Search
  • Follow NativePlanet
Share
» »మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ : ఒక రాయల్ టూర్ !

మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ : ఒక రాయల్ టూర్ !

By Mohammad

రాజస్థాన్ లో జైపూర్ తర్వాత అంతటి పేరుగాంచిన రెండవ నగరం జోధ్పూర్. ఇది థార్ ఎడారి భూభాగంలో ఉన్నది. నగరానికి ఉన్న రెండు ప్రత్యేకతల కారణంగా రెండు ముద్దు పేర్లు ఉన్నాయి. 'సన్ సిటీ' మరియు 'బ్లూ సిటీ' అని. నగరం ఉన్నది ఎడారి ప్రాంతం కనుక ఎండ ఎక్కువగా ఉంటుంది కనుక 'సన్ సిటీ' గా పిలుస్తారు. అలాగే మెహ్రాన్ ఘర్ కోట చుట్టూ ఉండే నీలిరంగు ఇళ్ల వల్ల 'బ్లూ సిటీ' గా పిలుస్తారు.

జోధ్పూర్ ఆకర్షణలలో మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ సింహభాగాన్ని కలిగి ఉన్నది. ఇక్కడి వచ్చే యాత్రికులు మెహ్రాన్ ఘర్ కోట చూసిన తర్వాతనే ఇతర ఆకర్షణలను చూస్తుంటారు. జోధ్పూర్ లోని 150 మీటర్ల ఎత్తున ఉన్న పెద్దకొండ పై మెహ్రాన్ ఘర్ కోట నెలకొని ఉన్నది. ఈ అద్భుత కోట ను రాజపుత్రుల వంశానికి చెందిన జోధ్పూర్ మహారాజు రావ్ జోధా క్రీ.శ. 1459 లో నిర్మించాడు.

మెహ్రాన్ ఘర్ కోటను రోడ్డు మార్గం ద్వారా జోధ్పూర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ కోటలోకి వెళ్ళటానికి 7 ద్వారాలు వున్నాయి. వాటిలో రెండో ద్వారంలో యుద్ధాలలో ఫిరంగులకు దెబ్బతిన్న గోడల మీద మచ్చలను గమనించవచ్చు.

చత్రి

చత్రి

మెహ్రాన్ ఘర్ కోటను అంబర్ సేనల నుంచి రక్షిస్తూ నేలకొరిగిన కిరాత్ సింగ్ సోడా అనే యోధుని చత్రి ఇక్కడ వుంది. చాత్రి అంటే రాజపుత్రుల గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిర్మించే గోపురం లాంటి ఆవరణ.

చిత్ర కృప : Manfred Sommer

మ్యూజియం

మ్యూజియం

ఈ కోటలోని ఒక భాగం రాచరిక పల్లకీల భారీ సేకరణతో ఒక మ్యూజియంగా మార్చబడింది. 14 ప్రదర్శన గదులు కలిగిన ఈ మ్యూజియం ఆయుధాలతో, ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించబడి ఉంది.

చిత్ర కృప : xinoda

శ్రింగర్ చౌకీ

శ్రింగర్ చౌకీ

పర్యాటకులు జోధ్పూర్ రాచరిక సింహాసనం ‘శ్రింగర్ చౌకీ' ని చూడవచ్చు. రాజుగారి ఐదుగురు రాణులూ సభా కార్యకలాపాలు వినడానికి ఉపయోగించే రహస్య బల్కనీలకు దారి తీసే ఐదు అరలు ఉన్నాయి.

చిత్ర కృప : Ansgar Schuffenhauer

ఫూల్ మహల్

ఫూల్ మహల్

ఫూల్ మహల్, మేహ్రంగర్ కోట ప్రాచీన గదులలో ఒకటి. ఈ భవనాన్ని రాజులు వ్యక్తిగత పనులకు ఉపయోగించేవారు. దీనిని 'పాలెస్ ఆఫ్ ఫ్లవర్స్' అని కూడా పిలుస్తారు, దీని పైకప్పు బంగారపు జరీకుట్టు పనితనంతో గొప్పగా ఉంటుంది.

చిత్ర కృప : Daniel Mennerich

శీశ మహల్

శీశ మహల్

శీశ మహల్ అందమైన అద్దాలతో అలంకరించబడి ఉంది. పర్యాటకులు ఈ భవనంలో కళ ఉట్టిపడే దేవతల చిత్రాలను ప్రదర్శించే అద్దాల పనితనాన్ని చూడవచ్చు. దీనిని ‘హాల్ ఆఫ్ మిర్రర్' అనికూడా అంటారు.

చిత్ర కృప : Jon Connell

తాఖత్ విలా

తాఖత్ విలా

తాఖత్ సింగ్ నిర్మించిన తాఖత్ విలా ని మెహ్రాన్ ఘర్ కోటలో చూడవచ్చు. ఇతను జోధ్పూర్ చివరి పాలకుడు. ఈ విలా నిర్మాణ శైలి సాంప్రదాయ, ఆధునిక శైలి రెంటినీ ప్రదర్శిస్తుంది.

చిత్ర కృప : lot on the road

ఝాన్కి మహల్

ఝాన్కి మహల్

ఝాన్కి మహల్ అందమైన భవనం, ఈ భవనాన్ని రాచరిక స్త్రీలు ఆస్థానంలో జరిగే రాచకార్యాలను పరిశీలించడానికి ఉపయోగించేవారు. ఈ భవనం ప్రస్తుతం రాచరిక ఉయ్యాలల భారీ సేకరణ ప్రదేశం. ఈ ఉయ్యాలలు నకిలీ అద్దాలతో, పక్షుల బొమ్మలతో, ఏనుగులతో, అందమైన బొమ్మలతో అలంకరించబడి ఉంటాయి.

చిత్ర కృప : FabIndia

జశ్వంత్ తడా

జశ్వంత్ తడా

జస్వంత్ తడా, మెహ్రాన్ ఘర్ కోట ఎడమ భాగాన ఉన్నది. ఇది జోధ్ పూర్ పాలకుడైన జశ్వంత్ సింగ్ మహారాజు పాలరాతి సమాధి. ఈ స్మారక చిహ్నాన్ని క్రీ. శ. 19 వ శతాబ్దంలో అతని కుమారుడు సర్దార్ సింగ్ నిర్మించాడు. ప్రధాన స్మారకం ఆలయం ఆకారంలో నిర్మించాడు. అందమైన పాలరాతి చెక్కుళ్ల వలన దీనిని మార్వార్ తాజ్ మహల్ అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : Daniel Mennerich

చోకే లవ్ బాగ్

చోకే లవ్ బాగ్

చోకేలావ్ బాగ్ ను అభయ్ సింగ్ మహారాజు మేహ్రంగర్ కోట ప్రాంగణంలో నిర్మించాడు. ఈ తోటలో అందమైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఉండటం వల్ల పర్యాటకులు విశ్రాంతి తీసుకోవచ్చు.

చిత్ర కృప : Charles Jettner

మెహ్రాన్ ఘర్ కోట ఎలా చేరుకోవాలి ?

మెహ్రాన్ ఘర్ కోట ఎలా చేరుకోవాలి ?

జోధ్పూర్ లోని రైక బాగ్ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో మెహ్రాన్ ఘర్ కోట ఉన్నది. స్టేషన్ బయట ఆటో రిక్షా లు లేదా క్యాబ్ ఎక్కి కోట కు సులభంగా చేరుకోవచ్చు. జోధ్పూర్ చేరుకోవటం ఎలా ?

కోట సందర్శన సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

చిత్ర కృప : Akshay Marathe

కోట సందర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసినవి

కోట సందర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసినవి

కోట లోకి కెమరాలు అనుమతిస్తారు

ప్రవేశ టికెట్ ఉంటుంది. కెమెరా లోని తీసుకువెళ్తే అదనపు ధర చెల్లించాలి.

పర్యాటకులను కొండ పై కి తీసుకెళ్లేందుకు ఎలివేటర్ సౌకర్యం కలదు. నామమాత్ర రుసుము చెల్లిస్తే సరిపోతుంది.

ఆడియో టూర్ సౌకర్యం

చిత్ర కృప : Manfred Sommer

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X