» »కోట నగరం - ఖమ్మం

కోట నగరం - ఖమ్మం

దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వున్న ఖమ్మం నగరం ఖమ్మం జిల్లాకు ప్రధాన కేంద్రం కూడా. ఇటీవలే చుట్టుపక్కల వున్న 14 గ్రామాలను విలీనం చేయడంతో నగరపాలక సంస్థగా ఈ నగరం రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు తూర్పున 273 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం తెలంగాణ సందర్శించే వారికి నచ్చే పర్యాటక స్థలం.

స్థానిక గాధల ప్రకారం స్థంభ శిఖరి లేదా స్తంభాద్రి అని పిలువబడిన నరసిమ్హాద్రి గుడి పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. విష్ణు మూర్తి అవతారం నరసింహ స్వామి దేవాలయం ఇది. సుమారు 1.6 మిలియన్ ఏళ్ళనాటి త్రేతా యుగం నుంచి ఈ నగరం ఉండేదని రుజువైంది. ఈ గుడి ఒక కొండ శిఖరం పై ఉ౦డగా కొండ క్రింద నిలువుగా వున్న రాయి స్థంభం లాగా పని చేసేది.

ఈ స్థంభం లేదా 'ఖంబా' అనే పదం నుంచి ఈ ఊరి పేరు పుట్టింది. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాన్ని 'కంబం మెట్టు' అనేవారు, అదే క్రమేణా ఖమ్మం మెట్టు లేదా ఖమ్మం గా మారిపోయింది.
కృష్ణా నదికి ఉపనది అయిన మునేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగర౦ వుంది.

కోట నగరం - ఖమ్మం

కోట నగరం

కోట నగరం

చరిత్రలో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక, రాష్ట్రం మొత్తానికి చాలా ముఖ్యమైనది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక.

కోట నగరం

కోట నగరం

ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్ల ఈ మిశ్రమ శైలి ఏర్పడింది. ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది.

కోట నగరం

కోట నగరం

ఖమ్మం ను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మం కు ప్రత్యేకత తీసుకు వచ్చింది.

కోట నగరం

కోట నగరం

ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే, అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ. ఖమ్మం, భారతదేశం లోని లక్షలాదిమంది పర్యాటకులు ఆకర్షించే ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఖమ్మంలోను, చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి.

సందర్శనీయ స్థలాలు

సందర్శనీయ స్థలాలు

వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రాంతంలో పలైర్ సరస్సుతో పాటు పాపి కొండలు, వాయర్ సరస్సు ప్రధాన సందర్శనీయ స్థలాలు.

కోట నగరం

కోట నగరం

అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది.

కోట నగరం

కోట నగరం

అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది.

కోట నగరం

కోట నగరం

చంద్రముఖీలాంటి సినిమాలలో నిధికి లేదా ఏదైనా పురాతనవస్తువులకు పాము కాపలాగా వుండటం అది వెంటపడటం చూసాం.కానీ అదే నిజజీవితంలో జరిగితే.ఖమ్మం జిల్లా చెండ్రుగొండ్లమండలం దామరచెర్లలో అలాంటి ఘటనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

కోట నగరం

కోట నగరం

వీరభద్రుడి పురాతన విగ్రహాలను తరలించటానికి ప్రయత్నిస్తుండగా పాము వెంటపడిందని అంటున్నారు.ఈ సంఘటనవివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దామరచెర్లకు చెందిన భూస్వామి లక్ష్మీవెంకట నరసింహరావ్ తన వ్యవసాయక్షేత్రంలో ఖాళీగా వున్న భూమిని తన ట్రాక్టర్ తో చదును చేస్తున్నాడు.

కోట నగరం

కోట నగరం

ఈ క్రమంలో ఆయుధం కల్గిన వీరభద్రుని విగ్రహంతో పాటు ఆనవాళ్ళు కోల్పోయిన మరోవిగ్రహం, చిన్నశివలింగం లభించాయి.దీంతో ఆయన విషయాన్ని అధికారులకు చేరవేసారు.పురాతన విగ్రహాల విషయం పత్రికల్లో కూడా ప్రకటించడమైంది.

కోట నగరం

కోట నగరం

ఈ క్రమంలో కొత్తగూడెం ఆర్.డి.వో ఎం.రవీంద్రనాథ్ ఆదేశాలమేరకు తహసీల్దార్ కనకదుర్గ సిబ్బందితో కలసి బుధవారం దామరచర్ల శివారులోని సంఘటన స్థలానికి వెళ్లారు. పురాతన విగ్రహాలను తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో సిబ్బంది విగ్రహాలను తీసుకుని బయల్దేరగా.. అకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైనట్లు అక్కడున్న వారు చెబుతున్నారు.

కోట నగరం

కోట నగరం

అది తహసీల్దార్ కనకదుర్గ వెంటపడగా.. అక్కడున్న వారు పాము.. పాము అంటూ కేకలు వేయడంతో ఆమె ఒక్కసారిగా పరుగులు పెట్టారు. కొంతదూరం తరువాత పాము కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ సిబ్బందితోపాటు భూస్వామి రాజా చెబుతున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న అధికారులు ఆ విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తెచ్చారు.

కోట నగరం

కోట నగరం

భయం భయంగా..పురాతన విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు, సిబ్బంది కొన్ని గంటలపాటు భయం భయంగా గడిపారు. జరిగిన సంఘటనపై ఆందోళన చెందిన తహసీల్దార్ కనకదుర్గ ఈ విషయాన్ని ఆర్డీవోకు వివరించారు.

కోట నగరం

కోట నగరం

అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు పురాతన విగ్రహాలను మళ్లీ యథాస్థానానికి తరలించారు. దీనిపై తహసీల్దార్ ను వివరణ కోరగా.. తాను పరుగులు పెట్టిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను పామును చూడలేదన్నారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఖమ్మం నగరం రాష్ట్రంలోని అదేవిధంగా దేశంలోని ఇతర భాగాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఖమ్మంలో ఎటువంటి విమానాశ్రయం లేదు, రాజధాని నగరమైన హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం. అయితే, ఖమ్మం లో విమానాశ్రయం లేకపోవడం వల్ల రోడ్డు, రైలు మార్గాలు ఏర్పడ్డాయి. ఈ నగరం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. ఇది హైదరాబాద్-విశాఖపట్టణం లైన్ లో ఉండడం వల్ల భారతదేశం అంతటి నుండి అనేక రైళ్ళు ఖమ్మం కి చేరుకుంటాయి.