• Follow NativePlanet
Share
» »ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

బీచ్ లకి ప్రకృతికి ఏదో సంభంధం ఉంది, లేకుంటే పర్యాటకులను అంతగా ఆకర్షించవు అవునా?కాదా? అవును! ఎందుకంటే మనిషి తన జీవితంలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సహజం. ప్రస్తుతం వేసవికాలం వస్తుంది కనుక పర్యాటకులు, ప్రకృతి ప్రియులు చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? అంటే తీర ప్రాంతాలలో.... భారతదేశంలోని తీరప్రాంతాలలో చెప్పుకోదగ్గ బీచ్ లు ఉన్నాయి. ఇవి ప్రకృతి ప్రియులను,పర్యాటకులను మరియు స్థానికంగా ఉండే వాళ్ళను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశాలకు కుటుంబసభ్యులతో గాని,స్నేహితులతో గాని వెళితే ఉంటుంది ఆ మాటలు వార్ణించలేము. భారతదేశంలోని ఉన్న కొన్ని బీచ్ ల గురించి తెలుసుకుందామా.....

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

బంగారం బీచ్

దీనిని హనీమూన్ కి వచ్చే వారు బాగా ఇష్టపడతారు.దీనిని హనీమూన్ జంటలకి స్వర్గం గా పిలుస్తారు. ఇక ఇక్కడ కల స్కూబా మరియు స్నోర్కేలింగ్ లతో నీటి ఆటలు ఆడవచ్చు. బీచ్ విహారంతో అలసిన వారు ఇక్కడి పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు కలియతిరిగి ఆనందించవచ్చు. వీటి విస్తీర్ణం సుమారు 120 ఎకరాలు వుంటుంది.అన్నిటికి మించి మీరు కోరే ఆల్కహాలు స్వేచ్చగా అందుబాటులో వుంది. సమీపంలో రుచికర ఆహారాల రెస్టారెంట్ లు కూడా కలవు. ఈ ప్రాంతం ఎన్నో రకాల, పక్షులు, చేపలు, ఇతర చిలకలు, ముళ్ళ పందులు వంటివి కలిగి వుంటుంది.

Photo Courtesy: Binu K S

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

జుహు బీచ్

ముంబై వెళితే తప్పక సందర్శించవలసిన బీచ్ గా ఇది ప్రఖ్యాతిగాంచింది. ఇది బీచ్ ప్రేమికులకి ఎంతో ఉత్సాహం కలిగించకమానదు. ఇది ముంబై లోని పోష్ ఏరియా సమీపంలో ఉండి, అక్కడి ప్రజలను, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. బీచ్ అంటేనే ఒక అనుభూతి.... అలాంటిది ఇంక సాయంత్రం పూట సందర్శిస్తే ఉంటుంది చూడండి...! ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే అది అనుభవిస్తేగాని తెలీదు అవునా? ఇక ఇక్కడి చిరుతిండి విషయానికి వస్తే భెల్ పూరీ, పానీ పూరీ, ముంబై స్యాండ్‌విచ్ మరియు ప్రత్యేకమైన పావ్ బాజీ దొరుకుతుంది. ఇక్కడ గొలాస్ అనే రుచికరమైన ఐస్ క్రీమ్ ఎంతో ప్రత్యేకం. సూర్యోదయం, సూర్యాస్తమం వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు అమితంగా ఇష్టపడతారు.

Photo Courtesy: Rajkiran

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

కన్యాకుమారి బీచ్

కన్యాకుమారి బీచ్ ఒక అందమైన , ఆహ్లాదభరితమైన ప్రకృతి ప్రదేశం. ఈ ప్రదేశం కేవలం బీచ్ కే కాదు భక్తి భావము కల భూమి. ఇది భారతదేశపు దక్షిణకొణ(అంచు). కన్యాకుమారి బీచ్ లో సూర్యోదయం,సూర్యాస్తమం ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో అదికూడా పౌర్ణమి రోజున నిండు చంద్రుని వెన్నలలో సేద తీరుతూ ఉంటే!! అలాంటి అనుభూతి మాటల్లో చెప్పలేనిది,వర్ణించలేనిది కూడా... ఇలాంటి సందర్భం కోసం పర్యాటకులు, ప్రకృతి ప్రియులు ఇక్కడికి వచ్చి బీచ్ యొక్క అందాలను తనివితీరా ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మూడు నదులు కలుస్తాయి అవి వరుసగా బంగాళాఖాతం సముద్రం,అరేబియా సముద్రం మరియు హిందూ మహా సముద్రం. అందుకే ఇది త్రివేణీ సంగమ క్షేత్రంగా విరజిళ్లుతుంది. కనుకనే పర్యాటకులను అంతగా ఆకర్షిస్తుంది.

