• Follow NativePlanet
Share
» »ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఆశ్చర్యాన్ని కలిగించే ముట్టుకుంటే మెత్తగావుండే స్వామి వారి విగ్రహం. ప్రతి ఆలయగర్భగుడిలో దేవుడివిగ్రహం అనేది వుంటుంది.స్థల పురాణంప్రకారం అక్కడ ఆలయం ఎలా వెలిసింది?అనేది తెలుస్తుంది. ప్రతీ ఆలయంలో కూడా రాతితో మలచిన విగ్రహాలేవుంటాయి. కాని ఇక్కడి ఆలయంలో ఒక విశేషం వుంది. ఇక్కడి స్వామివారి విగ్రహం రాతిలాకాకుండా ముట్టుకుంటే మెత్తగా వుంటుంది. మరి ఆశ్చర్యాన్నికలిగించే ఈ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయవిశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఎక్కడ వుంది?

వరంగల్ జిల్లాలోని మంగపేటమండలం మల్లూరుగ్రామంలో చిన్న గుట్టపైన అత్యంతమహిమాన్వితమైన శ్రీహేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వుంది.అందమైన కొండలమధ్య ఈ దేవాలయం స్వయంభూదేవాలయంగా ఎంతో చరిత్రకలిగిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

నవనరసింహక్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటిగా చెబుతారు. ఈ క్షేత్రం 6వ శతాబ్దంనాటిది.అయితే 12వ శతాబ్దంలో కాకతీయులు ఆలయాన్ని పునర్నిర్మించారు.ఇంకా 17వ శతాబ్దంలో నవాబులు స్వామివారికి 150కిలోల వెండికవచం బహూకరించటం జరిగింది.ఈ ఆలయంలో మూలవిరాట్టుగుహలో కొండను ఆనుకుని 9అడుగుల నల్ల రాతివిగ్రహం కలదు.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఇక్కడ స్వామివారు మొండెం దాకా నరరూపం, తల భాగం సింహంగా,నిజరూపంగా దర్శనమిస్తారు.అయితే ఇలా వుండటానికి కారణం ఒకప్పుడు పుట్టలో వుండే ఈ స్వామిని భక్తులు తవ్వి బయటకు
తీస్తుండగా గునపం స్వామివారి బొడ్డువద్ద తగిలి గాయమైందట, అందుకే ఇప్పటికి ఆ ప్రదేశంలో ఆలయఅర్చకులు చందనం పూస్తారు.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

అందుకే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ఎక్కడతాకినా రాతిని తాకినట్లు కాకుండా సజీవమానవ శరీరాన్ని తాకినట్లు మెత్తగావున్నట్లు కనపడుతుంది. దక్షిణభారతదేశంలో మరెక్కడా కూడా నువ్వులనూనెతో స్వామివారికి అభిషేకం చేయటం జరగదు.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

కాని ఇక్కడ స్వామివారికి నువ్వులనూనెతో అభిషేకం చేయటం మరో ప్రత్యేకత. ఈ ప్రాంతం అర్ధచంద్రాకారంలో వుంటుంది.కావున భరద్వాజమహారుషి దీనికి హేమాచలం అనే పేరుపెట్టారని ప్రతీతి.
ఇక్కడ చింతామణి జలాధారకికూడా ఒక ప్రత్యేకత వుంది.ఈ నీరు మూత్రపిండవ్యాధులకు,నడుముకు సంబంధించిన వ్యాధులకు ఔషధంగా వుపయోగపడుతుంది.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఈ నీరు సంలు పాటు నిలువవుండే గుణాన్ని కలిగివుంది.అంతేకాకుండా గుట్లపైన నుండి చెట్లమధ్య నుండి జలధార ఎక్కడనుండి వస్తుందో ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోవటం మరో విశేషం.ఈ విధంగా ఇక్కడ వెలసిన శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఉత్తమ సీజన్

ఇంతకుముందు చెప్పిన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఈ స్థల సందర్శానానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ మరియు మార్చి మధ్య బాగుంటుంది. ఎండాకాలంలో ఎండ వేడినుండి తప్పించుకోవొచ్చు సందర్శానానికి వెళ్ళకుండా ఉంటె, చలికాలం,వానాకాలం రెండూ కూడా అనువైనవి. ఈద్ ఉల్ ఫితర్, దసరా మరియు దీపావళి వంటి పండుగలు కూడా ఈ సీజన్లో జరుపుకుంటారు, కాబట్టి ఈ సీజన్లో సందర్శిచటం బాగుంటుంది.

PC:youtube

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ఎలా చేరాలి?

రోడ్ ద్వారా రోడ్ ట్రాన్స్ పోర్ట్ పబ్లిక్ బస్ సర్వీసు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది.ఒక కి.మీ.కు రూ.4 చొప్పున చార్జ్ తీసుకుంటూ వరంగల్ నుండి హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం వంటి నగరాలకు బస్సులు ఉన్నాయ్. వరంగల్ మరియు ఇతర నగరాల మధ్య ప్రైవేటు బస్ సర్వీసులు కూడా ఉన్నాయ్.

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

రైలు ద్వారా

వరంగల్ రైల్వే స్టేషన్ చాల ముఖ్యమైన స్టేషన్ మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది. చెన్నై, బాంగుళూర్,ముంబై మరియు న్యూ ఢిల్లీ నుండి రైళ్ళు వరంగల్ గుండా వెళ్ళేప్పుడు వరంగల్ స్టేషన్లో ఆగుతాయి.

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం

విమానం ద్వారా

వరంగల్ దగ్గరగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అది వరంగల్ నగరానికి 163కి.మీ. దూరంలో ఉన్నది మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటి కి అనుసంధించబడింది. హైదాబాద్ నుండి వరంగల్ కి టాక్సీలో అయితే సుమారుగా రూ.2500 అవుతుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి