» »'పాపం పసివాడు' గుర్తుందా ?

'పాపం పసివాడు' గుర్తుందా ?

Written By: Venkatakarunasri

పాపం పసివాడు సినిమా గుర్తుందా ..? చిరంజీవి నటించినది కాదు అది పసివాడి ప్రాణం. అమ్మా ... చూడాలి .. నిన్నూ నాన్ననూ చూడాలి అనే పాట అందరికీ గుర్తుందా ? (పాత కాలంలో రేడియో వింటే కదా ..!) ఆ పాట ఆ సినిమా లోనిదే. ఆ సినిమాలో దాదాపు అడవి సన్నివేశాలన్నీ కేరళ , తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ముదుమలై అడవుల్లో చిత్రీకరించారు. ఇప్పుడు మనం ఆ ప్రాంతం గురించే చెప్పుకోబోతున్నాం ..!

ముదుమలై అడవులు కేరళ, తమిళనాడు మరియు కర్నాటక రాష్ట్రాలు కలిసే చోటు దట్టమైన నీలగిరి అడవుల్లో ఉన్నది. దక్షిణ భారత దేశంలోనే పెద్దదిగా ముద్రపడ్డ ఈ అభయారణ్యం ప్రపంచంలోనే పేరెన్నిక కలది. దేశంలో తరిగిపోతున్న విస్తారమైన వృక్ష సంపద, జంతుసంపద ను సంరక్షించటానికి క్రీ.శ. 1940 వ సంవత్సరంలో ముదుమలై ఏర్పాటుచేశారు.

అభయారణ్యంలో చూడవలసినవి

ముదుమలై అభయారణ్యంలో అటవీశాఖ వారు నిర్వహించే జంగిల్ సఫారీలు నిజంగా చూడదగినవి. పక్షి ప్రేమికులకు ఇక్కడ వెరైటీ రకాల జాతులకు చెందిన పక్షులు చూడవచ్చు. జంతు జాతుల్లో మానిటర్ బల్లులు, హయనాలు, తోడేళ్ళు, జింకలు, చిరుతపులులు, పులుల తో పాటుగా అంతరించిపోతున్న వృక్షాలు గమనించవచ్చు. ఏడు వందల పై చిలుకు ఏనుగులకు ఈ అభయారణ్యం స్థావరంగా ఉన్నది. అందుకే కాబోలు .. ముదుమలై అభయారణ్యం ప్రకృతి అందాల కలగూరగంప గా పేరుగాంచినది.

తెప్పకడు ఏనుగుల శిబిరం

తెప్పకడు ఏనుగుల శిబిరం

తెప్పకడు ఏనుగుల శిబిరం లో ప్రస్తుతం 25 పై చిలుకు ఏనుగులు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఏనుగుల జంట అక్కడి వినాయకుడికి పూజలు చేస్తాయి. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ఏనుగుల రైడ్ జరుగుతాయి.

చిత్ర కృప : Dietmut Teijgeman-Hansen

తెప్పకడు ఏనుగుల శిబిరం

తెప్పకడు ఏనుగుల శిబిరం

సాయంత్రం ఏనుగులు మేత కు వెళ్లే సమయం, పర్యాటకులు చూడదగినది. ప్రవేశ రుసుం 20 రూపాయలు మరియు సందర్శించు సమయం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

చిత్ర కృప : Domesticated Onion

పైకారా సరస్సు

పైకారా సరస్సు

పైకారా సరస్సు వద్ద ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ సరస్సు ముదుమలై నేషనల్ పార్క్ కు 30 కి.మీ.ల దూరంలో వుంటుంది. నీలగిరి జిల్లాలో ఇది అతి పెద్ద సరస్సు. పైకారా లేక్ సమీపం లో కల విశాలమైన వెన్ లాక్ డౌన్స్ మైదాన ప్రదేశం స్థానికులకు, టూరిస్టులకు ఒక పిక్నిక్ ప్రదేశం. ఇక్కడే ఒక రెస్టారెంట్ కూడా కలదు.

