Search
  • Follow NativePlanet
Share
» »నాగలాపురం ట్రెక్ - ప్రకృతి స్వర్గంలోకి ప్రయాణం !

నాగలాపురం ట్రెక్ - ప్రకృతి స్వర్గంలోకి ప్రయాణం !

చెన్నై మహా నగరం నుండి 70 కి.మీ ల దూరంలో, బెంగళూరు కు 217 కి.మీ ల దూరంలో ఉంది నాగలాపురం.

By Mohammad

నాగలాపురం .. బహుశా మీరు ఈ పేరుతో చాలా చోట్లా ఊర్ల పేరు వినింటారనుకోండీ .. ! దాదాపు ప్రతి జిల్లాలో ఈ నాగలాపురం పేరు మీద ఒక గ్రామం గానీ, చిన్నపాటి పంచాయితి గానీ ఉంటుంది. సరే.. ఇక్కడ చెప్పుకోబోయేది చిత్తూర్ జిల్లాలోని నాగలాపురం గ్రామం గురించి.ఇది కేవలం తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రకృతిలో మమేకమైన చిత్తూర్ సోయగాలు !!ప్రకృతిలో మమేకమైన చిత్తూర్ సోయగాలు !!

చెన్నై నుండి చిత్తూర్ లోని నాగలాపురం కు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, సాహసికులు, ప్రకృతి ప్రేమికులు వారాంతంలో తరచూ వస్తుంటారు. ఇది కూడా చెన్నై మహా నగరం నుండి 70 కి. మీ ల దూరంలో, బెంగళూరుకు 217 కి.మీ ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పచ్చని అందాలను, జలపాతాలను చూసి తరిస్తుంటారు. ఇక్కడే మరో దేవాలయం ఉంది. అది కూడా చూడండీ ..!

ఊటీ కన్నా శేషాచలం ఫారెస్ట్ మిన్న !!ఊటీ కన్నా శేషాచలం ఫారెస్ట్ మిన్న !!

నాగలాపురం

నాగలాపురం

శ్రీకృష్ణ దేవరాయలు చోర, పాండ్య రాజులను ఓడించి హంపి కి వెళుతుండగా నాగలాపురంలో విడిది చేస్తాడు. అక్కడ ఆయనకు తన తల్లి జ్ఞాపకం వస్తుంది. వెంటనే అరుణా నది పరివాహక ప్రాంతంలో ఒక ఊరిని నెలకొల్పుతాడు. ఆ ఊరికి 'నాగలాంబపురం' అని పేరు పెడతాడు. తదనానంతరం ఆ ఊరి పేరుకాస్త 'నాగలాపురం' గా మార్పు చెందింది.

చిత్రకృప : Ravi S. Ghosh

వేదనారాయణస్వామి

వేదనారాయణస్వామి

నాగలాపురం లో ఫెమస్ టెంపుల్, వేదనారాయణ స్వామి ఆలయం కలదు. దీనిని కూడా శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. కుంభకోణం నుండి తిరిగి వస్తూ నాగలాపురంలో విడిది చేయగా, వేదనారాయణ స్వామి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని అడుగుతాడట. ఆ ఆలయమే ఇప్పుడున్న వేదనారాయణ స్వామి ఆలయం.

చిత్రకృప : Bhaskaranaidu

అబ్బురపరిచే కళాకృతులు

అబ్బురపరిచే కళాకృతులు

ఆలయం 12 ఎకరాలలో విస్తరించి ఉంది. శిల్పచాతుర్యానికి, వాస్తు నిర్మాణానికి ఈ ఆలయం మచ్చుతునక. గర్భగుడిలో మూలవిరాట్టు మత్స్యావతారమూర్తి కి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉంటాయి.

చిత్రకృప : Bhaskaranaidu

స్వామి పాదాలు

స్వామి పాదాలు

సంవత్సరంలో 3 రోజులు (మార్చి 25-27) సాయంత్రం 4 అయ్యిందంటే సూర్యకిరణాలు స్వామి వారిని తాకుతాయి. మొదటి రోజు పాదాలను, రెండవ రోజు నాభి ప్రాంతాన్ని, మూడవ రోజు ముఖారవిందాన్ని చుంబిస్తాయి. ఈ దృశ్యాలను చూడటానికి చుట్టుపక్కల ఆప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు.

