Search
  • Follow NativePlanet
Share
» »ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !

ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !

శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో గల ఒక ప్రముఖ పట్టణం. ఈ పట్టణం తిరుపతి నగరానికి 54 కి.మీ. దూరంలో ఉంది. దేశంలో అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన ఉన్నది. శ్రీకాళహస్తి మూడు పదాల కలయికతో ఏర్పడింది (శ్రీ - సాలీడు, కాళ - పాము, హస్తి - ఏనుగు). దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగం గల గొప్ప పుణ్య క్షేత్రంగా ఖ్యాతిగడించింది.

దక్షిణ కైలాసం గా ముద్ర పడ్డ ఈ దివ్య క్షేత్రం లో ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న రెండు దీపాలలో ఒకటి ఎల్లప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉండటం మరొకటేమో నిశ్చలంగా కదలకుండా ఉండటం. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు నాటి ప్రాచీన భారతీయ వాస్తుకళ కు, శిల్ప కళాకారుల పనితనానికి అద్దంపట్టే విధంగా ఉంటాయి. శ్రీ కాళహస్తి పట్టణం చుట్టూ చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ అందులో నుంచి మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు కొన్నే ఉన్నాయి వాటిలో ప్రధానమైనది వెయ్యి కాళ్ళ మండపం, 36 కు పైగా తీర్థాలు ఇలా ఎన్నో ...

కాళహస్తి దేవాలయం

కాళహస్తి దేవాలయం

శ్రీకాళహస్తి లో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఒకటిగా ఉన్న కాళహస్తి దేవాలయం తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన ఆకర్షణ. పురాణాలలో పేర్కొన్న విధంగా తనను పరీక్షించిన శివుని కోసం తన కంటినే తీసి ఇచ్చిన పరమ భక్తుడు భక్త కన్నప్ప ఇక్కడనే శివుడుని కొలిచాడు.

Photo Courtesy: Kalyan Kumar

కాళహస్తి దేవాలయం

కాళహస్తి దేవాలయం

శివ భక్తులే కాక ఈ కాళహస్తి ఆలయానికి రాహు - కేతు దోషాల నుంచి విముక్తి పొందటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుపతిని సందర్శించేవారు కాళహస్తి లోని కాళహస్తి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

Photo Courtesy: Rahul Pattnaik

కన్నప్ప దేవాలయం

కన్నప్ప దేవాలయం

కన్నప్ప దేవాలయం, శ్రీకాళహస్తి లోని ఒక చిన్న కొండ మీద ఉంది. కాళహస్తి లో ఉన్న ఈ ఆలయం గొప్ప శివ భక్తుడైన భక్త కన్నప్ప కు అంకితం చేయబడినది. వేటగాడు అయిన కన్నప్ప ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని చూసిన తరువాత అక్కడి నుంచి దానిని తీసుకువచ్చి నియమాలకు వ్యతిరేకంగా పక్కనే ఉన్న జలాధార నుండి తన నోటిలో నీరు తీసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు.

Photo Courtesy: go tirupati

భక్త కన్నప్ప గురించి ఒక్కమాటలో ..

భక్త కన్నప్ప గురించి ఒక్కమాటలో ..

కన్నప్ప ఒక వేటగాడు. ఈయన నిత్యం శివుణ్ని ఆరాదించేవాడు. ఒకనాడు శివుడు అలా అతనిని కొలిచే సమయంలో కన్నప్ప భక్తిని పరీక్షించడం కోసం తన కంటి నుండి రక్తం కార్చేవాడు వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామివారికి అమర్చాడు వెంటనే మరో కంటి నుండి రక్తం కారడం మొదలవడంతో భక్తుడైన కన్నప్ప సందేహీంచకుండా తన రెండవ కన్నుని కూడా పీకి స్వామివారికి అమర్చాడు. దీనికి చూసి ఎంతగానో ముగ్ధుడైన శివుడు ప్రత్యెక్షమై అతనిని కరుణించి ముక్తిని ప్రసాదించాడు.

Photo Courtesy: go tirupati

చతుర్ముఖేశ్వర దేవాలయం

చతుర్ముఖేశ్వర దేవాలయం

బ్రహ్మ మరియు మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తి లోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. ఈ గుడిలో శివలింగం నాలుగు దిక్కులూ చూసే నాలుగు ముఖాలతో వుండడం విశేషం. చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలున్న వాడని అర్ధం. ఈ దేవాలయం గోడల మీద శివుడికి చెందిన పురాణ గాధల చిత్రాలు వున్నాయి.

Photo Courtesy: Ramesh-K

సహస్ర లింగ దేవాలయం

సహస్ర లింగ దేవాలయం

శ్రీకాళహస్తి లో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఒకటి సహస్ర లింగ దేవాలయం. ఒక అందమైన అడవి మధ్యలో వున్న ఈ గుడి పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ‘సహస్ర' అంటే వేయి అని అర్ధం - ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన శివలింగం వుండడం వల్ల ఈ గుడికి ఆ పేరు అంతేనా .. ఈ దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ జన్మలోనూ, పూర్వజన్మల్లోనూ చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Photo Courtesy: pponnada

దుర్గంబికా దేవాలయం

దుర్గంబికా దేవాలయం

దుర్గాంబికా దేవి కోసం శ్రీకాళహస్తి లో సముద్ర మట్టానికి 800 మీ. ఎత్తున ఒక కొండపై నిర్మించిన దుర్గాంబికా దేవాలయం చాలా పురాతనమైనది. దీని రమణీయ దృశ్యాల వల్ల స్థానికులే కాక పర్యాటకులు కూడా ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. కొండ దిగువ నుంచి బాగా వెడల్పాటి మెట్లు నిర్మించారు. దీనివల్ల ఈ కొండ ఎక్కడం చాలా తేలికవుతుంది. వందలాది మంది భక్తులు ఈ దేవత చల్లని దీవెనల కోసం ఇక్కడికి వస్తుంటారు.

