Search
  • Follow NativePlanet
Share
» »ఫలోదీ - ఆకర్షించే వారసత్వ కట్టడాలు !

ఫలోదీ - ఆకర్షించే వారసత్వ కట్టడాలు !

By Mohammad

'ఉప్పు నగరం' గా పిలువబడే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఫలోదీ. ఈ పట్టణం బంగారు నగరం గా పిలిచే జైసల్మేర్ కు సూర్య నగరం గా పిలిచే జోధ్పూర్ కు మధ్యలో థార్ ఎడారి లో వుంది. ఎడారి ఓడలుగా పిలువబడే ఒంటెల మీద ఇప్పటికీ ఉప్పు వాణిజ్యం జరిగే కేంద్రం ఇది. ఫలోదీకి బికానేర్, నాగౌర్, జైసల్మేర్, జోధ్పూర్ లు సరిహద్దుగా వున్నాయి.

ఫలోదీ లోని వారసత్వ భవనాలు రాజస్థాన్ లోని ఝారోఖా, జాలీ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తాయి. 300 ఏళ్ళ నాటి ఫలోదీ కోట ఇక్కడి ప్రసిద్ధ చారిత్రిక కట్టడాల్లో ఒకటి. ఈ కోట అద్భుత నిర్మాణ శైలి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ఇది కూడా చదవండి: మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ : ఒక రాయల టూర్ !

ఫలోదీ ని సందర్శించే యాత్రికులు 1750 లో ఎర్రని ఇసుక రాయితో నిర్మించిన లాల్ నివాస్ కూడా చూడవచ్చు. ఈ అందమైన భవంతిని ఇప్పుడు ఆకర్షణీయమైన ప్రాచీన వస్తువులతోను, గాజు షాండిలియర్ ల తోనూ అలంకరించిన హెరిటేజ్ హోటల్ గా మార్చివేసారు. సచియా మాత గుడి, మహావీర మందిరం, రామ్ దేవరా దేవాలయం, సూర్య దేవాలయం ఇక్కడి ఇతర ప్రధాన ఆకర్షణలు.

ఫలోదీ లోని వారసత్వ కట్టడం

ఫలోదీ లోని వారసత్వ కట్టడం

చిత్ర కృప : Pablo Nicol

డేమాయిసేల్లె కొంగల గ్రామ౦

కోటలు, వారసత్వ భవనాలు, ప్రాచీన గుళ్ళ తో పాటు ఫలోదీ పక్షి ప్రేమికుల స్వర్గధామం. ఈ ప్రాంతంలోని ఖికన్ గ్రామంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వలస పక్షులను చూడవచ్చు. ఫలోదీ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం స్థానికంగా 'కుర్జా'గా పిలువబడే డేమాయిసేల్లె కొంగ కు తాత్కాలిక నివాసం. నైరుతి యూరప్, ఉక్రెయిన్, పోలాండ్ ల నుంచి ఎంతో దూరం ఎగురుతూ ఖికన్ లో తాత్కాలిక నివాసం కోసం వచ్చే ఈ అరుదైన పక్షి జాతిని చూడడానికి ఆగస్ట్ నుంచి మార్చ్ మధ్య కాలం సరైనది. ఈ పక్షులకు తాత్కాలిక ఆవాసంగా ప్రపంచ ప్రసిద్ది చెందడం తో ఈ గ్రామాన్ని 'డేమాయిసేల్లె కొంగల గ్రామం' గా పిలుస్తున్నారు.

డేమాయిసేల్లె కొంగల గ్రామ౦

డేమాయిసేల్లె కొంగల గ్రామ౦

చిత్ర కృప : Tathagat Arya

రామ్ దేవరా ఆలయం, ఫలోదీ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహానికి ప్రసిద్ది.

ఇది కూడా చదవండి : సికార్ - చారిత్రక గాధల నగరం !

సంస్కృతి, వర్ణాలు & జాతీయత

స్థానికంగా జూతీ లుగా పిలువబడే పాదరక్షలు, రంగు రంగుల గాజులు, రంగు రంగుల దుస్తులు ధరించే స్త్రీలు, బీడింగ్ లు, వెండి ఆభరణాలు ఫలోదీ ని కళ్ళకు కడతాయి. ఈ ప్రాంతంలో హిందీ, రాజస్థానీ ఎక్కువగా మాట్లాడే భాషలు. దీని గొప్ప సంస్కృతికే కాక, ఈ పట్టణాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన కోటలు, రాజప్రాసాదాలు, బజార్లు, పురాతన హిందూ, జైన దేవాలయాలకు ఫలోదీ ప్రసిద్ది చెంది౦ది.

హెరిటేజ్ భవనం యొక్క ఛాత్రి

హెరిటేజ్ భవనం యొక్క ఛాత్రి

చిత్ర కృప : Mukesh sarawag

ఫలోదీ చేరుకోవడం ఎలా ?

  • ఫలోదీ ని వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోవచ్చు. ఫలోదీ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వున్న జోధ్పూర్ ఇక్కడికి దగ్గరి విమానాశ్రయం.
  • బికానేర్, జైసల్మేర్, లాల్ ఘర్, పాత డిల్లీ, జోధ్పూర్ ల నుంచి యాత్రికులు ఇక్కడికి రైళ్ళలో కూడా చేరుకోవచ్చు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల నుంచి ఫలోదీ చేరడానికి కార్లు సిద్ధంగా వుంటాయి.
  • ఫలోదీ నగరాన్ని చేరడానికి సౌకర్యవంతంగా, వీలుగా వుండే బస్సు సేవలు కూడా అందుబాటులో వున్నాయి. ఫలోదీ నుంచి జోధ్పూర్, అజ్మీర్, జైపూర్, బేవార్, ఆగ్రా, అల్లహాబాద్, కాన్పూర్ వంటి ప్రసిద్ధ యాత్రా స్థలాలకు పర్యాటకులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X