Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులో తప్పక చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్

తమిళనాడులో తప్పక చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్

భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం.కానీ పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందుటుంది. తమిళనాడు రాష్ట్రం దేవాలయాలకు పుట్టినిల్లు. అలా వెంటనే గుర్తొచ్చే దేవాలయాల్లో మధురైలోని మీనాక్షి దేవాలయం, చిదంబారంలోని నటరాజస్వా మి దేవాలయం, కంచిలోని కామాక్షి దేవాలయం.

పర్యాటక ప్రదేశాలకు ఆయువుపట్టు. సహజసిద్దమైన అందాలకు, ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు. దేవాలయాలు కళాత్మక సౌరభాలు, గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం తమిళనాడు సొంతం. ఈ దక్షినాది రాష్ట్రానికి దేశంలోని అనేక ప్రాంతాల నుండే కాక, విదేశాల నుండి నుండి కూడా పర్యటనకు వస్తారు.

ఇక్కడ అనేక దేవాలయాలతో పాటు బీచ్ లు, ఇతర సహజ మరియు పర్యాటక ఆకర్షణలెన్నో ఉన్నాయి. కన్యాకుమారి, కుంబకోణం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వ రం, మీనాక్షి, స్వర్ణ దేవాలయం.. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

ఈ ప్రదేశాలను చూడటానికి ఒంటరిగా లేదా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లేదా జంటగా ఎలా ప్రయానించినా వివిధ అభిరుచులు కలవారికి అవసరాలకు తగినట్లు సందర్శించడానికి మంచి ప్రదేశాలు కలవు. మరి ఆ ప్రదేశాలు తమిళనాడులో ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

శ్రీపురం :

శ్రీపురం :

ఇటీవలే నిర్మింపబడిన స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గర్లో మలైకుడి సమీపంలో కొండల దిగువున సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్‌ టన్నుల సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది.

Photo Courtesy: Dsudhakar555

తంజావూరు:

తంజావూరు:

తంజావూరు 18 వ శతాబ్దం చివరలో దేశంలోని సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు పర్యటనకు వస్తారు. అత్యంత ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినది తంజా వూరు బృహదీశ్వర ఆలయం.ఈ ఆలయంలో శివుడు హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడి పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంను రాజ రాజ చోళ-I, మధ్యయుగ చోళ రాజు 11 వ శతాబ్దం ADలో నిర్మించారు. 1987 వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

Photo Courtesy: Narasimman Jayaraman

కుంబకోణం

కుంబకోణం

ఈ నగరాన్ని ‘సిటీ అఫ్‌ టెంపుల్స్‌' గా పిలుస్తుంటారు. ఇక్కడ 188 ఆలయాలు ఉన్నాయి. చుట్టు పక్కల మరో వంద ఆలయాల వరకూ ఉంటాయి. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్‌ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్‌ టౌన్ లో ‘మహామాహం' ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు. కావేరి, అరసలర్‌ నదుల మధ్య ఏర్పడింది కుంభకోణం.

PC: Ryan

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం తమిళనాడు లో ఒక మంచి పర్యాటక ప్రదేశం.

హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది రామేశ్వరం. రామేశ్వరాన్ని విష్ణుమూర్తి ఏడవ అవతారం భావిస్తారు. రావణాసురుడి చర నుండి సీతాదేవిని కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి ఇక్కడ నుంచే రాముడు వంతెనను నిర్మించాడట. అందువల్లే రామేశ్వరానికి ఆపేరు. ఈ ప్రాంతంలో సుమారు 64 తీర్దాలు ఉండగా వీటిలో 24 ప్రాముఖ్యత గలవని, ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హిందూ పురాణాల మేరకు రామేశ్వరంలో శ్రీ రాముడు తన పాప ప్రక్షాలనకై స్నానాలు చేసాడు. అంతేకాదు ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం కూడాను.ఇక్కడ కల శ్రీ రామనాథస్వామి టెంపుల్, పంబన్ బ్రిజ్ మరియు ధనుష్కోడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

PC: Ryan

తూతుకుడి:

తూతుకుడి:

ఈ ఆలయం తిరుచెందూర్‌ తూతుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ అందమైన దేవాలయాలు, తిరుచెందూర్‌ శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం, వల్లి గుహ, దత్తాత్రేయ గుహ కలవు. సుబ్రహ్మణ్య స్వామి కి అంకితమివ్వబడిన తిరుచెండుర్ ఆలయానికి ఈ నగరం ప్రసిద్ది చెందింది. సముద్ర ప్రేమికులకు తూథుకుడి అనువైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ఇక్కడ ఉన్న నౌకాశ్రయం. పార్కులకు ప్రసిద్ది చెందిన ఆ పట్టణంలో హార్బర్ పార్క్, రాజాజీ పార్క్ అలాగే రోచ్ పార్క్ లు ప్రసిద్ది చెందినవి.