నాగాల ట్రెక్

నాగాల ట్రెక్

నాగలాపురంలో మరో ప్రధాన ఆకర్షణ జలపాతం. ఇక్కడి కొండలను, పచ్చని ప్రకృతి అందాలను, జలపాతాన్ని చూడటానికే ఎక్కువ మంది పర్యాటకులు నాగలాపురం వస్తుంటారు. 'నాగాల ట్రెక్' తూర్పు కనుమలలో ఒక ఫెమస్ ట్రెక్. జలపాతం వెంబడి ట్రెక్, అద్భుత అనుభూతిని ఇస్తుంది.

చిత్రకృప : Shmilyshy

కోని జలపాతం (Koni Waterfall)

కోని జలపాతం (Koni Waterfall)

కోని జలపాతం ఒక చిన్న జలపాతం. తూర్పుకనుమలలో చుట్టూ కొండలు, అడవులు, నదుల మధ్య గలగల కిందకు దూకుతూ ఉంటుంది. ఇది ట్రెక్కర్లకు థ్రిల్లింగ్ గొలిపే ఒక అనుభూతి.

చిత్ర కృప : Shmilyshy

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్ మొత్తం మీద మీకు మూడు జలపాతాలు కనిపిస్తాయి. అందులో ఒకటి చిన్నది. ఆ జలపాతం వద్ద జారుబండ ఆడవచ్చు, కొర్రేట్ కొట్టొచ్చు, జంప్ చేయవచ్చు ... మీకు ఎలా నచ్చితే అలా !

చిత్ర కృప : Shmilyshy

క్యాంపైనింగ్

క్యాంపైనింగ్

ట్రెక్కింగ్, రిజర్వ్ ఫారెస్ట్ కు కనెక్ట్ చేయబడిన ఒక పెద్ద సరస్సు నుండి మొదలవుతుంది. అక్కడే క్యాపైనింగ్ స్పాట్ కలదు. నీటి కొలనులు, ఎత్తైన పర్వతాలు (వీలైతే ఎక్కడానికి ప్రయత్నించండి) క్యాంపైనింగ్ చుట్టూ ఉంటాయి.

చిత్ర కృప : Santhosh Janardhanan

మనవి

మనవి

నాగలాపురం వేరు. నాగలాపురం జలపాతం ట్రెక్ వేరు. నాగలాపురం ఊరి పేరు. నాగలాపురం జలపాతం ట్రెక్ అడవుల్లో సాగుతుంది. ఇది నాగలాపురం ఊరి నుండి 18 కి. మీ ల దూరములో కలదు.

చిత్ర కృప : Santhosh Janardhanan

బేస్ క్యాంపు

బేస్ క్యాంపు

నాగలాపురం జలపాతానికి చేరుకోవాలంటే ముందుగా 'అరై' గ్రామానికి చేరుకోవాలి. నాగలాపురం టౌన్ నుండి వయా పిచతుర్ మీదుగా రోడ్డు మార్గాన అరై గ్రామానికి చేరుకోవచ్చు. నాగలాపురం ట్రెక్ కు ఈ గ్రామం ఒక బేస్ క్యాంపు గా వ్యవహరిస్తోంది.

చిత్ర కృప : Santhosh Janardhanan

నాగాల డ్యాం

నాగాల డ్యాం

అరై గ్రామానికి చేరుకున్నాక నాగాల డ్యాం వద్ద ఆగండి. సొంతవాహనాలు వేసుకొచ్చిన వారు ఇక్కడే పార్క్ చేయండి. అద్దె వాహనాలు వేసుకొచ్చిన వారు కూడా ఇక్కడే పార్కింగ్ చేయవచ్చు. ఈ డ్యాం వద్ద నుండే ట్రెక్ మొదలవుతుంది. ఆ ఆతరువాత ఎంత ఎంజాయ్ చేయాలో మీకు తెలుసుగా ?

చిత్ర కృప : Prashant Dobhal

భోజనం

భోజనం

ఇక్కడికి ట్రెక్కింగ్ కై వచ్చే వారు దాదాపు ట్రావెల్ సంస్థలనే ఆశ్రయిస్తుంటారు. ఒక్కొక్కరికి 2500-3000 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. భోజనం, వసతి, గైడ్, పొనురాను ట్రాస్పోర్ట్ మొత్తం ట్రావెల్ సంస్థలదే భాద్యత. సొంతంగా వెళ్లే వారికి ఈ సౌకర్యాలు ఏవీ ఉండవు కనుక తగినన్ని ఏర్పాట్లు చేసుకొని వెళితే బాగుంటుంది.

చిత్ర కృప : Shmilyshy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X