Photo Courtesy: shadow of d

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

కౌప్ బీచ్

కౌప్ బీచ్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతంలో ఉన్నది. ఈ బీచ్ కోమలమైన ప్రకృతి మరియు ఆహ్లాద వాతావరణంతో కప్పబడి ఉంటుంది. కోమలమైన ప్రకృతి మరియు ఆహ్లాద వాతావరణం తో కప్పబడి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆ బీచ్ సౌందర్యాలను ఆశ్వాదిస్తారు. ఇక్కడ బీచ్ లో స్విమ్మింగ్ మరియు సూర్యస్నానాలు చేస్తుంటారు. మీరు ఈ ప్రాంతాన్ని పిక్నిక్ గా ఎంచుకొనవచ్చు. ఫ్యామిలీతో వచ్చినట్లయతే మంచి అనుభూతిని అందిస్తుంది.

Photo Courtesy: Subhashish Panigrahi

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

లైట్ హౌస్

కోవలం సముద్ర తీరానికి దక్షిణం అంచున లైట్ హౌస్ బీచ్ ఉంది. పక్కనే నగరం ఉండటం వల్లన పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తారు. ఇది నగరానికి దగ్గర్లో ఉన్నందున పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. పాత రోజులలో ఈ తీరం పక్కనే ఉన్న కొండమీద విజింజం లైట్ హౌస్ గా పిలువబడే ఒక దీపస్తంభం ఇక్కడ ఉండేది. ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు మార్గదర్శనం చేసేది.అదృష్టవశాత్తూ, కాలగమనం గానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ దీపస్తంభాన్ని ప్రభావితం చేయలేదు. రాత్రిపూట ఈ దీపస్తంభం నుంచి వెలువడే కాంతిరేఖలు ఈ తీరానికి ఒక అందమైన లక్షణాన్ని అందించాయి. అందువల్ల, అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడడానికి ఈ తీరాన్ని రాత్రిపూటే సందర్శించాలి. జనవరి నెలలో సైతం వెచ్చగా ఉండే ఈ తీరంలోని స్వచ్చమైన నీటిలో నమ్మశక్యం కాని ఈతను అందిస్తుంది.

Photo Courtesy: Fabrice Florin

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

మహాబలిపురం బీచ్

మహాబలిపురం బీచ్ బంగాళాఖాత తీరాన ఉన్నది. ఈ బీచ్ చెన్నై కి దక్షిణాన 58 కిలోమీటర్ల దూరంలో కలదు. మహాబలిపురం బీచ్ సుమారుగా 20 కిలోమెటర్ల మేర విస్తరించి ఉన్నది. ఈ బీచ్ 20 వ శతాబ్దంలో వెలుగు లోకి వచ్చింది. ఇది పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నది. ఇక్కడ మోటార్ బోటింగ్ మీద షికారు అమితంగా ఆకట్టుకుంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాలలో ఈ బీచ్ పర్యటన పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. అందమైన ఈ బీచ్ వెనుక వివిధ రకాలైన స్మారకాలు, రాతి కట్టడాలు కనిపిస్తాయి.

Photo Courtesy: SM14

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

పలొలెమ్ బీచ్

పలొలెమ్ బీచ్ దక్షిణ గోవాలో చౌది పట్టణంలోని మార్కెట్ కి 2.5 కిలోమీటర్లు, మార్గవో నుంచి సుమారుగా 40 నిమిషాల దూరంలో ఉన్నది. ఈ బీచ్ లో ప్రకృతి అందాలనూచూస్తూ జీవితాన్ని గడిపేయవచ్చు అలా ఉంటుడి ఈ సాగర తీరం. ఈ తీరం ఒక మైలు వరకు అర్ధ చంద్రాకృతి ఆకారంలో ఉంటుంది. మీరు ఈ బీచ్ అందాలను మొత్తం ఒకవైపు నుండి ఆస్వాదించవచ్చు. స్విమ్మింగ్ చేసే వారు అయినట్లైతే గాబర పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అలలు ఏమంతగా వేగంగా కొట్ట.వు. ఈ బీచ్ ప్రస్తుతం ఒక పర్యాటక ప్రదేశంగా ఉన్నది.

Photo Courtesy: Dan Searle

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

పయ్యంబళం బీచ్

అందంగా విస్తరించబడిన తెల్లని ఇసుక తీరం లో ఉన్న పయ్యంబళం బీచ్ కన్నూర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. కన్నూర్ నగరం నుండి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ బీచ్ కి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తల్లి బిడ్డల అద్భుతమైన శిల్పం ఈ బీచ్ లో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ. మలంపుజ్హ లో యక్షి శిల్పాన్ని చెక్కిన ప్రసిద్ది చెందిన శిల్పి కనయి కున్జిరామన్ చేత చెక్కబడిన ఈ భారీ శిల్పం పర్యాటకులని అతని పనితనం తో పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ బీచ్ కి దగ్గరలో ఉన్న గార్డెన్ లో సాయంత్రం పుట పర్యాటకులు సేద దీరి సముద్రపు అందాలు గమనించవచ్చు. పరిశుభ్రత మరియు సురక్షితమైన ప్రదేశం కావడం వల్ల కుటుంబ సమేతంగా గడపడానికి ఈ బీచ్ అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: Nisheedh

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

పూరీ బీచ్

పూరీ బీచ్ బంగాళాఖాతం తీరంలో పూరీ రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరీ బీచ్ నగరంలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈత కోసం ఆదర్శవంతమైనదిగా మరియు భారతదేశంలో ఉత్తమ బీచ్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది. వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పర్యాటకులను పుష్కలంగాను విశేషంగాను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఇసుక కళ ప్రదర్శించబడుతుంది. స్థానిక ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయిక్ గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డును దృశ్య రూపం ఇసుక కళతో ఉన్న దానిని ఇక్కడ చూడవచ్చు. మీరు పండుగ సమయంలో పూరీలో వున్నట్లయితే దీనిని చూడటానికి తప్పనిసరిగా రావాలి. ముదురు బంగారు ఇసుక బీచ్ లో సముద్రం, ఆహ్లాదకరమైన గాలి, స్పష్టమైన మెరిసే నీరు మరియు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క వీక్షణ ఒక శాశ్వతమైన ఆకర్షణగా చేశారు.

Photo Courtesy: Sourav Das

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

ఇండియాలోని 10 రొమాంటిక్ బీచ్ లు !

వర్కల బీచ్

వర్కాల బీచ్ తిరువనంతపురానికి 54 కి.మీ. ల దూరంలో కలదు. ఇక్కడ సుమారు 2000 సంవత్సరాలనాటి జనార్దన స్వామీ టెంపుల్ కలదు. ఇంకనూ అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. నేచర్ సెంటర్ ఈ బీచ్ లో ఒక ప్రధాన ఆకర్షణ ఇక్కడ మహిమలు కల నీటి బుగ్గ ఒకటి కలదు. ఈ నీటిలో స్నానాలు చేస్తే మొండి వ్యాధులు కూడా నయమవుతాని విశ్వసిస్తారు.ఇక్కడ మీరు వాలీ బాల్ ఆడవచ్చు. లేదా స్విమ్మింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు చేయవచ్చు లేదా ప్రకృతి అందించే సహజ అందాలు తిలకిస్తూ ఆనందించవచ్చు. సూర్యాస్తమయాన్ని తాటి తోపుల మధ్య చూసి ఆనందించవచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. వర్కాల బీచ్ ఉత్తరం మరియు దక్షిణం గా విభజించ బడింది. ఉత్తరం భాగంలో అనేక హోటళ్ళు ఉంటాయి. ఈ బీచ్ సందర్శనకు నవంబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.

Photo Courtesy: Kerala Tourism

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి