Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

By Venkatakarunasri

మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, రాయల సీమ ప్రదేశాలలో కూడా సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి గుడ్డిలో మెల్ల అన్నట్టు. పాత కాలం సినిమా లలో చూస్తే చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు కనిపించేవి. ఇప్పుడంతా సిటీ లైఫ్ గురించే చూపిస్తున్నాయి. కార్లు, బైక్ లు రోడ్డుమీద కనిపిస్తున్నాయి. అదే మీరు పాత సినిమాలు చూస్తే సైకిళ్లు, ఎడ్ల బండీలు, గుర్రపు జట్కాలు కనిపించేవి. ఇక వాటి గురించి ఎందుకులే చెప్పుకోవడం, మన రెండు తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ లకు అనువైన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు సినిమా షూటింగ్ లకి ప్రసిద్ధి గాంచినవి గా ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలను ఒకసారి చూస్తే పోలా ...

సినిమా లు మన జీవితంలో భాగమైపోయాయి. పాతకాలంలో అయితే సినిమా షూటింగ్ లు కేవలం దేశానికే పరిమితంగా ఉండేవి. ఆ తరువాత వచ్చిన పెను మార్పుల కారణంగా నవీన పోకడలకు అలవాటు పడి విదేశాలలో చిత్రీకరిస్తున్నారు. బ్ల్యాక్ అండ్ వైట్ సినిమాలలో మన రాష్ట్రం లో చెప్పుకోదగ్గ షూటింగ్ ప్రదేశాలు ఉండేవి. ఆ తరువాత వచ్చిన కలర్ సినిమాలలో కూడా కనిపించింది అనుకోండి కానీ ఇప్పుడైతే మరీ ఘోరం కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే విధంగా షూటింగ్ లు జరుగుతున్నాయి.

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

శ్రీ సీతారాముల ఆలయం

హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న శంషాబాద్ కేవలం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ వినానాశ్రయనికే పరిమితం కాదు. ఇక్కడ ఉన్న పురాతన శ్రీ సీతా రాముల ఆలయం సినిమా షూటింగ్ లకి పెట్టింది పేరు. ఈ ఆలయం వద్ద సినిమా షూటింగ్ లు జరిగితే బాక్స్ - ఆఫీస్ వద్ద విజయం ఖాయమని దర్శక నిర్మాతల నమ్మకం. ఈ ప్రదేశం హైదరాబాద్ నగరానికి 35 కి. మీ. దూరంలో, ఫిల్మ్ స్టూడియోలు ఉన్న జూబ్లీ హిల్స్, బంజార హిల్స్ వంటి ప్రదేశాల నుండి సులభంగా చేరుకోవచ్చు. మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా 9. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడి ప్రాంగణంలో కనిపిస్తాయి. అప్పుడెప్పుడో 1984 వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వామి చరిత్ర నుంచి మొదలుకొని పరమవీర చక్ర, మిస్టర్ పర్ఫెక్ట్, తీన్మార్, వీర వంటి 350 చిత్రాలు పైగానే ఇక్కడ సినిమా షూటింగ్ లు జరుపుకున్నాయి.

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

కోనసీమ ఎటు చూసినా పంటచేలు..

కొబ్బరి చెట్లు.. గోదారి గలగలలు.. ఇది కోనసీమ అందాలు. గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలిఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. మీరు పాత సినిమాలు ఒకసారి గమనిస్తే దర్శకుడు వంశీ తీసిన సినిమాలలో కోనసీమ తప్పక కనిపిస్తుంది. ఆయనగారు తీసిన సినిమా శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ చూస్తే కోనసీమ అందాలను మైమరిచి చూడవచ్చు. విలేజ్ లో వినాయకుడు. ముకుందా తదితర చిన్నా, పెద్దా సినిమాలు గోదావరి నది ఒడ్డున ఉన్న కోనసీమ ప్రదేశంలోనే జరిగాయి. గోదావరి సినిమా చూస్తే కోనసీమ యాస, కోనసీమ వంటలు మనకు కనిపిస్తాయి.

Photo Courtesy: Naveen Kumar

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

భద్రాచలం

భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున గల ఒక మండలం. ఇక్కడ రాములవారి గుడి ఉంది. అంతేకాక రామాయణంలోని కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా జరిగాయని ప్రశస్తి. ఏమైనా భద్రాచలం కూడా సినిమా షూటింగ్ లకి చిరునామాగా నిలిచింది. ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , గోదావరి, శ్రీ రామదాసు, అందాల రాముడు వంటి చిత్రాలు షూటింగ్ లు జరుపుకున్నాయి.

