృతిని ఆస్వాదించగలరా?

ఇక్కడ సిద్ధేశ్వర కామాక్షి మాత దేవాలయం ఉంది. ఇంత అందమైన ప్రదేశానికి కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు.

PC: youtube

14. ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహించే జలపాతం

14. ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహించే జలపాతం

కైలాస కోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది. ఇది ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ 100 అడుగుల పైనుంచి పడుతూ ఉంటుంది.

PC: youtube

15. ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

15. ప్రజల విశ్వాసమే నిజమయ్యిందా?

ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం.ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది.

PC: youtube

16.ఎలా వెళ్ళాలి

16.ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X