Search
  • Follow NativePlanet
Share
» »బంగీ జంపింగ్ సాహ‌స క్రీడ‌కు చిరునామాగా నిలిచే ప్ర‌దేశాలు

బంగీ జంపింగ్ సాహ‌స క్రీడ‌కు చిరునామాగా నిలిచే ప్ర‌దేశాలు

బంగీ జంపింగ్ సాహ‌స క్రీడ‌కు చిరునామాగా నిలిచే ప్ర‌దేశాలు

ఇటీవ‌ల కాలంలో ప్రజలు ప్రయాణం చేయడం కంటే సాహసోపేతమైన పనిని చేయడాన్ని ఆనందిస్తున్నారు. అలా సాహసం అంటే ఇష్టమైతే, బంగీ జంపింగ్ లేకుండా ఆ అనుభూతి పొంద‌డం క‌ష్ట‌మే మ‌రి. సాహసాల పట్ల ఆసక్తి ఉంటే, ఖచ్చితంగా బంగీ జంపింగ్ అనుభవాన్ని చ‌విచూడాల్సిందే. బంగీ జంప్ లాంటి సాహ‌స‌క్రీడ‌ల‌కు అనేక పర్యాటక ప్రదేశాలు మ‌న‌దేశంలో చాలానే ఉన్నాయి.

మీకు కూడా బంగీ జంపింగ్ అంటే ఇష్టమైతే, బంగీ జంపింగ్ చేసే ప్రదేశాల‌తోపాటు అక్క‌డి టిక్కెట్ ధర గురించి కూడా తెలుసుకోవాలి. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు బంగీ జంప్ కోసం మ‌న‌దేశంలోని ఈ ప్రదేశాల‌లో ఈ సాహ‌స క్రీడ‌ను ఎంజాయ్ చేస్తారు.

అస‌లు బంగీ జంప్ అంటే ఏంటి?

అస‌లు బంగీ జంప్ అంటే ఏంటి?

ప్రతి ఒక్కరూ కింద ప‌డ‌టం అంటే భ‌య‌ప‌డిపోతారు. కానీ బంగీ జంప్ అనేది ఇలాంటి ఒక సాహసం. ఇక్కడ ప్రజలు ఎత్తు నుండి కింద‌కు దూకి మ‌రీ ఆనందించడానికి ప్రయత్నిస్తారు. బంగీ జంపింగ్ అంటే ఎత్తు నుండి దూకడం. బంగీ జంపింగ్‌లో, ఎత్త‌యిన ప్రదేశం నుండి క్రిందికి నెట్టబడతారు. అయితే ఇందులో సాహ‌సికులు తాడుతో కట్టబడి ఉంటారు. దీని కారణంగా వారు కింద పడకుండా గాలిలో ఊగుతూ ఉంటారు. ఈ సాహ‌స క్రీడ చాలా సరదాగా ఉంటుంది.

రిషికేశ్

రిషికేశ్

రిషికేశ్‌లో కుటుంబ స‌మేతంగా కలిసి ప్రకృతితోపాటు సాహ‌స క్రీడ‌ల‌ను మ‌న‌సారా ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశం రోమింగ్‌తో పాటు సాహసాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ బంగీ జంపింగ్ వినోదం భిన్నంగా ఉంటుంది. రిషికేశ్‌లోని మోహంచట్టి అనే ప్రదేశం బంగీ జంపింగ్‌కు ప్రసిద్ధి పొందింది. మొహంచట్టిలో దాదాపు 83 మీటర్ల ఎత్త‌యిన‌ కొండపై నుంచి బంగీ జంపింగ్‌ని ఆనందించవచ్చు. అనుభ‌విజ్ఞులైన నిర్వాహ‌కుల స‌మ‌క్షంలో రిషికేశ్‌లో బంగీ జంప్ ఫీజు రూ. 3500 వ‌ర‌కూ వ‌సూళ్లు చేస్తారు.

గోవా

గోవా

గోవా అందమైన సముద్ర తీరానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇక్కడ సాహసక్రీడ‌లను కూడా ఆస్వాదించవచ్చు. గోవాలోని గ్రావిటీ జోన్‌లో బంగీ జంపింగ్ చేస్తారు. గోవాలో 25 మీటర్ల ఎత్తులో బంగీ జంపింగ్ కోసం ఒక ప్రదేశం ఉంది. ఇక్క‌డ ఒక్క‌క్క‌రికీ రూ. 500 రూపాయలతో బంగీ జంప్‌ను ఆనందించ‌వ‌చ్చు.

ఢిల్లీ

ఢిల్లీ

ఢిల్లీలోని వండర్‌లస్ట్‌లో బంగీ జంపింగ్ చేస్తారు. ఇక్కడ బంగీ జంపింగ్ స్పాట్ 130 మీటర్ల ఎత్తులో ఉంది. వండర్లస్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగీ జంప్ క్రేన్ సహాయంతో జరుగుతుంది. ఢిల్లీ బంగీ జంప్ విదేశీ బంగీ జంప్ లాగా సరదాగా ఉంటుంది. ఇక్కడ సంద‌ర్శ‌కుల‌కు మరింత భద్రత క‌ల్పిస్తారు. వండర్‌లస్ట్‌లోని బంగీ జంప్ సిబ్బంది జర్మనీ నుండి శిక్ష‌ణ పొందిన‌వారు ఉంటారు.

లోనావాలా

లోనావాలా

మహారాష్ట్రలోని లోనావాలా అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మీరు లోనావాలాలో తిరుగుతూ సాహసాన్ని కూడా ఆస్వాదించవచ్చు. లోనావాలాలో 150 మీటర్ల ఎత్తు నుండి బంగీ జంప్ ఆనందించవచ్చు. ఇక్కడ బంగీ జంపింగ్ రూ.400-500 నుంచి మొదలవుతుంది.

బెంగళూరు

బెంగళూరు

ఓజోన్ అడ్వెంచర్స్ బెంగళూరులో బంగీ జంప్‌లను నిర్వహిస్తోంది. ఇక్కడ బంగీ జంప్ క్రేన్ పై నుండి జరుగుతుంది, కాబట్టి బంగీ జంప్ యొక్క ప్రదేశం ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటుంది. బెంగళూరులో బంగీ జంపింగ్ ఫీజు రూ.400 వ‌ర‌కూ ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X