Photo Courtesy: kalyan atmakuri

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

అంతర్వేది

అంతర్వేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం కలదు. అంతర్వేది గ్రామము సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

Photo Courtesy: Konaseema Tourism

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

వేయి స్థంబాల గుడి

కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మింపబడిన ఈ నిర్మాణం చాళక్యుల శైలిలో నిర్మించబడింది. వరంగల్ నగరం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయ నిర్మాణాన్ని ఓసారి పరిశీలిస్తే... ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారంలో ఆలయం నిర్మించబడింది. ఆలయం వెలుపల చెక్కబడిన ఓ పెద్ద నందీశ్వరుని విగ్రహం ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉండడం దీని ప్రత్యేకత. వేయి స్థంబాల గుడి లో ఇప్పటి వరికి చాలానే సినిమా లు జరుపుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది వర్షం సినిమా. ఈ సినిమా లో ఈ వర్షం సాక్షిగా ... అనే పాట మొత్తం ఈ గుడి ప్రాంగణం లోనే చిత్రీకరించారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న రుద్రమదేవి సినిమా లో కూడా ఆలయ గొప్పతనం , ఆలయ పరిసరాలు చూడవచ్చు.

Photo Courtesy: Venkataramesh Kommoju

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

బొర్రా గుహలు

బొర్రా గుహలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, వైజాగ్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు ప్రకృతి సిద్ధంగా చాలా సంవత్సరాల క్రితమే ఏర్పడినవి. ఈ గుహలకు రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లో గాని, ప్రేయివేట్ వాహనాల ద్వారా కానీ వెళ్ళవచ్చు. కానీ రైలు మార్గం ద్వారా వెళితే భలే థ్రిల్లింగా ఉంటుంది. సుమారు 40 గుహల గుండా రైలు ప్రయాణిస్తుందంటే వెళ్లరూ !!. సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటి వరకు చాలా సినిమాల చిత్రీకరణలు జరిగినాయి. వాటిలొ ముఖ్యమైనవి చిరంజీవి నటించిన జగదేక వీరుడు - అతిలోకసుందరి, నాగార్జున నటించిన శివ, నరేశ్ కడుపుబ్బా నవ్వించించిన జంబలకిడిపంబ చిత్రాలన్ని ఇక్కడ చిత్రీకరించినవే.

Photo Courtesy: Harish Varma

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఓర్వకల్లు రాక్ గార్డెన్

కర్నూలు జిల్లాలో గల రాక్ గార్డెన్ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఓర్వకల్లు మండలానికి కూతవేటు దూరంలో గల ఈ ప్రదేశం ప్రస్తుతం ఏపి టూరిజం ఆధీనంలో ఉండి అభివృద్ధి పధంలో నడుస్తుంది. ఇక్కడ సినిమా షూటింగ్ లు అనేకం జరుగుతుంటాయి. వాటిలో వెంకటేష్ నటించిన సుభాస్ చంద్ర బోస్, రవితేజ నటించిన శంభో శివ శంభో , ప్రభాస్ నటించిన బాహుబలి మొదలగునవి ఉన్నాయి. ఈ రాక్ గార్డెన్ లో రాళ్లతో ఏర్పడిన ఆకారాలు చూపరులను కనులవిందు చేస్తుంటాయి. ఎంట్రేన్స్ ప్రాంగణం లోనే మీకు రెస్టారెంట్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన వాటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. కానీ ఆర్డర్ చూసి ఇవ్వండి.

Photo Courtesy: Balamurugan Natarajan

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే టాలివూడ్ నుంచి మొదలు కొని హాలీవూడ్, సీరియల్ చిత్రీకరణ సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఈ సినిమాల ఊరు 2000 ఎకరాల విస్తీర్ణంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమాల నగరంగా ప్రసిద్ధి చెందింది. లోనికి వెళ్ళడానికి టికెట్టు ఉంటుంది. పెద్దవారికైతే 900 రూపాయలు, పిల్లలకి (3 - 12 సంవత్సరాలు) 800 రూపాయలు గా ఉంటుంది. అలాగే భోజనంతో కలిపి టికెట్టు ధర పెద్దవారికీ 1900 రూపాయలు గా, పిల్లలకి 1600 రూపాయలుగా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి అనుమతించేది ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వారికి మాత్రమే తరువాత అనుమతించరు. కనుక మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ముప్పై నిమిషాల వరకు గడపవచ్చు. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం సందర్శించడానికి పట్టే సమయం 4 గంట నుంచి 5 గంటలు. ఇదేంది ఇంత డబ్బులు పెట్టి అంతసేపెనా అంటే ?? టైమ్ సరిపోదు అదీకాక షూటింగ్ జరిగే ప్రదేశాలలో అనుమతించరు.

Photo Courtesy: jai rathore

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు కర్నూలు నడిబొడ్డున ఉంది. కర్నూలు నగరానికే ఇది తలమానికం. ఒకప్పుడు కర్నూలులో వరదలు వచ్చినప్పుడు భాధితులు ఇక్కడే ఆశ్రయం చెందారు. సీతయ్య, ఒక్కడు, ఆది, తులసి, ఠాగూర్ చిత్రాలలోనే కాక రాయలసీమ, ఫ్యాక్షన్ చిత్రాలలో కనిపిస్తుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఆటో లో ఎక్కి (పది రూపాయలే) చేరుకోవచ్చు. ఇక్కడికి నడిచేంత దూరంలో ఉన్న సాయి బాబా ఆలయం చూడటం మరిచిపోవద్దు. సాయంత్రం పూట నోరూరించే మిరపకాయ బజ్జీలు, చికెన్ పకోడ (చికెన్ కబాబ్) ఇక్కడ స్పెషల్. షాపింగ్ చేసుకునే వారికి కూడా ఏమాత్రం బోర్ కొట్టకుండా బట్టల షాప్ లు, బంగారం షాప్ లు బురుజు నుండి కాళ్ళు బయట పెట్టగానే దర్శనమిస్తాయి.

Photo Courtesy: blaiq blaiq

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

అరుంధతి కోట

అరుంధతి కోట బనగానపల్లె నవాబుల వేసవి విడిది. ఈ కోట ఒక గట్టు మీద ఉంది. బనగానపల్లె - యాగంటి పోయే దారిలో రోడ్డుకు కుడివైపున ఉంది. ఈ కోట 9 గదులు, పెద్ద హాలు, నేలమాలిగా కలిగి ఉంటుంది. లోపలికి ప్రవేశం లేదు కానీ కోట ప్రాగణం మొత్తం ఒక చుట్టూ చుట్టిరావచ్చు. పై అంతస్తు లో నుంచి నక్కి నక్కి లోపలి అందాలనూ చూడవచ్చు. కోట లోపల భాగం శిధిలమైనప్పటికీ బయటి భాగం చెక్కు చెదరలేదు. ఇక్కడ అరుంధతి చిత్ర సన్నివేశాలని నెల రోజులు కూర్చొని చిత్రీకరించారు. అంతే గాక బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ కోటని సందర్శిస్తే దగ్గరిలోని యాగంటిని చూడటం మరిచిపోకండి.

Photo Courtesy: Lovell D'souza

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

గోల్కొండ కోట

గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి సుమారుగా 11 కి. మీ. దూరంలో ఉన్నది. కోట అలనాటి కుతుబ్ షాహీ రాజవంశీయుల దర్పనానికి నిలువుటద్ధము. ఈ కోటకున్న ప్రత్యేకమైన లక్షణం వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఇక్కడ మగధీర, పోకిరి, రాజకుమారుడు, శ్రీ రామదాసు వంటి చిత్రాలే కాకుండా మరెన్నో చిత్రాలను చిత్రీకరించారు.

Photo Courtesy: 10 Year Itch (Madhu Nair)

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

ఆంధ్రా మరియు తెలంగాణాలలో సినిమా షూటింగ్ ప్రదేశాలు !

చార్మినార్

హైదరాబాద్ నగరంలో పాతబస్తీ వద్ద ఉన్న చార్మినార్ కుతుబ్ షాహీ వంశస్థులచే నిర్మించిన ఒక ముఖ్య కట్టడం. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినదిగా చరిత్రకెక్కింది. చార్మినార్ పర్యాటకులనే కాక సినిమా వాళ్ళని కూడా ఎప్పుడో ఆకర్షించింది. హైదరాబాద్ అంటే చాలు చార్మినార్ తప్పక కనిపిస్తుంది అనే విధంగా సినిమాలలో ముద్రపడిపోయింది. ఇంతముందు సినిమాలలో మీరు గమనిస్తే చార్మినార్ కింది నుంచి వాహనాలు కూడా వెల్ళేవి కానీ ఇప్పుడైతే కాలుష్యం కారణంగా చార్మినార్ పక్క నుంచి వెళుతున్నాయి. సినిమాలు చెప్పుకోవాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇక్కడ వెళితే మీరు బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే చుట్టూ షాపింగ్ చేసే సందులు అనేకం ఉన్నాయి. మీరు ఏ సందులో వెళ్ళినా షాపింగ్ చేయకమానరు. ఇక్కడ పెళ్ళిళ్ల సామాగ్రి, బట్టలు, బంగారం ఇలా ఎన్నో కొనుక్కోవచ్చు. చార్మినార్ వెళితే ఇరానీ ఛాయ్ మరిచిపోవద్దు.

Photo Courtesy: Abhinay Omkar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X