Search
  • Follow NativePlanet
Share
» »చిత్తూరు దగ్గర చూడవలసిన ప్రదేశాలు

చిత్తూరు దగ్గర చూడవలసిన ప్రదేశాలు

చిత్తూరుని "చిట్ర ఊర్" అని తమిళంలో అనేవారు. చిత్తూరు ఒకప్పుడు తమిళ దేశంలో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది అనీ ఊర్ అనగా గ్రామము అని అర్థము.

By Venkata Karunasri Nalluru

చిత్తూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో కలదు. ఒకప్పుడు చిత్తూరు తమిళనాడులో ఒక భాగం. చిత్తూరును తమిళంలో చిట్ర ఊర్ అని పిలిచేవారు. చిట్ర అంటే చిన్నది, ఊర్ అంటే గ్రామం అని అర్థం. తర్వాత చిత్తూరుగా రూపాంతరం చెందినది.

పాకాల - కాట్పాడి రైలు మార్గములో చిత్తూరు రైల్వే స్టేషను కలదు. ఇక్కడినుండి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు రవాణా సౌకర్యము కలదు.

kanipakam temple history

PC : Liji Jinaraj

ఇక్కడ ప్రధానంగా ధాన్యము, చెరకు, మామిడి మరియు వేరుశనగ పండిస్తారు.

చిత్తూరు దగ్గర చూడవలసిన ప్రదేశాలు :

కాణిపాకం వినాయకుడి గుడి :

కాణిపాకంలో సజీవంగా వెలసిన వినాయకునికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర వుంది. కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు 12 కి.మీ. దూరంలో ఉంది.

కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది ?

కాణిపాకంలో స్వామివారు స్వయంభూగా వెలసినారు. కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకప్పుడు కాణిపాకంలో అంగవైకల్యం వున్న ముగ్గురు సోదరులకు పొలం ఉండేది. ముగ్గురూ కలిసి ఆ పొలాన్ని సాగుచేసేవారు. ముగ్గురూ కలిసి ఒక నూతిని త్రవ్వి నీరు తోడి పొలానికి పట్టేవారు. కొన్ని రోజులకు నూతి ఎండిపోయింది. పొలాలకు నీటి కోసం మరి కొంత లోతు త్రవ్వారు. అలా చాలా లోతుకు త్రవ్వేసరికి సడెన్ గా గడ్డపారకు ఒక రాయి తగిలింది. ఆ రాయి నుండి రక్తం కారటం మొదలుపెట్టింది. ఆ రాయిలో వున్న మహత్యం వల్ల అంగవైకల్యంతో బాధపడుతున్న ఆ ముగ్గురు సోదరులకు దాని నుంచి విముక్తి కలిగింది.

ఈ మహత్యం ఊరంతా ప్రాకింది. వెంటనే ఆ ఊరి ప్రజలంతా స్వయంభూగా వెలిసిన ఆ వినాయకునికి కొబ్బరి నీటితో అభిషేకించి పూజలు చేయటం ప్రారంభించారు. పొలంలో అభిషేకించిన కొబ్బరి నీళ్ళు పావు ఎకరం ప్రవహించసాగింది. దానితో అందరూ కాని "కానిపరకం" అని పిలవసాగారు. ఇప్పుడు అందరూ దీనినే "కాణిపాకం" అని పిలుస్తున్నారు.

కాణిపాకం దేవస్థానం :

kanipakam temple history

చిత్రకృప : Adityamadhav83

కాణిపాకంలో పూజలందుకునే దేవుడు వినాయకుడు. ఇక్కడ కొలువుదీరిన వినాయకుని విగ్రహం వేల సంవత్సరాల కాలం నాటిది అని చెప్తారు. ఈ వినాయకుని విగ్రహం ఆనాటి నుండి ఈనాటి వరకు పెరుతూనే వుంది.

వినాయకుని విగ్రహం పెరుగుతూ వుందని ఎలా తెలుస్తుంది ?

ఇక్కడ వినాయక స్వామికి ఏభై సంవత్సరాల నాటి వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదని చెప్తారు. ఇక్కడ వినాయకుడు భక్తులు అడిగిన వరాలు కురిపించే స్వామిగా వరసిద్ధి వినాయక స్వామిగా పూజలందుకుంటున్నాడు.

kanipakam temple history

చిత్రకృప : Murali Reddy

ఇక్కడ వినాయకుని విగ్రహం కొద్దిగా నీటిలో మునిగి వుంటుంది. వినాయక చవితికి ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తారు.