PC- Ssriram mt

కన్యాకుమారి

కన్యాకుమారి

అద్భుత సూర్యోదయాలు, ఆకాశం రంగులు మారటాలు చూడాలనుకుంటున్నారా ? కన్యాకుమారి తప్పక సందర్శించండి. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ది చెందినది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.

Photo Courtesy: ritesh3

కాంచీపురం 

కాంచీపురం 

ప్రతి హిందువు వారి జీవిత కాలం లో ఒక్కసారైనా సందర్శించవలసిన ఏడు పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. కాంచీపురం హిందువులు పూజించే ప్రదేశం. హిందూ మత పురాణాల ప్రకారం, ఏడు పవిత్ర ప్రదేశాలలో అన్నిటిని సందర్శించటం ద్వారా 'మోక్షం' లేదా ముక్తి ని సాధించవచ్చు. ఈ నగరం విష్ణువు మరియు శివ భక్తులకు పవిత్ర ప్రదేశం. కాంచీపురం నగరంలో శివుడు మరియు విష్ణువుకు అంకితం చేసిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అత్యంత ప్రముఖమైన వాటిని 'పంచభూత స్థలములు' అంటారు. శివుడు ప్రాతినిధ్యం వహించే ఐదు ఆలయాల్లో ఒకటి. ఇంకా విష్ణువు కి అంకితం చేసిన ఎకాంబరనాథ ఆలయం మరియు వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉన్నాయి. కాంచీపురం పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా పేరు మరియు ప్రసంశలు పొందింది.

PC: Nithi Anand

మహాబలిపురం 

మహాబలిపురం 

మహాబలిపురంను నేడు అధికారికంగా మామల్లాపురం అని పిలబడుతున్నది. ఇది తమిళ్ నాడులోని కాంచీపురం జిల్లాలో కలదు. ఇప్పటి మహాబలిపురాన్ని మహాబలి అనే ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆయను భగవంతుడైన శ్రీ మహావిష్ణువు వధించడం వల్ల ఈ పట్టణానికి ఆయన పేరుతో మహాబలివూరు లేదా మహాబలిపురం అనేపేరు వచ్చింది. మహాబలిపురం 7 వ శతాబ్దంలో ఖ్యాతి గాంచిన పల్లవ రాజుల పాలనలో కలదు.ఆకర్షణలు కొండరాతి గుహలు, ఇసుక బీచ్, సరివి చెట్లు, దేవాలయాలకు ప్రసిద్ది. చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం, అయిదు రధాలు, వరాహ మండపం సముద్ర తీర ఆలయాలు ఎన్నో మనస్సును హత్తుకుంటాయి.

PC-Sanjay Godbole

చిదంబరం 

చిదంబరం 

చిదంబరం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉన్న ఒక ఆలయ పట్టణం. పురాతన ద్రావిడ నిర్మాణం.గంభీరమైన గోపురములతో అధివాస్తవిక సెట్టింగ్ లకు ప్రసిద్ధి చెందింది.

పట్టణంలో ప్రసిద్ధ గంభీరమైన చిదంబర నటరాజ ఆలయం ఉంటుంది. ఆలయంలో ప్రధానంగా శివునికి పూజలు చేస్తారు.ఈ ఆలయం తమిళనాడులో విస్తరించిన 5 పంచభూత శివాలయాలలో ఒకటి. ఈ 5 అంశాలు ప్రతి ఒక్కదానితోను ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. గాలికి సంబంధించి కాళహస్తి నాథర్ ఆలయం, అగ్నికి సంబంధించి తిరువన్నమలై అరుణాచలేశ్వర ఆలయం,భూమికి సంబంధించి కంచి ఏకాంబరేశ్వర ఆలయం,నీటికి సంబంధించి తిరువనైకవల్ జంబుకేశ్వర ఆలయం ఇతర ఆలయాలుగా ఉన్నాయి. ఈ ఆలయంలో శివున్ని "నటరాజ" నృత్య రూపంలో పూజించే ఏకైక శివాలయం అని చెప్పవచ్చు. సాదారణంగా ప్రతి శివాలయంలో శివున్ని "శివలింగ" రూపంలో పూజించటం గమనించవచ్చు. పరమశివుడు మహావిష్ణు ఇద్దరిని పక్కపక్కనే పూజలు చేసే ప్రధాన ఆలయం ఇక్కడ మాత్రమే ఉంటుంది.

