• Follow NativePlanet
Share
» »ఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితం,

ఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితం,

Written By: Kishore

పుణ్యక్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే కొడిముద్దను తిని అక్కడే పడుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంటే ఇక్కడి ఒక రోజు రాత్రి  ఈ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే తమ ఇంట్లో చిట్టిపాదాలతో మహాలక్ష్మి లాంటి అమ్మాయి మువ్వల పట్టీలతో తిరుగాడటం తథ్యమని బలంగా విశ్వసిస్తారు. అందువల్లే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సంతానం లేని వారు ఇక్కడకి వస్తుంటారు.

ఇక ఈ ఆలయంలోని అమ్మవారు మొదట స్వయంగా కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. అంతే కాకుడా అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేవారని చెబుతారు. ఆ సమయంలో గ్రామంలోని పశువులన్నింటినీ తినేవారని స్థలపురణ కథనం.

ఇక్కడ అమ్మవారికి జరిగే నవావరణ పూజ ప్రపంచంలో మరే దేవాలయంలోనూ జరగదు. ఈ పూజకు అత్యంత శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అదే విధంగా ఇక్కడి స్వామివారికి జరిగే సహస్రనామ పూజ విధానం కూడా ప్రపంచంలో మరెక్కడా నిర్వహించరు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం

అమెకు అలా స్నానం చేయించారు...సన్యాసులు మాత్రమే ఇక్కడ ఆ పనిచేయాలి

1. స్థల పురణం ప్రకారం

1. స్థల పురణం ప్రకారం

P.C.YouTube

స్థలపురాణం ప్రకారం కశ్యప ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించాలని భావించాడు. తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకినీ నదీ తీరం (దీనిని పెన్నానది అని కూడా అంటారు) వద్దకు చేరుకొన్నాడు.

2. యాగానికి అనుకూలం

2. యాగానికి అనుకూలం

P.C.YouTube

యాగానికి ఈ ప్రాంంతం అనుకూలమైనది భావించి తూర్పు, నైరుతి, వాయవ్యాల్లో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు.

4. వేదగిరి నరసింహుడు

4. వేదగిరి నరసింహుడు

P.C.YouTube

నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి.

5. లింగాకారంలో

5. లింగాకారంలో

P.C.YouTube

ఇక వాయువ్యాన ఉన్న యాగకుండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు. ఈ యగవాటికను రజతగిరి అని పిలిచే వారు అదే కాలక్రమేణ జన్నవాడ, జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది.

6. పార్వతి కంగారుపడి

6. పార్వతి కంగారుపడి

P.C.YouTube

ఇక కైలాసంలో శివుడు కనబడక పోవడంతో పార్వతి కంగారు పడింది. తన మనో నేత్రంతో జరిగినది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడకు వచ్చి కొలువై ఉంది.

7. మనుమసిద్ధి రాజులు కాలంలో

7. మనుమసిద్ధి రాజులు కాలంలో

P.C.YouTube

కాలక్రమంలో పినాకినీ నది వదలతో మునిగిపోయి ఈ ప్రదేశం బీళ్లుగా మారింది. అటు పై మనుమసిద్ధి రాజుల హయాంలో ఈ ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకొందని తెలుస్తుంది.

8. పెనుబల్లి గ్రామంలో

8. పెనుబల్లి గ్రామంలో

P.C.YouTube

ముఖ్యంగా ఈ నదీ తీరంలో ఉన్న పెనుబల్లి గ్రామస్తులకు అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. తమకు గంగమ్మత తల్లి దొరికిందని సంబర పడుతూ దానికి పూజలు చేశారు. అటు పై ఈ విగ్రహాన్ని ప్రస్తుతం మల్లికార్జునుడు ఉన్న దేవాలయంలో ప్రతిష్టించారు.

9.అమ్మవారు మొదట ఉగ్రస్వరూపిణి

9.అమ్మవారు మొదట ఉగ్రస్వరూపిణి

P.C.YouTube

ఇదిలా ఉండగా ఆలయంలో అమ్మవారికి స్థానికులు అప్పట్లో మాంసాహారం నివేదించేవారు. ఈ ఆహారానికి అలవాటుపడ్డ అమ్మవారు రాత్రి సమయాల్లో పశువులను తినేది.

10. దేవాలయలో పడుకొంటాడు

10. దేవాలయలో పడుకొంటాడు

P.C.YouTube

దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులకు ఈ విషయం తెలిసి ఒక రోజు రాత్రి దేవాలయంలో పడుకొంటాడు. అర్థరాత్రి బయటకు వెలుతున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్తించి అమ్మవారిని శాంతింప జేస్తాడు.

11. శ్రీ చక్రాన్ని

11. శ్రీ చక్రాన్ని

P.C.YouTube

అటు పై తన శక్తినంతటినీ ధారపోసి ఒక శ్రీ చక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్టింపజేస్తాడు. అటు పై భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా మారాలని వరం కోరుతాడు. అప్పటి నుంచి అమ్మవారు కామాక్షిగా భక్తులతో నీరాజనం అందుకొంటూ ఉంటోంది.

12. ద్వాపరంలో ఇంద్రుడు

12. ద్వాపరంలో ఇంద్రుడు

P.C.YouTube

ద్వాపర యుగంలో ఇంద్రుడు వ`శపర్వుడనే రాక్షసుడి వల్ల తన పదవిని కోల్పోతాడు. అటు పై నారదుడి సూచనమేరకు ఈ క్షేత్రంలో అమ్మవారిని సందర్శిస్తాడు. ఆమె చల్లని చూపు వల్ల తిరిగి ఇంద్ర పదవిని పొందుతాడు.

13. కుష్టువ్యాధి సోకిన అశ్వత్థామ

13. కుష్టువ్యాధి సోకిన అశ్వత్థామ

P.C.YouTube

కుష్టువ్యాధి సోకిన అశ్వత్థామ ఇక్కడి పెన్నానదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో రోగం నుంచి వివముక్తి పొందాడని చెబుతారు. ఇలా భక్తితో తనను సేవించిన వారి కోర్కెలను అమ్మవారు తప్పక తీరుస్తారని చెబుతారు.

14. ఇక్కడ నిద్రిస్తే

14. ఇక్కడ నిద్రిస్తే

P.C.YouTube

ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ నిద్రిస్తే వెంటనే వారికి పిల్లలు పుడుతారని వేల ఏళ్లుగా నమ్ముతున్నారు. అదే విధంగా ఈ దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే కొడిముద్దలను స్వీకరించడానికి సంతానం లేని వారు బారులు తీరుతుంటారు.

15. కొడిముద్దు

15. కొడిముద్దు

P.C.YouTube

కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఆ సమయంలో బియ్యం, పెసరపప్పు తో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న దేవతలకు నిదేదిస్తారు. దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. దానినే కొడిముద్ద అంటారు.

16. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని

16. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని

P.C.YouTube

ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తులు నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి వివిధ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు.

17. సహస్రనామం కూడా

17. సహస్రనామం కూడా

P.C.YouTube

ఇక్కడి శివుడికి జరిపే సహస్రనామం కూడా మరే దేవాలయంలోనూ జరపరు. సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారముంతా క్రోడికరించి ఈ సమస్రనామాలను ఉపదేశించాడని ప్రతీతి.

18. నాలుగు వేదాలు చదివినంత పుణ్యం

18. నాలుగు వేదాలు చదివినంత పుణ్యం

P.C.YouTube

ఈ సహస్రనామ పూజ వలన నాలుగు వేదములు పారాయణం చేసినంత ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడి అర్చకులకు మాత్రమే ఆ సహస్రనామ విధానం తెలుసు. వీరు ఇతరులకు ఈ సహస్రనామం చెప్పరు. ఏ గ్రంధంలోనూ ఈ సమస్రనామం రాయబడలేదు.

19. ఎక్కడ ఉంది.

19. ఎక్కడ ఉంది.

P.C.YouTube

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జొన్నవాడ గ్రమంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.

20. ఎలా వెళ్లాలి.

20. ఎలా వెళ్లాలి.

P.C.YouTube

నెల్లూరుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేరుగా బస్సు, రైలు సౌకర్యం ఉంది. ఇక నెల్లూరు నుంచి జొన్నవాడ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నగరం నుంచి జొన్నవాడకు ఆటోలు, బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి