» »తాజ్ మహాల్ ‘తోబుట్టువు’లను చూశారా

తాజ్ మహాల్ ‘తోబుట్టువు’లను చూశారా

Written By: Beldaru Sajjendrakishore

ప్రేమకు చిహ్నంగా ప్రపంచ దేశాల ప్రజలు కీర్తించే ఆగ్రాలోని తాజ్ మహల్ గురించి అందరికీ తెలిసిందే. పర్యాటకం పై కొంత పరిజ్జానం ఉన్న వారెవరైనా ఈ కట్టడం గురించి కనీసం అరగంట అయినా గుక్కతిప్పుకోకుండా మాట్లడేస్తారు. ఇక ప్రపంచ దేశాల ముఖ్యులు భారత దేశ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో వీలు చూసుకుని మరీ యమునా నదీ తీరంలోని ఈ గ్రానైట్ కట్టడాన్ని తనివి తీరా చూసి మురిసిపోతుంటారు. అయితే తాజ్ మహల్ రూపాన్ని ప్రతిబింబించే ఏడు కట్టడాలు మన భారత దేశంలోనే ఉన్నాయి. ఇందులో కొన్ని తాజ్ మహల్ కట్టడానికి ముందే నిర్మించగా మరికొన్ని ఆ కట్టడం తర్వాత నిర్మించినవే. వీటిలో కొన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా కూడా మారిపోయాయి. మరికొన్ని మాత్రం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ తోబొట్టువులు అవి ఎక్కడ ఉన్నాయి వాటిని నిర్మించినవారు ఎవరు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది తదితర వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.తల్లి ప్రేమకు గుర్తుగా

1.తల్లి ప్రేమకు గుర్తుగా

Image source

మహారాష్ర్టలోని ఔరంగాబాద్ లో బీబీ కా మక్బారా ఉంది. ఔరంగాజేబ్ కుమారుడైన అజమ్ తన తల్లి దిల్ రాస్ బేగం గుర్తుగా ఈ సమాధిని నిర్మించారు. బీబీ కా మక్ బారాకు ఆగ్రాలోని తాజ్ మహల్ కు పరిమాణంలో కాకపోయిన నిర్మించిన తీరులో కొన్ని పోలికలు ఉండటం వల్ల దీన్ని తాజ్ ఆఫ్ దక్కన్ అని పిలుస్తారు. తాజ్ మహల్ ప్రధాన డిజైనర్ అయిన ఉత్సాద్ అహ్మద్ లహౌరీ కుమారుడైన అతా ఉల్ బీబీ కా మక్బారాకు ప్రధాన డిజైనర్. ఈ విషయం అక్కడ ప్రధాన ద్వారం వద్ద చెక్కబడి ఉంది.

2.ప్రముఖ సినీ స్పాట్

2.ప్రముఖ సినీ స్పాట్

Image source

ఈ సమాధిని నిర్మించడానికి రూ.6,68,203 లు ఖర్చు అయింది. ఈ కట్టడ నిర్మాణంలో వినియోగించిన మార్బల్స్ జైపూర్ నుంచి తీసుకువచ్చారు. అనేక సినిమాలను ఈ కట్టడం వద్ద షూట్ చేశారు. ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు నమోదు చేసిన ఎం.ఎస్ ధోని లోని జబ్ తక్...అనే పాటను ఇక్కడే చిత్రీకరించారు.

3. పోస్ట్ మ్యాన్ నిర్మించిన మహల్

3. పోస్ట్ మ్యాన్ నిర్మించిన మహల్

Image source

ఆగ్రలోని తాజ్ మహల్ ను ఓ చక్రవర్తి తన భార్య కోసం నిర్మిస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తాజ్ మహల్ ను ఓ రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ తన చనిపోయిన భార్యగా గుర్తుగా నిర్మించారు. ఇందు కోసం తన వద్ద ఉన్న మొత్తం నగదును ఖర్చు చేశాడు.

4. క్యాన్సర్ తో చనిపోయిన భార్య సంస్మరనార్థం

4. క్యాన్సర్ తో చనిపోయిన భార్య సంస్మరనార్థం

Image source

ఉత్తర ప్రదేశ్ లోని బులందర్ షార్ లో నివసించే ఫైజల్ హాసన్ క్వాద్రీ అనే రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఈ కట్టడాన్ని తన భార్య తాజా ములి భేగం సంస్మరనార్థం నిర్మించారు. ఆమె 2011లో గొంతు క్యాన్సర్ తో మరణించారు. తాజ్ మహల్ అంత గొప్ప కట్టడం కాకపోయినా గొప్ప మనస్సుతో నిర్మించడం వల్ల దీనిని చాలా మంది చూడటానికి వేర్వేరు ప్రాంతాలనుంచి వస్తున్నారు.