Photo Courtesy: Shanbhag

ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం

ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం

శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతం లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు. ఇది కాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే వుంది. ఈ దైవం ఆశీస్సుల కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తారు.

Photo Courtesy: temples india

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

శ్రీకాళహస్తి లోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయం గా ప్రఖ్యాతి గాంచింది. ఈ దేవాలయం 1200 - 1500 ఏళ్ళ నాటిదంటారు. పరిసరాల్లో వున్న గుళ్ళతో పోలిస్తే ఈ గుడి చిన్నదే అయినప్పటికీ ఎంతో మంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తారు. గమ్మత్తేమిటంటే ఈ చిన్న గుళ్ళోనే దక్షిణ భారతంలో కెల్లా అతి పెద్ద శివలింగం వుంది.

Photo Courtesy: NsChandru

శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం

శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం

సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం శ్రీకాళహస్తి లో వుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఆడి కృత్తిక ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది పొందింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సంగీత నృత్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఉత్సవాల చివరి రోజు దేవాలయాన్ని దీపాలతో, పుష్పాలతో అలంకరించి, సుబ్రహ్మణ్య స్వామి ఆయన దేవేరుల విగ్రహాలను రథాల మీద వుంచి ఊరి వీధుల గుండా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు.

Photo Courtesy: రవిచంద్ర

గుడిమల్లం

గుడిమల్లం

శ్రీకాళహస్తి కి 54 కి. మీ. దూరంలో ఉన్న గుడిమల్లంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది అదేమిటంటే ఇక్కడున్న శివలింగం లింగరూపంలో కాకుండా మానవ రూపంలో వేటగానివలె ఉంటుంది. పురుషాంగము తో పోలి ఉన్న ఈ లింగం ప్రపంచంలో అతి పురాతనమైన శివలింగంగా ఖ్యాతి గడించింది.

Photo Courtesy: Elvey

వేయిలింగాల కోన జలపాతం

వేయిలింగాల కోన జలపాతం

వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం చేస్తారు. చుట్టూ శివలింగాలను పోలి వున్న రాళ్ళతో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని భావిస్తారు. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయనే నమ్మకం వల్ల ఎంతో మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.

Photo Courtesy: go tirupati

భరద్వాజ తీర్థం

భరద్వాజ తీర్థం

శ్రీకాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం వుంది. ఈ తీర్థం నెలకొని వున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్ల తో ఉండి ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ తీర్థం మధ్య ధ్యానముద్రలో వున్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం వుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ తీర్థం లో మునక వేయడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

Photo Courtesy: NsChandru

ఉబ్బలమడుగు జలపాతం

ఉబ్బలమడుగు జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం జలకళతో కళకళలాడుతూ ఉంటుంది. టెక్కింగ్ మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. ఈ జలపాతాన్ని వీక్షించడానికి స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

Photo Courtesy: McKay Savage

తలకోన జలపాతం

తలకోన జలపాతం

శ్రీకాళహస్తి పట్టణానికి 82 కి. మీ. దూరంలో ఉన్న తలకోన జలపాతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కెల్ల ఎత్తైనది. ఈ జలపాతానికి సమీపంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది. అలాగే జలపాతం కింద గుంటలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

Photo Courtesy: VinothChandar

షాపింగ్

షాపింగ్

శ్రీకాళహస్తి కళంకారి కళలకు పుట్టినిల్లు. శ్రీకాళహస్తి లో షాపింగ్ చేయటం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా చెప్పవచ్చు. సహజసిద్ధమైన మరియు ఎటువంటి హానికరం చెయ్యని రంగులతో చిత్రాలు వేయటం కళంకారి కళలో ప్రత్యేకత. కలంకారీ చిత్రాలతో పాటు వేరే ఇతర కళాకృతులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ పట్టణానికి వున్న ధార్మిక ప్రాముఖ్యం వల్ల ఇక్కడి నుంచి పర్యాటకులు, భక్తులు పూజకు పనికి వచ్చే వస్తువుల్లా౦టివే కొంటారు.

Photo Courtesy: Kalyan Neelamraju

వసతి గృహాలు

వసతి గృహాలు

యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము తో పాటుగా పలు ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుంది.

Photo Courtesy: satish.skht

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి?

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం

శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతిలోని రేణిగుంట ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ వుంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.

రైలుమార్గం

ప్రధాన రైళ్లన్నీ శ్రీకాళహస్తి లో ఆగుతాయి. ఈ పట్టణం నుంచి అనేక రైళ్ళ ద్వారా దక్షిణాది లోని అనేక నగరాలకు అనుసంధానం వుంది. ఇతర స్టేషన్లలో రైళ్ళు మారకుండా నేరుగా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు. దీనికి సమీపంలో గుడూరు రైల్వే జంక్షన్ ఉంది.

రోడ్డు మార్గం

రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాళహస్తికి అనేక బస్సులు నడుపుతుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, నెల్లూర్ లాంటి నగరాలకు నిత్యం బస్సులు తిరుగుతాయి. తిరుపతి నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది.

Photo Courtesy: satish.skht

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more