Search
  • Follow NativePlanet
Share
» »పఠాన్ కోట్ - హిమాలయ పర్వత శ్రేణులకు ప్రవేశ ద్వారం !

పఠాన్ కోట్ - హిమాలయ పర్వత శ్రేణులకు ప్రవేశ ద్వారం !

By Mohammad

పఠాన్ కోట్ పంజాబ్ రాష్ట్రం లోని అతి పెద్ద నగరాలలో ఒకటి. కాంగ్రా మరియు డల్హౌసీ కొండల కింద భాగంలో కల ఈ నగరం 'హిమాలయా పర్వత శ్రేణులకు ప్రవేశ ద్వారం' గా వుంటుంది. హిమాలయాలకు వెళ్ళే చాలామంది పర్యాటకులు ఇక్కడ ఆగుతారు.

పఠాన్ కోట మరియు చుట్టపట్ల కల పర్యాటక ఆకర్షణలు

పఠాన్ కోట్ పర్యటనలో నూర్పూర్ కోట వంటి అనేక ప్రదేశాలు చూడవచ్చు ఈ కోటను సుమారు 900 సంవత్సరాల కిందట పతానియ రాజ్ పుత్రులు నిర్మించారు. ఇంతేకాక, ఇక్కడ షాపూర్ కండి కోట, శివ టెంపుల్ కాట్ ఘర్ మరియు జుగిఅల్ టవున్ షిప్ వంటివి కూడా ప్రసిద్ధి చెందినవే. టూరిస్టులు వారాంతంలో జ్వాలాజి మరియు చిన్త్పుర్ని వంటి ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు కూడా చూడవచ్చు.

ముక్తేశ్వర్ ఆలయం

ముక్తేశ్వర్ ఆలయం

చిత్రకృప : Dev39616

ముక్తేశ్వర్ ఆలయం

ముక్తేశ్వర్ ఆలయం పఠాన్ కోట్ కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలో, రావి నది ఒడ్డున కలదు. ఈ దేవాలయం శివభగవానుడికి అంకితం చేయబడింది. ఇంకనూ విష్ణు, పార్వతి, గణపతి విగ్రహాలు కూడా కలవు. పాండవులు రాజ్య బహిష్కరణ సమయంలో ఇక్కడ కొంత కాలం నివశించారని, ఆ సమయంలో ఈ గుడిని నిర్మించి పూజలు చేశారని చెబుతారు.

షాపూర్ కండి కోట

షాపూర్ కండి కోట

చిత్రకృప : Aspinwall

షాపూర్ కండి కోట

క్రీ. శ. 15 వ శతాబ్దంలో జస్పాల్ సింగ్ పఠానియా అనే రాజపుత్ర రాజు షాపూర్ కండి కోట ను నిర్మించాడు. ఇక్కడి నుండే రాజ్యపాలన గావించాడు. కోట పరిసరాలు రావి నది తో, హిమాలయ పర్వతాలతో అందంగా ఉంటాయి. కోట మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. లోపల మసీదులు, ఆలయాలు ఉన్నాయి.

రావి నది, పఠాన్ కోట్

రావి నది, పఠాన్ కోట్

చిత్రకృప : Ramnika Singh

రతన్ సాగర్ డాం

దీనినే తీన్ డాం అని కూడా పిలుస్తారు. రావి నది పై నిర్మించిన ఈ డ్యాం దేశంలోనే అతి పెద్ద మట్టి ఆనకట్ట. అందమైన కొండలు, సరస్సులతో ఈ ప్రదేశం ఆహ్లాదంగా ఉంటుంది. పఠాన్ కోట్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైడ్రాలిక్ రీసర్చ్ సెంటర్ సందర్శించదగినదే!

ఇది కూడా చదవండి : పంజాబీ సంస్కృతి - చరిత్రల నగరం !

విశ్రాంతి, తినటం, కొనుగోళ్ళు - పఠాన్ కోట లో చేయవలసిన అంశాలు

సంవత్సరం పొడవునా టూరిస్టులు వస్తూ వుండటంతో పఠాన్ కోట్ లో అనేక హోటళ్ళు వసతులు, రుచికర ఆహారాలను అందిస్తున్నాయి. అనేక ప్రసిద్ధ నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలు ఇక్కడ కల వివిధ డాభాలలో దొరుకుతాయి. సైట్ సీయింగ్ మాత్రమె కాక పఠాన్ కోట షాపింగ్ కు కూడా ప్రసిద్ధి. మిషన్ రోడ్, సుజాన్ పూర్ మార్కెట్, ఘండి చౌక్ వంటివి నగరంలో ప్రసిద్ధ షాపింగ్ కేంద్రాలు. ఇక్కడ పాష్మినా శాల్స్ విరివిగా కొనుగోలు చేస్తారు.

గుహాలయం, పఠాన్ కోట్

గుహాలయం, పఠాన్ కోట్

ఎలా చేరాలి ?

పఠాన్ కోట్ దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ట్రైన్ లు, బస్సు లలో చేరవచ్చు. ఇక్కడ రెండు రైలు స్టేషన్ లు కలవు అవి పఠాన్ కోట్ మరియు చక్కి బ్యాంకు. రైల్వే స్టేషన్ సమీపం లోనే బస్సు స్టాండ్ వుంటుంది. సిమ్లా, న్యూ ఢిల్లీ, చండీఘర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులలో ప్రయాణించవచ్చు. పఠాన్ కోట్ లో విమానాశ్రయం కలదు. కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. 108 కి.మీ ల దూరంలో అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇది విమాన ప్రయాణీకులకు అనువైనది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X