» »ఈ ‘‘దేవాలయ’’ ప్రాంగణంలో నిద్రిస్తే చాలు పిల్లలు పుట్టే భాగ్యం లభిస్తుంది..

ఈ ‘‘దేవాలయ’’ ప్రాంగణంలో నిద్రిస్తే చాలు పిల్లలు పుట్టే భాగ్యం లభిస్తుంది..

Written By: Venkatakarunasri

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం నుండి అధిక భాగం లభిస్తోంది. టూరిజం రంగం లోని ఈ అభివృద్ధి హిమాచల్ ప్రదేశ్ లో అనేక హోటళ్ళ మరియు రిసార్ట్ ల స్థాపనకు దోహదం చేసింది. పర్యాటకులకు మరింత ఆనందం మరియు చక్కని అనుభూతులను పంచుతోంది. భౌగోళికంగా పరిశీలిస్తే, ఈ రాష్ట్రం తూర్పు వైపు టిబెట్, పడమటి వైపు పంజాబ్, మరియు జమ్మూ & కాశ్మీర్ ఉత్తరం వైపు సరిహద్దులు గా కలిగి వుంది. దేవ భూమి లేదా దేవుళ్ళ భూమి గా చెప్పాబడే హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు దాని లోని దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు, మంచు కొండలు, అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది.

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

ఈ రోజుల్లో కూడా అనేక మంది ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఏదైనా విశ్వాసం లోతుగా కాకుండా ఒక క్రమ పద్దతిలో ఉంటే పర్వాలేదు. ఒక మహిళ గర్భవతి అవ్వటానికి వివిధ మార్గాల్లో ప్రయత్నించినప్పుడు విఫలం అయితే కనుక ఆమె మూఢనమ్మకాల వైపు వెళ్లే అవకాశం ఉంది.

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

కొన్ని సార్లు మహిళలు గర్భవతి కావటానికి చేసే పనులు మోసపూరితంగా ఉంటాయి. ఈ ఆలయం నెల మీద ఒక రాత్రి నిద్రిస్తే గర్భవతి అవుతారని నమ్మకం. దీని గురించి మరింత సమాచారం ఈ కింది వ్యాసంలో చదివి తెలుసుకోండి..

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

ఇది ఎక్కడ ఉంది?

ఈ ప్రత్యేక ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని లడ భరోల్ సమీపంలో సిమాస్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో దేవత సిమ్సా దేవత. సిమ్సా దేవిని 'సాన్టాన్-దత్రీ' అని కూడా పిలుస్తారు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది

హిమాచల్ ప్రదేశ్ మరియు సమీప రాష్ట్రాల్లో ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది.నవరాత్రి సమయంలో పంజాబ్, హర్యానా మరియు చండీగఢ్ లాంటి సమీపంలోని రాష్ట్రాల్లోని వేలాది బంజరు స్త్రీలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

నవరాత్రి సమయంలో విపరీతమైన రద్దీ

ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టని దంపతులు పెద్ద సంఖ్యలో వస్తారు. నవరాత్రి పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలు 'సాలింద్ర' (లేదా కల) అనే స్థానిక భాషలో మాట్లాడుకుంటారు. నవరాత్రి సమయంలో పిల్లలు లేని స్త్రీలు ఈ ఆలయంలో నెల మీద రాత్రి సమయంలో నిద్రిస్తారు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

సిమ్సా దేవత కలలో కనపడుతుంది

దేవత మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆలయాన్ని సందర్శించే స్త్రీలకు దేవత కలలో కనపడుతుంది. దేవత మనిషి రూపంలో కనపడి బిడ్డ కలగాలని ఆశీర్వాదం ఇస్తుంది. కలలో పువ్వు లేదా పండు స్వీకరించినట్టు వస్తే ఆమెకు బిడ్డ పుడతాడని నమ్మకం.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

నమ్మకం

ఇక్కడ పుట్టే బిడ్డ అడ లేదా మగ అనే విషయం కూడా తెలుస్తుందని నమ్మకం ఉంది. స్త్రీ కలలో జామ పండు కన్పిస్తే అబ్బాయి పుడతాడని,అదే బెండకాయ కన్పిస్తే అమ్మాయి పుడుతుందని నమ్మకం.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

కొన్ని నిబంధనలు ఉన్నాయి స్త్రీకి కలలో రాయి కనపడకుండా చెక్క లేదా మెటల్ కనపడితే పిల్లలు పుడతారని నమ్మకం. ఆమెకు బిడ్డ పుడతాడని కల రాగానే ఆమె ఆలయ ప్రాంగణాన్ని వదిలివేయాలి. ఒకవేళ ఆలయంలోనే ఉంటే ఆమె శరీరం మీద దురదలు,ఎర్రని మచ్చలు వస్తాయి. ఆ సమయంలో వెంటనే ఆలయాన్ని వదిలి వెళ్ళిపోవాలి.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

దేవాలయం సమీపంలో పెద్ద రాయి

నివేదికల ప్రకారం, సిస్సా దేవాలయానికి సమీపంలో ఒక పెద్ద రాయి ఉంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఈ రాయి యొక్క విశిష్టత మరియు ప్రత్యేకత ఏమిటంటే, ఈ రాయిని మీరు కదిలిస్తే కదలదు. కానీ మీ చేతిలో చిన్న పిల్లలు కదిలిస్తే సులభంగా కదులుతుంది.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

వాతావరణం

ప్రధానంగా, హిమాచల ప్రదేశ్ లో సంవత్సరం లో మూడు కాలాలు కలవు. అవి వసంత కాలం, శీతాకాలం మరియు వర్షాకాలం . వసంత కాలం ఫిబ్రవరి లో మొదలై ఏప్రిల్ మధ్య భాగం వరకూ వుంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై, మార్చ్ చివర వరకూ వుండి సరైన పర్యటనకు అవకాశం కల్పిస్తుంది.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

హిమాచల్ ప్రదేశ్ లో పర్యటన

హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలలోని ప్రతి జిల్లాలోను అనేక ఆకర్షణా ప్రాంతాలు కలవు. సైట్ సీఇంగ్, మతపర ప్రదేశాలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ జిల్లాలను నాలుగు సర్కిల్స్ గా విభజించినది.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

అవి సట్లేజ్ , బియాస్ , దౌలాధస్ర్ మరియు ట్రైబల్ సర్కిల్స్. బియాస్ నది ప్రఖ్యాత మనాలి, కులు వాలీ ల గుండా ప్రవహిస్తుంది. ఈ సర్కిల్ పర్యాటకులకు దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన్ పొలాలు, పర్వత వాలులు, పచ్చటి మైదానాలు , పూవుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి చూపుతుంది.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

గిరిజనుల వలయ ప్రదేశాలలో, మంచు కొండలు, మంచుతో గడ్డకట్టిన సరస్సులు, కనుమలు, అందమైన ఆరామాలు, లామాలు, జడల బర్రెలు కనపడతాయి. గొప్ప సాంప్రదాయక విలువలతో కూడిన ఈ ప్రదేశం అతి గొప్ప సాహస క్రీడలకు ప్రసిద్ధి. హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది. ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు. జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చి లు కూడా రాష్ట్రం లోని వివిధ భాగాల లో కలవు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

పవొంతా సాహిబ్, రేవల్సార్ మరియు మనికారాన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలు. క్రిస్ట్ చర్చి కసౌలి, క్రిస్ట్ చర్చి సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చి వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చి లు. ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక సంక్చురి , పాంగ్ డం సంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాల లో రాచరిక వైభవం చూడవచ్చు. పురాతన రాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియం లు మరియు గేలరీ లు కూడా కలవు.

PC:youtube

పిల్లలు పుట్టే భాగ్యం

పిల్లలు పుట్టే భాగ్యం

వాటిలో స్టేట్ మ్యూజియం, కాంగ్రా ఆర్ట్ గేలరీ, భూరి సింగ్ మ్యూజియం, రోరిచ్ ఆర్ట్ గేలరీ మరియు శోభా సింగ్ ఆర్ట్ గేలరీ లు ప్రధానమైనవి. ప్రశాంతం గా సమయం గడపాలనుకునే వారికి అందమైన అనేక సరస్సులు కలవు. వాటిలో ప్రశార్ లేక్, ఖజ్జాయర్ లేక్, రేణుక లేక్, గోవింద్ సాగర్ లేక్, దళ్ లేక్, పాంగ్ డాం లేక్, పండో లేక్, మని మహేష్ లేక్ మరియు బ్రిఘు లేక్ వంటివి కొన్ని.

PC:youtube