Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు నగరంలో ఒక తీర్ధయాత్ర ట్రిప్!

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు నగరంలో ఒక తీర్ధయాత్ర ట్రిప్!

ఆంధ్ర ప్రదేశ్ లో గల కర్నూలు ఆలయాలకు మరియు చారిత్రక కట్టడాలకు విస్తృతంగా పేరుగాంచింది.

By Venkata Karunasri Nalluru

ఆంధ్రప్రదేశ్ లో గల కర్నూలు ఆలయాలకు మరియు చారిత్రక కట్టడాలకు విస్తృతంగా పేరుగాంచింది.

బెంగుళూరు నుండి కర్నూల్ : ప్రయాణ సమయం: 5గం. 10ని. పడుతుంది.

Kurnool in Andhra Pradesh

మార్గం: బెంగుళూరు - లేపాక్షి - పుట్టపర్తి - అనంతపూరు - కర్నూల్

ఈ మార్గంలో చూడదగిన ప్రదేశాలు : లేపాక్షి, పుట్టపర్తి

లేపాక్షి లో ప్రధాన ఆకర్షణ వీరభద్ర స్వామి దేవాలయం:

పుట్టపర్తి - సత్య సాయి బాబా నివాసం

భారతదేశం యొక్క దక్షిణ భాగంలో కళలకు కాణాచి పురాతన సామ్రాజ్యాలు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో గల కర్నూలులో ప్రసిద్ధిచెందిన పురాతన కట్టడాలు, ఆలయాలు మరియు రాజభవనాలు ఉన్నాయి. నిర్మాణపరంగా మరియు మతపరంగా ముఖ్యమైన ఆలయాలు ఈ పవిత్ర ప్రాంతంలో అపారంగా ఉన్నాయి.

మొదటగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆధ్యాత్మిక పర్యటనను తీసుకుందాం

కర్నూలు:

Kurnool in Andhra Pradesh

PC : Harsha Vardhan

ప్రఖ్యాత ఆంధ్రప్రదేశ్ లో గల కర్నూలు దాని చారిత్రక కట్టడాల పవిత్ర దేవాలయాలు గలిగిన జిల్లా! ఇక్కడ బెలుం గుహలు ఇంకా అనేక ముఖ్యమైన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు దగ్గర సందర్శించడానికి కొన్ని స్థలాలు పరిశీలించండి.

మహానంది ఆలయం:

Kurnool in Andhra Pradesh

PC : Andhra Pradesh Tourism

కర్నూలులో గల మహానంది ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉంది! ఇది నల్లమల కొండలలో ఉన్న శివుడికి అంకితం చేయబడింది. మహానందీశ్వరస్వామి ఆలయం, ఇక్కడ ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది 1,500 సంవత్సరాల నాటిది. దీనిని చాళుక్య రాజులు నిర్మించారు చెబుతారు.

మంత్రాలయం:

Kurnool in Andhra Pradesh

PC : Andhra Pradesh Tourism

మంత్రాలయం కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. మంత్రాలయం విష్ణు భక్తులు యొక్క మత కేంద్రంగా అభివృద్ది చెందింది. ఇక్కడ రాఘవేంద్రస్వామి జీవసమాధి చెందారు. భక్తులు చాలా ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

శ్రీశైలం:

Kurnool in Andhra Pradesh

PC : Andhra Pradesh Tourism

శ్రీశైలంలో నల్లమల కొండలు పైన భక్తుల కొరకు మల్లికార్జునస్వామి వెలసినందువలన ఇక్కడ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. ఇక్కడ హిందూ మతం ఆధిపత్య పాత్ర పోషించింది. పురాతన కాలం నుంచి సాంస్కృతిక మరియు సామాజిక చరిత్ర గల ఈ క్షేత్రము ప్రజాదరణ పొందిన ఒక పుణ్య క్షేత్రము. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. భ్రమరాంబ ఆలయంను భారతదేశంలో గల పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. కర్నూలు పట్టణం శ్రీశైలం నుండి దూరం సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అహోబిలం:

Kurnool in Andhra Pradesh

PC : Andhra Pradesh Tourism

అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో గల ఒక పవిత్ర ప్రదేశం. ఇది దేశంలో 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి అతని గొప్ప భక్తుడు ప్రహ్లాదుని దీవించినారని భక్తుల నమ్మకం.

యాగంటి:

Kurnool in Andhra Pradesh

PC : Porusreddy

కర్నూలు నగరం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం ఉంది. ఇది శివుడు, పార్వతీదేవికి మరియు పవిత్రమైన నందీశ్వరునికి అంకితం చేయబడిన ఒక దేవాలయం. ఇక్కడ గల ఆలయ చెరువులో గల పుష్కరిణి ఒక అద్భుతమైన నిర్మాణంగా పేరు గాంచింది. కర్నూలు నగరం పరిసరప్రాంతాలలో చూడదగిన ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. తీర్ధయాత్రలు చేసేవారికి ఈ గొప్ప దేవాలయాలు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X