Search
  • Follow NativePlanet
Share
» »ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం ఎలా వెలిసిందో తెలిస్తే షాక్ అవుతారు !

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం ఎలా వెలిసిందో తెలిస్తే షాక్ అవుతారు !

By Venkatakarunasri

అమ్మవారిని గ్రామ దేవతగా ఎందుకు కొలుస్తారో ఈ వ్యాసంలో మనంతెలుసుకుందాం. ప్రతి గ్రామంలోకూడా ఏదో ఒక అమ్మవారి ఆలయం అనేది వుంటుంది.ఆ అవతారాలు మైసమ్మ,పోచమ్మ,ఎల్లమ్మ,కట్టమ్మ ఇలా చాలారకాల పేర్లతో మనం పిలుస్తూ వుంటాం.అయితే పాల్వంచలో వుండే పెద్దమ్మ గుడి అక్కడ ఎలావెలసిందో మనం ఈవ్యాసంలో తెలుసుకుందాం.

ఖమ్మంలో పెద్దమ్మతల్లి

ఖమ్మంలో పెద్దమ్మతల్లి

దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వున్న ఖమ్మం నగరం ఖమ్మం జిల్లాకు ప్రధాన కేంద్రం కూడా. ఇటీవలే చుట్టుపక్కల వున్న 14 గ్రామాలను విలీనం చేయడంతో నగరపాలక సంస్థగా ఈ నగరం రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు తూర్పున 273 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం తెలంగాణ సందర్శించే వారికి నచ్చే పర్యాటక స్థలం.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

స్థానిక గాధల ప్రకారం స్థంభ శిఖరి లేదా స్తంభాద్రి అని పిలువబడిన నరసిమ్హాద్రి గుడి పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. విష్ణు మూర్తి అవతారం నరసింహ స్వామి దేవాలయం ఇది. సుమారు 1.6 మిలియన్ ఏళ్ళనాటి త్రేతా యుగం నుంచి ఈ నగరం ఉండేదని రుజువైంది. ఈ గుడి ఒక కొండ శిఖరం పై ఉ౦డగా కొండ క్రింద నిలువుగా వున్న రాయి స్థంభం లాగా పని చేసేది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ స్థంభం లేదా ‘ఖంబా' అనే పదం నుంచి ఈ ఊరి పేరు పుట్టింది. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాన్ని ‘కంబం మెట్టు' అనేవారు, అదే క్రమేణా ఖమ్మం మెట్టు లేదా ఖమ్మం గా మారిపోయింది. కృష్ణా నదికి ఉపనది అయిన మునేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగర౦ వుంది. చరిత్రలో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక, రాష్ట్రం మొత్తానికి చాలా ముఖ్యమైనది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్ల ఈ మిశ్రమ శైలి ఏర్పడింది. ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మం ను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మం కు ప్రత్యేకత తీసుకు వచ్చింది. ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే, అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఎక్కడ వుంది?

ఖమ్మంజిల్లాలో భద్రాచలం వెళ్ళేదారిలో పాల్వంచకు 5కిమీల దూరంలో జగన్నాథ పురం అనే గ్రామంవుంది. ఈ గ్రామంలో ఒక చింత చెట్టు కింద వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఈ ప్రాంతప్రజలు పెద్దమ్మ తల్లి అనే పేరుతో గ్రామదేవతగా ఎంతో కాలంగా ఆరాధిస్తున్నారు.ఖమ్మంజిల్లాలో వుండే ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి అని ఇక్కడ వుండే పెద్దమ్మగుడి చాలా మహిమకలదని చెబుతారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

పెద్దమ్మతల్లి అక్కడ ఎలా వెలసిందంటే పూర్వం పాల్వంచపరిసర ప్రాంతాలలో దట్టమైన అడవులుండేవి.అరణ్యంలావుండే ఆ ప్రాంతంలో ఒక పెద్దపులి తిరుగుతోందట ఇప్పడు.అది ప్రతీరోజూకూడా ఒక చింతచెట్టుకింద నిద్రిస్తూవుండేది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ దారినుండి నడిచి వెళ్ళే బాటసారులు ప్రతీరోజూపడుకున్న ఆ పులిని చూస్తుండేవారుఅక్కడవుండే ఆ పులి బాటసారులకు ఎలాంటి హానిఅనేది చేసేది కాదు.అలా రోజూ చింతచెట్టు కింద పులినిచూడగా చూడగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి దానిమీద భక్తిభావన పెరిగింది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

