» »రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

గుట్టమీద గుడి కట్టడం సాధారణమే.కాని గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతావిగ్రహాలను తీర్చిదిద్దడం,దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించటం మాత్రం అబ్బురమే. భూపాల్ పల్లిజిల్లా చిట్యాల్ మండలం నైన్పాక్ గ్రామశివర్లోని గుట్టమీద వున్న సర్వతోబధ్ర ఆలయం ప్రత్యేకత ఇది. దేశంలోనే ప్రత్యేక తరహాలో రూపుదిద్దుకున్న ఈ మందిరం కొత్తగా కనుగోన్నదేమీ కాదు. వందలఏళ్లుగా స్థానికులకు సుపరిచితమేఅయిన ఈ ఆలయం నిర్మాణంలో ప్రత్యేకత,తాజాగా నిపుణుల పరిశీలనలో వెలుగులోనికొచ్చింది.సాధారణంగా ఆలయాలనిర్మాణంలో గర్భాలయాన్ని దానికి ఆనుకొని మంటపాన్ని నిర్మిస్తారు. తర్వాత చుట్టూ గోడతో ఆలయఆవరణను ఏర్పాటుచేస్తారు.ఎక్కడో రూపొందించిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు.

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఎక్కడ వుంది?

కాని నైన్పాకసర్వతోభద్ర ఆలయం దీనికి భిన్నంగా వుంటుంది. గుట్టపై మధ్య భాగంలో ఆలయం వుంటుంది.ఇది కేవలం గర్భాలయం మాత్రమే.దానికే 4వైపులా ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు వుంటాయి.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం వుంటుంది. ఇది ఒక విగ్రహం కాదు.ఒకే రాతిపై నాలుగున్నర అడుగుల ఎత్తులో దేవతావిగ్రహాలను చెక్కారు. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో వైపున దేవతావిగ్రహాలు కనిపిస్తూవుంటాయి.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

తూర్పు ద్వారం నుంచి వుగ్రనరసింహస్వామి, దక్షిణద్వారం నుంచి కాళియా మర్దనం భంగిమలో వేణుగోపాల స్వామి,పశ్చిమం వైపున బలరాముడు,వుత్తరభాగంలో సీతారామలక్ష్మణరూపాలు దర్శనమిస్తాయి.
దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయంగా పిలుచుకుంటారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

సర్వతోభద్రఆలయంలోని విగ్రహాలు ఇప్పటివరకూ మామూలుగా పిలిచిన మామూలుగా ప్రతిష్టించినవిగానే భావించారు.కానీ కొద్దిరోజుల క్రితం పర్యటనకు వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బి వ్యాగనర్.
పురావస్తుశాఖ రిటైర్ అధికారి రంగాచార్యులతో కలిసి ఈ ఆలయాన్ని పరిశీలించి దాని ప్రత్యేకతను గుర్తించారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఆ విగ్రహం ఎక్కడినుండో తెచ్చి ప్రతిష్టించినది కాదని,ఆలయం నిలిచివున్న గుట్టభాగాన్నే విగ్రహంగా మలచివున్నారని తేల్చారు.అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయంలో స్పష్టత లేదు.ఇది వైష్ణవ సాంప్రదాయ సర్వతోభద్ర ఆలయంకావటంతో కాకతీయుల కాలం తర్వాత నిర్మించివుంటారని భావిస్తున్నారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఇక్కడి కోనేరు మట్టితో పూడుకుపోయి వుంది.దానిని తవ్వి పరిశీలిస్తే ఆధారాలు దొరకవచ్చని అంటున్నారు.గుట్టపై మధ్యలో ఎత్తుగావున్న భాగాన్ని ఎంపికచేసి దాదాపు నాలుగున్నర అడుగులఎత్తులో 4వైపులా నాలుగు విగ్రహాలు చెక్కారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

అంటే ఆ విగ్రహాల భాగం నేరుగా గుట్టరాయే.ఒక విగ్రహం రాతినే సమంగా చెక్కి బల్లపరుపుగా మార్చారు. ఇలా చెక్కగా వచ్చిన రాళ్ళతోనే ఆ విగ్రహంచుట్టూ దాదాపు 25అడుగుల ఎత్తులో గర్భాలయాన్ని నిర్మించారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

తర్వాత దానిపై మరో 30అడుగుల ఎత్తులో ఇటుకులతో గోపురం నిర్మించారు.ఆలయం వుండేది అంతే మండపం అంటూ ఏమీ లేదు.ముందు వైపు విశాలమైన కోనేరును నిర్మించారు. ఇలా గుట్టరాతిలోనే విగ్రహం చెక్కివున్న దేవాలయం ఇప్పటివరకూ రికార్డుకాలేదని పురావస్తుఅధికారులు చెప్తున్నారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఇక విగ్రహం పైభాగంలో స్థూపాకారంలో రాతిభాగాన్ని విడిగా ఏర్పాటు చేసారు. గతంలో దొంగలు గుప్తనిధుల తవ్వకాలంటూ ఆ భాగాన్ని పక్కకు పడేసారు. భూపాలపల్లి గ్రామంలోని జనకోకేంద్ర సిబ్బంది క్రేన్ తెచ్చి దాన్ని మళ్ళీ విగ్రహం పైభాగంలో అమర్చారు.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఈ ఆలయాన్ని 1992లో నాటి పురావస్తుసహాయసంచాలకుడు ఎన్. రామకృష్ణారావ్ తొలిసారి వెలుగులోకి తెచ్చారు.అప్పటివరకూ ఇది స్థానికులకే పరిచయం. తర్వాత శాఖ డిప్యూటి డైరెక్టర్ రంగాచార్యుల ఆధ్వర్యంలో హిన్టాక్ సంస్థ దీనిని సర్వే చేసి వెలుగులోకితెచ్చింది.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

కాని ఇప్పటివరకూ పురావస్తుశాఖ దీన్ని రక్షితకట్టడంగా గుర్తించలేదు. దీంతో క్రమంగా ఆలయం ధ్వంసంఅయిపోతోంది. చెట్లు విరిగి గోపురం దెబ్బతింటోంది. అయితే తాజాగా అమెరికన్ ప్రొఫెసర్ ఈ ఆలయాన్ని తాజాగా ఈ ఆలయప్రత్యేకతను గుర్తించిన నేపథ్యంలో దీనిపై కేంద్రపురావస్తు శాఖ ఆసక్తిప్రదర్శిస్తోంది.

pc:youtube

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

రాళ్లగుట్ట.. గుడిగా మారింది ఎలానో? చూడండి..

ఇంజనీరింగ్ నైపుణ్యంపరంగా ఇదోగొప్ప కట్టడం. దీనిని భావితరాలకు అందించాల్సిన అవసరం వుందని అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బి.వ్యాగనర్ తెలిపారు.

pc:youtube