PC: Raghavendran

మధురై 

మధురై 

మదురై, దక్షిణ భారతం, తమిళనాడులో రెండవ పెద్ద నగరం. ఈ ఆలయ నగరం వైగై నది ఒడ్డున ఉంది. ఈ నగరానికి ఉత్తర దిక్కున సిరుమలై హిల్స్ మరియు దక్షిణాన నాగమలై హిల్స్ ఉన్నాయి.తమిళనాడులో మదురై ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక ఇంకనూ అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి.

PC: Jorge Royan

కుట్రాలం 

కుట్రాలం 

కుర్తాలం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో సుమారు 167మీటర్ల ఎత్తులో కల కుర్తాలం అక్కడ కల ఒక చికిత్సాలయ కారణంగానే ప్రసిద్ధి చెందినది. కుర్తాల్లంలో అనేక ఆరోగ్య కేంద్రాలు, చికిత్సాలయాలు, ఔషధ గుణాల నీరు ప్రవహించే జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ కల అనేక జలపాతాలు మరియు నదులు ఈ ప్రదేశ అందాలను మరింత పెంచి దీనిని ఒక పర్యాటక ఆకర్షణ ప్రదేశంగా చేసాయి.

Photo Courtesy: Sankara Subramanian

హుగెనక్కళ్ ఫాల్స్ — 

హుగెనక్కళ్ ఫాల్స్ — 

ఇది దేశీయ మరియు విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధ వారాంతపు పర్యాటక ప్రదేశంగా ఉంది. కావేరినది గలగలలు, నదిలో పట్టుకున్న చేపలు, స్థానిక మూలికలు, ప్రత్యేక నూనెలు మరియు మర్దన పింట్లు యొక్క పురాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మర్దనలు, ఇవి అన్నీ హోగేనక్కల్ సందర్శించి అనుభవించవలసిందే!

ఎవరైతే సాహసాలను ఇష్టపడతారో, ఈ జలపాతాలలో ఈత కొట్ట వలసిందే!మేలగిరి హిల్స్ గుండా ట్రెక్కింగ్ చేస్తూ, స్వచ్చమైన అడవి గాలిని ఆస్వాదిస్తూ, ఈ ప్రదేశంలో ఉన్న అద్భుతమైన ఆకుపచ్చని ప్రక్రుతి దృశ్యాలను మరియు అందాలను చూడవొచ్చు. సినిమాలు తీసేవాళ్ళు 'హోగేనక్కల్' ను రొమాంటిక్ పాటలు తీయటానికి ఎన్నుకుంటారు.

Photo Courtesy: Mithun Kundu

ఊటీ 

ఊటీ 

ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఈ పట్టణ అధికారిక పేరు ఉదకమండలం,

ఊటీ పట్టణం చుట్టూ ఉన్న నీలగిరి కొండలు దీని అద్భుతమైన అందానికి నిదర్శనం. ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ లోయలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కురుంజి పూలు పూస్తాయి. ఈ పేరుకు మూలం ఇవేనని కొంతమంది ప్రజల నమ్మకం. ఈ పూలు నీలం రంగులో ఉంటాయి, అవి పుష్పించినపుడు ఈ పర్వతాలు నీలం ర౦గులో కనిపిస్తాయి.బొటనికల్ గార్డెన్ లు , దోడబెట్ట శిఖరం, ఊటీ సరస్సు, కల్హట్టి జలపాతం, ఫ్లవర్ షో మొదలైన కొన్ని ప్రదేశాల వల్ల ఊటీ ప్రపంచం మొత్తం మీద పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందింది.

కొడైకెనాల్ 

కొడైకెనాల్ 

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది.సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడు లోని ది౦డుగల్ జిల్లలో ఉంది.ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.కోకర్స్ వాక్, బేర్ షోల జలపాతాలు, బ్ర్యాంట్ పార్కు, కొడైకెనాల్ సరస్సు, గ్రీన్ వ్యాలీ వ్యూ, సహజ చరిత్ర కలిగిన శేమ్బగానుర్ మ్యూజియం, కొడైకెనాల్ సైన్స్ అబ్జర్వేటరీ, పిల్లర్ రాక్స్, గుణ కేవ్స్, సిల్వర్ కాస్కేడ్, డాల్ఫిన్స్ నోస్, కురింజి అండవార్ మురుగన్ ఆలయం, బెరిజం లేక్ వంటివి కొడైకెనాల్ లోను, చుట్టుపక్కల ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు.

