Search
  • Follow NativePlanet
Share
» »పటాన్ - ప్రపంచ ఆకర్షణీయ ప్రదేశం !

పటాన్ - ప్రపంచ ఆకర్షణీయ ప్రదేశం !

By Mohammad

మధ్య యుగ కాలం గుర్తుందా ? పోనీ శాతవాహనులు, కుషాణులు , గుప్తులు, చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, రాజపుత్రులు వీరైనా గుర్తున్నారా ..! అయితే అదే .. మధ్య యుగ కాలం అంటే. పైన పేర్కొన్న ఆ వంశ రాజులందరూ మధ్య యుగ కాలంలో భారతదేశంలోని రాజ్యాలను పరిపాలించారు.

పటాన్ ... మధ్య యుగ కాలానికి చెందిన పట్టణం మరియు అప్పటి గుజరాత్ రాజ్యానికి రాజధాని. పటాన్ పట్టణాన్ని క్రీ.శ. 8 వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్రుల చావడ రాజ్యానికి రాజైన వనవాడ్ చావడ నిర్మించాడు. కందకం, దుర్గాలు మొదలైన వాటిని నిర్మించి ఈ పట్టణాన్ని ఎంతో పటిష్టంగా మార్చాడు.

అహ్మదాబాద్ నగరానికి పటాన్ 126 కిలోమీటర్ల దూరంలో, పాలంపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో కలదు. పర్యాటకులను ఆకర్షించే ఎన్నో వారసత్వ స్థలాలు, అద్భుత నిర్మాణాలు మరియు అప్పటి కాలానికి చెందిన నిర్మాణ అవశేషాలను పూర్తిగా చూడవచ్చు. ఇక్కడ చూడవలసిన కొన్ని ఆకర్షణీయ ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ..

ఇది కూడా చదవండి : పాలన్పూర్ - ఒక ప్రసిద్ధ రాచ విడిది !

జైన దేవాలయం

జైన దేవాలయం

చాళుక్య లేదా సోలంకి కాలానికి చెందిన జైన దేవాలయం పటాన్ లో ఒక ప్రసిద్ధ మత కేంద్రం గా విరాజిల్లుతుంది. ఇక్కడ వందల సంఖ్యలో జైన ఆలయాలు ఉన్నాయి. పంచసార పార్శ్వనాథ్ జైన్ దేరసర్ ఆలయము ఇక్కడ ప్రధాన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ జైన దేవాలయాలన్నీ తెల్లని పాలరాతి తో నిర్మితమై ఉంటాయి.

చిత్ర కృప : Michel Hillon

రాణి కి వావ్

రాణి కి వావ్

రాణి కి వావ్ అనే మెట్ల బావి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానానికి, శిల్ప శైలి కి ప్రతీక. ఈ మెట్ల బావి గుజరాత్ ను పాలించిన సోలంకి రాజ వంశ పాలనలో నిర్మించబడినది. రాణి ఉదయమతి నిర్మించిన ఈ బావి గతంలోని సరస్వతి నది ఒడ్డున పటాన్ లో నిర్మించ బడినది.

చిత్ర కృప : Shri V

రాణి కి వావ్

రాణి కి వావ్

రాణి కి వావ్ ను రాణి ఉదయమతి తన భర్త రాజు భీమ దేవ్ - I జ్ఞాపకార్ధం నిర్మించినది. అందమైన ఈ మెట్ల బావి తాజా గా 1980 సంవత్సర తవ్వకాలలో అనేక శతాబ్దాల తర్వాత బయట పడగా, దీనికి నేడు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించనది.

చిత్ర కృప : FabIndia

రాణి కి వావ్

రాణి కి వావ్

రాణి కి వావ్ గోడలు మరియు స్తంభాల మీద విష్ణు రూపాలైన రామ, వామన,మహిషాసురమర్దిని, కల్కి మొదలైన అవతారాలు చెక్కబడి ఉన్నాయి.

ఇది కూడా చదవండి : రాణి కి వావ్ చిత్రాల రూపంలో దర్శించండి !

చిత్ర కృప : DSM888

సహస్త్రలింగ తలావ్

సహస్త్రలింగ తలావ్

వెయ్యి లింగాల సరస్సు గా ప్రసిద్ధి కెక్కిన సహస్త్రలింగ తలావ్ ను సిద్ధ్రాజ్ జయసిన్ క్రీ.శ. 1084 వ సంవత్సరంలో నిర్మించాడు. ఎంతో మంది ముఖ్యంగా ముస్లీం రాజులు ఈ ప్రాంతం పై దండెత్తారు అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని భాగాలు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.

చిత్ర కృప : Rajtrivedi2001

పటోల్ పట్టు

పటోల్ పట్టు

పటాన్ ప్రస్తుతం పటోల్ పట్టు కి ప్రసిద్ధి చెందినది. పటోల పట్టును నేసె పద్దతి అన్ని నేత పద్ధతులు కన్నా చాలా కష్టంగా ఉంటుంది. వారు పట్టు నేత పనికి 'డబుల్ ఇక్కాట్ శైలి' ని ఉపయోగిస్తారు. చీరలు తయారు చేయటానికి నెలల సమయం పడుతుంది, అందుకే వారు అధిక ధరల టాగ్లు వేస్తారు.

చిత్ర కృప : Rita Willaert

మశ్రు నేత వారు

మశ్రు నేత వారు

మశ్రు చేనేత దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే వాడుకలో ఉన్నది. పట్టును మరియు సిల్క్ ను రెండింటిని ఉపయోగించి నేసె ఒక ప్రత్యేకమైన శైలి ఈ నేతన్నలది. లోపల వస్త్రాన్ని పత్తి తో బయట పొరను సిల్క్ వేసి దుస్తులు తయారు చేస్తారు. ముశ్రు అనే పదానికి అర్థం 'అనుమతి'.

చిత్ర కృప : Melissa Enderle

పటాన్ ఎలా చేరుకోవాలి ?

పటాన్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ విమానాశ్రయం పటాన్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి పటాన్ సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

పటాన్ కకు సమీపాన మెహ్సానా రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

మెహ్సానా, గాంధీనగర్, పాలన్పూర్, అహ్మదాబాద్ తదితర పట్టణాల నుండి నిత్యం రోడ్డు రవాణా బస్సులు, ప్రవేట్ వాహనాలు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Jonesy38

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X