5.తాజ్ మహల్ నిర్మాణానికి ఇదే ప్రేరణ

5.తాజ్ మహల్ నిర్మాణానికి ఇదే ప్రేరణ

Image source

మొఘల్ చక్రవర్తి హుమయూన్ సమాధిని హుమయూన్ టోంబ్ అంటారు. భారత దేశంలో అతి ఖరీదైన, విస్తీర్ణమైన మొదటి సమాధి ఇదే. హుమయూన్ మొదటి భార్య అయిన బేగా భేగం ఈ కట్టడం నిర్మించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ రెడ్ సాండ్ రాయితో ఈ కట్టడాన్ని నిర్మించినా కూడా అగ్రా లోని తాజ్ మహల్ వలే కనిపించడం దీని ప్రత్యేకత. అసలు తాజ్ మహల్ నిర్మాణానికి హుమయూన్ సమాధే ప్రేరణ అనే కథ కూడా ప్రచారంలో ఉంది.

6. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో

6. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో

Image source

ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద ఈ కట్టడాన్ని పూర్తి చేసిన వారు అక్బర్. చరిత్రను అనుసరించి మొదట హుమయూన్ సమాధిని ఢిల్లీలోని పురాణా ఖిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే ఓ ప్రమాధంలో హుమయూన్ సమాధి కొంత ద్వంసం కావడంతో అక్బర్ నిజమాముద్దీన్ ప్రాంతానికి ఈ సమాధిని మార్చి ప్రస్తుత కట్టడాన్ని పూర్తి చేశారు.

7.మహాబద్ మక్బారా

7.మహాబద్ మక్బారా

Image source

గుజరాత్ లోని జూనా ఘడ్ లో ఈ సమాధి ఉంది. జూనాఘడ్ ను పాలించిన రాజుల సమాధి ఇది. దీనిని 18వ శతాబ్దంలో నిర్మించారు. హిందూ, ఇస్లామిక్, యూరోపిన్ వాస్తుశాస్త్రాల సమ్మిళితంగా ఈ కట్టడాన్ని అభివర్ణిస్తారు.

8. కొంత గందరగోళం

8. కొంత గందరగోళం

Image source

ఈ కట్డడం నిర్మిణం కొంత గందరగోళంగా కనిపించినా ప్రాథమికంగా ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ ను పోలి ఉంటుందింది. ఇది కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లు తోంది. ఈ కట్డడానికి సమీపంలోనే గిర్ అభయారణ్యం ఉంది. ఇక్కడ సింహాలను పరిరక్షిస్తుంటారు.

9. భర్త కోసం భార్య

9. భర్త కోసం భార్య

Image source

తాజ్ మహల్ ను భార్య పై ఉన్న ప్రేమతో భర్త నిర్మించిన కట్టడంగా చెబుతారు. అయితే మనం ఇప్పడు తెలుసుకోబోయే తాజ్ మహల్ ఓ భర్య తన భర్త పై ఉన్న ప్రేమకు చిహ్నంగా నిర్మించింది. ఈ కట్టడం ఆగ్రలోనే ఉండటం విశేషం. ఇది పర్యాటకంగా పెద్దగా ప్రాచూర్యంలోకి కూడా రాలేదు.

10. రెడ్ తాజ్ మహల్

10. రెడ్ తాజ్ మహల్

Image source

అన్నా హెన్సింగ్ అనే మహిళ సైనికుడైన తన భర్త జాన్ విలియం హెన్నింగ్ సంస్మరణార్థం ఓ కట్టడాన్ని నిర్మించింది. దీన్ని రెడ్ తాజ్ మహల్ గా పిలుస్తారు. ఈ కట్టడం పరిమాణంలో తాజ్ మహల్ కంటే చిన్నగానే ఉన్నా తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతం. దీని నిర్మాణంలో మొఘల్ విధానాలు కనిపిస్తాయి.

11. మీనియేచర్ తాజ్ మహల్

11. మీనియేచర్ తాజ్ మహల్

Image source

ఈ కట్టడం బెంగళూరులో ఉంది. నగరంలోని బన్నేరుగట్టకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఈ కట్టడం ఉంది. నగరానికి చెందిన శేఖర్ అనే మళయాళీ తన భార్య సంస్మరణార్థం ఈ కట్టడాన్ని నిర్మించాడు. 40 అడుగుల ఎత్తు, 70 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు విస్తీర్ణంలో ఈ కట్టడాన్ని 2015లో పూర్తి చేశారు.

12. ఇటుకలతో నిర్మించింది...

12. ఇటుకలతో నిర్మించింది...

Image source

తాజ్ మహల్ ఆకారంలో ఉన్న షజాది కా మక్బారాను ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో నిర్మించారు. దీనిని ఇటుకలతో నిర్మించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో ప్లాస్టింగ్ చేయడం వల్ల ఇది తాజ్ మహల్ వలే కనిపిస్తుంది. ఇక్కడకు కూడా పర్యాటకులు చాలా మంది వెళుతుంటారు.

13. మిగిలిన దేశాల్లో కూడా

13. మిగిలిన దేశాల్లో కూడా

Image source

కేవలం భారత దేశంలోని వేర్వేరు చోట్లే కాకుండ ప్రపంచంలోని ఇతర దేశాల్లో ముఖ్యంగా బాంగ్లాదేశ్, చైనా తదితర చోట్ల కూడా తాజ్ మహల్ ను పోలిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి ఏవి మన ఆగ్రలోని తాజ్ మహల్ కు సాటి రాలేదని ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో చెబుతుంది.