కాణిపాకం గుడిని దర్శించుకోవలసిన సమయం :

తెల్లవారిజామున 4:00 గం. ల నుండి రాత్రి 9:30 గం. ల వరకు దర్శించుకోవచ్చును.

ఇక్కడ గల వసతి సౌకర్యాలు :

కాణిపాకం దేవస్థానంలో 6 రూములు భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఇంకా 100 రూములను నిర్మిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు :

బస్సు ప్రయాణం: తిరుపతి నుండి కాణిపాకం కు ప్రతి 15 ని.లకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుండి ప్రతి 10 ని.లకు బస్సు వుంది.

రైలు ప్రయాణం : ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నుండినైనా చిత్తూరుకు రైళ్ళు సౌకర్యం వుంది. చిత్తూరులో దిగి కాణిపాకం చేరవచ్చు.

విమాన ప్రయాణం : తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం నుంచి విమాన సౌకర్యం కలదు.

అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయం :

kanipakam temple history

PC : youtube

చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ గల పుష్కరిణిలో నీరు చాలా పవిత్రమైనది. ఇక్కడి చెరువులోని మట్టిని 40 రోజులు అనేక శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

మొగిలి :

kanipakam temple history

PC : youtube

చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో మొగిలీశ్వరాలయం కలదు. ఇక్కడ వెలసిన దేవుడు "ఈశ్వరుడు". ఈ దేవస్థానం చిత్తూరు నుండి బెంగుళూరుకు వెళ్ళే మార్గమధ్యంలో ఉంది.

హార్సిలీ హిల్స్ :

kanipakam temple history

Image source:wikitravel.org

హార్సిలీ హిల్స్ "చిత్తూరు జిల్లా మదనపల్లె" వద్ద కలదు. దీని అసలు పేరు "ఏనుగు మల్లమ్మ". దీనికి "ఆంధ్రా ఊటీ" అని పిలుస్తారు.

ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు ఊరట ఈ "హార్సిలీ హిల్స్". ఈ కొండలు పశ్చిమ కనుమలలో కలదు. ఈ హిల్స్ తిరుమలకొండ కంటే 1200 అడుగుల ఎత్తులో వున్నాయి. అందువల్ల ఇక్కడ చాలా చల్లగా వుంటుంది.

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చి సేద తీరుతుంటారు. ఇక్కడ టూరిజం శాఖ ఎన్నో సౌకర్యాలు కల్పించింది. ఇక్కడ వసతిగృహాల కోసం ఆన్ లైన్ సౌకర్యం కూడా కలదు. ఇక్కడి కొండలలో అనేక వృక్షజాతులు వున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు జంతు ప్రదర్శనశాలలు మరియు మొసళ్ళ పార్కును కూడా ఏర్పాటుచేశారు.

రవాణా సౌకర్యాలు :

తిరుపతి నుండి 150 కి.మీ, మదనపల్లె నుండి 28 కి.మీ. ల దూరంలో కలదు. ప్రతి వారాంతాలలో బెంగళూరు నుండి టూరిజం శాఖ స్పెషల్ ప్యాకేజీ బస్సులను నడుపుతోంది.

ఆర్టీసి వారు తిరుపతి నుండి మధ్యాహ్నం 1:30 గం.లకు , మదనపల్లె నుండి ప్రతి రోజూ ఉదయం 6:30 గం.లకు, 9:00 గం.లకు, మధ్యాహ్నం 2:00 గం.లకు మరియు సాయంత్రం 5:00 గంటలకు బస్సుల సౌకర్యాన్ని కల్పించారు.

రూట్ మ్యాప్ :

బెంగళూరు నుంచి మదనపల్లె చేరి అక్కడ నుంచి హార్సిలీహిల్స్ వెళ్ళవచ్చును
చెన్నై నుండి అయితే చిత్తూరు మీదుగా చేరుకోవచ్చును

ఇక్కడ గల వసతులు :

ఇక్కడ అటవీశాఖ వారు అనేక వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఉదా : బాహుదా, కళ్యాణి, పింఛా, కౌండిన్యా మొదలైనవి. అద్దె రోజుకు రూ.300 వుంటుంది. ఇంకా ఎక్కువ ధరలతో సూట్లు కూడా వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X