Search
  • Follow NativePlanet
Share
» »చాముండేశ్వరి దేవాలయం, మైసూరు !!

చాముండేశ్వరి దేవాలయం, మైసూరు !!

కొండపైన ఉన్న చాముండేశ్వరి దేవాలయం చేరుకోవటానికి మెట్లు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని 18 శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు శివాలయం, అక్కడ ఉన్న అనేక నంది విగ్రహాలను చూడవచ్చు.

By Mohammad

చాముండేశ్వరి దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి : మంత్రముగ్ధులను చేసే బృందావన్ గార్డెన్స్ !

ఈ కొండలు సముద్రమట్టానికి సుమారు 1065 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ఒడయార్ మహారాజులు చాముండేశ్వరిని తమ దేవతగా కొలిచేవారు. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 11 -12 వ శతాబ్దాల మధ్య నిర్మించారు. తర్వాత 1827 సంవత్సరంలో మైసూర్ రాజులు దీనికి కొన్ని మరమ్మత్తులు నిర్వహించారు. దేవాలయం ముందరి భాగంలో మహిషాసుర రాక్షస రాజు విగ్రహం కూడా ఉంటుంది.

టెంపుల్ దర్శనం మరియు పూజా టైమింగ్స్ : 7:30 AM - 2:00 PM, 3:30 PM - 6:00 PM, 7:30 PM- 9:00 PM.

ఇది కూడా చదవండి : అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానం !

గుడి చరిత్ర

గుడి చరిత్ర

ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు.

చిత్రకృప : Deepti deshpande

నంది చిత్రాలు

నంది చిత్రాలు

1659 లో 3000 అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉన్నాయి.

చిత్రకృప : Sriram Jagannathan

శివాలయం

శివాలయం

కొండ మీద 800 వ మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉన్నది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో మరియు 24 అడుగుల పొడవుతో ఉన్నది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి.

చిత్రకృప : Ramesh NG

ముస్లిం పాలకులు సైతం

ముస్లిం పాలకులు సైతం

ఈ ఆలయానికి 1761-82 మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు.

చిత్రకృప : Ramesh NG

సకల ఆభరణాలు

సకల ఆభరణాలు

దసరా ఉత్సవాలు చాముండేశ్వరి ఆలయంలో మరియు దాని చుట్టుప్రక్కల అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు.

చిత్రకృప : Spiros Vathis

ఆనవాయితీ

ఆనవాయితీ

దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని శ్రీకంఠ్‌దత్ నరసింహరాజ ఒడయార్ తన వద్ద ఉంచుకొని, వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

చిత్రకృప : Ranjithsiji

విశేష ఆభరణాలు - ఉత్సవమూర్తి

విశేష ఆభరణాలు - ఉత్సవమూర్తి

ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశం ఉంటుంది.

చిత్రకృప : innacoz

చాముండేశ్వరి పచ్చల హారం బహు ఖరీదు !!

చాముండేశ్వరి పచ్చల హారం బహు ఖరీదు !!

ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. చాముండీ దేవికి పచ్చల హారాన్ని చేయించారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. బెంగుళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిందాన్నిబట్టి - మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు.

చిత్రకృప : Saravana Kumar

ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు

సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది.

చిత్రకృప : Vinodtiwari2608

ముక్క ఖరీదు అప్పట్లోనే 75 లక్షలు

ముక్క ఖరీదు అప్పట్లోనే 75 లక్షలు

దేవికి అలంకరించే ఒక ఆభరణం ‘మాటి'. ఆ ఆభరణం ముక్క అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుట్టలో చేరింది. దాని విలువ అప్పట్లోనే 75 లక్షలు. కోట్ల విలువైన ఆ ఆభరాణాలను అత్యంత భద్రత మధ్య కాపలాకాస్తుంటారు.

చిత్రకృప : Prof tpms

అత్యంత కట్టుదిట్టమైన భద్రత

అత్యంత కట్టుదిట్టమైన భద్రత

ఖజానా నుండి ఆభరణాలను తీసుకురావటం మొదలు వాటిని దేవికి అలంకరించేవరకు ... ఆ ఆభరణాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యవేక్షిస్తుంటారు. పోలీసులు, అర్చకులు, రాజకుటుంబీకులు మరియు ప్రభుత్వ అధికారుల సమక్షంలో పెట్టెను తెరిచి అమ్మావారికి అలంకరిస్తారు.

చిత్రకృప : Sanath Kumar

చాముండి హిల్ పై నుండి దృశ్యం

చాముండి హిల్ పై నుండి దృశ్యం

అమ్మవారికి ఆభరణాలను అలంకరించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరియు దసరా పండగ ముగిసేవరకు ఇదేపద్ధతిని అవలంభిస్తారు. ఆ ఆభరణాల విలువ దేవుడెరుగ... అందులో ఒక్కోరాయి ఖరీదే లక్షలలో ఉంటుందని అంచనా.

చిత్రకృప : Sonamj28

చాముండేశ్వరి దేవాలయం ఎలా చేరుకోవాలి ?

చాముండేశ్వరి దేవాలయం ఎలా చేరుకోవాలి ?

మైసూరు లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఇక్కడికి బెంగళూరు నుండి కూడా రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, మంగళూరు తదితర ప్రాంతాల నుండి మైసూర్ కు పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి.

చిత్రకృప : Prof tpms

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X