చిత్ర కృప : Rupak Sarkar

పైకారా సరస్సు లో బోట్ విహారం

పైకారా సరస్సు లో బోట్ విహారం

పైకారా సరస్సు లో బోటు విహారం అందుబాటులో ఉన్నది. మెయిన్ రోడ్ పై కల బ్రిడ్జ్ నుండి మీరు చక్కని ఫోటోలు తీయవచ్చు. ఈ ప్రదేశం ఉదయం 8.30 గం. నుండి సా. 5 గం వరకు పర్యాటకులకు తెరచి వుంటుంది. బోటు విహార ప్రవేశ రుసుము రూ.550 మాత్రమే. సరస్సు ప్రేవేశానికి ఎంట్రీ ఫీసు లేదు.

చిత్ర కృప : Rupak Sarkar

మోయర్ నది

మోయర్ నది

మోయర్ నది ముదుమలై అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది. ఈ నది వద్దకు అడవి జంతువులు వచ్చి తమ దాహార్తి తీర్చుకుంటుంటాయి. వీటిని చూడటానికి ఇదే సరైన స్థలం. మీ వద్ద కెమరా ఉన్నట్లయితే ఫోటోలు తీసి ఆనందించండి.

చిత్ర కృప : Dietmut Teijgeman-Hansen

జంతువులను గమనించే మరికొన్ని ప్రదేశాలు

జంతువులను గమనించే మరికొన్ని ప్రదేశాలు

పైకారా సరస్సు సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వంతెన అనేక రకాల పక్షులు, జంతువులూ కనిపించే గొప్ప ప్రదేశం. కల్లట్టీ జలపాతం, మోయర్ నది వద్ద అనేక జంతువులు దాహం తీర్చుకోవడానికి రావడం చూడవచ్చు, అందువల్ల ఈ ప్రదేశం కూడా జంతువులను తిలకించాలని మరో మంచి ప్రదేశం.

చిత్ర కృప : Moorthy Gounder

జంతువులను గమనించే మరికొన్ని ప్రదేశాలు

జంతువులను గమనించే మరికొన్ని ప్రదేశాలు

తమిళనాడు ప్రభుత్వం వారు అందించే బోట్ రైడింగ్, అడవి సఫారి లతో వృక్ష, జంతు జాలాలను వీక్షించవచ్చు. ఎవరైనా ఊటీ నుండి ముదుమలై అభయారణ్యానికి వెళ్ళేటట్లైతే, అడవులతో కూడిన కొండలు, జలపాతాల మార్గంలో ముప్పైఆరు మలుపులు ఉంటాయి. ఈ మలుపుల వద్ద కూడా వృక్ష, జంతు జాలాలను చూడవచ్చు.

చిత్ర కృప : luerna

మ్యూజియం

మ్యూజియం

ముదుమలై కు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇక్కడి మ్యూజియంలో ప్రదర్శించబడుతుంటాయి. అడవులలో నివసిస్తున్న గిరిజన తెగల సంస్కృతి - సాంప్రదాయాలు ఇక్కడ గమనించవచ్చు.

చిత్ర కృప : byron aihara

ముదుమలై పరిసరాలు

ముదుమలై పరిసరాలు

ఇక్కడి ప్రకృతి అందాలు, పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు, ముదుమలై లో కుటుంబంతో సహా ఒక్క రోజు పర్యటనలు చేయటానికి ప్రేరేపించే అంశాలు.

చిత్ర కృప : byron aihara

ముదుమలై ఎలా చేరుకోవాలి ?

ముదుమలై ఎలా చేరుకోవాలి ?

ముదుమలై చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

పీలమేడు వద్ద ఉన్న కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ముదుమలై కి సమీప విమానాశ్రయం. ఇది ముదుమలై నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ ల మీదుగా ముదుమలై చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఉదగమండలం/ఊటీ ముదుమలై కి సమీప రైల్వే స్టేషన్. ఇది ముదుమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం స్టేషన్ నుండి ముదుమలై కి టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కూడా సమీపంలో ఉన్న మరొక ప్రధాన రైల్వే స్టేషన్. ఇది ముదుమలై నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గం

ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యానికి సమీపంలో ఉన్న పట్టణం గుడలుర్. ఇది ఉదగమండలం -మైసూర్ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదగమండలం, మైసూర్, సమీప పట్టణాల నుండి ముదుమలై వన్యప్రాణుల అభాయరణ్యానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అనేక మలుపుల వంపులు ఉన్నాయి, అందువల్ల ఈ ప్రాంతానికి డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.

చిత్ర కృప : byron aihara

Please Wait while comments are loading...