• Follow NativePlanet
Share
» » కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకే

కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకే

Written By: Kishore

భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన నగరాల్లో నాసిక్ కూడా ఒకటి. ఈ నగరానికి రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఈ నాసిక్ ఎన్ని వేల ఏళ్ల నుంచి మనుగడలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాసిక్ చుట్టు పక్కల అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో ఒక దేవాలయంలోని దేవతను మాత్రం కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే భక్తుల సందర్శనకు అనుమతి ఇస్తారు. స్థానికంగా ఉన్న నదిలో స్నానం చేసి ఆ దేవిని దర్శనం చేసుకొంటే సర్వ పాపాలు నాశనం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ దేవాలయంతో పాటు అక్కడే ఉన్న మరికొన్ని ఆలయాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం

ఆ మణి ఉండటం వల్లే అక్కడ అనంత సంపద

ఈ వి'చిత్ర'మైన మ్యూజియం చూసావా గురు

1. పురాణ ప్రాధాన్యత కలిగిన నగరం

1. పురాణ ప్రాధాన్యత కలిగిన నగరం

P.C: You Tube

భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన అతి తక్కువ నగరాల్లో నాసిక్ కూడా ఒకటి. ఇది గోదావరి నది ఒడ్డున మహారాష్ట్రలో ఉంది. ఈ నాసిక్ తో పాటు చుట్టు పక్కల అనేక ప్రాచీన, ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

2. పంచవటి ముఖ్యమైనది

2. పంచవటి ముఖ్యమైనది

P.C: You Tube

ఇందులో పంచవటి ముఖ్యమైనది. రాముడు వనవాస సమయంలో ఎక్కువ సమయం ఇక్కడే గడిపాడని రామాయణ మహాకావ్యంలో ఉంది. అగస్త్య మహాముని సూచనమేరకు ఇక్కడే పర్ణశాలను ఏర్పాటు చేసుకొని రాముడు సీత, లక్ష్మణ సమేతుడై ఉండేవాడు.

3. ముక్కు, చెవులు కోసినది ఇక్కడే

3. ముక్కు, చెవులు కోసినది ఇక్కడే

P.C: You Tube

ఇక్కడే లక్ష్మణుడు, సూర్పణక ముక్కు, చెవులు కోసాడని చెబుతారు. అంతే కాదు ఇక్కడ అతి పవిత్రమైన ఐదు మర్రి చెట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పంచవటి అని అంటారు. వట వ`క్షం అంటే మర్రి చెట్టు అన్న విషయం తెలిసిందే.

4. సీత గుహ

4. సీత గుహ

P.C: You Tube

ఇక్కడ చూడదగిన మరో ప్రదేశం సీతాదేవి గుహ. ఇక్కడ సీత స్వయంగా ప్రతిష్టించి పూజించిన శివ లింగాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ గుహ చాలా చిన్నదిగా ఉంటుంది. కొద్దిగా లావుగా ఉన్నవారు ఈ గుహలోకి వెళ్లడం కుదరదు.

5. రావణుడు, సీతను ఎత్తుకెళ్లిన ప్రదేశం

5. రావణుడు, సీతను ఎత్తుకెళ్లిన ప్రదేశం

P.C: You Tube

ఈ గుడికి ఎదురుగా రావణుడు, సీతను ఎత్తుకెళ్లిన ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఇక పంచవటి రాముడి వనవాస ఘట్టంతో విడదీయలేని బంధం ఏర్పరుచుకుంది. అందువల్లే రామాయణాన్ని పంచవటి లేకుండా ఊహించుకోలేము.

6. కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే

6. కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే

P.C: You Tube

పంచవటి నుంచి కొద్దిగా ముందుకు వెళితే రామకుండ్ వస్తుంది. త్రయంబకేశ్వరాలయానికి అతి దగ్గరగా ఉంటుంది. ఇది గోదావరి జన్మస్థానమని చెబుతారు. ఇక్కడే గోదావరి మాతకు దేవాలయం ఉంది. అయితే ఒక్క కుంభమేళ సమయంలో మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు.

7. దశరథ మహారాజు శ్రాద్ధ కర్మలు నిర్వహించింది ఇక్కడే

7. దశరథ మహారాజు శ్రాద్ధ కర్మలు నిర్వహించింది ఇక్కడే

P.C: You Tube

అంటే 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ దేవాలయంలోని గోదావరి మాతను దర్శనం చేసుకోవడానికి వీలవుతుందని స్పష్టమవుతోంది. అదే విధంగా ఇక్కడ ఉండే రామకుండంలో దశరథ మహారాజు శ్రాద్ధ కర్మలు అతని కుమారుడైన శ్రీరామ చంద్రుడు నిర్వహించాడు.

8. కపాలేశ్వర్ ఆలయం

8. కపాలేశ్వర్ ఆలయం

P.C: You Tube

రామకుండ్ ఎదురుగా ఉన్న చిన్న గుట్టపై కపాలేశ్వర్ ఆలయం ఉంది. పరమశివుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఉన్న గోదావరిలో స్నానం చేసి గుట్ట పై కపాలేశ్వరుడిగా లింగ రూపంలో కొలువై ఉన్నట్లు చెబుతారు.

9. త్రయంబకేశ్వరాలయం

9. త్రయంబకేశ్వరాలయం

P.C: You Tube

జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరాలయం నాసిక్ కు దగ్గర్లోనే ఉంది. స్వర్గం, ఆకాశం, భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన శివుడిని ఇక్కడ త్రయంబకం అనే పేరుతో కొలుస్తారు.

10. అందువల్లే ఈ పేరు

10. అందువల్లే ఈ పేరు

P.C: You Tube

అంబకం అంటే నేత్రమని అర్థం. మూడు నేత్రాలు కలిగినవాడు కాబట్టే శివుడిని ఇక్కడ త్రయంబకేశ్వరుడని పేర్కొంటారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు తేజస్సులను మూడు నేత్రాలుగా కలిగిన వాడిగా కూడా ఈశ్వరుడిని అభివర్ణిస్తారు.

11. షిర్డీ వెళ్లిన వారు

11. షిర్డీ వెళ్లిన వారు

P.C: You Tube

ఎన్నో పవిత్ర ఆలయాలు కలిగిన ఈ పంచవటి నాసిక్ పట్టణానికి దాదిపు 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. షిర్డీ వెళ్లే యాత్రికులు తప్పకుండా నాసిక్, త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు.

12. మరికొన్ని ఆలయాలు

12. మరికొన్ని ఆలయాలు

P.C: You Tube

ఇక పంచవటికి దగ్గర్లోనే ఉన్న బాల చంద్ర గణపతి మందిరం, ప్రవర సంగమం, సుందర నారాయణ మందిరం, కాలా రామ్ మందిర్, చంగ్ దేవ్ మహారాజ్ అలాయాలు చూడదగినవి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి