• Follow NativePlanet
Share
» »మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

దక్షిణ కైలాసం గా ముద్ర పడ్డ ఈ దివ్య క్షేత్రం లో ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న రెండు దీపాలలో ఒకటి ఎల్లప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉండటం మరొకటేమో నిశ్చలంగా కదలకుండా ఉండటం. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు నాటి ప్రాచీన భారతీయ వాస్తుకళ కు, శిల్ప కళాకారుల పనితనానికి అద్దంపట్టే విధంగా ఉంటాయి. శ్రీ కాళహస్తి పట్టణం చుట్టూ చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ అందులో నుంచి మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు కొన్నే ఉన్నాయి వాటిలో ప్రధానమైనది వెయ్యి కాళ్ళ మండపం, 36 కు పైగా తీర్థాలు ఇలా ఎన్నో .

శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో గల ఒక ప్రముఖ పట్టణం. ఈ పట్టణం తిరుపతి నగరానికి 54 కి.మీ. దూరంలో ఉంది. దేశంలో అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన ఉన్నది. శ్రీకాళహస్తి మూడు పదాల కలయికతో ఏర్పడింది (శ్రీ - సాలీడు, కాళ - పాము, హస్తి - ఏనుగు). దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగం గల గొప్ప పుణ్య క్షేత్రంగా ఖ్యాతిగడించింది.

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

కాళహస్తి దేవాలయం

శ్రీకాళహస్తి లో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఒకటిగా ఉన్న కాళహస్తి దేవాలయం తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన ఆకర్షణ. పురాణాలలో పేర్కొన్న విధంగా తనను పరీక్షించిన శివుని కోసం తన కంటినే తీసి ఇచ్చిన పరమ భక్తుడు భక్త కన్నప్ప ఇక్కడనే శివుడుని కొలిచాడు.

Photo Courtesy: Kalyan Kumar

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

కాళహస్తి దేవాలయం

శివ భక్తులే కాక ఈ కాళహస్తి ఆలయానికి రాహు - కేతు దోషాల నుంచి విముక్తి పొందటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుపతిని సందర్శించేవారు కాళహస్తి లోని కాళహస్తి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

Photo Courtesy: Rahul Pattnaik

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

కన్నప్ప దేవాలయం

కన్నప్ప దేవాలయం, శ్రీకాళహస్తి లోని ఒక చిన్న కొండ మీద ఉంది. కాళహస్తి లో ఉన్న ఈ ఆలయం గొప్ప శివ భక్తుడైన భక్త కన్నప్ప కు అంకితం చేయబడినది. వేటగాడు అయిన కన్నప్ప ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని చూసిన తరువాత అక్కడి నుంచి దానిని తీసుకువచ్చి నియమాలకు వ్యతిరేకంగా పక్కనే ఉన్న జలాధార నుండి తన నోటిలో నీరు తీసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు.

Photo Courtesy: go tirupati

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

భక్త కన్నప్ప గురించి ఒక్కమాటలో ..

కన్నప్ప ఒక వేటగాడు. ఈయన నిత్యం శివుణ్ని ఆరాదించేవాడు. ఒకనాడు శివుడు అలా అతనిని కొలిచే సమయంలో కన్నప్ప భక్తిని పరీక్షించడం కోసం తన కంటి నుండి రక్తం కార్చేవాడు వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామివారికి అమర్చాడు వెంటనే మరో కంటి నుండి రక్తం కారడం మొదలవడంతో భక్తుడైన కన్నప్ప సందేహీంచకుండా తన రెండవ కన్నుని కూడా పీకి స్వామివారికి అమర్చాడు. దీనికి చూసి ఎంతగానో ముగ్ధుడైన శివుడు ప్రత్యెక్షమై అతనిని కరుణించి ముక్తిని ప్రసాదించాడు.

Photo Courtesy: go tirupati

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

చతుర్ముఖేశ్వర దేవాలయం

బ్రహ్మ మరియు మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తి లోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. ఈ గుడిలో శివలింగం నాలుగు దిక్కులూ చూసే నాలుగు ముఖాలతో వుండడం విశేషం. చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలున్న వాడని అర్ధం. ఈ దేవాలయం గోడల మీద శివుడికి చెందిన పురాణ గాధల చిత్రాలు వున్నాయి.

Photo Courtesy: Ramesh-K

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

సహస్ర లింగ దేవాలయం

శ్రీకాళహస్తి లో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఒకటి సహస్ర లింగ దేవాలయం. ఒక అందమైన అడవి మధ్యలో వున్న ఈ గుడి పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ‘సహస్ర' అంటే వేయి అని అర్ధం - ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన శివలింగం వుండడం వల్ల ఈ గుడికి ఆ పేరు అంతేనా .. ఈ దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ జన్మలోనూ, పూర్వజన్మల్లోనూ చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Photo Courtesy: pponnada

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

దుర్గంబికా దేవాలయం

దుర్గాంబికా దేవి కోసం శ్రీకాళహస్తి లో సముద్ర మట్టానికి 800 మీ. ఎత్తున ఒక కొండపై నిర్మించిన దుర్గాంబికా దేవాలయం చాలా పురాతనమైనది. దీని రమణీయ దృశ్యాల వల్ల స్థానికులే కాక పర్యాటకులు కూడా ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. కొండ దిగువ నుంచి బాగా వెడల్పాటి మెట్లు నిర్మించారు. దీనివల్ల ఈ కొండ ఎక్కడం చాలా తేలికవుతుంది. వందలాది మంది భక్తులు ఈ దేవత చల్లని దీవెనల కోసం ఇక్కడికి వస్తుంటారు.

Photo Courtesy: Shanbhag

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం

శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతం లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు. ఇది కాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే వుంది. ఈ దైవం ఆశీస్సుల కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తారు.

Photo Courtesy: temples india

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

శ్రీకాళహస్తి లోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయం గా ప్రఖ్యాతి గాంచింది. ఈ దేవాలయం 1200 - 1500 ఏళ్ళ నాటిదంటారు. పరిసరాల్లో వున్న గుళ్ళతో పోలిస్తే ఈ గుడి చిన్నదే అయినప్పటికీ ఎంతో మంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తారు. గమ్మత్తేమిటంటే ఈ చిన్న గుళ్ళోనే దక్షిణ భారతంలో కెల్లా అతి పెద్ద శివలింగం వుంది.

Photo Courtesy: NsChandru

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం

సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం శ్రీకాళహస్తి లో వుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఆడి కృత్తిక ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది పొందింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సంగీత నృత్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఉత్సవాల చివరి రోజు దేవాలయాన్ని దీపాలతో, పుష్పాలతో అలంకరించి, సుబ్రహ్మణ్య స్వామి ఆయన దేవేరుల విగ్రహాలను రథాల మీద వుంచి ఊరి వీధుల గుండా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు.

Photo Courtesy: రవిచంద్ర

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

గుడిమల్లం శ్రీకాళహస్తి

కి 54 కి. మీ. దూరంలో ఉన్న గుడిమల్లంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది అదేమిటంటే ఇక్కడున్న శివలింగం లింగరూపంలో కాకుండా మానవ రూపంలో వేటగానివలె ఉంటుంది. పురుషాంగము తో పోలి ఉన్న ఈ లింగం ప్రపంచంలో అతి పురాతనమైన శివలింగంగా ఖ్యాతి గడించింది.

Photo Courtesy: Elvey

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

వేయిలింగాల కోన జలపాతం

వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం చేస్తారు. చుట్టూ శివలింగాలను పోలి వున్న రాళ్ళతో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని భావిస్తారు. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయనే నమ్మకం వల్ల ఎంతో మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.

Photo Courtesy: go tirupati

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ?

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం

శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతిలోని రేణిగుంట ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ వుంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.

రైలుమార్గం

ప్రధాన రైళ్లన్నీ శ్రీకాళహస్తి లో ఆగుతాయి. ఈ పట్టణం నుంచి అనేక రైళ్ళ ద్వారా దక్షిణాది లోని అనేక నగరాలకు అనుసంధానం వుంది. ఇతర స్టేషన్లలో రైళ్ళు మారకుండా నేరుగా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు. దీనికి సమీపంలో గుడూరు రైల్వే జంక్షన్ ఉంది.

రోడ్డు మార్గం

రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాళహస్తికి అనేక బస్సులు నడుపుతుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, నెల్లూర్ లాంటి నగరాలకు నిత్యం బస్సులు తిరుగుతాయి. తిరుపతి నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది.

Photo Courtesy: satish.skht

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి