Search
  • Follow NativePlanet
Share
» »ఛౌకొరి - పవిత్ర స్థలాల గర్భగుడి !

ఛౌకొరి - పవిత్ర స్థలాల గర్భగుడి !

By Mohammad

ఉత్తరాఖండ్ దేవతల భూమి. ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షించటంలో ఈ ప్రాంతం ముందుంటుంది. భూమి పై స్వర్గాన్ని తలపిస్తూ .. ప్రపంచ సుందర దృశ్యాలకు నెలవుగా ఉన్నది. గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్, రిషికేశ్ వంటి పవిత్ర స్థలాలు ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మరో ప్రదేశం ... ఛౌకొరి !

ఛౌకొరి అనే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అందమైన కొండ ప్రాంతంలో విస్తరించి ఉన్నది. ఇది సముద్ర మట్టానికి సరాసరి 2100 మీటర్ల ఎత్తున హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఫిథోరగర్ జిల్లా లో ఆకుపచ్చని పైన్, ఓక్ వృక్షాలతో మరియు రోడోడెండ్రాన్ అడవులతో నిండి ఉన్నది.

ఇది కూడా చదవండి : అల్మోర దృశ్యాలు - మరుపురాని అనుభూతులు !

ఛౌకొరిలో చూడదగ్గ పర్యాటక స్థలాల విషయానికి వస్తే .. అతి పురాతన దేవాలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. మహాకాళీ దేవాలయం, నాగ మందిర్, ఉల్కా దేవి ఆలయం, పాతాల్ భువనేశ్వర్ వాటిలో కొన్ని.

మహాకాళీ ఆలయం

మహాకాళీ ఆలయం

చౌకొరిలో ఉన్న మహాకాళి దేవాలయం చాల ప్రాచుర్యం చెందింది. ఇండియాలోని శక్తి పీఠాలలో ఇది ఒకటి. దీనిని శక్తి పీఠాలలో ఒక దేవాలయంగా ఆది గురు శంకరాచార్య ఎన్నుకుని, దీనిని మహాకాళి దేవతకు అంకితం చేశారు.

చిత్ర కృప : almoraboy

చాముండా దేవి ఆలయం

చాముండా దేవి ఆలయం

మహాకాళీ ఆలయానికి 2 కి.మీ ల దూరంలో చాముండా దేవి ఆలయం చూడదగ్గది. ఆలయ ఆవరణలో రాత్రుళ్ళు ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికుల కధనం.

చిత్ర కృప : sandy226b

నాగమందిర్

నాగమందిర్

నాగమందిర్ బెరినాగ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. దట్టమైన చెట్లు, కొండల నడుమ బెనిమాధవ రాజు నాగవేణి ఈ ఆలయాన్ని కట్టిచారని స్థానికుల నమ్మకం. యమునా నది లో శ్రీకృష్ణుడు కాలినాగ్ ను ఓడించిన తరువాత, కాలినాగ్ తన అనుచరులతో ఈ ప్రదేశానికి వచ్చిందని కొందరి భావన.

చిత్ర కృప : Vivek Sheel Singh

పాతాల్ భువనేశ్వర్

పాతాల్ భువనేశ్వర్

పాతాల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తున గుహలో ఉన్నది. ఈ గుహ శివ భగవానుడికి అంకితం చేయబడింది. గుహలో 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు. ఈ ప్రదేశం నుండి అందమైన పర్వత శిఖరాలను వీక్షించవచ్చు.

చిత్ర కృప : ashwinbahulkar

ఘున్సేర దేవి ఆలయం

ఘున్సేర దేవి ఆలయం

ఘున్సేర దేవి ఆలయం, కొండ పై ఉన్న ఘునసేర గుహలలో కలదు. ఈ దేవాలయంలో అనేక దేవుళ్ళ మరియు దేవతల రాతి బొమ్మలు ఉన్నాయి.

చిత్ర కృప : Kartazon Dream

ఉల్కా దేవి ఆలయం

ఉల్కా దేవి ఆలయం

ఉల్కా దేవి ఆలయం, ఫిథోరగర్ వెళ్ళే మార్గంలో రోడ్డు మీద ఉన్నది. దీనికి సమీపంలో అమరుల స్మారక చిహ్నం, ఆలయం మరియు విశ్రాంతి గృహం లు ఉన్నాయి. ఈ ప్రదేశం నుండి సోయర్ వాలీ యొక్క అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు.

చిత్ర కృప : Vivek Sheel Singh

కామాక్ష ఆలయం

కామాక్ష ఆలయం

కామాక్ష ఆలయం ఫిథోరగర్ కు 7 కి. మీ ల దూరంలో కొండ పై కలదు. ఇక్కడి నుండి కూడా సమీపంలోని అందమైన పర్వత దృశ్యాలను వీక్షించవచ్చు.

చిత్ర కృప : Vivek Sheel Singh

ఛౌకొరి ఎలా చేరుకోవాలి ?

ఛౌకొరి ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ఛౌకొరి కి 232 కి.మీ ల దూరంలో పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ కలదు. న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ తో ఈ విమానాశ్రయం అనుసంధానించబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ఛౌకొరి సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

కథ్గోడం రైల్వే స్టేషన్ ఛౌకొరి కి సమీపాన కలదు. ఇది 194 కి.మీ ల దూరంలో కలదు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్ తదితర పట్టణాల నుండి ఈ రైల్వే స్టేషన్ బాగా కనెక్ట్ చేయబడింది


బస్సు / రోడ్డు మార్గం

హాల్ద్వానీ మరియు ఆల్మోరా నుండి ఛౌకొరి కి చక్కని రోడ్డు మార్గం కలదు. ఫిథోరగర్, కౌసని, దిదిహాట్, బాగేశ్వర్, నైనితాల్ తదితర సమీప పట్టణాల నుండి కూడా ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Vivek Sheel Singh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X