పులి అమ్మవారివాహనం గనుక అమ్మవారే అక్కడ కొలువైనట్లు భావించారు. అమ్మ చల్లనిచూపు తమపై పడిందని సంతోషించి ఆ పరిసరగ్రామాల్లోని ప్రజలు అక్కడ అమ్మవారికి చిన్న ఆలయం నిర్మించి పెద్దమ్మ పేరుతో ప్రతిష్టించారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఇలా ఈ ఆలయంలో శ్రీ కనకదుర్గఅమ్మవారు వెలసారు.పెద్దమ్మతల్లి మహాశక్తివంతురాలని శ్రద్ధతో మొక్కులు అర్పిస్తే అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇచ్చట ప్రతీ ఆదివారం భక్తులు అధికసంఖ్యలో వచ్చిఅమ్మవారిని దర్శించుకుంటారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మం లో పర్యటన ఖమ్మం, భారతదేశం లోని లక్షలాదిమంది పర్యాటకులు ఆకర్షించే ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఖమ్మంలోను, చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ ప్రాంతంలో పలైర్ సరస్సుతో పాటు పాపి కొండలు, వాయర్ సరస్సు ప్రధాన సందర్శనీయ స్థలాలు. ఆహ్లాదకర వాతావరణం ఉండే శీతాకాలంలో ఖమ్మం సందర్శించడం ఉత్తమం. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఉత్తర ప్రాంత౦తో పోలిస్తే తక్కువ చలిని కలిగి ఉంటుంది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది. ఖమ్మం నగరం రాష్ట్రంలోని అదేవిధంగా దేశంలోని ఇతర భాగాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో ఎటువంటి విమానాశ్రయం లేదు, రాజధాని నగరమైన హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం. అయితే, ఖమ్మం లో విమానాశ్రయం లేకపోవడం వల్ల రోడ్డు, రైలు మార్గాలు ఏర్పడ్డాయి.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ నగరం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. ఇది హైదరాబాద్-విశాఖపట్టణం లైన్ లో ఉండడం వల్ల భారతదేశం అంతటి నుండి అనేక రైళ్ళు ఖమ్మం కి చేరుకుంటాయి.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మందగ్గర చూడవలసిన ప్రదేశాలు

ఖమ్మం కోట

ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట మరింత అభివృద్ది చెందింది. హిందూ, ముస్లింల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ ఈ కోట, దీని నిర్మాణంలో ఇద్దరి శైలి, పాలకులు ప్రమేయం ప్రభావితం చేసింది. నేడు ఈ కోట ఉనికి 1000 సంవత్సరాలు పూర్తి చేసి గర్వంగా నిలబడి ఉంది. ఇది ఆంద్ర ప్రదేశ్ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోటను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడానికి ధన, శ్రమల కోర్చి అభివృద్ధికి కృషి చేసింది.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయం

ఖమ్మం నగరం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నగరం శివార్లలో ఉంది, దీనిని రోడ్డు ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ఖమ్మం నగరానికి అభిముఖంగా కొండపై నిర్మించ బడింది. ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఖ్యాతి పొందింది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సంవత్సరం అన్ని రోజుల్లో ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఈ కారణంగా, అనేక మంది ప్రతి రోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ ఆలయంలోని నరసింహ స్వామి విగ్రహం విష్ణు మూర్తి అవతారం అంటారు. నరసింహస్వామి విగ్రహం సగం సింహం ఆకారంలో, సగం మనిషి శరీరంతో ఉన్నట్లు రూపొందించడం వల్ల భక్తులు ‘గొప్ప రక్షకుడు' గా భావిస్తారు. ఈ కారణంగా, ఈ ఆలయంలో ఏర్పాటు చేయబడిన నరసింహస్వామిని పంచ నరసింహ మూర్తిగా పిలుస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న దేవుని విగ్రహం భక్తులను యోగ ముద్రలో ఆశీర్వదిస్తారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

పాపి కొండలు

ఖమ్మంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. పాపి కొండల పర్వత శ్రేణులు మెదక్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భాగంగా ఉండి, ఖమ్మం నగరానికి 124 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తెలుగులో ‘విభజన' అనే పదం నుంచి ఈ పర్వత శ్రేణులు ప్రారంభంలో పాపిడి కొండలు అని పిలువబడ్డాయి. ఈ విభజన వల్ల గోదావరి నదిని రూపొందించి ఈ పర్వతశ్రేణికి ఈ పేరు పెట్టారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేస్తే ఒక స్త్రీ తన జుట్టులో తీసే పాపిట ను పోలి వుండడం వల్ల ఈ శ్రేణులకు ఆ పేరు వచ్చిందని కొంతమంది నమ్మకం. పాపి కొండల పర్వత శ్రేణులు మునివాటం అనే అందమైన జలపాతాలకు చాలా ప్రసిద్దమైనవి. ఇది తప్పనిసరిగా ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం కలిగిన గిరిజన ప్రాంతం. చాలామంది ప్రకృతితో మమేకం అవడానికి ఈ జలపాతాలు సందర్శిస్తారు. ఈ ప్రాంతంలోని గిరిజన వర్గాల ప్రజలు పర్యాటకులకు ఎటువంటి హాని కలగచేయకుండా, శాంతియుతంగా ఉంటారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

పలైర్ సరస్సు

ఖమ్మం జిల్లాలో ఉన్న పలైర్ సరస్సు, భారతదేశం లోని అందమైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లాల్ బహదూర్ కాలువగా పిలువబడే ఈ కృత్రిమ సరస్సు వాస్తవానికి ఎడమ కాలువకి ఒక సమతుల్య రిజర్వాయర్ గా ఉంది, దీనిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఒక భాగంగా నిర్మించారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

1748 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సరస్సు 2.5 టి ఎం సి ల నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలిగిఉంది. ఈ సరస్సు నీటిని నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, చేపల పెంపకానికి ప్రసిద్ధ ప్రదేశం. జల క్రీడలు అలాగే సాహస చర్యలు అందించడం వల్ల ఈ పలైర్ సరస్సు ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ సరస్సు అనేక రకాల రొయ్యలను కలిగి ఉండి, మంచి నీటి చేపల సాగుకు మాత్రమె కాకుండా, పర్యాటకులకు పదార్ధాలను తయారుచేస్తుంది. పలైర్ సరస్సుకు చాలా దగ్గరలో ఉన్న వైరా సరస్సు మరొక మంచి విహార స్థలం. ఖమ్మం వచ్చే పర్యాటకులు వారి యాత్రలో ఎక్కువగా అన్ని ప్రదేశాలూ కలిసి ఉండేటట్లు చూసుకుంటారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

జమలాపురం ఆలయం ఖమ్మ౦

ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు. అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. హిందువులకు ఎంతో ప్రధానమైన ఆలయం కనీసం 1000 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్ధనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూసి గుట్ట అనే కొండ ఉంది. ఈ మహర్షి ఇక్కడ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శన మిచ్చి ఆయనను దీవించారని భావిస్తారు.

pc:youtube

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం నగరానికి తేలికగా చేరుకోవచ్చు. ఖమ్మం నుండి ప్రభుత్వ మరియు అనేక ప్రైవేట్ బస్సులు అటు-ఇటు ప్రతిరోజూ నడపబడతాయి. అనేక డీలక్స్, అలాగే వాల్వో బస్సులు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఖమ్మం కి బైల్దేరతాయి. ఖమ్మం నగరం గుండా జాతీయ రహదారులు 5 మరియు 7 రెండు జాతీయ రహదారులు ఉంటాయి.

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

రైలు ద్వారా

ఖమ్మం నగరం దక్షిణ రైల్వే వారి మంచి నెట్వర్క్ ద్వారా భారతదేశం లోని ఇతర నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. ఈ పట్టణం హైదరాబాద్-విజయవాడ లైన్ లో వస్తుంది. ఈ లైన్ ద్వారా వరంగల్, విశాఖపట్టణం, తిరుపతి, చెన్నై, న్యూ డిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి ఇతర పట్టణాలకు ఈ నగరం అనుసంధానించబడి ఉంది. ఇక్కడ అనేక సూపర్ ఫాస్ట్, పాసెంజర్, ఎక్స్ప్రెస్ రైళ్ళు ఖమ్మలో ఆగుతాయి.

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం

వాయు మార్గం ద్వారా

ఖమ్మంలో విమానాశ్రయం లేదు. గన్నవరం ఖమ్మం కి దగ్గర విమానాశ్రయ౦, ఇది ఒక దేశీయ విమానాశ్రయం. ఖమ్మం నగరం నుండి 298 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయ౦. ఖమ్మంలో విమానాశ్రయ నిర్మాణ౦ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. విమానం ద్వారా హైదరాబాద్ వచ్చిన వారు అద్దె టాక్సీలలో లేదా బస్సులలో ఖమ్మం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X