• Follow NativePlanet
Share
» »పవిత్ర భూమి - శ్రీశైలం టూరిజం

పవిత్ర భూమి - శ్రీశైలం టూరిజం

Written By: Venkatakarunasri

శ్రీశైలం భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉన్న ఒక పట్టణం. ఈ ప్రదేశం కృష్ణా నది ఒడ్డున ఉన్నది. ఈ చిన్న పట్టణం హైదరాబాద్ నుండి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది.

లక్షలాది యాత్రికులు దేశవ్యాప్తంగా శ్రీశైలం నగరానికి వస్తూవుంటారు. నగరంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు యాత్రికులు మాత్రమే కాకుండా పర్యాటకులు కూడా వస్తూ వుంటారు.

శ్రీశైలంలో అత్యంత ప్రసిద్ధ ఆలయం శివపార్వతులకు చెందిన మల్లికార్జునస్వామి ఆలయం.

ఇక్కడ ఏముందో చూద్దాం. మరెందుకాలస్యం. శ్రీశైలానికి ఒక యాత్ర చేద్దామా!

పవిత్ర భూమి - శ్రీశైలం టూరిజం

ఇక్కడి గుహలు ఇప్పటివి కావు

ఇక్కడి గుహలు ఇప్పటివి కావు

శ్రీశైలం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల కొండ వద్ద ఉన్న అక్కమదేవి గుహలు వున్నాయి. ఇది శ్రీశైలం చరిత్రలోనే ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ గుహలు పూర్వ చారిత్రక కాలాల నుండి వచ్చాయని నమ్ముతారు.

wikimedia.org

 చారిత్రాత్మక గుహ

చారిత్రాత్మక గుహ

150 అడుగుల పొడవైన ఈ గుహను మీరు శ్రీశైలంకు వచ్చినప్పుడు తప్పక చూడాల్సిన గుహ.

commons.wikimedia.org

మల్లెల తీర్థం జలపాతాలు

మల్లెల తీర్థం జలపాతాలు

శ్రీశైలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లెల తీర్థం జలపాతాలకు ప్రతి ఏటా వేలకొలది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

Ylnr123

చలికాలంలో

చలికాలంలో

ఈ జలపాతం అడవుల మధ్య ప్రవాహిస్తుంది. ఈ జలపాతం చేరుకోవటానికి కఠినమైన రహదారులను కలిగి ఉన్నప్పటికీ సులభంగా చేరుకోవచ్చు. అయితే ఈ జలపాతాన్ని వర్షాకాలంలో చూడటం కష్టం.

 శివాజీ స్ఫూర్తి కేంద్రం

శివాజీ స్ఫూర్తి కేంద్రం

శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ కు మారాట్టా యోధుడు శివాజీ పేరు పెట్టారు. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది. ఈ సెంటర్ చుట్టూ అన్నివైపులా సంరక్షణ చేయబడి అక్కడ నుండి లోయ లోని ప్రకృతి దృశ్యాలు మరియు దూరంగా వుండే శ్రీ శైలం డాం ని చూచి ఆనందించేలా వుంటుంది.ఈ క్రీడల కేంద్రాన్ని , రాష్ట్రం లోని క్రీడల లో అన్ని వయసుల పిల్లలు పాల్గొనేందుకు గాను శిక్షణ ఇచ్చేందుకు స్థాపించారు. చాలా మంది తమ పిల్లలని ఈ కేంద్రానికి పంపుతారు. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో ఈ కేంద్రం లో ట్రైనింగ్ పొందిన పిల్లలు చాల మంది పాల్గొన్నారు.

క్రీడలలో పోటీ చేసే పిల్లలు

క్రీడలలో పోటీ చేసే పిల్లలు

శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము క్రీడలలో పోటీ చేసే పిల్లల కోసం కేటాయించబడినది. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ వంటి ఆటలలో చాలా మంది పిల్లలు శిక్షణలో ఉన్నారు. ప్రధానంగా ఈ క్రీడా కేంద్రం నుండి అనేకమంది పిల్లలు సీమాంధ్ర తరపున జాతీయ క్రీడలలో పాల్గొన్నారు.

 శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం నగరం మధ్యలో కొన్ని కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిపై నిర్మించబడింది. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద నీటి ప్రాజెక్టు అయిన శ్రీశైలం డ్యాం నల్లమల కొండల కొండలలో వుంది.

Kashyap joshi

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం

ఈ రిజర్వాయర్ నీటి నిలువకు విద్యుత్ అవసరం లేనందున అధిక మొత్తాలలో నీటిని ఇక్కడ నిలువ చేస్తారు. వరదలు వచ్చినపుడు, శ్రీశైలం రిజర్వాయర్ చాలా త్వరగా నిండిపోయి మిగిలిన నీరు నాగార్జునసాగర్ డాం లోకి ప్రవహిస్తుంది. వరద నీటిని పవర్ జనరేషన్ కు ఉపయోగించరు.

Strike Eagle

శ్రీశైలం శాంక్చురి

శ్రీశైలం శాంక్చురి

శ్రీశైలం చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కల సంరక్షిత అడవిని తప్పక చూడాలి. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఏ జంతువు కనబడక పోయినా, ఈ ప్రదేశం లో తిరిగి రావటమే ఒక సాహసంగా భావించాలి. శాంచురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి చూడవచ్చు.

శ్రీశైలం

శ్రీశైలం

శాంక్చురి లోపల వివిధ రకాల జంతువులను అంటే పులులు, చిరుతలు, హయనాలు, అడవి పిల్లులు, ఎలుగులు, లేళ్ళు , దుప్పులు వంటివి చూడవచ్చు. శ్రీశైలం డాం కు సమీపం లో కల సాన్క్చురి భాగం లో మీరు నీటి మడుగులలో వివిధ రకాల మొసళ్ళ ని కూడా చూడవచ్చు.

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం

శ్రీశైలం దేశంలోని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం లో చక్కగా కలుపబడి వుంది. అనేక ప్రభుత్వ బస్సులు కలవు. అయినప్పటికీ, మీరు బస్సు టికెట్లని ముందుగా రిజర్వు చేసుకోవటం సూచించతగినది.

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం

శ్రీశైలం కు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ గుంటూరు - హుబ్లి లైన్ పై కల మర్కాపూర్ లో కలదు. శ్రీశైలం కు ఇది సుమారు 85 కి. మీ.ల దూరం లో కలదు. బస్సు లేదా ప్రైవేటు టాక్సీ ల లో శ్రీశైలం చేరవచ్చు. బస్సు ప్రయాణం చవక.

విమాన ప్రయాణం

విమాన ప్రయాణం

శ్రీశైలం పట్టణానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం 201 కి. మీ. ల దూరం లో హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు, మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడి వుంది. విమానాశ్రయం నుండి శ్రీశైలంకు టాక్సీలలో చేరవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి