Search
  • Follow NativePlanet
Share
» » అలహాబాద్ పర్యటనలో పాప ప్రక్షాళన !

అలహాబాద్ పర్యటనలో పాప ప్రక్షాళన !

ఈ సారి ఎక్కడకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా ? ఉత్తర ప్రదేశ లోని అతి పెద్ద నగరం అయిన అలహాబాద్ కు పర్యటించండి.

పూర్వకాలంలో ప్రయాగ అని పిలువబడిన ఈ పట్టణం, వేదాలలోను మరియు రామాయణ , మహాభారత వంటి ఇతిహాసాలలోను కూడా పేర్కొనబడింది. ఈ పట్టణంలో బ్రిటిష్ నిర్మాణ సౌదాలైన అల్ ఫ్రెడ్ పార్క్ వంటి వాటితో పాటు హిందువుల పురాణ ప్రదేశాలు కూడా కలిగి టూరిస్ట్ లకు ఎన్నో ఆనందాలను పంచుతున్నాయి.

ఇక్కడ రుచికరమైన మొగలాయీ వంటకాలు కూడా తినవచ్చు. బాగా పండిన మామిడి పండ్లు, జామ కాయలు, వేసవి మరియు వింటర్ లలో దొరుకుతాయి. అలహాబాద్ పర్యటనకు కొన్ని మార్గదర్శకతలు ఇక్కడ కనుగొనండి.

అలహాబాద్ హోటల్స్ కు క్లిక్ చేయండి

అల్ ఫ్రెడ్ పార్క్

అల్ ఫ్రెడ్ పార్క్

బ్రిటిష్ యువరాజు అల్ ఫ్రెడ్ ఇండియా పర్యటనకు వచ్చినపుడు అలహాబాద్ లో ఈ అతి పెద్ద పార్క్ ను నిర్మించారు. ఒకప్పుడు దీనిలో కింగ్ జార్జ్ మరియు రాణి విక్టోరియాల పెద్ద విగ్రహాలు ఉండేవి. ఈ పార్క్ లో అందమైన తెల్లటి మార్బుల్ రూఫ్ కలదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్క్ పేరును ఇక్కడే అసువులు బాసిన ఒక స్వాతంత్ర యోధుడు పేరు పై చంద్ర శేకర్ ఆజాద్ పార్క్ గా మార్చారు.

Photo Courtesy: Maini vaibhav

అలహాబాద్ కోట

అలహాబాద్ కోట

అలహాబాద్ కోటను అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. ఇది గంగ మరియు యమునా నదుల సంగమంలో కలదు. ఈ కోట ఒక ప్రత్యేక నిర్మాణ శైలి , కళా నైపుణ్యాలు కలిగి వుంది. ప్రస్తుతం ఈ కోట భారత సైన్య నివాసంగా వుంది. కనుక కోట లోని అన్ని భాగాలు చూడటం కుదరదు. ప్రసిద్ధి చెందిన అశోక పిల్లర్ ఇక్కడే కలదు.
Photo Courtesy: Aman Deshmukh

అక్షయవట్

అక్షయవట్

అక్షయవట్ లేదా సజీవ రావి చెట్టు కోట లోపలి భాగంలో కలదు. కోట భారత సైన్యం అధీనంలో వుండటం చే దీనిని చూసేందుకు ముందస్తు అనుమతులు అవసరం అవుతాయి.
Photo Courtesy: Eric Guinther

అలహాబాద్ మ్యూజియం

అలహాబాద్ మ్యూజియం

అలహాబాద్ మ్యూజియం ను 1931 లో నిర్మించారు. దీనిలో అనేక కళాకృతులు కలవు. వివిధ గాలరీ లుగా దీనిని విభజించారు. ఒక గాలరీ లో టెర్ర కొట్ట కళాకృతులు కలవు. ఈ మ్యూజియం లో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు కు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు, డాక్యుమెంట్ లు కలవు.
Photo Courtesy: Dananuj

అలహాబాద్ యూనివర్సిటీ

అలహాబాద్ యూనివర్సిటీ

అలహాబాద్ యూనివర్సిటీ ఇండియా లో అతి పురాతనమైన ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ.

Photo Courtesy: Adam Jones

అల్ సెయింట్స్ కేథడ్రాల్

అల్ సెయింట్స్ కేథడ్రాల్

అలహాబాద్ లో కల అల్ సెయింట్స్ కేథడ్రాల్ చర్చి దాని శిల్ప శైలికి ప్రసిద్ధి గాంచినది. ఈ చర్చి లో ఒకేసారి సుమారు 400 మంది ప్రార్ధనలు చేయవచ్చు. ఈ చర్చి ని స్థానికంగా 'పత్తర్ చర్చి' అంటారు. అంటే రాతి చర్చి అని అర్ధం.
Photo Courtesy: Ojas Tripathi

ఆనంద్ భవన్

ఆనంద్ భవన్

ఆనంద్ భవన్ నెహ్రు - గాంధి కుటుంబానికి చెందిన ఒక పురాతన ఆస్తి. ఆనంద భవన్ అంటే, సంతోషాల నిలయం అని అర్ధం. ఇక్కడ పూర్వం గొప్ప రాజ కీయ నేతల సమావేశాలు జరిగాయి. ఇపుడు ఈ భవనం ఖాళీగా వుంది. దీనిని జవహర్లాల్ నెహ్రు మెమోరియల్ ఫండ్ నిర్వహిస్తోంది. లోపల ప్రవేశించి గతం గురించి తెలుసుకొనవచ్చు.
Photo Courtesy: Adam Jones

ఖుస్రో బాగ్

ఖుస్రో బాగ్

ఖుస్రో బాగ్ ఒక రక్షిత గోడలు గల తోట. దీనిలో మొఘల్ కుటుంబాలకు చెందిన మూడు సమాధులు కలవు. అవి జహంగీరు చక్రవర్తి యొక్క కుమారుడు, జహంగీర్ భార్య, జహంగీర్ కుమార్తె లవి.
Photo Courtesy: Ankur15989

పాతాలపురి టెంపుల్

పాతాలపురి టెంపుల్


పాతాల పూరి టెంపుల్ ఇండియాలో అతి పురాత న టెంపుల్స్ లో ఒకటి. వేదం కాలం నాటిదిగా చెపుతారు. అండర్ గ్రౌండ్ లో కల ఈ టెంపుల్ అలహాబాద్ కోట లో కలదు. తూర్పు గెట్ ద్వారా స్థానికులు దీనికి వస్తారు. దీనిలో అందమైన హిందూ దేవతల శిల్పాలు అనేకం కలవు.
Photo Courtesy: Adam Jones

సంగం

సంగం


సంగం అంటే సంస్కృత భాషలో కలయిక అనే అర్ధం. ఇక్కడ గంగ, యమునా మరియు సరస్వతి నదులు కలుస్తాయి. దీనినే 'త్రివేణి సంగమం' అని కూడా అంటారు. హిందువులు ఈ ప్రదేశంలో పుణ్య స్నానాలు ఆచరించి తమ పాపాలను కడిగి వేసుకుని శుభ్ర పడతారు.

Photo Courtesy: Arunawasthi

ఆహారం

ఆహారం


ఆహార ప్రియులకు అలహాబాద్ రుచులు అందించే ఒక స్వర్గం. మొఘల్ వంటకాలు ఎన్నో తినవచ్చు. సిటీ లోని ప్రతి ప్రదేశంలోను మీకు మొఘల్ వంటకాలతో పాటు వివిధ వంటకాల ఎంపికలు కనపడతాయి.
Photo Courtesy: Leningrad

షాపింగ్

షాపింగ్

సాధారణ షాపింగ్ తో పాటు, ఇక్కడ వేసవిలో రుచికర మామిడి పండ్లు, వింటర్ లో రుచికర జామ కాయలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాక ప్రతి రోజూ ఉదయం వేళ తయారు చేయబడే తాజా కారపు వస్తువులు కూడా కొనవచ్చు. పూజలు చేసేవారు ఇత్తడి లేదా రాగి గంగ నీరు కల చెంబులు సీల్ వేసినవి కొనవచ్చు.

Photo Courtesy: shankar s.

మరిన్ని అలహాబాద్ ఆకర్షణలకు క్లిక్ చేయండి

అలహాబాద్ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X