Photo Courtesy: Ramkumar

మదుమలై 

మదుమలై 

మూడు రాష్ట్రాలు కలిసే చోట (కర్నాటక, తమిళనాడు, కేరళ) దట్టమైన నీలగిరి అడవుల్లో వున్న ముదుమలై వన్యప్రాణి అభయారణ్యానికి ప్రసిద్ది చెందింది. దక్షిణ భారత దేశంలోనే పెద్దదిగా పేరుపడ్డ ఈ అభయారణ్యం అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ది చెంది౦ది.ముదుమలై అభయారణ్యంలో అటవీశాఖ వారు నిర్వహించే జంగిల్ సఫారీలు నిజంగా చూడతగ్గవి.పక్షి ప్రేమికులకు ఇక్కడ రెండు వందలకు పైగా జాతులను చూసే అవకాశం వుంది. జంతు జాతుల్లో మానిటర్ బల్లులు, హయనాలు, తోడేళ్ళు, జింకలు, చిరుతపులులు, దుప్పులు ఇక్కడి పచ్చని, ప్రశాంత వాతావరణంలో సహజీవనం చేస్తూ వుంటాయి. భారత దేశంలోని అత్యధిక పులుల సాంద్రత కలిగిన ఒక పులి అభయారణ్యం కూడా ఇక్కడ వుంది. పైగా, ఈ అభయారణ్యంలో ఏడు వందలకు పైగా ఏనుగులు స్వేచ్చగా తిరుగుతూ వుంటాయి. ఎన్నో అంతరించిపోతున్న జాతుల (వృక్ష, పశు, పక్షి) ఆలవాలమైన ఈ అభయారణ్యం దేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది.

Photo Courtesy: Vinoth Chandar

 తిరువన్నామలై 

తిరువన్నామలై 

పర్యాటకులకు చాల ప్రసిద్ది చెందింది.తిరువన్నమలై పంచ భూత క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు చిదంబరం, శ్రీ కాళహస్తి, తిరువనైకోవిల్ మరియు కంచిలలో వరుసగా ఆకాశము, గాలి, నీరు మరియు భూమిని సూచిస్తాయి. ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు.

ఎలగిరి 

ఎలగిరి 

తమిళనాడు లోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం, పర్యాటకుల స్వర్గధామ౦.ఏలగిరి రాగానే ఎవరికైనా కనిపించేది ఇక్కడి నిశ్శబ్ద, ప్రశాంత పరిసరాలు, ఈ ప్రాంతంలో వుండే అందం. ఇక్కడి తాజా పళ్ళ ఘుమఘుమలు, రాలిన ఆకులతో ఈ ప్రాంతం నిండిపోతుంది - ఎందుకంటే ఇక్కడ పళ్ళ తోటలు, గులాబి తోటలు, పచ్చటి లోయలు వున్నాయి. ఈ మైదానాల గుండా ప్రయాణించడం చాలా బాగుంటుంది. ఎలగిరిలోని వేలవన్ దేవాలయ౦, స్వామిమలై కొండ లాంటి పర్వత ప్రాంతాలు, పర్వతారోహణ లాంటి ఇతర సందర్శనీయ స్థలాలు కూడా ఇక్కడ వున్నాయి. ఇక్కడి సహజమైన పార్కులు, ప్రభుత్వ మూలికా, పండ్ల తోటలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.

వలపరై 

వలపరై 

వలపరై హిల్ స్టేషన్ . తమిళనాడులో ఉన్న అనేక అందమైన పర్వతాలలో ఒకటి. వల్పరై కోయంబత్తూరు జిల్లాలో ఉన్న అన్నామలైలో పర్వత శ్రేణి యొక్క భాగంగా ఉంది.

చిన్నకలర్ ఫాల్స్ నుంచి వల్పరై కి వెళ్ళుతూ ఉంటె చుట్టూ ప్రక్కల చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నవి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాలాజీ దేవాలయం ఉంది. అంతే కాకుండా నిరర్ ఆనకట్ట, గణపతి ఆలయం మరియు అన్నై వేలన్కాన్ని చర్చి ,శోలయర్ ఆనకట్ట, పచ్చగడ్డి కొండలు మరియు వ్యూ పాయింట్లు యొక్క అత్యద్భుతమైన అందాన్ని వల్పరై పర్యటనలో భాగంగా చూడవచ్చు.

PC-Thangaraj Kumaravel

వేదంతంగళ్ 

వేదంతంగళ్ 

వేదంతంగల్, తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న కుగ్రామం మరియు ఇది ఒక పక్షుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వేదంతంగల్ పక్షుల కేంద్రం. దేశం యొక్క పురాతన పక్షుల కేంద్రాలలో ఒకటిగా ప్రత్యేకతను కలిగి ఉంది.వేదంతంగల్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చిత్రవిచిత్రమైన చిన్న సరస్సులతో వివిధ రకాల వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. వేదంతగల్ బ్రిటిష్ పాలనలో బర్డ్ సాన్క్చ్యుయరీగా మారింది.

Photo Courtesy: Shannon Dosemagen

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more